For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేస్తుంటే, ఆలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
|

సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ సామాజికంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటిని మనం ప్రస్ఫుటంగా గుర్తించవచ్చు. ఇందులో ప్రధానమైన, అందరు గుర్తించిన, ఆమోదించబడిన మార్పు ఏమిటంటే, సంబంధబాంధవ్యాల యొక్క అంగీకారం. ఒక తరం ముందు వరకు ఒక మంచి కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు పెద్దగా కలుసుకునే వారు కాదు, ఒకరితో ఒకరు మాట్లాడుకునే వారు కాదు మరియు డేటింగ్ కు అస్సలు వెళ్లేవారు కాదు.

పెళ్ళికి ముందు సహజీవనం చేయడం అనేది పూర్తిగా నిషిద్ధం. కానీ, ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. లింగ బేధం లేకుండా వ్యక్తులు ఎక్కడైనా నివసించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, చాలామంది సహజీవనం చేస్తున్నారు. మీరు సంబంధబాంధవ్యంలోకి ప్రవేశించకముందే, ఇలా చేయడం ప్రస్తుత కాలంలో చాల సులభతరం అవుతోంది.

మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేస్తుంటే, ఆలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా ?

అయినప్పటికీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరో వైపు వ్యక్తులకు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా వారు వేరే వారిని చూసి ఆశపడుతుంటారు మరియు ఆకర్షితులు అవుతుంటారు. ఇలాంటి విషయాలు ఎక్కువగా మగవారిలో జరుగుతుంటాయి. వీరు ఎక్కువగా ఇతర స్త్రీల వైపు ఆకర్షితులు అవుతుంటారు.

ఈ మొత్తం వ్యవహారంలో చింతించాల్సిన అంశం ఏమిటంటే, ఏ స్త్రీ అయితే సంబంధ బాంధవ్యంలో ఉంటుందో, తనను తన బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తున్నాడు అనే విషయం కూడా ఆమె గ్రహించలేదు. దీని వల్ల ఆమెకు పరిస్థితులన్నీ మరింత క్లిష్టతరంగా మారుతుంటాయి మరియు ఈ విషయం ఆమెకు తెలిసేటప్పటికీ, ఆ సందర్భానికి సర్దుబాటు చేసుకోవడం తెలియక, ఎలా వ్యవహరించాలో అర్ధం కాక మానసిక వేదనను అనుభవిస్తున్నారు.

ఇలాంటి సందర్భం లేదా పరిస్థితులు ఏ అమ్మాయి కానీ కోరుకోదు. కావున ఇటువంటి వాటి భారిన పడకుండా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు మరియు ఎప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తనని మోసం చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి.

ఈ వ్యాసంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వీటిని తెలుసుకోవడం ద్వారా మీ సంబంధ బాంధవ్యం సరైన దారిలో వెళ్తుందా లేదా ? వెళ్లాల్సిన మార్గంలోనే ఉందా ? మరియు ఎందుకు మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఇలా ఎన్నో విషయాలను మీరు తెలుసుకోవచ్చు.

మాట్లాడుకోవడానికి విషయాలు మీ దగ్గర అస్సలు లేకపోవడం :

మాట్లాడుకోవడానికి విషయాలు మీ దగ్గర అస్సలు లేకపోవడం :

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక విషయం ఏమిటంటే, మీరు, మీ ప్రేమికుడు మాట్లాడుకోవడానికి మీ దగ్గర చాలా కొన్ని విషయాలు మాత్రమే ఉన్నాయి అనే విషయాన్ని మీరు గుర్తించి ఉంటారు. మొదట్లో అంటే, సంబంధబాంధవ్యాలు మొదలుపెట్టినప్పుడు ఈ కొన్ని విషయాలు చాలు అని మీరు భావించి ఉండవచ్చు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ అవే విషయాలపై మాట్లాడుకోవడానికి పెద్దగా విషయం ఉండదు. దీంతో మీ ప్రేమికుడు విసుగుచెందుతాడు మరియు మీతో మాట్లాడటం తగ్గిస్తాడు. ఎప్పుడైతే మాటలు ఇద్దరి మధ్య తగ్గిపోతాయో అటువంటి సందర్భాలు మిమ్మల్ని మోసం చేయడానికి పురిగొలుపుతాయి.

ఇంతకు ముందులా ఇప్పుడు ఉండకపోవడం :

ఇంతకు ముందులా ఇప్పుడు ఉండకపోవడం :

ఇలా ఉండటం ఎప్పుడూ చెడ్డ విషయం అని ఇక్కడ అర్ధం కాదు. ఎప్పుడైతే పరిణితి బాగా పెరుగుతుందో, మరీ తరచూ కాకపోయినా ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్క వ్యక్తి ఎంతోకొంత మార్పులకు లోనవుతుంటారు. ఈ మార్పు ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది, విభిన్నంగా ఉంటుంది. వీటిలో గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఈ మార్పు కేవలం శారీరికంగా మాత్రమే ఉంటుంది అని మాత్రం అనుకోకండి. శారీరకంగా మరియు బావోద్వేగపరంగా ఈ మార్పులు ఉంటాయి మరియు సామాజికంగా వీటిని అందరూ అంగీకరిస్తూ ఉంటారు కూడా.

అయినప్పటికీ ఈ మార్పుల వల్ల మిమ్మల్ని ఇంతకు ముందు ప్రేమిస్తున్న వ్యక్తి ఇప్పుడు కూడా ప్రేమిస్తుంటాడు అని అనుకోనవసరం లేదు. అలా చేయాలనే నియమం కూడా లేదు. మీలో ఏర్పడిన ఈ కొత్త వ్యక్తిత్వం మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రేరేపించవచ్చు.

వృత్తిపరమైన ప్రాధాన్యతలు :

వృత్తిపరమైన ప్రాధాన్యతలు :

ఇది రెండువైపులా నుండి ఎలా అయినా జరగవచ్చు. మీరు మీ వృత్తి పరంగా విపరీతమైన నిబద్ధతను ప్రదర్శిస్తూ కేవలం పనిలోనే మునిగి తేలుతూ, ప్రేమికుడు ఒకడు ఉన్నాడు అనే విషయాన్ని మీరు పూర్తిగా మరచిపోయి ఉండవచ్చు. అదేవిధంగా అతడు కూడా అతని వృత్తిపరమైన జీవితంలో తీరిక లేని జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. ఇటువంటి సందర్భాలు మిమల్ని మోసం చేయడానికి పురిగొల్పవచ్చు. మరో సందర్భం ఏమిటంటే, వృత్తిపరమైన అంశాలు సంబంధ బాంధవ్యాలకు అడ్డు తగలవచ్చు. ఎప్పుడైతే అతడు లేదా ఆమె వృత్తి పరంగా వారి ప్రేమికుల కంటే, ముందుకు వెళ్తారో అటువంటి సమయంలో ఎవరైతే వృత్తి పరంగా అంతగా వృద్ధి చెందారో వారు, వృద్ధి చెందిన భాగస్వామిని చూసి అసూయపడి మోసం చేయడానికి పూనుకుంటారు. ముఖ్యంగా మగవారిలో ఈ స్వభావం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే, ఎప్పుడైతే స్త్రీలు వారి కంటే వృత్తిపరంగా ముందుకు సాగుతుంటారో అప్పుడు వారి అహం దెబ్బతింటుంది. ఈ సందర్భాలన్నీ కలిసి అతన్ని మిమ్మల్ని మోసం చేయడానికి పురిగొల్పుతాయి.

నిబద్దత భయం :

నిబద్దత భయం :

చాలా సందర్భాల్లో మగవారు విషయాలన్నీ చాలా మంచిగా, బాగా ఉన్నప్పుడు ఎంతో బాగా ఆనందిస్తూ ఉంటారు. కానీ, ఏ క్షణం అయితే పరిస్థితులన్నీ అధ్వాన్నంగా మారుతాయో, అటువంటి సమయంలో వారు ఆ పరిస్థితుల నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తారు మరియు అటువైపు ఉండకుండా, రాకుండా పరిగెత్తుతారు. ఎప్పుడైతే మీ కుటుంబం లేదా వారి కుటుంబం ఒప్పుకోరు అని అర్ధం అవుతుందో, అటువంటి సమయంలో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది వ్యక్తిగతంగా మీకు పెద్దగా నష్టం చేకూర్చకపోవచ్చు. అతడిలో ఉండే నిబద్దత విపరీతమైన భయాన్ని పెంచుతుంది మరియు భవిష్యత్తులో తీసుకోబోయే బాధ్యతలు అతడిని ఈ విధంగా చేయడానికి ఉసిగొల్పుతాయి.

మీరు మీ యొక్క శారీరిక ఆకర్షణను కోల్పోయి ఉంటారు :

మీరు మీ యొక్క శారీరిక ఆకర్షణను కోల్పోయి ఉంటారు :

వయస్సు పెరిగే కొద్దీ చర్మం మరియు శరీరం దాని యొక్క గట్టి తనం మరియు ఆ ఛాయను ను కోల్పోయే అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో మీరు విపరీతమైన బరువు పెరిగి ఉంటారు లేదా విపరీతంగా బరువు తగ్గి ఉంటారు. లేదా ఎదో ఒక కారణం వల్ల మీ శరీరాకృతిలో విపరీతమైన మార్పులు చోటు చేసుకొని ఉంటాయి. చాలామంది అబ్బాయిలకు ఇది అస్సలు రుచించదు. మీ ప్రేమికుడు గనుక మిమ్మల్ని కేవలం మీ అందాన్ని చూసి మాత్రమే ఆకర్షితులు అయి ఉంటే, అటువంటి వారు ఈ సందర్భంలో మీ పై ఆసక్తిని కోల్పోతారు మరియు మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధపడతారు.

English summary

Is Your Boyfriend Cheating On You, But Why?

When in love, everything looks colourful. And suddenly you might feel insecure for many reasons. Maybe your boyfriend is not paying enough attention to you. But why does he want to cheat on you? Maybe he wants to focus more on his career, his priorities are different or he may be afraid of commitment.
Desktop Bottom Promotion