For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భాగస్వామిని ఫేస్ బుక్ లో ఫాలో అవకుండా ఉండటం ఎందుకు మంచిది!

ఈకాలంలో ప్రతిఒక్కరూ ఫేస్ బుక్ లో ఉంటున్నారు. మీ భాగస్వామి కూడా ఉండే ఉంటారు. అయితే మీరు వారిని స్నేహితుడిగా అందులో యాడ్ చేసుకుంటున్నారా?

By Deepti
|

ఈకాలంలో ప్రతిఒక్కరూ ఫేస్ బుక్ లో ఉంటున్నారు. మీ భాగస్వామి కూడా ఉండే ఉంటారు. అయితే మీరు వారిని స్నేహితుడిగా అందులో యాడ్ చేసుకుంటున్నారా?

సోషల్ మీడియాలో మీ భాగస్వామిని జతచేయకపోవటమే మంచిది. అది మీ బంధంపై, మనఃశ్శాంతిపై ప్రభావం చూపవచ్చు.

ఈ చిన్నపని మీ బంధం నాణ్యతను ఎలా నిర్ణయిస్తుందని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఈ కింది కారణాలు చదవండి.

అనవసర చింతలు ఎక్కువవుతాయి మీకు !

అనవసర చింతలు ఎక్కువవుతాయి మీకు !

మీ భర్త లేదా ప్రియుడు ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయిల ఫోటోలకి లైక్ లు కొడుతున్నట్టు ఊహించుకోండి. మీకు తెలీకుండానే మీరు బాధపడతారు. అలాగే పబ్లిక్ గా వేరే అమ్మాయిలతో సంభాషణ మొదలుపెట్టినా, ఇతర అమ్మాయిల ప్రొఫైల్స్ పై కామెంట్ లేదా ప్రశంసించినా మీకు కారణం తెలీకుండానే కొన్నిగంటలు ఉదాసీనంగా మారిపోతారు. అందుకే మీ భాగస్వామితో ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ గా ఉండాల్సిన అవసరం లేదు.

ఫేస్ బుక్ నుంచి ఇప్పటికిప్పుడే డిలీట్ చేయాల్సిన విషయాలు ఫేస్ బుక్ నుంచి ఇప్పటికిప్పుడే డిలీట్ చేయాల్సిన విషయాలు

మీ మనసు అతిగా ఆలోచిస్తుంది

మీ మనసు అతిగా ఆలోచిస్తుంది

ఇటీవలి అధ్యయనం ప్రకారం ఇటీవలి కాలంలో అధికశాతం జంటలు విడిపోవడానికి ముఖ్య కారణం సోషల్ మీడియా కావచ్చు . నిజం, మీరు కొన్నిసార్లు అతిగా ఆలోచించి, విశ్లేషించి మీ భాగస్వామితో తర్వాత ఎప్పుడో వాదనకి దిగవచ్చు !

అతనికి స్వేచ్చనిచ్చి మీరు మీ స్వేఛ్చని ఆనందించండి

అతనికి స్వేచ్చనిచ్చి మీరు మీ స్వేఛ్చని ఆనందించండి

ఫేస్ బుక్ లో మీ భాగస్వామితో ఫ్రెండ్ గా లేకుండా, మీరు మీ సమయాన్ని ఆనందిస్తూ, అతన్ని అతని స్వేఛ్చని ఆనందించేలా చేయవచ్చు. అతను మీరు ఎలా ఫేస్ బుక్ వాడుతున్నారో గమనిస్తున్నాడో లేదో, అదే సమయంలో మీరు కూడా అనవసరంగా అతని వెనకాల పడి అతనేం చేస్తున్నాడో అని ఫేస్ బుక్ లో సమయం వృధా చేయక్కర్లేదు.

ఊరికే మీరెలా ఉన్నారని పదే పదే సందేహపడక్కర్లేదు

ఊరికే మీరెలా ఉన్నారని పదే పదే సందేహపడక్కర్లేదు

కొంచెం హాట్ గా కన్పించే మీ ఫోటో ఫేస్ బుక్ లో పెట్టినప్పుడు, మీ భాగస్వామి మీ ఫేస్ బుక్ స్నేహితుల లిస్ట్ లో లేకపోతే, అతనెలా స్పందిస్తాడో అని ఆందోళనపడక్కర్లేదు.

మీరు అతన్ని వెంటాడక్కర్లేదు

మీరు అతన్ని వెంటాడక్కర్లేదు

మీ మెదడులో అతనిపై ఫేస్ బుక్ లో గూఢచర్యం చేయాలని అన్పించినా, మీరు అతనితో ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ కాదు కాబట్టి చేయలేరు. దానివల్ల మీకే మనఃశ్శాంతి.

మీకు అతనెప్పుడు ఆన్ లైన్ లో ఉంటాడో తెలీదు

మీకు అతనెప్పుడు ఆన్ లైన్ లో ఉంటాడో తెలీదు

నిజానికి, ఎప్పుడు అతను ఆన్ లైన్ లో ఉన్నాడని చెక్ చేస్తూ ఉండటం మీకే బాధ. అదికూడా అతను అర్థరాత్రి వరకూ ఆన్ లైన్ లో ఉంటే ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నాడనే టెన్షన్ తో మీకు నిద్రపట్టదు. హాయిగా అతనితో ఫేస్ బుక్ లో దూరంగా ఉంటే, ఇలాంటి అర్థం పర్థం లేని విషయాలకు దూరంగా ఉండవచ్చు.

జీవితంలో శాంతి

జీవితంలో శాంతి

అనేక అధ్యయనాల్లో భాగస్వామితో ఆన్ లైన్ లో దూరంగా ఉండే వారి జీవితాలు సంతోషంగా ఉంటాయని తేలింది. మీకు అతనిపై నమ్మకం ఉంటే, మీ బంధాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. మీకు నమ్మకం లేకపోతే, అతన్ని ఆన్ లైన్ లో వెంటాడటం కన్నా నేరుగా అతనితో మాట్లాడి పరిష్కరించుకోవచ్చు.

English summary

Why It Is Better Not To Follow Your Partner On Facebook

Almost everyone is on Facebook. So, even your partner is also on Facebook. So, would you like to send him a friend request in order to add him? Read this!
Story first published: Monday, July 24, 2017, 14:59 [IST]
Desktop Bottom Promotion