నేను సింగిల్‌... వ్యాలెంటైన్స్ డే నాడు ఇలాగే గ‌డుపుతాను!

By: sujeeth kumar
Subscribe to Boldsky

ప్రేమికుల దినోత్స‌వం అంటే ప్రేమికుల‌కు పండ‌గే! ఆ రోజు ఎలా గ‌డ‌పాల‌ని ర‌క‌ర‌కాలుగా ఆలోచిస్తుంటారు. అందుకు త‌గ్గ ప్ర‌ణాళిక వేసుకుంటూ ఉంటారు. మ‌రి సింగిల్స్ గా ఉన్న‌వారి ప‌రిస్థితి! వాళ్లు అలా చూడ‌ముచ్చ‌టైన జంట‌ల‌ను చూస్తూ ఉండాల్సిందేనా! ఎంజాయ్‌మెంట్‌కు ఆస్కార‌మే లేదా? ఎందుకు లేదు... సింగిల్ గా ఉన్నా.. జాలీగా ఎలా ఎంజాయ్ చేయొచ్చో.. ఈ క‌థ‌నం చెబుతానంటుంది.. మ‌రి చ‌దివి సింగిల్ అయితే మీరూ ఆచరించే ప్ర‌య‌త్నం చేయండి!

1. ప్రేమికుల దినోత్స‌వాన సంబరాలు

1. ప్రేమికుల దినోత్స‌వాన సంబరాలు

ప్రేమికుల దినోత్స‌వం... ఇదంటే సింగిల్స్‌కు చిరాకు క‌లిగిస్తుందేమో! ప్ర‌తి ఏడాది నా స్నేహితులంతా త‌మ భాగ‌స్వాముల‌తో రొమాంటిక్ డేట్ జ‌రుపుకునేందుకు అన్ని ర‌కాలుగా సిద్ధ‌ప‌డ‌తారు. నిన్నే నా ఫ్రెండ్ ఒక‌రు కొల‌ను ప‌క్క‌న ఉన్న రెస్టారెంట్లో డిన్న‌ర్ టేబుల్‌ను బుక్ చేసుకొంది. ఇంకొక‌రు త‌న బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి హిల్ స్టేష‌న్‌కు వెళ్ల‌నుంది. మ‌రికొంద‌ర‌మో నాతో మంచి క‌విత్వం రాయించుకొని వాళ్ల పార్ట‌న‌ర్‌కు ఇద్దామ‌నుకుంటున్నారు. ఇంకొక‌రైతే వారి బాయ్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్ చేయ‌డంలో హెల్ప్ చేయాలంట‌. మ‌రి నాలాంటి ఏకాకి అదేనండోయో పార్ట‌న‌ర్ లేని నా ప‌రిస్థితి ఏంటి? ఆ రోజున ఎలా గ‌డ‌పాలి అని ఆలోచిస్తున్నాను. ఆల్ ద సింగిల్స్ ఇన్ ద వ‌రల్డ్ ఇది మీకోస‌మే!

2. ఇలా గ‌డిపేందుకు స‌న్నాహం

2. ఇలా గ‌డిపేందుకు స‌న్నాహం

మా బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేక‌ప్ అయి 3 వారాలు అవుతోంది. దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఐతే వ్యాలెంటైన్స్ డే కు ముందు వ‌చ్చే టెడ్డీ డే, కిస్ డే, చాకొలెట్ డే లాంటివి నా బాధ‌ను మ‌రింత పెంచుతున్నాయి. అయినా ఆ బాధ‌ను దిగ‌మింగేందుకు నేనూ సంబ‌రాలు జ‌రుపుకుందామ‌ని నిర్ణ‌యించుకున్నాను. ఏ! ఎందుకు సెల‌బ్రేట్ చేసుకోకూడ‌దు!

3. నా ప్లాన్ ఇదీ...

3. నా ప్లాన్ ఇదీ...

మ‌న భాగ‌స్వామి మ‌న‌ కోసం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన‌, ఆనందం క‌లిగించే ప‌నుల‌ను చేయాల‌ని ఎందుకు కోరుకుంటారో నాకిప్ప‌టికీ అర్థం కాదు. ఇవ‌న్నీ నాకు నేనే స్వ‌త‌హాగా చేసుకోగ‌ల‌ను. ఆ రోజు ఉద‌య‌మే గంట సేపు గులాబీపూలతో స్నానం చేస్తాను. ఆ త‌ర్వాత వేడి వేడి సెగ‌లు క‌క్కే కాఫీ తాగుతూ మంచి పుస్త‌కం చ‌దువుతాను. ఇంత రిలాక్స్ మూడ్‌లో ఒక రోజు ప్రారంభిస్తే ఎంత బాగుంటుందో మీరే ట్రై చేయండి. ఆ త‌ర్వాత‌... నా డైట్ ప్లాన్‌ను ఈ రోజుకి ప‌క్క‌న పెట్టేసి ఇష్ట‌మైన స్వీట్లు, స్నాక్స్ తింటాను. ఎంతైనా భోజ‌న‌మే క‌దా నా మొద‌టి ప్రియుడు!

4. ఒక్కదాన్నే వెళ‌తా...

4. ఒక్కదాన్నే వెళ‌తా...

వేరొక‌రితో క‌లిసి డేట్‌కు వెళ్లాల‌నే ఆలోచ‌న ప‌క్క‌న పెట్టేసి నాకోస‌మే నేను డేట్ కు వెళ‌తాను. లాంగ్ డ్రైవ్‌కు వెళ్లి ఆ త‌ర్వాత ఏదైనా స్పా లో కాసేపు గ‌డుపుతాను. ఆ త‌ర్వాత ఏదైనా మాల్‌కు వెళ్లి డైమండ్ బ్రేస్‌లెట్ కొంటాను. ఇందుకోసం 4 నెల‌ల నుంచి కొంత డ‌బ్బు ప‌క్క‌న పెట్టాను లెండి! ధ‌ర ట్యాగ్ చూడ‌కుండా న‌చ్చిన‌వ‌న్నీ కొనేస్తాను. ఏంటి అలా ఉన్నారు! ఒక్క రోజు బాగా ఖ‌ర్చు చేసినంత మాత్రాన దివాళా ఏమీ తీయ‌నులెండి!

5. ఇంకా అయిపోలేదు...

5. ఇంకా అయిపోలేదు...

అంత‌టితో అయిపోలేదు. మాంఛి రొమాంటిక్ డిన్న‌ర్ లేనిదే ప్రేమికుల దినోత్స‌వం ముగియ‌దు. నా ఫేవ‌రేట్ రెస్టారెంట్ కు వెళ్లి అక్క‌డ నాకిష్ట‌మైన‌వ‌న్నీ ఆర్డ‌ర్ చేసేస్తాను. నేనొక్క‌దాన్నే కాబ‌ట్టి టేబుల్ మ్యాన‌ర్స్ లాంటివేవీ ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు. నేను ఆర్డ‌ర్ చేసిన ఫుడ్ అంతా ఒక్క‌దాన్నే తినేస్తా.. ముఖ్యంగా లాస్ట్‌లో డెజ‌ర్ట్‌ను కొంచెం కూడా వ‌దిలేది లేదు.!!

6. ప్రేమ లేఖ నా కోస‌మే...

6. ప్రేమ లేఖ నా కోస‌మే...

ఇంటికి వెళ్లి ఫ్రెష‌ప్ అయ్యాక ప్రేమ లేఖ రాస్తాను. బ్రేక‌ప్ అయిన మా ప్రియుడికి అనుకునేరు! నా కోస‌మే ఇది. నా గురించి నాకు న‌చ్చిన విష‌యాలు, నేను గ‌ర్వంగా ఫీల్ అయ్యే అంశాలు, నాకు అందిన ఆశీర్వ‌చ‌నాలు, భ‌విష్య‌త్ లో సాధించాల్సిన ల‌క్ష్యాలు. నా భావోద్వేగాలు, శ‌క్తివంత‌మైన వ్య‌క్తిగా ఎదిగేందుకు ఏం చేయాలి అన్న విష‌యాల‌తో సుదీర్ఘ ప్రేమ లేఖ రాసుకొంటాను.

7.ఒకే ఒక్క ష‌ర‌తు

7.ఒకే ఒక్క ష‌ర‌తు

ప్రేమికుల దినోత్స‌వం రోజు ఎలాంటి రూల్స్ లేవు. స్వ‌యం ప్రేమ‌లో మునిగితేలుతాను. అయితే ఒకే ఒక్క ష‌రతు పెట్టుకున్నాను. గ‌త స్మ్ర‌తుల‌ను తవ్వుకొని బాధ‌ప‌డ‌ద‌ల్చుకోలేదు. అప్పుడు నా ప్రియుడితో క‌లిసున్నా ఆనంద క్ష‌ణాల‌ను త‌ల్చుకొని అవి ఇప్పుడు పొంద‌లేక‌పోతున్నాను అని అస్స‌లు చింతించ‌ద‌ల్చుకోవ‌డం లేను. జీవితం చాలా చిన్న‌ది, ప్ర‌పంచంలో ఏదైనా ఆనందాన్ని పొందే హ‌క్కు నా కుంది. అన్ని బాధ‌ల‌ను మ‌ర్చిపోయి సంతోష‌పు సాగ‌రంలో మునిగిపోతాను.

మ‌రి సింగిల్స్ మీరూ మీ ప్రేమికుల దినోత్స‌వాన్ని ఎలా జ‌రుపుకోబోతున్నారో మాకు చెబుతారా?

English summary

Celebrating Valentine's Day

Do you really need to celebrate Valentine's Day? Of course, love doesn't need a specific day to be celebrated or enjoyed. Also, many people argue that it is just a day created only to profit the greeting card industry, gift industry and the hotel industry. May be, they are right!
Story first published: Wednesday, February 7, 2018, 9:00 [IST]
Subscribe Newsletter