For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ సంబంధాలను నాశనం చేస్తున్న సోషల్ మీడియా ... !

  |

  ఎప్పుడైనా మీరు మీ ప్రియమైనవారిత , సన్నిహితులతో ముఖాముఖి సంబంధాలను తక్కువగా కలిగి, సోషల్ మీడియా చాట్స్ అయిన " హే, ఎలా ఉన్నావ్, మెసేజ్ చెయ్ ఫ్రీ గా ఉన్నప్పుడు" వంటి సంభాషణలను ఎక్కువగా కలిగి ఉన్నారని గమనించారా?

  సోషల్ మాధ్యమాలు అంత తీవ్రంగా మన జీవితాలని స్వాధీనం చేసుకున్నాయి అన్నది జగమెరిగిన సత్యం, దీని కారణంగా సోషల్ మాద్యమాలలో టెక్స్ట్ చేయడానికి చేతి వేళ్ళు వాటికవే ఉసిగొల్పబడుతాయి, కానీ మనకు మనమే వెళ్లి ముఖాముఖిగా మాట్లాడటానికి సుముఖంగా ఉండలేని స్థితిలో ఉన్నామని గమనించలేకపోవడం సోషల్ మీడియా దురదృష్టకర సంకేతాలకు తార్కాణం.

  problems due to social media

  ఈ పరిస్థితుల కారణంగానే సోషల్ మీడియా చాటింగ్ సంబంధాలు పెరుగుతున్నాయి కానీ, వ్యక్తిగత సంబంధాలు తగ్గుముఖం పడుతున్నాయి.

  పొరపాటున ఏదైనా ఒకరోజు సోషల్ మీడియా పూర్తిగా పడిపోతే, అనేక సంబంధాల ఉనికి ఆరోజుతో ప్రశ్నార్ధకమే అవుతుంది. అంతగా మమేకమైపోయి జీవిస్తున్నాం అవునా కాదా?

  ఒక పరిశీలన ప్రకారం సోషల్ మీడియా వలన ప్రభావితం అయ్యే ఎన్నో కారణాలు ఇక్కడ ఉన్నాయి.

  problems due to social media

  1. వాస్తవికతకు దూరంగా:

  ఇటువంటి సోషల్ మీడియా అను మహా సముద్రంలో పూర్తిగా మునిగిపోయి బయటకు రాలేని పరిస్థితులలో ఉన్న మనకు, దీని నుండి బయటపడి వాస్తవిక సంబంధాలను మెరుగుపరిచే నాగరికతను సృష్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  సోషల్ మీడియాలో సంబంధాలు ఎంతగా మారుతున్నాయి అంటే, మామూలుగా ఏ ఇద్దరి మద్య సంబంధాలు సరిగ్గా ఉన్నా లేకపోయినా అది వాళ్ళ వ్యక్తిగతం అవుతుంది. కానీ, what is your relationship status? అనే ప్రశ్న దగ్గర single, committed, open relationship, divorced, married, complicated వంటి పదాలను చూడాల్సిన దుస్థితికి వచ్చాము. వీటి కారణంగా తెలియకుండా మనం ఇచ్చిన స్టేటస్లు , భావోద్వేగాల ఉనికిపై కూడా దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి.

  కావున సోషల్ మీడియాలో మీ వాస్తవికతను కోల్పోకండి, ఆ ప్రశ్నలకు సమాధానాలిచ్చి మీ వ్యక్తిగత జీవితాలను బహిర్గతం చేయడం వలన తెలీకుండానే మీ పై ఒక చెడు అభిప్రాయాన్ని ప్రజలలో కలిగేలా చేస్తుంది. కొన్ని ప్రశ్నల వలన అంతగా సమస్యలు లేకపోయినా, కొన్ని చాలా తీవ్ర ప్రభావాలనే చూపిస్తుంటాయి. ఇవి మనిషి మానసిక ఆలోచనలకు, మరియు వ్యక్తిగత ఉనికికి కూడా ప్రశ్నార్ధకంగా మిగులుతాయి.

  problems due to social media

  2. ప్రపంచానికి పరిచయం చేస్తుంది కానీ..!

  సోషల్ మీడియా మీరు ప్రపంచంలో ఎక్కడికైనా సంబంధాలను కొనసాగించేలా చేయగలదు, అనగా మీరు సోషల్ మీడియాలో ఇచ్చిన వివరాలను తెలుసుకుని మీ ఆలోచనలకు దగ్గరగా ఉన్నవారు కానీ, మీ అవసరం కోరుకున్న వారు కానీ, ఏ రూపంలో అయినా మీతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే మీరు కూడా చేయవచ్చు.

  ఒకసారి పాత తరానికి, నేటి తరానికి గల పోలిక చూద్దాం...

  పూర్వ కాలంలో, ప్రజలు ఇతరుల పట్ల తక్కువ సంబంధ మాద్యమాలను కలిగి ఉన్నారు. దీనికారణంగా తమకు ఉన్నదానితో సంతృప్తి చెందడం అలవాటుగా ఉండేది, కానీ నేటి తరంలో సంతృప్తి అనేది ప్రశ్నార్ధకమే? అందుబాటులో ఉన్న అన్నిరకాల అవకాశాలను మంచి చెడుల ఆలోచనలతో సంబంధమే లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఒకదానికంటే మెరుగైన మరొక సంబంధాలను కలిగి ఉండుటలో ఆలోచనలు చేస్తున్నారు. తద్వారా సంతృప్తి అనేది పక్క మార్గం పట్టి , అసంతృప్త జీవనానికి దారులు తెరుస్తున్నారు.

  3. ప్రతి ఒక్కరూ మీ జీవితంలోకి ఒక అడుగు కలిగి ఉంటారు :

  నవ్వుగా అనిపించినా ఇది నిజం. సోషల్ మీడియాలో వ్యక్తుల పోస్టులకు లైక్స్, షేర్స్, కామెంట్స్, టాగ్ వంటివి ప్రజల హక్కుగా ఉన్నది. ఇవి ఎంత మంచి చేస్తాయో అన్ని సమస్యలకు కూడా దారితీస్తాయి. కొన్ని సమయాల్లో తప్పుదోవ పట్టించి, అనేక గొడవలకు కూడా కారణం అవుతుంది. దీని కారణంగా మనుషుల ఆలోచన స్థితి తగ్గుముఖం పడుతుంది అన్నది నిజం.

  ఉదాహరణకి మీరు ఏదైనా సంబంధంలో ఉన్నప్పుడు మీ భాగస్వామితో కలిసి ఉన్న ఫోటోను అందరితో పంచుకున్నప్పుడు, మీకు అనేక లైక్స్, షేర్స్, కామెంట్స్, టాగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఫోటోలను మార్ఫింగ్ చేసి వేరే పనులకు ఉపయోగించే ప్రభుద్దులు కూడా లేకపోలేదు. అంత రక్షణ తక్కువగా సోషల్ మీడియా ఉంది అన్నది వాస్తవం.

  కానీ మీరు ఒకసారి పొరపాటున ఆ ఫోటో కానీ , మీ స్టేటస్ కానీ తొలగించిన ఎడల ప్రతి ఒక్కరూ మీ రిలేషన్ పై ప్రశ్నలను సంధిస్తారు. ఏమైంది మీ ఇద్దరి మద్య ? విడిపోయారా ? గొడవలయ్యాయా ? వంటి ప్రశ్నలతో మీ భావోద్వేగాలతో ఆడుకునే అవకాశం ఉంది. కావున అలాంటి అవకాశాలను ఇవ్వవద్దు.

  problems due to social media

  4. అసూయ మరియు ఆందోళన: -

  అనేక సందర్భాలలో ఇది నిజమని తేలింది కూడా. సోషల్ మాధ్యమాన్ని ఉపయోగించని వారి కన్నా ఉపయోగించుకునే వారు తరచుగా ఆందోళన సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా తమ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం చేసేవారు ఈ ప్రభావాలకు లోనవుతున్నారు. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు కూడా గురవుతున్నారు.

  5. సంబంధం ఆధారంగా క్రిమినల్ చర్యలు

  ఒక్కోసారి సోషల్ మీడియా సంబంధాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తుంటాయి. కొందరు తెలియని వ్యక్తులు సాన్నిహిత్యం ఏర్పరచుకుని మోసాలకు తెగబడుతుంటారు. కొందరు అసాంఘిక కార్యకలాపాలకు కూడా సోషల్ మీడియానే మాద్యమం గా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దీనికారణంగా అనేక మంది ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎన్నో కేసులు సైబర్ క్రైమ్ దృష్టికి వస్తున్నా, సరైన సాక్ష్యాలు లేక అనేకం పెండింగ్ లో ఉంటున్నాయి. ఒక్కోసారి కొన్ని సంబంధాలు ఒక్క కామెంట్, ఒక్క లైక్ తోనే అంత్యదశకు చేరుకుంటున్నాయి అంటే , ఎంత దుర్భర సామాజిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నామో తెలుస్తూనే ఉంది.

  ప్రపంచదేశాల ప్రజలను ఏకం చేసే సోషల్ మీడియాకు దన్యవాదములు తెలుపాల్సిందే, కానీ అదేవిధంగా జరుగుతున్న తీవ్ర పరిణామాలను అర్ధం చేసుకోవలసిన అవసరం కూడా ఉంది.

  English summary

  How Does Social Media Affect Your Relationship?

  Did you ever realize that you have less face-to-face conversation and more "hey! how are you? Ping me back when you are free", etc., conversation? Social media has taken over our life in such a drastic measure that we trigger a conversation with an unknown in few seconds over text but we have no guts to go up to someone and talk face-to-face.
  Story first published: Wednesday, March 28, 2018, 8:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more