ప్రేమ మరియు బాధ - కొన్ని యుగాల నుంచి మానవుల జీవితంలో ఇమిడిపోయిన భావోద్వేగాలు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

కొన్నిసార్లు, మనం బాగా ప్రేమించిన వ్యక్తుల నుంచి మనం దూరమవటం జరుగుతుంది. ఆ తరువాత దాని వలన కలిగే బాధ అంతా ఇంతా కాదు. ప్రియమైన వారిని విడిచి ఉండటం వలన కలిగే బాధ అనేది కఠినంగా ఉండటం వాస్తవమే.

దగ్గరివారిని విడిచి ఉండటం వలన కలిగే బాధ వర్ణనాతీతం. దానిని అక్షరాలలో మనం వ్యక్తీకరించలేము.

మనం కొన్నిసార్లు ఇతరులు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోలేము. వారిని గ్రాంటెడ్ గా తీసుకుంటాము. అందువలన, ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకుంటాయి.

LOVE AND PAIN. CATERING HUMAN NEEDS FROM AGES

మాట్లాడేటప్పుడు మనం వాడే పదాలు కొన్ని సార్లు మనల్ని ప్రేమించేవారిని బాగా బాధిస్తాయి. మనం ఆ తరువాత క్షమాపణలు కోరినా కూడా ఫలితం ఉండదు. ఒక్కసారి మనసు విరిగితే ఆ మనసుని తిరిగి జతచేయలేము. మన తప్పిదానికి మనమే ఎన్నో సార్లు బాధపడతాము. మీ రిలేషన్ లో ఒకప్పుడు ఉండే ప్రేమను మళ్ళీ తీసుకురాలేము. ఇదివరకటిలా ఆ రిలేషన్ సంతోషంగా సాగలేదు.

ప్రేమ అనేది అత్యంత శక్తివంతమైన భావన. ప్రేమ కోసం ఏదైనా చేయాలన్న తపన మీలో పెరుగుతుంది. ఒకవేళ రిలేషన్ షిప్ అనేది బ్రేక్ అయితే దాని వలన మీ ఇద్దరికీ తీవ్రమైన బాధ కలుగుతుంది.

ప్రేమ మరియు బాధ - కొన్ని యుగాల నుంచి మానవుల జీవితంలో ఇమిడిపోయిన అంశాలు

1. మీరు బాగా ప్రేమించిన వ్యక్తిని ఎక్కువగా మిస్ అవుతున్నప్పుడు:

1. మీరు బాగా ప్రేమించిన వ్యక్తిని ఎక్కువగా మిస్ అవుతున్నప్పుడు:

మీరు ఏ వ్యక్తినైనా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి మీకు దగ్గరగా లేనప్పుడు, ఆ భావనలో మీకు మీ జీవితంలోని ఆ వ్యక్తికి గల ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఆ సమయంలో ఆ వ్యక్తిని మీరు ఎక్కువగా మిస్ అవుతారు. వారు మీ వద్ద లేరన్న ఆలోచన మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. ప్రేమ అనేది మిమ్మల్ని ఎంతగా సంతోషపెడుతుందో అంతగా బాధిస్తుంది కూడా. మీరు బాగా ప్రేమించే వ్యక్తిని మీరు మిస్ అవడం వలన మీరు జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని భరిస్తున్న భావనను పొందుతారు.

2. మీరు బాగా ఇష్టపడిన వ్యక్తితో బ్రేకప్:

2. మీరు బాగా ఇష్టపడిన వ్యక్తితో బ్రేకప్:

మీరు ఒకప్పుడు బాగా దగ్గరైన వ్యక్తితో ఇప్పుడు మీరు దూరంగా ఉండటం ఎంతో బాధాకర విషయం. ఈ ఆలోచన మీకు ఇదివరకు అలవాటు లేనిది. అందువలన, ప్రతిరోజూ మీరు ఈ విషయంలో బాధకు గురవుతూనే ఉంటారు. సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా మీరు ఈ విషయంలో ఆందోళనకు గురవుతూనే ఉంటారు.

కొత్త స్నేహితులను ఏర్పరచుకోవడం, పరిచయాలను పెంచుకోవడం సులభమే. అయితే, ప్రియమైన వారితో బంధాలను తెగతెంపులు చేసుకోవడం మాత్రం కష్టతరమైన పని.

3. తల్లిదండ్రులతో విభేదాలు:

3. తల్లిదండ్రులతో విభేదాలు:

ఈ యుగంలో, టీనేజర్స్ తల్లిదండ్రులతో గొడవపడటం సర్వసాధారణం అయిపొయింది. చిన్న చిన్న విషయాలకే తల్లిదండ్రులతో విభేదాలు పెంచుకుని ఆ తరువాత కొన్నేళ్ళకు ఈ విషయంపై బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులే కాదు, ఈ విషయంలో పిల్ల్లలు కూడా తమ తప్పుడు నిర్ణయాలకు చింతిస్తారు. పిల్లలు తమ నిర్ణయాలతో తమని తాము హర్ట్ చేసుకోవడం వలన తల్లిదండ్రులు కూడా హర్ట్ అవుతారు. పిల్లల మంచినే తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే, మంచీ చెడులను చెప్పే సమయంలో పిల్లలకు తల్లిదండ్రులు శత్రువులా కనిపిస్తారు. కొన్నాళ్ల తరువాత, పిల్లలకు విషయం తెలిసి తల్లిదండ్రుల మాట తాము వినలేదని బాధపడతారు.

4.తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం:

4.తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం:

ప్రతిఒక్కరూ తమ జీవితకాలంలో కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. ఆ తరువాత ఆ నిర్ణయాల వలన కలిగే ఫలితాలు గురించి బాధపడతారు. ఈ నిర్ణయాల ఫలితాలు వారిని జీవితాంతం వెంటాడతాయి. వారి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయి.

అటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వలన కలిగే ఫలితాలను మీరు రివర్స్ చేయలేరు. అటువంటి సమస్యలు మీతో జీవితాంతం ఉంటాయి. మిమ్మల్ని వదిలిపెట్టవు. తప్పుడు నిర్ణయం తీసుకోవడం వలన ఆ వ్యక్తి జీవితాంతం చింతిస్తూనే ఉంటాడు. ఈ నిర్ణయాల వలన ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తికి సంబంధించిన వారు కూడా బాధకు గురవుతారు. ముఖ్యంగా ఆ వ్యక్తి తల్లిదండ్రులు బాధకు గురవుతారు.

5. దగ్గరి వారిని శాశ్వతంగా కోల్పోవడం:

5. దగ్గరి వారిని శాశ్వతంగా కోల్పోవడం:

మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు. అయితే, మరణం అనేది దగ్గరి వారికి తీవ్రమైన బాధను కలిగిస్తుంది.

దగ్గరివారిని కోల్పోవడం అనేది జీవితంలోని అత్యంత బాధాకరమైన సంఘటన. ఈ బాధ నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

English summary

LOVE AND PAIN. CATERING HUMAN NEEDS FROM AGES

The feeling of not caring about the one you once cared the most, is a feeling one can never get used to and it hurts you every day for the rest of your life, even in your subconscious mind.Making new friends and meeting acquaintances is very simple, but leaving the ones you cared the most about is a hefty task.
Story first published: Friday, May 11, 2018, 13:30 [IST]