For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా కౌగిలించుకుంటే… మీ లైంగిక జీవితం తారస్థాయికి చేరుకుంటుందట…!

|

ఈ విశ్వంలోని ఏ అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా కౌగిలింత అయినా కలయిక వంటి క్రీడకు దోహదం కలిగించేదిగా ఉండాలి. ఎందుకంటే జంటల మధ్య లైంగిక జీవితాన్ని మెరుగుపరచడంలో కౌగిలి అనేది చాలా చక్కని మందులా పని చేస్తుందని పలు అధ్యయనాలు సైతం నిరూపించాయి. ఏది ఏమైనా అమ్మాయిల శరీరతత్వాన్ని గ్రహించి పురుషుడు పడకగదిలో రతి కార్యానికి సిద్ధం కావాలి. అప్పుడు ఇద్దరికీ ఎంతగానో సుఖం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సాధారణ మహిళ శరీరతత్వం మెల్లగా పారే సెలయేరు వంటిదని, పురుషుని శరీర తీరు ఎగిసి పడే సాగరం వంటిదని వాత్స్యాయనుడు ఎప్పుడో వివరించాడు. మహిళల్లో మామూలుగా ఉద్రేకం అనేది నెమ్మదిగా కలుగుతుంది. పురుషుల స్థితి ఆ విధంగా ఉండదు. అందుకే మహిళ శరీరతత్వాన్ని గ్రహించి ఆమెకు అనుకూలంగా పురుషుడు మసలుకోవాలి. అందుకోసం ముందుగా మీ పార్ట్ నర్ ను ప్రేమగా కౌగిలించుకోవాలి. అలాంటి కౌగిలింతల వల్ల జంటల మధ్య రిలేషన్ షిప్ ఎంతగా బలపడుతుందో ఈ స్టోరీలో చూద్దాం...

ఇలాంటి కౌగిలింతతో..

ఇలాంటి కౌగిలింతతో..

కౌగిలింతల్లో అత్యంత ప్రాచుర్యం పొందినది స్పూనింగ్ దశ. ఈ యాంగిల్ లో స్త్రీ, పురుషుల శరీరాలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఇలాంటి ఆలింగనం మీరు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నారని సూచిస్తుంది. అందుకే చాలా మంది జంటలు తరచుగా ఇలాంటి స్థానాలనే కోరుకుంటారు. తమ సహచరుడిని కౌగిలించుకోవాలనుకునే వ్యక్తులు తమకు ఇలాంటి అభిరుచులు ఉన్నాయని తెలుసుకుంటారు. అందుకే ఇలాంటివి ఎక్కువగా చేసి సంతోషపడతారు.

ఛాతీపై తలపెట్టి..

ఛాతీపై తలపెట్టి..

చాతీపై తలపెట్టి ఆలింగనం చేసుకోవడం వల్ల మీ భాగస్వామితో పాటు మీ మనసులోని స్పందనను తెలుసుకోవచ్చు. ఇది ఇతర వ్యక్తి తన లోతై రహస్యాన్నిమరియు అతని కోరికను దాదాపు తెలియజేస్తుంది. ఒకరి తలను ఇంకొకరి ఛాతిలో ఉంచి కౌగిలించుకునే భాగస్వాములు ఒకరికొకరు చాలా సహాయం చేసుకుంటారు. అంతేకాదు వీరు మానసికరంగా మరియు శారీరకంగా ఎలాంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించుకోగలరు.

కళ్లలో కళ్లు పెట్టి...

కళ్లలో కళ్లు పెట్టి...

కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటూ.. పడకగదిలో కౌగిలింతలు అనేవి అందరూ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఒకరినొకరు తమ ప్రేమను పంచుకుంటూ ఉంటారు. ఇలాంటివి అత్యంత రొమాంటిక్ సినిమా సన్నివేశంగా కూడా అనిపించవచ్చు. అలా వారు ఒకరినొకరు చూసుకుంటూ మెల్లగా కౌగిలి ఒడిలో జారుకుంటే వారికి ఎంతగానో ఉత్సాహంగా అనిపిస్తుంది.

రక్షణగా..

రక్షణగా..

ఒకరికొకరు నిలబడి కౌగిలించుకునే జంటలు చాలా మందే ఉంటారు. అలా కౌగిలించుకుంటే ఆమె నుండి అతనికి.. అతని నుండి ఆమెకు భద్రతా లభిస్తుందని అర్థం. అయితే కొన్నిసార్లు అలాంటివి బలవంతం చేసినట్లు అనిపిస్తాయి. కానీ అలాంటి సంబంధాలు ఎల్లప్పుడూ సమయ పరీక్షగా నిలుస్తాయి. ఎందుకంటే ఒక భాగస్వామి, మరొకరిని రక్షించడమే కాదు, సంబంధాన్ని ఏదైనా హాని నుండి రక్షించడానికి వారు ఏదైనా చేస్తారు.

కాళ్లను గట్టిగా పట్టుకుని..

కాళ్లను గట్టిగా పట్టుకుని..

కౌగిలిలో ఒకరి తొడలు మరొకరి తొడపై ఉంచి గట్టిగా కౌగిలించుకునే భంగిమను శయన భంగిమ అంటారు. ఇలాంటి వాటికే అనేక జంటలు చాలా ప్రాముఖ్యత ఇస్తాయి. అంతేకాదు కాళ్లను గట్టిగా పట్టుకుని నిద్రపోతారు. అలాగే మీ భాగస్వామి ఇష్టానికి ప్రాముఖ్యత ఇస్తారు. అదేవిధంగా చేతులను కూడా కట్టేసినట్టు ఫీలవుతారు. ఇలా నిద్రపోవటం వల్ల మీరు మరియు మీ భాగస్వామి బాగా కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారని అర్థం.

వెనుక నుండి..

వెనుక నుండి..

మీ భాగస్వామి నిద్రపోతున్నప్పుడు వారిపై మీ చేతులను మెల్లగా వెనుక నుండి పోనివ్వండి. ఈ సమయంలో వారికి ఎంతో వెచ్చగా ఉంటుంది. అలా మీరు మీ భాగస్వామిపై మీ ప్రేమను చూపండి. ఎందుకంటే వారికి మీ మద్దతు అవసరమని మీరు చెప్పే ప్రయత్నం చేయవచ్చు.

ఇద్దరి ప్రేమ..

ఇద్దరి ప్రేమ..

బ్యాక్ టు ప్యాక్ స్థానానికి తిరిగి వెళ్లే ప్రతి జంట పరస్పర గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. చాలా మంది జంటల్లో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మరియు మరొకరి స్థానం గురించి తెలుసుకోవాలి. అందువల్ల మీరు ఎప్పటికీ ఒకరినొకరు ప్రేమించుకుంటారు.

ప్రేమ కౌగిలి..

ప్రేమ కౌగిలి..

మీ కౌగిలి శైలి ఎలా ఉన్నప్పటికీ, మీ భాగస్వామిని కౌగిలించుకోవడానికి మీకు ఎలాంటి ప్రోత్సాహాకాలు అవసరం లేదు. ఎందుకంటే వెచ్చని కౌగిలి మీలోని అన్ని దూరాలను కవర్ చేస్తుంది. మీరు మానసికంగా బాధలో ఉంటే, అలాంటి సమయంలో లభించే కౌగిలి వల్ల మీరు ఆ క్షణంలో బాధలన్నీ మరచిపోయే అవకాశం ఉంది.

English summary

cuddling positions say a lot about your relationship

Here we are talking about the how you cuddle your lover can say a lot about your relationship. Read on.