మీ డేటింగ్ భాగస్వామిని ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలివే ..!

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మీరు ఎంతో కాలం పాటు మీ భాగస్వామితో డేటింగ్ చేసి ఉండొచ్చు, కానీ మీ భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకున్నారా. అయితే ముందు ఆ పని చేయండి.

సాన్నిహిత్యం అనేది ప్రతి కోరిక యొక్క మార్గం. సాన్నిహిత్యం మీ మద్య పరస్పర ఇష్టాన్ని పెంచుతుంది. సరైన సాన్నిహిత్యం ఇద్దరు వ్యక్తుల మధ్య సునిశిత సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది.

డేటింగ్ చేస్తున్నప్పుడు, మనం ఎల్లప్పుడూ నిత్యనూతనంగా, యవ్వనంగా ఉండేలా ప్రయత్నిస్తాము. ఇక్కడ భౌతిక సంబంధం కోసం యాచించడం కూడా యాదృచ్చికమే. కానీ తరచుగా అటువంటి సాన్నిహిత్యాన్ని మొదలుపెట్టడంలో వైఫల్యాలను ఎక్కువగా చవిచూడవలసి వస్తుంది.

ఈ విషయంలో మేము మీకు సహాయపడుతాము. భౌతిక సంబంధం కన్నా, మానసికంగా మీరు ఎంతగా ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు అనే విషయం మీదనే సంబంధాలు, తద్వారా జీవితం ఆధారపడి ఉంటుంది. కొన్ని అసంబద్ద ఆలోచనలు, మీకు మేలు చేయకపోగా సంబంధాలను కూడా నాశనం చేస్తుంది.

INTIMATE QUESTIONS YOU CAN ASK YOUR DATING PARTNER

మీరు మీ డేటింగ్ భాగస్వామి గురించి తెలుసుకొనే ప్రక్రియలో భాగంగా అడగాల్సిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అయితే సమయానుసారంగా 2, 3 రోజుల గడువును ఇస్తూ అడుగుతుండాలి. ఒక్కసారిగా ఆకస్మికంగా ప్రశ్నలు అడగడం మొదలు పెడితే, మీరు చులకనకు గురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కావున జాగ్రత్త తప్పనిసరి.

ఈ ప్రశ్నలను పరిస్థితులను బట్టి, ఆలోచనా విధానం అనుసరించి సందర్భానుసారం అడిగేలా ఉండండి. కొన్ని ప్రశ్నలు నేరుగా అడిగే చనువు లేనప్పుడు, అడగకపోవడమే మంచిది. అలా కాకుండా ధైర్యం చేసి అడిగితే, మొదటికే మోసం రావొచ్చు.

ముఖ్యంగా కొందరికి పాత సంబంధాలు నరకంగా ఉంటాయి, వారికి మీరు నీడలా ఉండాలి కానీ, భాదిoచేలా నడుచుకోరాదు. అలాగని అందరిదీ ఒకే కథ కూడా ఉండదు. కావున అసందర్భ ప్రశ్నలు అని మీకు అనిపించిన వాటి జోలికి వెళ్ళకపోవడమే అన్ని విధాలా మేలు.

ఈ ప్రశ్నలలో కొన్నిటికి మీరు సమాధానాలు పొందినా, కొన్ని మాత్రం వారు చెప్పడానికి సాహసం చేయలేకపోవచ్చు. కానీ మానసికంగా ఒకరిపై ఒకరికి అవగాహన ఉన్న ఎడల, ఆ సమాధానాలు కొన్ని, వారి నడవడిక, హావభావాలలో తెలుస్తాయి. అవి నిజమైనా అబద్దమైనా. ఏది ఏమైనా మీరు తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది. ప్రశ్నలు సమాధానం కోసమే అన్న పట్టుదలతో కాకుండా, నొప్పించకుండా అడగాలి.

మీరు మీ డేటింగ్ భాగస్వామిని అడుగవలసిన ప్రశ్నలు :

1. నీ స్నేహితులందరినీ నీ గురించి వివరించమని అడిగినప్పుడు, ఏ స్నేహితుని వివరణ ఖచ్చితoగా ఉంటుంది? ఎందుకు?

2. ఏదేని ఒక పుస్తకంలో నువ్వొక పాత్రగా ఉంటే, నువ్వు ఎవరిని ఎంపిక చేసుకుంటావు?

3. జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లయితే, నువ్వు ప్రతిరోజూ చెయ్యాలనుకునే పని ఏంటి?

4. శృంగారం పట్ల నీ ఆలోచన మరియు అభిప్రాయo చెప్పు?

5. ప్రేమకు ఒకేఒక ఆలోచన ఉంటే, అది ఏమవుతుందని నీ అభిప్రాయం?

6. నీకోసం నేనెందుకిoత పరితపిస్తాను?

7. నీజీవితంలో నీ అవసరాలను తీర్చుకోలేని స్థితిలో ఏమైనా ఉన్నావా? నేనేమైనా సహాయం చేయగలనా?

8. నేను పిల్లలను భరించలేనని నువ్వు గుర్తించినట్లయితే నాతో ఉంటావా? నాకు నేర చరిత్ర ఉంటే? నేను చాలా రుణాలను కలిగి ఉంటే? లేదా నేను ఏదైనా ఒక టెర్మినల్ వ్యాధి కలిగి ఉంటే? నాతో ఉండగలవా?

9. వివాహo పట్ల నీ అభిప్రాయం ఏంటి? వివాహం అనే ఘట్టంలో నీకు నచ్చిన అంశం ఏమిటి ? నీ వివాహం ఎలా జరగాలని కోరుకుంటున్నావు?

10. ప్రేమను కల్పనగా లేక అసహజంగా భావిస్తున్నారా?

11. ఏదైనా విషయం గురించి నువ్వు తీవ్రంగా ఆలోచిస్తున్నావా? నాతో ఏమైనా పంచుకోగలవా?

12. నేను ఇప్పుడు చేయాలని నువ్వు కోరుకునే విషయం ఏమిటి?

13. నేను నీతో ప్రేమలో ఉండడాన్ని నువ్వు నిజంగా ఆస్వాదిస్తున్నావా? నేనేం చేస్తే నాప్రేమను నువ్వు ఫీల్ అవ్వగలవు?

14. నీకేమైనా లైంగిక ఆలోచనలు ఉన్నాయా? నేను నీ పట్ల ఎలా ఉండాలని నువ్వు భావిస్తున్నావు?

15. గడిచిపోయిన సంఘటనలు ఏవైనా బాదిస్తున్నాయా? నీ మనస్సు నుండి కొన్ని జ్ఞాపకాలను చెరిపివేయాలని అనుకుంటున్నావా?

16. నువ్వు నాకు ఏమైనా చెప్పాలని భావిస్తున్నావా?

17. ఏదైనా ప్రమాదంలో నా రూపు రేఖలను కోల్పోతే, నాతో ఉండగలవా?

18. గత లైంగిక అనుభవాలను మీ ప్రస్తుత భాగస్వామికి తెలియజేయాలని అనుకుంటున్నారా? ఎందుకు?

19. నువ్వు ఎంత తరచుగా లైంగికాసక్తిని ప్రదర్శిస్తుంటావు?

20. బహిరంగంగా ప్రేమను ప్రదర్శించడం పట్ల సౌకర్యం ఉందా?

21. మీ పార్టనర్ లైంగికాసక్తి ప్రదర్శించాలని భావిస్తున్నారా?

22. నీకేదైనా ఫాంటసీ ఆలోచనలు ఉన్నాయా? మీరు నిజం చేయాలనుకుంటున్న, ప్రత్యేకమైన ఫాంటసీ ఏదైనా ఉందా? రోల్ ప్లేయింగ్ గురించి మీరు ఎలా భావిస్తారు?

23. ఆదర్శవంతమైన సన్నిహిత సంబంధంలో, ఎంత తరచుగా సెక్స్ కలిగి ఉండుటకు ఇష్టపడుతావు?

24. నీ తల్లిదండ్రుల వివాహం ఎలా జరిగింది? మీరు వారితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారా?

25. నువ్వు ప్రేమను ఎలా నిర్వచిస్తావు?

26. నీ గతంలోని ఏక్షణానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకు?

27. నీ గతంలో ఏ క్షణాన్ని మరచిపోవాలనుకుంటున్నావు?

28. ఎప్పుడైనా నీ తప్పులను నువ్వే తెలుసుకుని క్షమాపణలు చెప్పుకున్నావా?

29. ప్రత్యేకంగా నువ్వు నా గురించి, తెలియని ఏదేని విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నావా?

30. మీ గురించి ఇతరులతో నేను మాట్లాడినప్పుడు, నేనేం చెప్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ?

31. నీలో ఏదైనా మార్చుకోవాలి అని అనిపిస్తే, ఏం మార్చుకుoటావు?

32. అకస్మాత్తుగా, 6 వారాలు మాత్రమే నివసించడానికి మిగిలి ఉందని నీకు తెలిస్తే, ఆ మిగిలిన సమయంలో ఏమి చేయాలనుకుంటున్నావు?

33. నీ ఇల్లు మంటల్లో కాలుతూ ఉంది, మరియు మీ కుటుంబ సభ్యులు మరియు పెంపుడు జంతువులు సురక్షితంగా ఉన్నాయని అనుకోండి, మీరు ఆ మంటలనుండి ఏదైనా వస్తువుని కాపాడాలని కోరుకుంటే, ఆ వస్తువు ఏంటి ?

34. మీరు చరిత్రలో ఏదైనా సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఎవరైనా ఉండాలని భావిస్తే, మీరు ఎవరిని ఎంపిక చేస్తారు?

35. గత ఐదు సంవత్సరాలుగా, మీరు ఎలా మారారని అనుకుంటున్నారు?

36. నీ కలల ప్రదేశం ఏంటి? ఎక్కడికైనా వెళ్ళే అవకాశం వస్తే ఏ ప్రదేశాన్ని ఎన్నుకుoటావు?

37. ఏ మూడు విషయాలు లేకుండా నీ జీవితాన్ని ఊహించలేవు?

38. మిమ్మల్ని మార్చిన ఘటన ఏంటి?

39. నీకు లైంగిక సంబంధంలో ఇష్టమైన, నెరవేర్చుకోవాలని పరితపిస్తున్న అంశం ఏమిటి?

40. లైంగిక సంబంధం ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నావు?

41. నీ జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఎవరు?

42. నీ మునుపటి సంబంధం ఏమిటి మరియు అది ఎందుకు ముగిసింది?

43. నీ ఈ జీవితంలో ఏ భావజాలాన్ని అనుసరిస్తున్నావు?

44. ఈ పట్టణంలో ఏ ప్రదేశం మీకు అర్థవంతమైనదిగా కనిపిస్తుంది?

45. మీరు మానసికంగా ఒక సంబంధంలో ఉండటానికి సిద్ధంగా ఉన్నారా?

46. మీకుండే అతి పెద్ద కోరికలు ఏమిటి?

47. మీ జీవితం యొక్క సౌండ్ట్రాక్ ఉంటే, ఏ పాటలు ఉండవచ్చు మరియు ఎందుకు?

48. మీ బాల్యoలో హీరోలు ఎవరు? అన్ని పరిస్థితులు చక్కబడుతాయి అని మీకు వెన్నుతట్టి ప్రోత్సహించింది ఎవరు? మిమ్ములను స్పెషల్ గా భావించిన ఫ్రెండ్ ఉన్నారా?

49. మీకు సడెన్ గా లాటరీ తగిలి ఎక్కువ డబ్బు వస్తే ? ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితుల్లో వెంటనే చేసే పని ఏంటి ? ఎందుకని? డబ్బుతో ఆ పని సాధ్యమా?

50. మీరు ప్రస్తుతం మీ జీవితంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఒత్తిడి ఏమిటి? మిమ్ములను నిద్రలేకుండా చేస్తున్న మరియు నాతో కూడా చెప్పుకోలేని విషయం ఏమైనా ఉందా?

English summary

INTIMATE QUESTIONS YOU CAN ASK YOUR DATING PARTNER

You have been dating for a long time and now it is about time you start getting to know your partner in a deeper sense.Intimacy is the path of every desire. Intimacy makes you grow fond of each other. It not only helps but also gathers the required sensual connection between two human beings.Read to know.
Story first published: Wednesday, May 16, 2018, 16:00 [IST]