For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దృఢమైన మనస్తత్వం కలిగిన అమ్మాయిలు అబ్బాయిల సహాయం లేకుండానే జీవించగలరు...అందుకు కారణాలు ఇవే :

By R Vishnu Vardhan Reddy
|

మనం ఈ తరం మహిళలం. మనం దృఢంగా ఒకప్పుడు ఉన్నాము, ఇప్పుడూ ఉంటాము, ఎప్పటికీ ఉంటాము. మనం దయను ప్రేమిస్తాము. దయతో వదిలేస్తాము. దయతో

అంగీకరిస్తాము, మనల్ని పొందడం చాలా కష్టమైనా పని. మనల్ని వదిలి వెళ్లడం ఇంకా కష్టమైనా వ్యవహారం. అన్నింటికంటే, కష్టం ఏమిటంటే, మనతో తెగతెంపులు చేసుకోవడం.

ఆమె గనుక బాధలో ఉంటే, నాకు తెలిసి మనం అందరం కూడా బాధలో ఉంటాము. కానీ, ఆమె భావోద్వేగాలతో వ్యవహరిస్తున్న తీరుని, వాటికి లొంగిపోకుండా వాటిని తన ఆధీనంలోకి తీసుకువచ్చే శక్తి, ఇవన్నీ గనుక ఉంటే, అలాంటి మహిళను దృఢమైన మహిళగా భావిస్తారు.

Reasons why strongest girls make the best of the life and don’t need any guy

కానీ, ఆమె ఎవరితోనైనా చాలా త్వరగా కలిసిపోతుంది, బంధాలని పెంచుకుంటుంది. అందుచేతనే చాలా త్వరగా తన మనస్సు గాయపడుతుంది. ఆ తర్వాత తనంతట తానుగా అందరికీ దూరం అవుతుంది. ఈ కారణం చేతనే నేమో ఆమెను ప్రతిఒక్కరు దృఢవంతురాలుగా భావిస్తారు.

సమరంలో గెలవాలంటే, కన్నీళ్లు కారిస్తే సరిపోదు. యుద్ధాలను గెలవాలంటే, దృఢమైన మనస్తత్వంతో పాటు గట్టి మనస్సు ఉండాలి.

" బాధ్యతతో వ్యవహరించి చక్కగా ప్రవర్తించే అమ్మాయిలు చరిత్రను సృష్టిస్తారు " అని ఒక నానుడి ఉంది. దృఢమైన మనస్తత్వం కలిగిన అమ్మాయిలు జీవితంలో ఉత్తమంగా జీవిస్తారు అని చెప్పడానికి కారణాలు ఇవే.

భావోద్వేగం తో ఎక్కువగా తినడం అనేది ఒక మందు :

భావోద్వేగం తో ఎక్కువగా తినడం అనేది ఒక మందు :

ఆహారాన్ని తీసుకోకపోవడం, ఒత్తిడిలో ఆహారాన్ని తీసుకోవడం. జీవితంలో ఎప్పుడైతే విపరీతమైన ఒత్తిడికి మానసికంగా దృఢమైన అమ్మాయిలు ఎదుర్కొంటారో, అటువంటి

సమయంలో ఆహారం అనేది ఒక పరిష్కార మార్గంలా కనిపిస్తుంది. భావోద్వేగంలో ఉన్నప్పుడు ఏడవడం, ఒత్తిడికి లోనవడం కంటే, విపరీతంగా తినడం ఉత్తమం అని వీరు

భావిస్తారు. బాయ్ ఫ్రెండ్ లేని స్థానాన్ని వీరు ఆహారంతో భర్తీ చేయగలరు. ఆహారంలోనే మొత్తం ఉందని వీరు భావిస్తారు. ఇలా ఎందుకు చేయకూడదు ? ఆహారం వీళ్ళని మరింత

కృంగదీయదు కదా ? అంతేకాకుండా ఆహారం ఎప్పుడుగాని, నొప్పిని వేదనను కోరుకోదు. అందుచేతనే ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఆహారాన్నే జీవితంగా భావిస్తారు.

 ఒంటరిగా ఉండటం వీళ్లకు ఓదార్పుని ఇస్తుంది :

ఒంటరిగా ఉండటం వీళ్లకు ఓదార్పుని ఇస్తుంది :

మానసికంగా దృఢంగా ఉన్న అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఓదార్పుని పొందుతారు. తమను తాము ఆనందంగా ఉంచుకోవడానికి వీరికి ఎప్పడూ వేరేవాళ్ళ తోడు అవసరంలేదు. ఒంటరిగా ఉండటం, ఆనందంగా తమకు తోచినట్లు గడపటం ఉత్తమమైన మార్గం అని వీళ్ళు భావిస్తారు. వీరి విజయానికి కారణం కూడా ఇవే. అదే సమయంలో వీరు మరింత దృఢవంతులుగా కూడా మారుతారు. తమకు తాముగానే ఆనందం పొందుతున్నప్పుడు వేరేవాళ్ళ సహచర్యంతో అవసరం ఏముంది ? కొన్ని సార్లు ఏకాంతంగా తాము ఉన్నామా అనే భావన వీరిలో కలుగుతూ ఉంటుంది. కానీ, ఆ ఏకాంతాన్ని ఎలా అధిగమించాలో కూడా వీరికి తెలుసు. ఒంటరిగా ఉన్నప్పుడే తమకు అత్యుత్తమమైన ఓదార్పు లభిస్తుందని వీరు భావిస్తారు.

సంబంధ బాందవ్యాలకు దూరంగా ఉంటారు :

సంబంధ బాందవ్యాలకు దూరంగా ఉంటారు :

సంబంధ బాంధవ్యాలకు దూరంగా ఉండి, ఎవ్వరితోను బంధాలు పెంచుకోకపోవడమే ఉత్తమం అని వీరు బలంగా నమ్ముతారు. అంటే దీనర్ధం వీరు విపరీతమైన ఆశతో కేవలం పడక గది శృంగారానికి ప్రాధాన్యత ఇస్తారని అర్ధం కాదు. వీరు ఒకప్పుడు ఎవరితోనో విపరీతంగా బంధాలను పెంచుకొని ఉంటారు. కానీ, అదే వ్యక్తి వల్ల వీరి మనస్సు విపరీతంగా గాయపడి ఉంటుంది. వీటన్నింటివల్ల వీరి మనస్సు విరిగిపోవడంతో, బంధాలే వద్దు అనే నిర్ణయానికి వస్తారు. నిబద్దతతో ఎవరితోనైనా గడపడానికి వీరు భయపడరు. కానీ, భావోద్వేగపరంగా ఎదుటివ్యక్తితో ఉండటానికి ఇష్టపడరు. ఈ అతి ముఖ్యమైన గుణం కారణంగా వీళ్ళ మనస్తత్వం మరింత దృఢంగా తయారవుతుంది.

ఒక నిర్ణయానికి వెంటనే వచ్చేయరు, బేరీజు వెయ్యరు :

ఒక నిర్ణయానికి వెంటనే వచ్చేయరు, బేరీజు వెయ్యరు :

వీరి జీవితాల్లో ఎన్నో విషయాలు జరిగి ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. జీవితంలో చేయాల్సింది ఎంతో ఉందని వీరు భావిస్తారు. అందుచేతనే, ఎదుటి వ్యక్తి ఎలాంటి వారు, వారి మనస్తత్వం ఎలాంటిది అనే విషయాలను బేరీజు వేసుకొనే సమయం వీరికి ఉండదు. వీరు కూడా సాధారణ అమ్మాయిలు లాంటివారే. కానీ, మంచి అమ్మాయిలు. ఎందుకంటే, వీరికి ఎదుటివారిని బేరీజు వేయడం అస్సలు ఇష్టం ఉండదు. వీరికి వారి జీవితంలో చాలా ప్రశాంతంగా ఉండటం ఇష్టం. వారి జీవితాన్ని ఆనందంగా గడపడం ఇష్టం. అందుచేతనే ఎప్పుడుగాని ఎవ్వరిని అంచనా వేయరు. ఈ గుణం వల్లనే వారు ఆసక్తికరంగా, అపూర్వమైన వ్యక్తులుగా కనిపిస్తారు. అంతేకాకుండా మరింత దృఢంగా తయారవుతారు.

 పురుషులు వీరి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు :

పురుషులు వీరి పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు :

చెత్త అబ్బాయిల్లా కాకుండా, కొంతమంది గొప్ప పురుషులు ఇలాంటి దృఢవంతమైన మహిళల పట్ల ఆకర్షితులవుతుంటారు. ఇలాంటి మంచి పురుషులు వాళ్లకు కావాల్సిన ఇష్టాల్లో దృఢమైన మనస్తత్వం కలిగిన మహిళలు భాగస్వాములుగా రావాలని కోరుకుంటారు. అందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఇలాంటి మహిళలు చాకచక్యంతో వ్యవహరించడంతో పాటు సమయస్ఫూర్తి కనపరుస్తూ ఆనందమయ జీవితాన్ని గడుపుతారు. అందుచేతనే తెలివైన పురుషులు ఇలాంటి మహిళలను కోరుకుంటారు. పురుషులు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా తమ వైపు దృష్టి కేంద్రీకరించాలి అనే ఉద్దేశ్యంతో విపరీతంగా తాపత్రయ పడుతుంటారు. అదే సమయంలో వారిని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు.

సామజిక మాధ్యమాల గురించి అస్సలు ఆందోళన చెందారు :

సామజిక మాధ్యమాల గురించి అస్సలు ఆందోళన చెందారు :

వీరు ప్రతి విషయాన్నీ చాలా చిన్నదిగా తీసుకుంటారు. సామజిక మాధ్యమాల్లో తమపై వార్తలు వచ్చినా, లేక ఎలాంటి వార్తలు చదివినా పెద్దగా పట్టించుకోరు. వీళ్ళ సామజిక మాధ్యమాల ఖాతాల్లో అద్భుతమైన గొప్ప పోస్టులను వీరు పెడుతుంటారు. అదే సమయంలో ఏమి పోస్ట్ చేయాలి, ఎవరిని స్నేహితులుగా పెట్టుకోవాలి అనే విషయాలకు సంబంధించి ఎవ్వరైనా తమకు సలహాలు ఇస్తే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. వేరే వారి అధీనంలో ఉండాలని వీరు అస్సలు కోరుకోరు. గత ప్రియుడిని కానీ, లేదా తమతో అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తులను గాని స్నేహితుల జాబితా నుండి తీసివేయాలని అనుకోరు, అదే సమయంలో బ్లాక్ చేయాలని కూడా భావించరు. కేవలం పిరికిపందలు మాత్రమే అలా చేస్తారని వీరు భావిస్తారు. తమని తాము చాలా శక్తివంతులుగా భావిస్తారు. అదే సమయంలో తమ అభిప్రాయాలను చాలా నిర్మొహమాటంగా ధైర్యంతో వ్యక్తం చేస్తుంటారు.

హాస్య చతురతని ప్రదర్శించడం, తెలివిగా వ్యవహరించడం వీరి ఆయుధాలు :

హాస్య చతురతని ప్రదర్శించడం, తెలివిగా వ్యవహరించడం వీరి ఆయుధాలు :

తెలివిలేని వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మానసికంగా దృఢంగా ఉన్న మహిళలు తెలివితో వ్యవహరిస్తూ హాస్య చతురతని ప్రదర్శిస్తారు. గట్టిగా మాట్లాడటం వల్ల పనులు జరుగుతాయి అనే విషయాన్ని వీళ్ళు పెద్దగా నమ్మరు. చర్చలు, వాదనలు లేదా ఏదైనా విషయంలో గెలవాలంటే, జ్ఞానంతో పాటు ఉత్తమమైన విషయాలు ప్రస్తావించడం ఉత్తమం అని వీరు నమ్ముతారు. హింసాత్మక పోరాటాలు వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అందుచేతనే వీరికి నచ్చని వారిని కూడా అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తారు. పొరపాటున వారు గనుక ఎదురుపడితే చిరునవ్వుతో పక్కకు తప్పుకుంటారు. సందర్భం ఏదైనా ఎవ్వరితోనైనా చర్చిస్తున్నా, లేదా వాదనకు దిగినా ఎలాంటి యుద్ధంలో అయినా కేవలం హాస్య చతురత, తెలివితో గెలుస్తారు. ప్రజలు ఎక్కువగా భావోద్వేగానికి లోనవుతుంటారు. అదే సమయంలో ప్రతి ఒక్కటి మనస్సుకి తీసుకుంటుంటారు. చెడ్డ సంబంధ బాంధవ్యం లేదా చెడ్డ సమయం ప్రేమలో గనుక వస్తే అటువంటి సమయంలో వ్యక్తులు కృంగుపాటుకు గురౌతుంటారు. అమ్మాయిల్లో ఇది ఎక్కువగా కనపడుతుంది. కానీ దయ, నమ్మకం ద్వారా ఇలాంటి ఎన్నో పరిస్థితులన్నింటిని అధిగమించి మంచి జీవితాన్ని జీవించడంతోపాటు దృఢమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా కూడా ఎదగవచ్చు.

కాబట్టి మహిళలందరూ చిన్న చిన్న విషయాలకు కృంగిపోకుండా మేల్కోండి. తమను తాము సంసిద్ధం చేసుకొని, రోజులు గడుస్తున్న కొద్దీ మరింత దృఢమైన వ్యక్తులుగా మారండి.

English summary

Reasons why strongest girls make the best of the life and don’t need any guy

A strong women doesn't really need a man to lead her life. Even if she has had a break-up, she knows how to cope up with it and still have a happy life as she wishes. A point that support for the same are strong girls always wish to be alone. They don't give much attention to the outside world.Reasons Strong Women Don't Need A Man
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more