For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పార్ట్ నర్ పై ప్రేమ పెరుగుతూ పోవాలంటే... ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...

|

మనలో వివాహం చేసుకున్న ప్రతి ఒక్క జంట తమ జీవితం ఆనందంగా, హాయిగా ఉండాలని కోరుకుంటుంది. అయితే జంటల మధ్య సాన్నిహిత్యాన్నిపెంచేది శృంగారం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

దీని వల్ల కపుల్స్ మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం వంటివి పెరుగుతాయి. అయితే కేవలం ఆ కార్యంలో పాల్గొన్నంత మాత్రాన మీ భాగస్వామితో బంధం బలపడుతుందనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే..

ఎందుకంటే కాలం మారే కొద్దీ.. వయసు పెరిగే కొద్దీ మీ ఇద్దరికీ ఆ కార్యంపై ఆసక్తి తగ్గిపోతుంది. మీ లైఫ్ లో అలా కాకుండా.. మీరు జీవితాంతం మీ భాగస్వామితో ఆనంద సాగరంలో మునిగిపోవాలన్నా.. విరహ లోకంలో హాయిగా విహారించాలన్నా.. మీరు కొన్ని పద్ధతులను పాటించాలి... ఆ ఆసక్తికరమైన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెద్దలు చేసే పెళ్లిలో మనం గుర్తించని ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసా...

కొంచెం మార్పు..

కొంచెం మార్పు..

మీరు మీ పార్ట్ నర్ నుండి ప్రేమను అనునిత్యం కావాలనుకుంటే.. ప్రతిరోజూ ఒక రొమాంటిక్ టచ్ ఇవ్వండి. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. మీపై రోజురోజుకు ప్రేమను కూడా పెంచుతుంది. అయితే ఇలాంటి రిలేషన్ ను మీరు కలకాలం నిలబెట్టుకోవాలి. అయితే దీని కోసం మీరు కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు కొంత మార్చుకోవాలి. ఎదుటివారు మీ కోసం మారేలా ప్రయత్నించాలి.

ప్రాధాన్యత తగ్గకుండా..

ప్రాధాన్యత తగ్గకుండా..

ఏ బంధమైనా కలకాలం నిలబడాలంటే.. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ రిలేషన్ ఎక్కువ కాలం ఉంటుంది. అయితే సంబంధం ముందుకు సాగేకొద్దీ ఏదో ఒక సందర్భంలో తప్పులు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో కొన్నిసార్లు మీ భాగస్వామికి మీరు తగినంత ప్రాధాన్యత ఇవ్వరు. పైగా వారిపై నిందలు వేస్తుంటారు. దీంతో మీ రిలేషన్ షిప్ లో లుకలుకలు ఏర్పడతాయి. కాబట్టి అలా జరగకుండా మీరు జాగ్రత్త పడాలి.

కొంచెం కొత్తగా..

కొంచెం కొత్తగా..

మీరు తొలిసారి మీ భాగస్వామిని కలిసినప్పుడు ఏ విధంగా ఫీలయ్యి ఉంటారో మీకు బాగా గుర్తుండే ఉంటుంది. మీ రిలేషన్ షిప్ లో ప్రేమ ప్రతిరోజూ అలాగే ఉండాలంటే.. మీ భాగస్వామితో మీరు ప్రతిరోజూ కొంచెం కొత్తగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ప్రతిరోజూ మీ పార్ట్ నర్ తో ప్రేమలో పడొచ్చు.

ఆసక్తి తగ్గుదల..

ఆసక్తి తగ్గుదల..

ఏ రిలేషన్ షిప్ అయినా మొదట్లో అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే కాలం మారే కొద్దీ రిలేషన్ పై ఆసక్తి తగ్గిపోతుంది. కోరికలు తగ్గిపోతాయి. మీ బంధంలో ఇలా జరగకుండా ఉండాలంటే.. మీ పార్ట్ నర్ మీ నుండి ఏమి కోరుకుంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. లేకపోతే, మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు, అప్పటి నుండే మీ సంబంధంలో సమస్యలు ప్రారంభమవుతాయి.

ఆ నగరంలో అందరూ అందమైన కన్యలే... కానీ కళ్యాణం కావట్లేదట... ఎందుకో తెలుసా...

ఎప్పటికప్పుడు..

ఎప్పటికప్పుడు..

ప్రేమికులైనా.. పెళ్లి చేసుకున్న జంటలైనా వారిద్దరి మధ్య రిలేషన్ షిప్ లో గొడవలు, వాదనలు చాలా కామన్. అయితే మీరు దేని గురించి గొడవ పడుతున్నారో.. దాని గురించే చర్చను పరిమితం చేయండి. అంతేకానీ, దాన్ని అడ్డం పెట్టుకుని.. గతంలో జరిగిన తప్పులు.. లోపాలను గుర్తు చేయడం వంటివి చేయకండి. దీని వల్ల మీ గొడవ పెద్దదవుతుంది తప్ప.. మీ ప్రాబ్లమ్ కు సొల్యూషన్ అనేది ఎప్పటికీ దొరకదు.

రెగ్యులర్ ఇలా చెప్పండి..

రెగ్యులర్ ఇలా చెప్పండి..

మన పార్ట్ నరే కదా.. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే మీరు ఎంత కాదనుకున్నా కొన్ని సందర్భాల్లో ఈ పదాన్ని కచ్చితంగా వాడాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాన్ని అస్సలు వదులుకోకండి. దీని వల్ల వారిని బాగా ప్రోత్సహిస్తున్నారని, గుర్తిస్తున్నారని భావిస్తారు. దీని వల్ల మీపై ప్రేమ మరింత పెరుగుతుంది.

జవాబుదారీతనం..

జవాబుదారీతనం..

మీ రిలేషన్ షిప్ గురించి పది మంది ఏమనుకుంటున్నారు.. సమాజం ఏ విధంగా చూస్తుంది.. అనే విషయాలను అస్సలు పట్టించుకోకండి. మీ ఇద్దరి మధ్య సంబంధం గురించి మీరు ఏమనుకుంటున్నారో, దానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా ఉన్నన్ని రోజులు మీ జీవితాలు హాయిగా సాఫీగా సాగిపోతాయి. ఎందుకంటే మీ రిలేషన్ లో మీరిద్దరే ఎక్కువ కాలం కలిసి జీవించేది అనే విషయాన్ని ఎప్పటికీ మరచిపోవద్దు.

ఎంత బిజీగా ఉన్నా..

ఎంత బిజీగా ఉన్నా..

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చాలా బిజీగా గడిపేస్తున్నారు. అయితే రిలేషన్ షిప్ లో మీరిద్దరూ ఎంత బిజీగా ఉన్నా.. ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవాలి. ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన పనులు మీరిద్దరూ కలిసి చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. దీని కోసం ఓ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోండి. దీంట్లో మీరిద్దరూ కలిసి చేయాల్సిన జర్నీ, పనులు, ఫైనాన్షియల్ మీటింగ్స్ ఇలా ఏవైనా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే మీ రిలేషన్ కలకాలం హాయిగా ముందుకు సాగిపోతుంది.

English summary

Best Pieces of Relationship Advice in Telugu

Here are the best pieces of relationship advice in Telugu. Take a look
Story first published: Wednesday, April 7, 2021, 12:29 [IST]