For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  లో లోపల ఆలోచించుకునే వ్యక్తుల కోసం ప్రత్యేకమైన డేటింగ్ ఆలోచనలు :

  By R Vishnu Vardhan Reddy
  |

  ప్రస్తుతం భారతీయ సమాజం ఎంతో వేగంగా, ఎవ్వరూ ఊహించనంతగా వృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే డేటింగ్ మరియు ప్రేమించుకోవడం అనేది సర్వసాధారణం అయిపొయింది మరియు ప్రసిద్ధి చెందుతోంది. ఒక నమ్మలేని నిజం ఏమిటంటే, ఒకానొక వయస్సులో ఎవరైనా ఎవ్వరిని ప్రేమించకపోయినా లేదా ఎవ్వరితో డేటింగ్ కి వెళ్లకపోతే, అలాంటి వారిని స్నేహితులందరూ వింతగా చూసే అవకాశం ఉంది. సూటిపోటి మాటలు కూడా అనొచ్చు.

  ఇవి వ్యక్తుల పై విపరీతమైన ఒత్తిడి పెంచుతాయి. ఇది చాలా చెడ్డ పద్దతి అని చెప్పడం సబబు కాదు. ఎందుకంటే, ఒక తరానికి ముందు ఎవరో తెలియని ఓ కొత్త వ్యక్తిని పెళ్లిచేసుకునే సంప్రదాయం మన దేశంలో ఉంది. కానీ, అసలు సమస్య ఎప్పుడు మొదలవుతుంది అంటే, ఎప్పుడైతే లో లోపల ఆలోచించుకునే ఇద్దరు వ్యక్తులు ఒక్కటి కావాలనుకుంటారో, అటువంటి సందర్భం కొద్దిగా సమస్యగా మారుతుంది. అలాంటి సమయంలో వారిద్దరిలో ఎవ్వరు కానీ ఆదిపత్యం ప్రదర్శించాలని అనుకోరు మరియు వారికి ప్రేమ పరంగా మరియు డేటింగ్ కి సంబంధించి అటువంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

  Unique Dating Ideas For Introverts,

  ఇదంతా నిజమైన అంశాలే. ఎందుకంటే, పబ్బు లకు వెళ్లడం లేదా తమ ప్రేమని బహిరంగంగా వ్యక్తపరచుకోవడం లాంటి అంశాలన్నీ డేటింగ్ లో భాగంగా సాధారణంగా చేసే పనులు. కానీ, లో లోపల ఆలోచించే వ్యక్తులకు ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండవు. ఎలా అయితే బహిరంగంగా అన్ని వ్యక్తపరచడానికి ఇష్టపడతారో, వ్యక్తులు ఎలా అయితే డేటింగ్ ని ఆస్వాదిస్తారో అచ్చం అలానే లో లోపల ఆలోచించే వ్యక్తులు కూడా ఈ డేటింగ్ అనే అంశాన్ని ఇష్టపడటానికి కొన్ని ప్రత్యేకమైన డేటింగ్ ఆలోచనలు ఉన్నాయి. అవి మీకోసం.

  ఇంకెందుకు ఆలస్యం వాటి గురించి తెలుసుకోండి. మీకు నచ్చినవి పాటించండి. ఇక మొదలు పెడదాం.

  1. బుక్ స్టోర్ వద్ద డేటింగ్ :

  1. బుక్ స్టోర్ వద్ద డేటింగ్ :

  ఒక వ్యక్తి ఎంచుకొనే పుస్తకాల ఆధారంగా, ఆ వ్యక్తి ఎటువంటి వారు అని తెలుసుకోవడం చాలా సులభతరం అవుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. కాబట్టి, మీరు మీ యొక్క డేటింగ్ లో భాగంగా ఏదైనా పుస్తకాల షాప్ కి వెళ్లడం కూడా చాలా మంచి అంశమే. ఇందులోనే కొద్దిగా విభిన్నంగా ఆలోచించాలంటే, ఒకరు ఎంచుకున్న పుస్తకాన్ని మరొకరు చదవండి. ఇది నమ్మండి. ఎందుకంటే, ఇలా ఎప్పుడైతే చేస్తారో ఆ తర్వాత మీరు డేట్ కి కలిసినప్పుడు, మీ దగ్గర మాట్లాడుకోవడానికి బోలెడు విషయాలు ఉంటాయి. ఇద్దరికీ నచ్చిన పుస్తకాన్ని ఎంచుకోవడం వల్ల ఆనందం కలగవచ్చు. కానీ, అది అంత సులభమైన విషయం కాదు. ఎప్పుడైతే అలా జరుగుతుందో అప్పుడు మీలో ఉత్సాహం మరియు ఆతురత పెంచే విధంగా ఎదో దాచిన నిధిని కనుకున్నాం అనే ఒక కొత్త అనుభూతి కలుగుతుంది.

  2 కలిసి వంట చేయండి :

  2 కలిసి వంట చేయండి :

  మీరు గనుక లో లోపల ఆలోచించే వ్యక్తులు అయ్యి ఉండి మరియు ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడే వారైతే, అటువంటి సమయంలో వంట గదిలో ఎక్కువ సమయాన్ని గడపడాన్ని మీరు ఆనందంగా భావిస్తారు. ఎప్పుడైతే, మీకు ఇష్టమైన ఆహారాన్ని మీకు నచ్చిన వ్యక్తులతో వండుతారో అప్పుడు మీలో ఒక మధురానుభూతి కలుగుతుంది. దీనినే కొద్దిగా విభిన్నంగా ఎలా ఆలోచించవచ్చు అంటే, ఇద్దరూ తమకు నచ్చిన వంటను చేయాలనీ, ఎంచుకున్న తర్వాత అందుకు కావాల్సిన పదార్ధాలన్నింటిని సమకూర్చండి. ఎవరు ముందుగా ఉత్తమంగా చేస్తారు అని పోటి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. మీరు గనుక కొత్త రకం వంటలను తినడానికి ఇష్టపడే వారైతే, అటువంటప్పుడు విభిన్న సంస్కృతులకు సంబంధించిన ఆహారాన్ని వండటానికి ప్రయత్నించండి.

  3 . ఆటలు ఆడటం :

  3 . ఆటలు ఆడటం :

  లో లోపల ఆలోచించే వ్యక్తులు వ్యూహాలు మరియు పద ప్రయోగం వంటి ఆటలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మీరు పెద్దవారు అయ్యారని వీటన్నింటిని మీరు వదులుకోవలసిన అవసరం లేదు. మీరు గనుక లో లోపల ఆలోచించే వ్యక్తులు తో డేటింగ్ చేస్తున్నట్లైతే, అటువంటప్పుడు ఇటువంటి ఆటలను వారితో ఆడితే, వారు ఆనందించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు పరిస్థితులను మరింత ప్రేమ పూరితంగా మార్చాలనని భావిస్తే, ఆడుతున్న ఆటకు మరిన్ని నియమ నిబంధనలు జోడించి మీకు నచ్చినట్లు ఆటను మలుచుకోండి. అవసమైతే పేకాట కూడా ఆడండి. ఈ సరదాగా చేయాలనుకున్న పనులన్నింటిన్నీ ఎక్కడ చేస్తారు అనేది పూర్తిగా మీ ఇష్టం. మండుతున్న ఎండలోనైనా లేక దగ్గరలో ఉన్న ఉద్యానవనం లోనైనా లేక మీ పడకగదిలో అయినా ఎక్కడైన మీ ఇష్టం.

  4 . సుదూర ప్రాంతాలకు వెళ్లడం :

  4 . సుదూర ప్రాంతాలకు వెళ్లడం :

  మీరు గనుక లో లోపల ఆలోచించే వ్యక్తులు అయి ఉండి, సుదూర ప్రాంతాలకు వెళ్లడం ఇష్టపడే వారైతే, అక్కడ అలా ఎక్కువ సేపు నడుస్తూ తమకు నచ్చిన వారితో మాట్లాడటం అనేది మంచి ఆలోచన. ఇక్కడ మీకు మాట్లాడటానికి ఎంతోసమయం దొరుకుతుంది మరియు అదే సమయంలో ఇద్దరిలో ఎవ్వరు ఏమి మాట్లాడకపోయినా, పరిస్థితులు అంత ఎబెట్టుగా కనిపించవు. ఇలాంటి రకమైన సుదూర ప్రాంతాల్లో నడుస్తూ డేటింగ్ కి వెళ్లడం వల్ల, మీరిద్దరూ ప్రకృతిని ఎంతగానో కలిసి ఆస్వాదిస్తారు మరియు ఎంతో హాయిగా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఇద్దరిలో ఎవ్వరైనా ఒకరు శారీరికంగా అలసిపోతారో, అటువంటి సమయంలో వేరొకరు ఆసరాగా నిలుస్తారు.

  5 సముద్రతీరం :

  5 సముద్రతీరం :

  ఇది వినడానికి కొద్దిగా నమ్మశక్యంగా లేకపోయినా, దాచలేని నిజం ఏమిటంటే, సముద్రతీరం లో నడుస్తూ వెళ్లడం అనేది ఒక వర్ణించలేని ప్రేమ పూరితమైన అనుభవం. మీరు గనుక లో లోపల ఆలోచించే వ్యక్తులు అయితే, ఆ సమయంలో మీ చుట్టూ ఇతరులు ఉండటాన్ని లేదా గందరగోళాన్ని ఎక్కువగా ఇష్టపడరు. కాబట్టి, మీరు గనుక ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే, ముందుగానే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకోండి. ఆ ప్రాంతం ఎలా ఉండాలంటే, అక్కడికి ఎక్కువగా యాత్రికులు రాకుండా మరీ అంత గజిబిజిగా ఉండకుండా మీకు నచ్చే విధంగా ఉండేలా చూసుకోండి. ఏదైనా జంతు ప్రదర్శన శాలకు వెళ్లడం కూడా మంచి ఆలోచనే. ఎందుకంటే, అక్కడ మీరు ఉండే ప్రదేశంలో మీరు ఎప్పుడు గాని లేదా తరచూ చూడని ఎన్నోరకాలైన పక్షులను, జంతువులను మరెన్నో ప్రాణులను మీరు చూస్తారు. ఇవన్నీ మీకు మీరు ఊహించని, అనుకోని, తెలియని ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్తాయి. మీ యొక్క డేటింగ్ ని మరుపురానివిగా చేస్తాయి.

  English summary

  Unique Dating Ideas For Introverts

  With the Indian society progressing at an alarming rate, the concept of dating is becoming all the way more popular. In fact, there is a certain age in which if you do not have a date, you are pretty much considered as a social outcast in your friend's circle.
  Story first published: Saturday, March 10, 2018, 9:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more