For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన జీవిత కాలంలో మనం మూడు రకాల వ్యక్తులతో మాత్రమే ప్రేమలో పడతాం అనే విషయం మీకు తెలుసా ?

మన జీవిత కాలంలో మూడురకాల వ్యక్తులతో ప్రేమలో పడతాం అంట. ఇలా ప్రతి ఒక్కసారి ప్రేమలో పడే విషయమై ప్రత్యేకమైన కారణం ఉంది.

By R Vishnu Vardhan Reddy
|

చాల సందర్భాల్లో మనం ఒకసారి కంటే ఎక్కువ ప్రేమలో పడుతుంటాం. మనలో చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు అది ఎలా సాధ్యం అని. ఈ భావాలూ మనల్ని అయోమయానికి గురిచేస్తాయి. కానీ మనం మన జీవిత కాలంలో కనీసం మూడు సార్లు ప్రేమలో పడతాం అనే విషయం మీకు తెలుసా ?

మన జీవిత కాలంలో మూడురకాల వ్యక్తులతో ప్రేమలో పడతాం అంట. ఇలా ప్రతి ఒక్కసారి ప్రేమలో పడే విషయమై ప్రత్యేకమైన కారణం ఉంది.

మన జీవిత కాలంలో విభిన్న సందర్భాల్లో ఎలా మనం ప్రేమలో పడతాం అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం...

మొదటిసారి బాల్యంలో ఉన్నప్పుడు :

మొదటిసారి బాల్యంలో ఉన్నప్పుడు :

సాధారణంగా మనం పాఠశాలా జీవితం గడుపుతున్నప్పుడు మొదటిసారి మనం ప్రేమను అనుభవిస్తాము. ఈ ప్రేమ చాల అమాయకమైనది. ఈ ప్రేమ కథ వినటానికి అద్భుతమైన కథలుగా ఉంటాయి. ఈ రకమైన ప్రేమని మనం అనుభవిస్తామని మన సహచరులు అనుకుంటూ ఉంటారు. మన జీవితంలో ఈ దశలో ప్రేమలో పడినప్పుడు చాల అమాయకమైన వ్యక్తులు మనకు ఎదురవుతూ ఉంటారు.

రెండవసారి ఎలాంటి వ్యక్తులు మనకు ఎదురవుతారంటే :

రెండవసారి ఎలాంటి వ్యక్తులు మనకు ఎదురవుతారంటే :

ఈ రకమైన ప్రేమను కొద్దిగా కష్టమైనా ప్రేమగా మనం భావించవచ్చు, చెప్పవచ్చు. ఈ దశలో మనం అనుభవించే ప్రేమ మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. మనం ఏంటి ? మనం దేని గురించి ప్రేమలో వెతుకుతున్నాం ? మరియు జీవితంలో మనకు ఏమి కావాలి ? అనే విషయాలకు సంబంధించి ఎన్నో తెలియజేస్తుంది. ఈ రకమైన ప్రేమ మనల్ని బాధిస్తుంది, కొన్ని సార్లు చాల తీవ్రంగా బాధపెడుతోంది మరియు పూర్తిగా అబద్దాలతో కూడుకున్నది అయివుండొచ్చు, నొప్పిని కలిగించవచ్చు మరియు ఎన్నో సందర్భాలు తారుమారు అయిపోవచ్చు. ఈ దశలో మనం ప్రేమించే వ్యక్తి వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి మనకు ఎన్నో అబద్దాలు చెప్పవచ్చు. మనకు తెలియ కుండానే మనం వాళ్ళ ఉచ్చులో చిక్కుకుపోతుంటాము.

మనకు ఎంతో నొప్పిని కలిగించినా అలానే అట్టిపెట్టుకొని ఉంటాము :

మనకు ఎంతో నొప్పిని కలిగించినా అలానే అట్టిపెట్టుకొని ఉంటాము :

మన సంబంధబాంధవ్యాలు చాల చెండాలంగా, అనారోగ్యకరంగా మరియు నిరాశపరిచే విధంగా ఉండవచ్చు. అయినప్పటికీ అవి అలానే నిలిచి ఉండడటం కోసమై మనం ఎంతో కష్టపడుతుంటాము. కొన్ని సమయాల్లో శారీరిక మరియు మానసిక వేదనను అనుభవించాల్సి వస్తుంది. దీనికి తోడు ఎన్నో నాటకాలు కూడా చోటుచేసుకోవచ్చు. ఎన్నో అత్యున్నతమైన ఎత్తులు మరియు మానసిక స్థితిని పూర్తిగా దెబ్బతీసే పల్లాలు తో కూడిన ఒక బావద్వేగ జీవిత ప్రయాణాన్ని మనం చేయవలసి ఉంటుంది.

మూడో సారి మనం ఎలాంటి వ్యక్తిని కలవబోతున్నామంటే :

మూడో సారి మనం ఎలాంటి వ్యక్తిని కలవబోతున్నామంటే :

ఈ వ్యక్తి మనల్ని ఎప్పుడు సంరక్షిస్తూ ఉంటాడు. ఇది వస్తుంది అనే విషయం మనం గుర్తించం. ఎందుకంటే మనం ఎప్పుడు చెడు వైపు మాత్రమే చూస్తూ ఉంటాము మరియు మన యొక్క గత అనుభవాల ఆధారంగా ప్రేమ యొక్క మూలాల్ని సరిగ్గా అర్ధం చేసుకోకుండా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటాం. ఏది నిజంకాదు అని అనుకుంటున్న సమయంలో ఇలాంటి ప్రేమ మరియు అలాంటి వ్యక్తి మన జీవితంలోకి రావొచ్చు.

మూడో సారి మనం ఎలాంటి వ్యక్తిని కలవబోతున్నామంటే :

మూడో సారి మనం ఎలాంటి వ్యక్తిని కలవబోతున్నామంటే :

మనం ఏంటో తెలుసుకొని మనల్ని మనంగా స్వీకరించే వ్యక్తి వచ్చినప్పుడు మనం ఒక్కసారిగా ఉలిక్కిపడతాము. మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసే వ్యక్తితో మనం మూడవసారి ప్రేమలో పడతాము. మొదటి సారి లేదా రెండవ ప్రయత్నంలోనే ఇలాంటి మూడవ రకం వ్యక్తితో ఎవరైనా ప్రేమలో పడినట్లైతే అటువంటి వ్యక్తులు చాల అదృష్టవంతులు.

కాబట్టి మీరు ఏ రకానికి చెందినవారు. మీ ఆలోచనలను అభిప్రాయాలను క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మరిచిపోకండి.

English summary

The Different Types Of People We Fall In Love With

According to a research we all tend to fall in love with 3 different types of people in our lifetime. Each time you fall in love, it has its own specific reasons. They are based on the different phases and situations that we meet them at and fall in love with, at different times.
Story first published:Monday, December 25, 2017, 10:24 [IST]
Desktop Bottom Promotion