For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుడు మీ దగ్గరకు మళ్ళీ రావాలనుకుంటే, ఎందుకు మీరు ఖచ్చితంగా వద్దు అని చెప్పాల

By R Vishnu Vardhan Reddy
|

మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుడుతో ఎన్నో భావోద్వేగ బంధాలు ఉండి ఉండొచ్చు. కానీ వాటన్నింటికంటే ముందు మొదటగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఏమిటంటే, ఎందుకు వాళ్ళు మీ మాజీ అయ్యారు అనే విషయం ఆలోచించండి.

మీరు ప్రేమించిన వ్యక్తితో ఎప్పుడు అయితే విడిపోతారో, అటువంటి సమయంలో ఈ శాస్త్ర సాకేంతిక పరిజ్ఞానం విపరీతమైన చికాకుని కలిగిస్తుంది. వారి ట్వీట్లు, ఇంస్టాగ్రామ్ ఫోటోలు మరియు మరీ ముఖ్యంగా పేస్ బుక్ సెల్ఫీలు, ఇలా ఎన్నో మీ ముందు కదలాడుతూనే ఉంటాయి.

<strong>మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు మరొకరితో డేటింగ్ చేస్తుంటే?!</strong>మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు మరొకరితో డేటింగ్ చేస్తుంటే?!

వాళ్ళని మీ యొక్క స్నేహితుల జాబితా నుండి తీసివేయడం ఒక్కటే మార్గం కాదు. ఎందుకంటే, వారిని మీ మెదడు నుండి అంత సులభంగా తీసివేయలేరు కాబట్టి. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకవేళ మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుడు తిరిగి మీ వద్దకు రావాలని భావిస్తే, ఎందుకు మీరు ఇంతకముందు విడిపోవాల్సి వచ్చింది అనే విషయమై మొదట ఆలోచించండి. మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుడే మొదట విడిపోవడానికి కారణం అయి ఉండొచ్చు. ఇటువంటి సందర్భంలో చిత్త శుద్దితో కూడిన మానసిక ఆరోగ్యాన్ని అంత సులవుగా అనుభవించలేకపోవచ్చు. కానీ, మీకు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీకు ఇంతకంటే మరింత మంచివారు మీ జీవితంలోకి వస్తారు. మొదట మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుడు మీ వద్దకు రావాలని భావిస్తే, మీరు ఎందుకు వద్దు అని చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం....

అన్ని మరచిపోయి ముందుకు సాగిపోయారు :

అన్ని మరచిపోయి ముందుకు సాగిపోయారు :

మీరు మీ ప్రేమని కోల్పోయినప్పుడు అత్యంత ఘోరమైన దశను చూసి ఉంటారు. అవన్నీ దాటి ఇప్పుడు మళ్ళీ మాములు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇటువంటి దాని గురించి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుడు క్షమించమని మరియు తప్పైపోయింది అనే భావనను కలిగించేలా మాట్లాడతారు. వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు రావాలని కోరుకుంటూ ఉండవచ్చు. కానీ, మీకు మళ్ళీ అదే దశ రాకూడదని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే, మళ్ళీ ప్రేమను కోల్పోవడం అనే దశ ఏదైతే ఉందో అది ఈ సరి మరింత ఘోరంగా ఉంటుంది.

కోల్పోయినవాటిని తిరిగి తెచ్చుకోవడం కంటే, మెరుగైనవి మీకోసం ఎదురు చూస్తున్నాయి :

కోల్పోయినవాటిని తిరిగి తెచ్చుకోవడం కంటే, మెరుగైనవి మీకోసం ఎదురు చూస్తున్నాయి :

ప్రేమికులు ఇద్దరు విడిపోవడం అనేది ఎదో ఒక ప్రత్యేకమైన కారణం వల్ల జరిగి ఉంటుంది. ఆ కారణానికి కారణం ఎవరు, ఎవరు మొదలుపెట్టారు అనే విషయాలు అనవసరం. మీకు కొన్ని రోజుల తర్వాత మీ అంతట మీరే ఒకానొక సమయంలో ఈ వ్యక్తితో నా జీవితాన్ని మొత్తం గడపలేను అని గుర్తిస్తారు. వాళ్ళు గనుక తిరిగి మీ దగ్గరకు రావాలని భావిస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే , మీరు వాళ్ళకంటే మించిన చాలా మంచివారు అని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని సంరక్షించలేనివారు, మిమ్మల్ని అర్ధం చేసుకోలేనివారు మీకు జీవిత భాగస్వామిగా ఉండలేరు అని గుర్తించండి.

ఎదో ఒక కారణం వల్ల మీరు ఇద్దరూ విడిపోయి ఉంటారు :

ఎదో ఒక కారణం వల్ల మీరు ఇద్దరూ విడిపోయి ఉంటారు :

మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుడు మిమ్మల్ని మళ్ళీ ప్రేమిస్తున్నాని మరియు మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవాలని ఉందని మెసేజ్ పెడితే మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ, మీ ఇద్దరు విడిపోవడానికి కారణం అయిన ఆ భయంకరమైన కారణాన్ని మీరు మర్చిపోకండి మరియు మీరు ఆ సమయంలో అనుభవించిన క్షోభను గుర్తుపెట్టుకోండి. మీరు అప్పుడు ఆ సమయంలో ఎలా ఉన్నారు అని చూడటానికి లేదా కనీసం పలకరించడానికి మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుడు మీ చుట్టూ ప్రక్కల లేరని, మిమ్మల్ని ఓదార్చడానికి కనీసం ప్రయత్నించలేదని గుర్తించండి. ఆ సమయంలో వారు రుచికరమైన భోజనాన్ని వాళ్ళ స్నేహితులతో తింటూ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉండి ఉంటారు లేదా వాళ్లకు నచ్చిన వేరొక కొత్త వ్యక్తితో కలిసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లి ఉంటారు. ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని ఇప్పటికే ఒకసారి వదిలేసి వెళ్లారో, మళ్ళీ కూడా మిమ్మల్ని వదిలివెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అస్సలు అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే, ఈ విషయమే అన్నింటికంటే అతి ముఖ్యమైనది.

సందర్భాలన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు :

సందర్భాలన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు :

మీరిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మీరు ఆలోచించిన క్షణాలు మరియు వారితో ప్రేమగా గడిపిన సందర్భాలు ఒకసారి విడిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటికి అవి తిరిగిరావు. మీరు విడిపోయి మీ ప్రేమకు ముగింపు పలికిన తర్వాత మళ్ళీ తిరిగి కలిసినా కూడా మొదట్లో ప్రేమించుకున్నంత ఎక్కువగా ఇప్పుడు ప్రేమించుకోలేరు.

అవకాశాలు :

అవకాశాలు :

మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుడిని తిరిగి వెనక్కి రమ్మని, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారనే బాధలో తిరిగి రమ్మని మీరు అడుక్కొని ఉండవచ్చు. ఏ విషయం పై లేదా ఏ కారణం పై మీరు విడిపోయారు అనే విషయం అనవసరం. వాళ్ళు తిరిగి రావడానికి ఎంతో సమయం అప్పట్లో ఉండి ఉంటుంది. అప్పుడు రాకుండా ఎప్పుడో సంవత్సరం తర్వాత తిరిగిరావడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే, మీరు అప్పటికే భావోద్వేగమైన దశను దాటి ఇప్పుడు సాధారణ స్థితిలో ఉన్నారు.

ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు :

ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు :

ఒకసారి ప్రేమలో విఫలమైన లేదా చాలా భయంకరమైన పరిస్థితితుల్లో విడిపోయిన వ్యక్తులు ప్రస్తుతానికి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎన్ని సార్లు తిరిగి మీ చెంతకు వస్తామని వాళ్ళు మీకు మెసేజ్ లు పంపించినా తిరిగి వారిని దగ్గరకు తీయకూడదు కలవకూడదు అనే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.

మాజీ ప్రేయసి లేదా ప్రియుడు అంటే అర్ధం అది కాదు :

మాజీ ప్రేయసి లేదా ప్రియుడు అంటే అర్ధం అది కాదు :

మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుడు మీతో గడపటం వల్ల నిరుత్సాహ పడి ఉండొచ్చు మరియు వాళ్ళ జీవితంలో ఏదో వెలుగుని కోల్పోయాము అనే భావన వారిలో కలిగి ఉండొచ్చు. అందుకనే వాళ్ళు అప్పుడు వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రావాలని కోరుకోవడానికి కారణం ఏమిటంటే, వాళ్ళకి ఇప్పుడు పొద్దుపోక మీ దగ్గరకి రావాలని అనుకోని ఉంటారు లేదా వాళ్ళ జీవితంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అని ప్రపంచానికి చూపించుకోవడానికి అయినా అయి ఉండాలి.

మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుడితో బంధాన్ని మళ్ళీ కొనసాగించాలి అనుకోవడం చాలా చెడ్డ ఆలోచన మరియు మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఏమిటంటే, మీరు ఇప్పుడు ఎలా అయితే వాళ్ళు లేకుండా ఖచ్చితత్వంతో ఉన్నారో అలానే ఉండండి మీ జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్ళండి.

English summary

why we should say no when ex wants to get back | reasons why we should say no when our ex wants to get back

Here is why you should say a NO when your ex will be wanting to get back, check out why!
Desktop Bottom Promotion