మీ ప్రేయసిలో ఈ లక్షణాలు గనుక ఉంటే ఆమె మీ అసలైన ప్రేయసి కాదు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ చిగురించినప్పుడు, ఆ ప్రేమ నిజమా కాదా అని ఒకటికి పది సార్లు తర్కించి చూసుకోవడం అవసరం. ఎందుకంటే వారిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలి గనుక. ఒక అబ్బాయి తాను ప్రేమలో ఉన్నానని గ్రహించినప్పుడు అందుకు అనుగుణంగా తీసుకొనే చర్యలు చాలా నెమ్మెదిగా ఉండాలి.

మొదట ప్రేమికులు ఒకరి భావాలు ఒకరు అర్ధం చేసుకోగలగాలి. ఇద్దరిదీ ఒకే భావన అనే ఏకాభిప్రాయానికి రావాలి. ఆ తరువాత వారిద్దరూ ఒకరినొకరు అమితంగా ప్రేమించుకుంటున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలి.

మీ సహోద్యోగిని లేక మీ తరగతిగదిలో ఉన్న అమ్మాయి నవ్వుతూ మీతో తరచూ మాట్లాడుతుందని మీరు కొన్ని నిశ్చిత అభిప్రాయాలకు వచ్చేయకండి.

మీరిద్దరూ ప్రతి రోజూ ఓ గంటపాటు కాఫీ షాప్ లో కూర్చొని హాయిగా ప్రపంచంలోని అన్ని సంగతుల గురించి మాట్లాడుకున్నంత మాత్రాన, ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుందనే అభిప్రాయానికి రాకండి. కొన్ని సార్లు ఆ అమ్మాయికి మీతో గడపడం ఇష్టం అయిఉండొచ్చు.మీతో మాట్లాడుతుండటం ఆమెకు హాయిగా అనిపించొచ్చు. అంత మాత్రం చేత మీ పై ప్రేమ ఉన్నట్లు కాదు. ఆ విషయాన్ని అక్కడితోనే మీరు వదిలేయండి. అంతకు మించి ఆలోచించకండి.

ఈ మోడల్ ను చూస్తే మీకేమనిపిస్తుంది..? ఆడ..మగ..?

ఆమె మిమ్మల్ని తిరిగి ఇష్టపడటంలేదని చెప్పే లక్షణాలు :

ఆమె మిమ్మల్ని తిరిగి ఇష్టపడటంలేదని చెప్పే లక్షణాలు :

మీతో గడపడం ఇష్టమైనంత మాత్రాన, దానర్ధం మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టి మీతో బంధం ఏర్పరుచుకోవడానికి తానూ సిద్ధంగా ఉందని కాదు. ఇలా ఉన్న అమ్మాయిలు మిమ్మల్ని ఆ సమయానికి వాళ్ళ అవసరం కోసం వాడుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన వ్యక్తి ఇంకెవరో వున్నారని మీరు అర్ధం చేసుకోండి. ఇలాంటి అమ్మాయి లపై మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. అందువల్ల మీరు నిరుత్సాహపడే అవకాశాలు ఎక్కువ. మీకు నచ్చిన అమ్మాయిలో ఈ క్రింద చెప్పిన లక్షణాలు గనుక ఉంటే అటువంటి వాళ్లకు మీరు కొద్దిగా దూరంగా ఉండటం మంచిది.....

ఆమె మీకు తరచూ ఫోన్ చేయదు, మీరు ఫోన్ చేసినా ఎత్తదు :

ఆమె మీకు తరచూ ఫోన్ చేయదు, మీరు ఫోన్ చేసినా ఎత్తదు :

మీరు తనకు తగిన వ్యక్తి కాదు అని ఆ అమ్మాయి గనుక భావిస్తే, ఆమె స్వతహాగా మీకెప్పుడు ఫోన్ చేయదు. మరియు మీరు ఫోన్ చేస్తే ఎత్తదు ఎప్పుడో కానీ మాట్లాడదు. నిజంగా ప్రేమించే వాళ్ళు మీరు ఫోన్ చేసే వరకు ఎదురు చూడరు కదా.

మీ గర్ల్ ఫ్రెండ్ కు చిరాకుపరిచే 7 భయంకరమైన ప్రశ్నలు!

ఆమె తను ఉంటున్న ప్రదేశానికి మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించదు :

ఆమె తను ఉంటున్న ప్రదేశానికి మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించదు :

ఈ ఒక్క విషయం చెప్పేస్తుంది, ఆమె జీవితంలో మీకు ఎటువంటి ప్రాముఖ్యత లేదని. ఆమె గనుక నిజంగా ఇష్టపడి, భవిష్యత్తులో మిమ్మల్ని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలనే ఆలోచన ఉంటే, తన ఇంటికి పిలిచి తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తుంది.

మీతో కలిసి ఉన్నట్లు ఆమెను ఎవరైనా చూస్తే అస్సలు ఇష్టపడదు :

మీతో కలిసి ఉన్నట్లు ఆమెను ఎవరైనా చూస్తే అస్సలు ఇష్టపడదు :

మీతో ఎప్పుడూ సెల్ఫీ తీసుకోదు. మీరు ఏదైనా కాఫీ షాప్ లో తనతో కూర్చొని ఉన్నప్పుడు, తన స్నేహితులు ఎవరైనా ఆ సమయంలో తనని చూస్తే, అలా మీతో కనపడటానికి అస్సలు ఇష్టపడదు. ఆ సమయంలో విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది.

మీ ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని ఎప్పటికి అంగీకరించదు :

మీ ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని ఎప్పటికి అంగీకరించదు :

మీతో ఉండటానికి, గడపడానికి, మాట్లాడటానికి ఆమె ఆఫీస్ వరకే ఇష్టపడుతుంది, అది కూడా ఎవ్వరికి తెలియకుండా. ఆ తర్వాత సమయంలో మీ అవసరం తనకు లేదని భావిస్తుంది.

ఆమె పుట్టిన రోజు నాడు మీకు అసలు ఆహ్వానమే రాదు :

ఆమె పుట్టిన రోజు నాడు మీకు అసలు ఆహ్వానమే రాదు :

ఇదొక్క విషయం తో అర్ధం అవుతుంది, ఆమె మిమ్మల్ని వాడుకుంటుందని, ఆమెకు కావాల్సిన వ్యక్తి మీరు కాదని, మరెవరో అని మీరు గ్రహించాలి. మీతో ఎంతో బాగా మాట్లాడినంత మాత్రాన ఇలాంటి వాళ్ళపై మీరు అస్సలు ఆశల పెట్టుకోకండి.

ఆమెకు ఎపుడు అవసరం వచ్చిన మీకే మొదట ఫోన్ చేస్తుంది :

ఆమెకు ఎపుడు అవసరం వచ్చిన మీకే మొదట ఫోన్ చేస్తుంది :

ఆమెకు ఎప్పుడు అవసరం అయినా మొదట మీకే ఫోన్ చేస్తుంది. అలాంటి సమయంలో మీరు ఆమెకు సహాయం చేయడం మీకు పెద్ద విషయం కాకపోవచ్చు. అవసరమైనప్పుడు మీరే దగ్గర ఉండి చూసుకొని ఉండొచ్చు, కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు, మీరు సాయం చేయమని అడిగితే సాయం చేసే స్థితిలో ఉన్నా, మీ వైపు కన్నెత్తి కూడా చూడదు. ఆమె దగ్గర నుండి మీకు ఎటువంటి సహాయం అందదు. ఇదొక్క విషయం చెబుతుంది, మిమ్మల్ని ఆ అమ్మాయి కోరుకోవడం లేదని.

వర్జినిటీ (కన్యరికాన్ని) కోల్పోవడానికి కరెక్ట్ వయసెంత..?

మీరు అస్సలు మనస్సు విప్పి మాట్లాడకపోయి ఉంటే :

మీరు అస్సలు మనస్సు విప్పి మాట్లాడకపోయి ఉంటే :

మీ సంభాషణలు అసలు ఎప్పుడూ ఏ విషయం పై అయినా ఆమెతో లోతుగా చర్చలు జరగనప్పుడు, మీ భావాలు ఆమె గుండెలకు తాకనప్పుడు, అలాంటి అమ్మాయి మిమ్మల్ని ఎంత వరకు కావాలో అంత వరకు వాడుకొని ఆ తర్వాత తన జీవితం నుండి పక్కన పెట్టేస్తుందని గ్రహించండి.

English summary

Signs You're Her Side Dish; Not Main Course!

Liking your company doesn't mean that she likes to start a relationship with you. It means that you are just a side dish, not the main course meal for her. So, if you pin your hopes too much on her, you may feel disappointed later. Here are some more signs to notice.
Subscribe Newsletter