For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్యాభర్తల మధ్య ఉండాల్సిన, ఉండకూడని ఏజ్ గ్యాప్ ఎంత..!

తాజాగా జరిగిన అధ్యయనాలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాయి. భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఉండాల్సిన ఏజ్ గ్యాప్ గురించి ఈ అధ్యయాలు చాలా క్లియర్ గా వివరిస్తున్నాయి.

By Swathi
|

పెళ్లి ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించేది.. తమకు కాబోయే భాగస్వామి వయసు. తమ జీవిత భాగస్వామి వయసు, తమ వయసు కంటే ఇంతే డిఫరెన్స్ ఉండాలని చాలామంది ఫిక్స్ అవుతారు. అలాగే.. ఇద్దరి మధ్య గ్యాప్ ని తల్లిదండ్రులు కూడా పరిగణలోకి తీసుకోవడం ఆచారంగా వస్తోంది.

age gap

భర్త వయసు భార్య కంటే ఎక్కువగా ఉంటేనే.. వాళ్లకు బాధ్యతలు తెలుస్తాయని, భార్యలను జాగ్రత్తగా చూసుకుంటారని, కుటుంబాన్ని ఒక పద్ధతిగా చూసుకుంటారని హిందువులు భావిస్తారు. అందుకే.. అబ్బాయి కోసం వెతికేటప్పుడు.. వయసుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే మరీ ఎక్కువ ఏజ్ గ్యాప్ ని కూడా అంగీకరించరు.

MOST READ: ఈ జనవరిలో వచ్చే సూర్య గ్రహణం వలన ప్రభావితమయ్యే ప్రధాన రాశి చక్రాలు ఇవే! <br>MOST READ: ఈ జనవరిలో వచ్చే సూర్య గ్రహణం వలన ప్రభావితమయ్యే ప్రధాన రాశి చక్రాలు ఇవే!

అయితే తాజాగా జరిగిన అధ్యయనాలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాయి. భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఉండాల్సిన ఏజ్ గ్యాప్ గురించి ఈ అధ్యయాలు చాలా క్లియర్ గా వివరిస్తున్నాయి. భార్యా భర్తల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలి, ఎంత ఏజ్ గ్యాప్ ఉంటే ఎలాంటి ఫలితాలు, ప్రభావాలు ఉంటాయో చూద్దాం..

ఏజ్ గ్యాప్

ఏజ్ గ్యాప్

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటే.. విడిపోతున్నారని.. ఈ అధ్యయనాలు తేల్చాయి. కాబట్టి ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండకూడదట.

20ఏళ్లు

20ఏళ్లు

భార్యాభర్తల మధ్య వయసు వ్యత్యాసం 20 ఏళ్లు ఉంటే.. 95శాతం వాళ్లిద్దరూ విడాకులతో విడిపోయే అవకాశాలుంటాయి.

10ఏళ్లు

10ఏళ్లు

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ 10 ఏళ్లు ఉండే.. వాళ్లిద్దరూ విడిపోవడానికి 40 శాతం అవకాశాలు ఉంటాయి.

5ఏళ్లు

5ఏళ్లు

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ 5ఏళ్లు ఉంటే.. డైవర్స్ రిస్క్ 15 శాతం ఉండవచ్చు. అంటే.. ఏజ్ గ్యాప్ ఐదేళ్లు ఉన్నవాళ్ల ఆలోచనలు.. బాగా మ్యాచ్ అవడం వల్ల.. మనస్పర్ధలకు ఎక్కువ అవకాశం ఉండదు.

లైఫ్ లాంగ్ రిలేషన్

లైఫ్ లాంగ్ రిలేషన్

ఒకవేళ మీరు ఇప్పటికే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న వ్యక్తితో రిలేషన్ లో ఉంటే.. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల.. మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది.

MOST READ: రామ్ చరణ్ తేజ్ డైట్ ప్లాన్, జిమ్ వర్కవుట్స్, ఇలా చేస్తే ఎవరికైనా అదిరిపోయే బాడీ సొంతం, ట్రై చేయండి MOST READ: రామ్ చరణ్ తేజ్ డైట్ ప్లాన్, జిమ్ వర్కవుట్స్, ఇలా చేస్తే ఎవరికైనా అదిరిపోయే బాడీ సొంతం, ట్రై చేయండి

మనస్పర్థలు

మనస్పర్థలు

ఏజ్ గ్యాప్ తో వచ్చే రిస్క్ ఏంటి అంటే.. ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, జాలి లేకపోవడం. మనుషుల సైకాలజీ వాళ్ల డెవలప్ మెంట్, లైఫ్ లో స్టేజెస్ దాటేకొద్దీ ఒక్కోలా ఉంటుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయినప్పుడు.. ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతుంది.

ఆరోగ్యం

ఆరోగ్యం

వయసు ఎక్కువగా ఉన్న భర్త ఆరోగ్య పరిస్థితులు.. యంగ్ పార్ట్ నర్ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోవచ్చు. దీనివల్ల ఇద్దరి మధ్య విబేధాలు వస్తాయి.

లవ్ అండ్ కేర్

లవ్ అండ్ కేర్

రిలేషన్ లో లవ్, కేర్ ఉంటే.. ఇద్దరి మధ్య బంధాన్ని చాలా బలంగా మారుస్తుంది. దానికి ఏజ్ గ్యాప్ తో ఎలాంటి సంబంధం ఉండదు.

English summary

What’s The Ideal Age Gap Between Couples?

What’s The Ideal Age Gap Between Couples? Experts say that a lot of gap isn’t advisable for a healthy and a stable relationship. So, read on to know what’s the ideal age gap between couples...
Desktop Bottom Promotion