మాకు ప్ర‌తి రోజు ప్రేమికుల దినోత్స‌వ‌మే!

Written By: Sujeeth
Subscribe to Boldsky

ఫిబ్ర‌వ‌రి 14 వ‌చ్చేస్తుంది. ప్రేమ సాగ‌రంలో మునిగేందుకు ప్రేమికులు ఉబ‌లాట‌ప‌డుతుంటారు. మా ప్రేమ ఊసుల‌ను క‌ని, వినే స్నేహితులంతా మ‌మ్మ‌ల్ని ఆట‌ప‌ట్టిస్తుంటారు. అయినా మేము సిగ్గుప‌డ‌కుండా ఒక‌ర్నొక‌రం బాగా ప్రేమించేసుకుంటాం.

అవును మా పెళ్లయి 5 ఏళ్లవుతున్నా ఇప్ప‌టికీ మా మధ్య ఇసుమంతైనా ప్రేమ త‌గ్గ‌లేదు స‌రిక‌దా రోజురోజుకు పెరుగుతూ వ‌స్తోంది. ప్రేమ‌ను సంబరంగా జ‌రుపుకోవాల‌ని ప్ర‌పంచ‌మంతా ఎదురుచూస్తుంటే మేము మాత్రం కాస్త జ‌గ‌మెరిగి ప్ర‌తి రోజు ప్రేమికుల దినోత్స‌వాన్ని జ‌రుపుకోవాల‌నే త‌లంపుతో ఉన్నాం.

1. ప్ర‌తి రోజు ఎలా అంటే...

1. ప్ర‌తి రోజు ఎలా అంటే...

మా బంధం బ‌ల‌ప‌డ‌టానికి ఒక‌రి గురించి మ‌రొక‌రికి చిన్న చిన్న విష‌యాలు తెలుసుకోవ‌డ‌మే కార‌ణం. మా బ‌ల‌హీన‌త‌ల‌న్నీ మెల్ల‌మెల్ల‌గా బ‌లంగా మారాయి. ఆఫీసు నుంచి అల‌సిపోయి ఇంటికి రాగానే ఒక‌రి బాధ‌లు మ‌రొక‌రితో పంచుకునేందుకు తోడు ఉన్నామ‌ని తెలియ‌గానే మ‌న‌సు సంతోషంగా ఉప్పొంగిపోతుంది. మా విజ‌యాల సంతోషాలు పంచుకుంటున్నాం. ప్ర‌తి రోజు ఉద‌యం లేవ‌గానే ప‌క్క‌నే ప్రియ‌మైన వారు ఉన్నార‌నే భావ‌న ఒక లాంటి భ‌రోసానిస్తుంది. ప‌గ‌లంతా ఎన్ని టెన్ష‌న్లు ఉన్నా, మూడ్ బాగా లేక‌పోయినా రాత్ర‌యితే గూటికి చేరుకొని ఒక‌ర్నొక‌రం క‌లుసుకుంటాం.

2. చిన్న చిన్న సంద‌ర్భాలే..

2. చిన్న చిన్న సంద‌ర్భాలే..

ప్ర‌త్యేక తేదీల కోసం ఎప్ప‌టికీ వేచిచూడం. అది బ‌ర్త్‌డే కావొచ్చు, వ్యాలెంటైన్స్ డే కావొచ్చు. జీవిత‌కాలం పాటు గుర్తుండిపోయేలా గ‌డిపేస్తాం. మ‌ధుర క్ష‌ణాలు మా బంధాన్ని వ‌ర్ణించ‌లేవు. ప్ర‌త్యేకంగా సెల‌బ్రేట్ చేసుకునేందుకు మైలురాళ్ల‌ను లెక్కించుకోం. బ‌య‌ట ఎక్క‌డో గ‌డిపే క‌న్నా ఇంట్లోనే ఏదైనా మంచి సినిమా చూస్తూ క‌లిసి తిన‌డంలోనే మ‌జా అనిపిస్తుంది మాకు.

3.​ ఒక్క రోజు ప్రేమ ఏం స‌రిపోతుంది?

3.​ ఒక్క రోజు ప్రేమ ఏం స‌రిపోతుంది?

ప్రేమికుల దినోత్స‌వం లాంటి సంద‌ర్భాలు వ‌చ్చిన‌ప్పుడు మాకు ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంటుంది. నిజంగా ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర్చుకునేందుకు ఇన్ని సంద‌ర్భాలు అవ‌స‌రమా? ఒక్క‌రోజు ప్రేమ ఉంద‌ని చెప్పుకుంటే స‌రిపోతుందా, ఇది ప్ర‌తి రోజు చేసే ప్ర‌క్రియ కాదా అని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. మా ప్రేమ ల‌వ్ కార్డ్స్‌లో, రోజా పూల‌లో, ముద్దుగొలిపే బొమ్మ‌ల్లో ఉండ‌దు అని మా న‌మ్మ‌కం. వేడి వేడి కాఫీ తాగుతూ లేదా ఆఫీసులో ఉండ‌గా కవ్వించే మెసేజీ పంప‌డంలోనే ప్రేమ ఉంటుంద‌ని మా భావ‌న‌.

4. స‌మ‌యం గాఢ స్నేహితులను చేసింది

4. స‌మ‌యం గాఢ స్నేహితులను చేసింది

మా బిజీ షెడ్యూల్ నుంచి కాస్తంత స‌మ‌యం కేటాయించ‌డం క‌ష్ట‌మే అయ్యింది. ఐతే అయితే మా మ‌ధ్య బంధాన్ని పెంచి గాఢ స్నేహితులుగా మ‌లిచింది. ప్ర‌త్యేకంగా క్యాండిల్ లైట్ డిన్న‌ర్ కోసం బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోయినా ఫుడ్ ఆర్డ‌ర్ చేసుకుంటాం. వీకెండ్స్‌లో ద‌గ్గ‌రి ప్ర‌దేశాల‌ను చుట్టొస్తాం. ప్రేమ కురిపించుకునేందుకు ఇలా ఏ చిన్న సంద‌ర్భాన్ని వ‌దులుకోం.

5. ప్ర‌తి రోజు ఒక వాగ్దానంతో...

5. ప్ర‌తి రోజు ఒక వాగ్దానంతో...

ఒక‌ర్నొక‌ర‌కం ప్రేమించుకుంటాం అనే వాగ్దానంతో మా రోజు ప్రారంభ‌మ‌వుతుంది. ఇది మాట‌ల్లో చెప్పుకుంటామంటే పొర‌బ‌డిన‌ట్టే. మాట‌ల కంటే చేత‌లే గొప్ప అని మా న‌మ్మ‌కం. అది మా ప‌డ‌క వెచ్చ‌ద‌నంలో, మేము తినే అమృత‌ర‌స‌మ‌య‌మైన భోజ‌నంలో స్ప‌ష్ట‌మ‌వుతూనే ఉంటుంది. మాకు ప్ర‌తిరోజు ప్రేమికుల దినోత్స‌వ‌మే! కాదంటారా?

English summary

We do not need Valentine’s Day to celebrate love!

Love is in the air and as 14th February approaches, we are almost suffocating with love. While our friends tease us for being love cynics, we never shy away from declaring our love for each other. We have been married for almost half a decade and our love for each other is growing stronger with each passing day.
Story first published: Friday, February 9, 2018, 19:00 [IST]
Subscribe Newsletter