స్త్రీలకు పురుషులు చెప్పకూడని రహస్యాలు ఇవే..

By R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

రహస్యాల గురించి మాట్లాడాల్సి వస్తే సాధారణంగా స్త్రీలు ఎక్కువ రహస్యాలను దాస్తుంటారు. వారు ఓ పట్టాన అర్ధంకారు అని చాలా మంది భావన. పురుషులు చాలా సాదాగా, సహజమైన స్వభావముతో ఉంటారని మరియు సాధారణ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని అనుకుంటారు. పురుషులు కూడా కొన్ని విషయాలను దాచడానికి ప్రయత్నిస్తారు, దాచాలని గట్టిగా అనుకుంటారు. కానీ అలా చేయడంలో తరచూ విఫలమవుతుంటారు.

పురుషులు వాళ్ళ జీవితంలోని కొన్ని అంశాలను స్త్రీలకు తెలియకుండా ఉంచాలని భావిస్తారు లేదా వారిలో ఉన్న సాధారణ అలవాట్లను స్త్రీలకు చూపించకూడదు అనుకుంటారు. ఎందుకంటే ఇవి గనుక వాళ్లకు తెలిస్తే వేరే దృష్టితో వీరిని చూస్తారని భయం ఎక్కువగా పురుషులని వెంటాడుతుంటుంది.

అలర్ట్ : పురుషులు అట్రాక్టివ్ గా కనిపించడానికి సీక్రెట్స్ ఏంటి..!?

ఏ రహస్యాలను పురుషులు ఎప్పటికీ స్త్రీలకు చెప్పకూడదు అనుకుంటారు ? తెలుసుకోవాలని ఆతురతగా ఉందా? అయితే ఇప్పుడు ఆ పురుష రహస్యాల గురించి సవివరంగా తెలుసుకుందాం.

" ఈ భూ ప్రపంచంలో నువ్వే అత్యంత అందమైన మహిళవి " అని ఎప్పుడైనా చెప్పాడా ? :

90% పురుషులు తాము కలిసే మహిళల దగ్గర ఇలాంటి అభినందనలను కురిపిస్తుంటారు ! ఒక అధ్యయనం ప్రకారం చాలా మంది పురుషులు వాళ్ళ జీవితంలో కలిసే మహిళల దగ్గర " నువ్వు చాలా అందంగా ఉన్నావు " అనే తరహా వ్యాఖ్యలను తరుచుగా వాడుతుంటారని ఒక అధ్యయనం లో తేలిన విషయం. ఈ నిజాన్ని పురుషులు కూడా స్వయంగా ఒప్పుకున్నారు.

వాళ్ళు కొన్ని సార్లు సోమరితనాన్ని ప్రేమిస్తారు :

వాళ్ళు కొన్ని సార్లు సోమరితనాన్ని ప్రేమిస్తారు :

మీరు విన్నది నిజమే, కొన్ని సార్లు పురుషులు ఏమి చేయకుండా, సోమరితనంగా కూర్చోడానికి ఇష్టపడతారు. మరికొందరు వారికి దొరికిన సమయాన్ని ఏకాంతంగా కూర్చొని ప్రశాంతంగా గడపాలని భావిస్తారు. మరికొందరు ఆ రోజంతా మంచం పైనే తిని, తాగి గడిపేయాలని అనుకుంటారు.

సాధారణంగా ఇలా సోమరితనంతో వ్యవహరిస్తున్న సమయాల్లో స్త్రీలు గనుక పురుషుడిని కలవాలని అనుకుంటే, ఆ సమయం లో తాను బిజీగా ఉన్నానని, తరువాత కలుద్దాం అని పురుషుడు అబద్దం చెప్పే అవకాశం కూడా ఉంది! ఎందుకంటే ఆ సమయం లో తాను ఒక్కడే ఏకాంతంగా ఉండాలని, కొద్దీ సేపు తాను మాత్రమే గడపాలని, ఒంటరి గా పడుకోవాలని భావిస్తాడు.

పురుషులు తాము తిరస్కారానికి గురైయ్యామనే విషయాన్ని కప్పిపుచ్చుతారు :

పురుషులు తాము తిరస్కారానికి గురైయ్యామనే విషయాన్ని కప్పిపుచ్చుతారు :

ఇప్పుడు మీ ముందు ఉన్న పురుషుడు గతంలో ఎంతో మంది స్త్రీల దగ్గరకు వెళ్లి తన ప్రేమను వ్యక్తపరిచి ఉండొచ్చు మరియు వాళ్ళు ఇతన్ని తిరస్కరించి ఉండొచ్చు. కానీ ఇతను ఎప్పుడు కూడా ఆ తిరస్కారాల గురించి మాట్లాడడు, మాట్లాడటానికి ఇష్టపడడు. ఎంతసేపు తన పై ఎంతో మంది మహిళలు ఆసక్తి చూపారని చెబుతూ, తన గొప్పదనాన్ని చూపించుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు.

పురుషులు కొన్ని వివరాలను మరిచిపోతారు :

పురుషులు కొన్ని వివరాలను మరిచిపోతారు :

అపుడప్పుడు పురుషులు కొన్ని వివరాలను మరిచిపోతుంటారు. ఎంతో పెద్దా విషయాల పై దృష్టి కేంద్రీకరించే సామర్థ్యం ఉన్నా కానీ చిన్న చిన్న విషయాలను మరిచిపోయి అన్ని విషయాలను కలిపేసి గజిబిజి చేసేస్తుంటారు. అందువల్లనే మీరు ఏమైనా పని చేయమని చెప్పినా ఆ పని కూడా ఇలా గజిబిజి చేసేయడంతో అవి సక్రమంగా పూర్తికావు.

అర్ధంలేని విషయాల గురించి ఆలోచించడం ద్వారా ఉపశమనాన్ని పొందుతారు :

అర్ధంలేని విషయాల గురించి ఆలోచించడం ద్వారా ఉపశమనాన్ని పొందుతారు :

ఎప్పుడైతే పీకల్లోతు కష్టాల్లో పురుషులు మునిగిపోయి ఉంటారో, అటువంటి సమయాల్లో చాలా లోతుగా తదేకకంగా, ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నట్లు నటిస్తుంటారు. కానీ, అటువంటి ఆందోళన నుండి దూరం జరగడానికి అర్ధంలేని విషయాల గురుంచి ఆలోచించి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. కొంత మంది పురుషులు అయితే అశ్లీల చిత్రాల గురించి అలోచించి సమస్యల నుండి తప్పించుకోవాలనుకుంటారు.

లైంగిక సామర్థ్యంను పెంచే 15 ఇండియన్ సూపర్ ఫుడ్స్

పురుషులు ప్రతి విషయాన్ని సూక్ష్మంగా, క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు :

పురుషులు ప్రతి విషయాన్ని సూక్ష్మంగా, క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు :

పురుషులు దాదాపు తమకు ఎదురయ్యే ప్రతి మహిళను చూస్తారు. అంతే కాకుండా అందమైన మహిళలు తారసపడినప్పుడు, రహస్యంగా తదేకంగా వారిని అలానే చూస్తూ ఉండటానికి ఇష్టపడతారు.

పురుషులకు కూడా భయాలు ఉంటాయి :

పురుషులకు కూడా భయాలు ఉంటాయి :

కొంత మంది పురుషులు బయటికి చాలా దైర్యవంతులుగా నటిస్తారు, కానీ వారి లోలోపల ఎంతో భయం దాగి ఉంటుంది. ఇందు వల్ల కొద్దిగా వేదనకు గురవుతారు. కొంతమంది పురుషులు ఏ కారణం లేకపోయినా భవిష్యత్తు గురించి ఆందోళన చెందే స్వభావం తో సతమతమవుతుంటారు.

పురుషులకు కూడా మద్దతు చాలా అవసరం !

పురుషులకు కూడా మద్దతు చాలా అవసరం !

పురుషులు భావోద్వేగ మద్దతు కోసం విపరీతంగా పరితపిస్తుంటారు. కానీ, ఆ సహాయం ఎవరినైనా అడగటానికి వారిని ఎదో అడ్డుకుంటూ ఉంటుంది. అందుకనే అడగటానికి సంకోచిస్తుంటారు. లోలోపల వారి మనస్సుని ఎదో దహించి వేస్తున్నా బయటకు ఆ విషయం తెలియకుండా ఉండటానికి, కల్పిత మొహాన్ని బయటప్రపంచానికి చూపిస్తుంటారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Secrets Of Men

    If you talk about mystery, women are mysterious. Men are plain and simple. But even men do have some things which they want to hide but they generally fail
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more