Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
రాజుగారి మనువరాలు బస్సులో నాతో పాటే, అబ్బా ఏం అందంరా బాబు, చూసి తట్టుకోలేకపోయా #mystory396
పరుగెత్తుకుని వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొచ్చా. థ్యాంక్స్ అండీ అంది. నెస్ట్ స్టాఫ్ కు వెళ్లేసరికి తనతో పరిచయం కాస్త పెరిగింది. బస్ లాస్ట్ స్టాఫ్ లో ఆపింది. అక్కడ అందరూ దిగి ఎవరి దారిన వారు వెళ్లారు. ఆ
ఆ రోజు భోగి. సిటీ మొత్తం ఖాళీగా ఉంది. అంతకు ముందు రోజే అందరూ ఉర్లకు వెళ్లిపోయారు. నేను మాత్రం సెలవు దొరకకపోవడంతో సిటీలోనే ఉండిపోయాను. భోగి రోజు కూడా పని చెయ్యాల్సి వచ్చింది.
ఇక ఆ రోజు రాత్రి ఊరికి బయల్దేరాను. బస్సు మొత్తం ఖాళీగా ఉంది. నాకు అటు వైపు ఉండే లేటీస్ సీట్లలో ఒక అమ్మాయి కూర్చొంది. అందానికి కేరాఫ్ అడ్రస్ లా ఉంది.

చూపంతా తనపైనే
బస్సులో ఎవరూ లేకపోవడంతో నా చూపంతా తనపైనే పడింది. కట్టుబొట్టూ కూడా అదిరింది. మోడ్రన్ సంప్రదాయం తెలుగు ట్రెడిషన్ కలగలిపిన అందం ఆమెది. తన అందం చూసి నన్ను నేను మైమరిచిపోయాను.

పరిచయం ఉన్న అమ్మాయిలా
తను ఎవరో నాకు తెలియదు. కానీ చాలా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపించింది. నెస్ట్ స్టేజీలో బస్ కాస్త ఫుల్ అయ్యింది. తర్వాత డిన్నర్ కు బస్ ఆపారు. నేను తినేందుకు దిగాను. తను కిటికీలో అలా ప్రకృతిఅందాలను చూస్తూ ఉండిపోయింది.

నయాగారా జలపాతాన్నే తీసుకొచ్చి
బస్ కదులుతున్న సమయంలో ఏమండి కాస్త వాటర్ బాటిల్ తీసుకొస్తారా అంటూ కిటీకీలో నుంచి డబ్బులు ఇచ్చింది. నువ్వు అడిగితే వాటర్ బాటిల్ ఏంటి నయాగారా జలపాతాన్నే తీసుకొచ్చి నీ ముందు ఉంచుతా అనుకున్నా మనస్సులో.

బస్ లాస్ట్ స్టాఫ్ లో
పరుగెత్తుకుని వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొచ్చా. థ్యాంక్స్ అండీ అంది. నెస్ట్ స్టాఫ్ కు వెళ్లేసరికి తనతో పరిచయం కాస్త పెరిగింది. బస్ లాస్ట్ స్టాఫ్ లో ఆపింది. అక్కడ అందరూ దిగి ఎవరి దారిన వారు వెళ్లారు.

ఆ ఏంజిల్ ను చూస్తూ
నేను మాత్రం అక్కడే నిల్చొన్నాను ఆ ఏంజిల్ ను చూస్తూ. అయినా దారిలో ఏర్పడిన పరిచయాలు శాశ్వతంగా ఉండవని నాకు తెలుసు. అందుకే అంతగా పట్టించుకోలేదు.

బంధువుల అమ్మాయి
ఇక్కడి నుంచి తను ఎక్కడికి వెళ్తుందబ్బా అనుకున్నాను. నా లక్ బాగుండి తను మా ఊరివాళ్లకు బంధువుల అమ్మాయి అయి ఉంటే బాగుండనిపించింది. నేను అనుకున్నదే కరెక్ట్.

రాజుగారి మనువరాలు
తను మా ఊరి రాజుగారి మనువరాలు. ఆయన కూతురి కుమార్తె ఆ అమ్మాయి. రాజుగారు ఊరికి పెద్దమనిషిలా ఉంటారు. బాగా సౌండ్ పార్టీ. తను కూడా మా ఊరి బస్సులోనే ఎక్కింది. దీంతో తన డిటేల్స్ మొత్తం అడిగాను. అన్నీ చెప్పేసింది.

ఎమ్మెస్సీ అగ్రికల్చర్ చేస్తున్నా
"సిటీలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ల ఊరికి చాలా తక్కువ సార్లు వచ్చాను. ఈ సారి మా అమ్మనాన్న ముందే ఊరెళ్లపోయారు. నన్ను రమ్మని చాలా బతిమిలాడారు."

పొలాల్లో చాలా పనులున్నాయి
"అందుకే ఊరికి వస్తున్నాను. అలాగే నా స్టడీస్ కు సంబంధించి కూడా విలేజ్ లోని పొలాల్లో చాలా పనులున్నాయి. అందుకే తప్పని పరిస్థితుల్లో వచ్చేస్తున్నాను" అని క్లుప్తంగా న్యూస్ ఛానల్స్ లో నైట్ నైన్ కు వచ్చే బులెటెన్ మాదిరిగా చెప్పేసింది.

నా కళ్లార్పకుండా
తను మాట్లాడుతుంటే నా కళ్లార్పకుండా అలాగే చూస్తుండిపోయాను. ఈ జర్నీ మాత్రం నా జీవితంలో మరిచిపోని ఒక మధుర జ్ఞాపకం. ఎందుకనేది మీరు నెస్ట్ మై స్టోరీ చదివితే తెలుస్తుంది.
మిగతా స్టోరీ #mystory397



Click it and Unblock the Notifications