మొదటి సారి ముద్దు పెట్టేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పలు చేయకండి..!

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రేమలో పడటం అనేది ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. మీకు నచ్చిన వాళ్లతో మీ ఆలోచనలను మరియు అభిప్రాయాలను పంచుకుంటున్న సమయం మీకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ జీవితం, ఆనందంలో మరో మైలురాయి దాటినట్లు భావిస్తారు.

ప్రేమలో ఉన్నప్పుడు మీరు ఎంతో ఉల్లాసంగా మరియు సంతోషంగా ఉంటారు. అలా ఇద్దరు కలిసి బయటకు వెళ్లడం, చేయి చేయి పట్టుకొని అలా ఎక్కువ దూరం నడుస్తూ మాట్లాడుకోవడం లేదా ప్రేమను పంచుకోవడం. ఇలా ఎన్నో పనులు మీ భాగస్వామితో చేయడం చాలా ఉత్తేజకరంగా ఉంటుంది. ఇక ఈ స్థితి నుండి మీ ప్రేమను ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్లే సమయం ఆసన్నమవుతుంది. అదే మొదటి సారి ముద్దుపెట్టడం.

ముద్దుపెట్టడం అనే విషయానికి వచ్చేసరికి చాలామంది వెనకడుగు వేస్తారు మరియు సంకోచిస్తారు. మొదటిసారి ముద్దుపెట్టేటప్పుడే సరిగ్గా పెట్టడం ద్వారా ఒక బలమైన ముద్ర వేయాలని భావిస్తారు. అది ఎలా చేయాలి అనే విషయమై చాలా ఆందోళన చెందుతుంటారు.

ముద్దుపెట్టడం అనే విషయం, మీ భాగస్వామిని నేరుగా అడగాలంటే చాలామంది ఇబ్బంది పడతారు. మీ భాగస్వామి మీరు ముద్దుపెట్టే సమయాన్ని ఆస్వాదిస్తున్నారా లేదా అనే విషయం తెలియాలంటే మీరు ఎక్కువ శ్రమ పడనవసరంలేదు. ఆ విషయాన్నీ వాళ్ళే మెల్లగా తెలియజేస్తారు. కానీ, మీ భాగస్వామి మీ ముద్దుని ఇష్టపడకపోతే అప్పుడు ఎలా ?

మీరు ముద్దు సరిగ్గా పెట్టడంలేదు అని తెలియజెప్పే కొన్ని లక్షణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మీ భాగస్వామి మీ నుండి దూరం జరుగుతారు :

1. మీ భాగస్వామి మీ నుండి దూరం జరుగుతారు :

మీ భాగస్వామికి ఎప్పుడైతే ముద్దుపెట్టాలని మీరు భావిస్తారో, ఆ సమయంలో వారు కొద్దిగా దూరం జరుగుతారు లేదా ఇష్టం లేని హావభావాలను ప్రదర్శిస్తారు. మీరు ముద్దుపెట్టే నైపుణ్యాలను ఎంతగానో పెంపొందించుకోవాలి అనే విషయాన్ని ఈ సందర్భం మరియు లక్షణం తెలియజేస్తుంది.

2. పళ్లతో కొద్దిగా శబ్దం చేయడం :

2. పళ్లతో కొద్దిగా శబ్దం చేయడం :

ఇద్దరు వ్యక్తులు ముద్దుపెట్టుకునే క్రమంలో వారి నోటికి ఏ విధమైన అడ్డంకి ఉండకూడదు అనే విధంగా దేవుడు నోటిని రూపొందించడం జరిగింది. ముద్దుపెట్టే సమయంలో పళ్లతో కొద్దిగా మీరు గనుక శబ్దం చేస్తున్నట్లైతే మీరు ముద్దుపెట్టే విధానాన్ని తక్షణం మార్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుపెట్టుకోండి.

3. చిత్తడిగా వుండే ముద్దు :

3. చిత్తడిగా వుండే ముద్దు :

ఇది ప్రతి ఒక్క పురుషుడు తెలుసుకోవాల్సిన విషయం. ఎక్కువ లాలాజలంతో మీ భాగస్వామిని ముద్దు పెట్టినట్లయితే అది బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ఎందుకంటే చాలా మంది స్త్రీలకు ఎక్కువ లాలాజలంతో కూడిన ముద్దు పెట్టించుకోవడం ఇష్టం ఉండదు. కాబట్టి ముద్దుని చాలా పరిశుభ్రంగా మరియు సాధారణంగా పెట్టండి. దీనినే స్త్రీలు ఇష్టపడతారు.

4. ముద్దుపెట్టే సమయంలో కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడకపోవడం :

4. ముద్దుపెట్టే సమయంలో కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడకపోవడం :

ముద్దు పెట్టిన తర్వాత మీ భాగస్వామి గనుక త్వరగా వెళ్లిపోవాలని ఆతురతపడుతున్నట్లైతే వాళ్ళు మీ ముద్దుని ఆస్వాదించడంలేదని అర్ధం చేసుకోవాలి. ఈ విషయాన్ని వాళ్ళను నేరుగా అడగకండి, వాదనలకు దిగకండి. అసలు విషయాన్ని గ్రహించి, మీరు మరింత బాగా ముద్దుపెట్టి మీ భాగస్వామి మనస్సుని గెలవడానికి ప్రయత్నించండి.

తొలిముద్దు జీవితాంతం గుర్తుండే తీయని జ్ఞాపకం

5. నాలుకని ఎక్కువగా వాడటం :

5. నాలుకని ఎక్కువగా వాడటం :

మీ భాగస్వామి నోటి లోపలి మీ నాలుకను ముద్దుపెట్టే సమయంలో పెడుతున్నట్లైతే, అలా చేయటం తక్షణం ఆపేయండి. ముఖ్యంగా మీ భాగస్వామి మీరు స్పందించిన విధంగానే నాలుకతో ప్రతిస్పందించకపోతే ఆ విధానాన్ని తక్షణం ఆపివేయండి. నాలుకను ముద్దుపెట్టే సమయంలో కొద్ది వరకు మాత్రమే వాడటం ఉత్తమం.

6. ఎదో ఒక సంభాషణను మొదలుపెట్టడం ద్వారా ముద్దుకు దూరం జరగడం :

6. ఎదో ఒక సంభాషణను మొదలుపెట్టడం ద్వారా ముద్దుకు దూరం జరగడం :

మీ భాగస్వామి గనుక మీరు ముద్దుపెట్టే సమయంలో ఎప్పుడూ ఎదో ఒక కారణాలు చెప్పి ముద్దుకి సహకరించకుండా దూరం జరుగుతుంటే వాళ్ళు మీ ముద్దుని ఆనందించడంలేదని అర్ధం.

ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెడ్డగా ముద్దుపెట్టాలని అనుకోరు. అందరూ బాగా ముద్దులు పెట్టాలనే భావిస్తారు. కాబట్టి మీరు మీ భాగస్వామికి ముద్దుపెట్టే సమయం లో వాళ్ళ యొక్క హావభావాలు మరియు ప్రవర్తనను గమనించి వారికీ నచ్చిన రీతిలో వ్యవహరించండి.

భవిష్యత్తులో మీ భాగస్వామితో అనుబంధం మీరు పెట్టే ముద్దు పై ఆధారపడి ఉంటుంది. కావున ఇద్దరికీ ఓ తీపి జ్ఞాపకంగా ఉండేలా ముద్దు పెట్టండి, అలా పెట్టడానికే ప్రయత్నించండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Signs You Are A Bad Kisser

    It might be too uncomfortable to directly ask your date about it. If you want to know whether your partner enjoys your kissing sessions, he/she might let you know about it subtly. But what if he/she is being repellent when it comes to kissing you? Here are a few signs which will tell you that you are a bad kisser.
    Story first published: Monday, October 9, 2017, 18:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more