For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళా దినోత్సవం స్పెషల్ : మంచి భర్తను కనుగొనడం కంటే కూడా ముఖ్యమైనవి ఉన్నాయా?

|

కొన్ని శతాబ్దాల క్రితం మహిళల ఆలోచనా విధానం ప్రకారం మంచి భర్తను సంపాదించడం కన్నా ముఖ్యమైనది ఏది లేదు. కానీ ఈరోజుల్లో అడిగిచూడండి, ఒక్కొక్కరు ఒక్కో సమాధానాన్ని చెప్తారు. ఒకరు చెప్పిన సమాధానాన్ని మరొకరు చెప్పడం కూడా వింతే అవుతుంది.

ఏ జవాబు చెప్తారో అని తెలుసుకోవాలని ఉందా? ఒక సర్వేలో, మహిళలు తమ తమ ప్రాధాన్యతలను ఉద్దేశంగా ఉంచుకుని సమాధానాలు ఇచ్చారు. అవేమిటో చూడండి.

తమ ఉన్నతికి తోడ్పడే ఉద్యోగం సంపాదించడం

తమ ఉన్నతికి తోడ్పడే ఉద్యోగం సంపాదించడం

పని అనేది ఒక మంచి అనుభూతిని, ఒక గుర్తింపుని ఇస్తుంది. డబ్బుతో పాటు పేరు, పరపతిని ఇస్తుంది. ఒక్కరోజు పని లేకుండా ఇంట్లో కూర్చోండి, మీ మనసు దెయ్యాల కొంపలా తయారవుతుంది. అదే పనిలో సహోద్యోగులతో ఒక చాలెంజ్ తో చేసే పని సంతృప్తిని ఇస్తుంది. అవునా కాదా? అందువల్లే ఎక్కువమంది మహిళలు, విద్యాభ్యాసం పూర్తయ్యాక మంచి భర్తని వెతుక్కునేకంటే , మంచి ఉద్యోగం వెతుక్కోడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

ఎక్కువ మంది మహిళలను స్నేహితులుగా కలిగి ఉండడం.

ఎక్కువ మంది మహిళలను స్నేహితులుగా కలిగి ఉండడం.

నిజం, పురుషులకన్నా మహిళలలోనే కోపం తెచ్చుకోకుండా ఏ విషయాన్నైనా సున్నితంగా అర్ధం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. అందుచేతనే ఎక్కువమంది మహిళల గ్రూప్స్ లో ఫ్రెండ్స్ గా చేరుటకు సిద్దంగా ఉంటారు. అందుచేతనే ఏమో, ఒక సర్వేలో మంచి భర్తను కనుగొనడం కన్నా మహిళా స్నేహితుల గ్రూపుల్లో సభ్యులుగా ఉండడం మేలు అని సమాధానం ఎక్కువగా వచ్చింది.

స్వేచ్చా ప్రపంచంలో విహంగమై విహరించాలి

స్వేచ్చా ప్రపంచంలో విహంగమై విహరించాలి

నిజం చాలామంది మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకరి అనుమతిని తీసుకొనడానికి ఇష్టపడరు. దీనికి కారణం ఆర్ధికపరమైన, ఉద్యోగ పరమైన స్వేచ్చని పొందినట్లే నచ్చిన చోటుకు ప్రయాణించే స్వేచ్చని కూడా కోరుకోవడమే.

ప్రయాణం మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతో పాటు శరీరాన్ని ఉత్తేజంగా పునర్నిర్మించడం చేస్తుంది. ఇక్కడ మీ శరీరాన్ని రిఫ్రెష్ చేసుకోవడానికి మరొక శరీరం అనుమతి కావాలా? అన్న ఈ ప్రశ్నే ఎక్కువ తలెత్తడం మూలంగా సర్వేలో ఎక్కువమంది ఈ సమాధానాన్ని ఇచ్చ్చారు.

ప్రియమైన వారితో సమయం వెచ్చించుట

ప్రియమైన వారితో సమయం వెచ్చించుట

మన చివరి శ్వాస ఆగేవరకు మనతో ఉండే ఏకైక నేస్తాలు కొందరే ఉంటారు. అందులో తల్లిదండ్రులు ముఖ్యులు. ఇక్కడ కొందరి ఆలోచనల ప్రకారం కొన్ని మోసంచేసే మనస్తత్వాలు ఉన్నప్పటికీ, ప్రతి వ్యక్తికీ తనకంటూ ప్రియనేస్తం ఒకరు ఖచ్చితంగా ఉంటారు. కొందరికి తల్లి దండ్రులే సర్వస్వం అయితే, కొందరికి తోబుట్టువులు, ప్రేమించిన వారు, భర్త, స్నేహితులు ఇలా ఉంటారు. వీరు ఎన్నటికీ మిమ్ములను వదిలి వెళ్ళుటకు సిద్ధంగా ఉండరు. కావున భర్తకన్నా వీరితో సమయం వెచ్చించడమే మాకు ఇష్టం అని చాలామంది తమ అభిప్రాయాలు చెప్పారు.

శరీరాన్ని రీఫ్రెష్ చేసే శక్తిని గుర్తించడం.

శరీరాన్ని రీఫ్రెష్ చేసే శక్తిని గుర్తించడం.

కొందరు వారమంతా ఆఫీసు పనుల్లో నిమగ్నమై, వారాంతం లో శరీరాన్ని రీఫ్రెష్ చెయ్యాలని కోరుకుంటారు. వీరికి స్పా , మసాజ్ లాంటివి కొద్ది మేర రీఫ్రెష్ ని ఇస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇది లగ్జరీ కాకపోయినా ఒక అవసరంగా మారింది. వారాంతములో ఈ స్వేచ్చను కోరుకునే హక్కు మాకుంది. ఈహక్కుని వేరే కారణాలతో నాశనం చెయ్యడం మాకిష్టం లేదు అని సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది అభిప్రాయం.

నా వాక్ స్వాతంత్ర్యం నా జన్మ హక్కు

నా వాక్ స్వాతంత్ర్యం నా జన్మ హక్కు

ఆధునిక మహిళల అభిప్రాయాల ప్రకారం, కాదు, లేదు అని చెప్పే దైర్యం ఉండడంతో పాటు , ప్రతికూల వ్యక్తులను దూరం పెట్టడం లాంటి లక్షణాలు పుణికిపుచ్చుకోవడం మంచి భర్తను సంపాదించడం కన్నా పొందవలసిన గొప్ప లక్షణాలు అని ఒక సర్వే లో సమాధానాలుగా వచ్చాయి.

నా వస్త్రధారణ, నా స్వేచ్చ

నా వస్త్రధారణ, నా స్వేచ్చ

అత్యధికులు ఇచ్చిన సమాధానం , ఒక మంచి భర్తను కనుగొనడం కన్నా ముఖ్యమైనది స్వేచ్చను కనుగొనడం. నా దుస్తుల ఎంపికలో, నాచదువు విషయంలో, నా లక్ష్యసాధనలో , నా అభిప్రాయాలు వ్యక్తపరచడంలో , నా ఆర్ధిక లావాదేవీలలో, నా ఇష్టమైన జీవితాన్ని నేను ఆస్వాదించడంలో నాకు స్వేచ్చలేకపోతే నా జీవితానికే అర్ధం ఉండదు. కావున మంచి భర్తను కనుగొనడం కన్నా స్వేచ్చని పొందడానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తాను అని అనేక సమాధానాలు వచ్చాయి.

English summary

Finding A Husband | Finding A Good Husband | Find Me A Good Husband

Everything changed! A century ago, most of the women thought finding the right husband is the most important thing in life.But today, if you ask the modern women about what's the most important thing in life according to them, you won't get the same answer.
Story first published: Thursday, March 8, 2018, 7:00 [IST]