For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆరోగ్యకరమైన అలవాట్లను మార్చుకుంటే రొమాంటిక్ రిలేషన్ షిప్ సులభమే...

|

ఈ విశ్వంలోని ప్రతి జంటకు ఏవో కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. వీటి వల్ల వారి సంబంధంలో మనస్పర్దలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా మన దేశంలో చిన్న చిన్న సమస్యలకే రిలేషన్ షిప్ కు బ్రేకులు వేసి విడిపోతుంటారు. అందుకే చాలా మంది వీటి నుండి బయట పడాలని కోరుకుంటారు. ముఖ్యంగా చెడు స్నేహం మరియు చెడు సంబంధాల నుండి బయటపడాలని అనుకుంటారు. ఎందుకంటే రిలేషన్ షిప్ అన్నాక అవి చెడ్డ అలవాట్లు అని మనం అర్థం చేసుకోవాలి.

అయితే ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషి పరిపూర్ణుడు కాదు. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది సంబంధంలో అవసరమైన వాటిని పొందేందుకు ఏదో పర్ఫెక్ట్ గా ఉన్నట్టు నటిస్తారు. ఇంకా మనలో చాలా మంది ఎల్లప్పుడూ రొమాంటిక్ గా ఉండాలని కోరుకుంటారు. వాస్తవానికి ఇది సాధ్యం కాదని మాత్రం వారు గుర్తించరు. ఇలా రిలేషన్ షిప్ విషయంలో సాధారణంగా తప్పుగా భావించే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

భావ వ్యక్తీకరణ...

భావ వ్యక్తీకరణ...

భార్య భర్తలు లేదా ప్రేమికులు మరియు స్నేహితులలో తరచుగా జరిగే సంఘటనలలో ఒకటి భావాలను బాధపెట్టడం. ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు, అది ఇతరులకు అర్థం కాని సమయంలో వారి భావోద్వేగాలు బయటపడతాయి. కొన్నిసార్లు మీరు, మీ జీవిత భాగస్వామి మనోభావాలను దెబ్బతీస్తారు. అయితే మీరు మీ భాగస్వామిని నిజం చెప్పాల్సిన సందర్భాలు వచ్చినా, మీరు నిజాన్ని బయట పెట్టరు. మీరు సంబంధంలో కపట నాటకం ప్రదర్శిస్తే అది మీకే నష్టం. మీ జీవిత భాగస్వామి తను నిజాయితీగా తన అభిప్రాయాన్ని చెబితే, అది బాధగా అనిపించినా పర్వాలేదు. అయితే ఇది మీ భాగస్వామి యొక్క పారదర్శకత(ట్రాన్స్ పారన్సీ)ను తెలియజేస్తుంది.

విభేదాలను నివారించడం

విభేదాలను నివారించడం

ప్రియుడు మరియుప్రియురాలు లేదా భార్యభర్తలు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో గొడవ పడుతుంటారు. అయితే చాలాసార్లు గొడవల వల్ల ఏర్పడ్డ విభేదాలను నివారించాలనుకుంటారు. కానీ అది సాధ్యపడదు. అయితే మీరిద్దరూ వాదనలు నివారిస్తే అది చాలా మందికి ఆరోగ్యకరంగా ఉంటుంది. మీరిద్దరూ కలిసి తీసుకునే నిర్ణయంలో ఒకే అభిప్రాయం ఉండాలి. సంఘర్షణ సమయంలో మాట్లాడటం ద్వారా ప్రతిదీ పరిష్కారం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు వాదించడం మరియు బాధపెట్టడం కంటే కొన్ని విభేదాలను విస్మరించడం ఆరోగ్యకరమైనది. కొంతమంది పోరాడటానికి విలువైనవారు కాదు. అందువల్ల, విభేదాలను నివారించడం మంచిది.

ఎవ్వరూ పరిపూర్ణంగా ఉండరు..

ఎవ్వరూ పరిపూర్ణంగా ఉండరు..

ఈ విశ్వంలో మగవారైనా లేదా ఆడవారైనా ప్రతి ఒక్కరిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. అందుకనే ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు అన్న విషయాన్ని అందరూ గుర్తంచుకోవాలి. అయితే లోపాల నుండి నేర్చుకోవడం వంటివి అలవాటు చేసుకుంటే మంచిది. మీ జీవిత భాగస్వామి మీకు ఉన్న ప్రతికూలతలను ఒప్పుకుని మిమ్మల్నీ అంగీకరిస్తే, మీరు కూడా అలాగే చేయాలి. ఇలా లోపాలను విస్మరించడం వల్ల ఇంతకుముందు కంటే మీ సంబంధాన్ని మరింత దగ్గరగా చేయడానికి ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి.

బంధానికి కొంత సమయం..

బంధానికి కొంత సమయం..

మనది మాన జీవితం కాబట్టి. మన జీవన విధానం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఈ గందరగోళ జీవితంలో పురుషులు తమ సహచరులపై మాత్రమే శ్రద్ధ వహించడం అనేది అసాధ్యం. అందుకే ప్రతి ఒక్కరూ సంబంధానికి కొంత సమయాన్ని కేటాయించాలి. మీ భాగస్వామితో సమయం గడపకపోవడం వల్ల మీ సంబంధంలో మనస్పర్దలు వచ్చే అవకాశం ఉంది. అందుకే అప్పుడప్పుడు, సమయాన్ని కేటాయించడం అనేది సహజంగా అలవాటు చేసుకోవాలి. ఇది భవిష్యత్తులో మీ సంబంధాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. మీరు మీతో లేదా మీ భాగస్వామితో కొంత సమయం గడపాలనుకుంటే, వారి అభిరుచుల కోసం కొంత సమయం కేటాయించడం మరియు స్నేహితులతో ప్రయాణించడం మీ సంబంధంలో కచ్చితంగా మెరుగుదలను తిరిగి తెస్తుంది.

మంచంపై కోపంగా..

మంచంపై కోపంగా..

మీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మంచంపైకి కోపంగా వెళ్లకూడదు. అలా చేస్తే మీ సంబంధంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే మంచం మీదికి మీరు ఎల్లప్పుడూ మాంచి ఉత్సాహంతో వెళ్లాలి. అప్పుడే మీ సంబంధంలో సరదా, రొమాన్స్ వంటివి ప్రారంభమై మీ బంధం బలంగా తయారవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే మంచం మీదికి వెళ్లేటప్పుడు కూడా టెన్షన్ పడరాదు. రాత్రంతా మీ భాగస్వామి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఉదయాన్నే దాని గురించి మళ్లీ మాట్లాడాలి. ఒకవేళ గొడవ పడితే తర్వాతి రోజు ఉదయం ప్రశాంతంగా సయోధ్యకు రావడం మంచిది.

ఆకర్షణగా చూడటం..

ఆకర్షణగా చూడటం..

పెళ్లి అయిన తర్వాత లేదా పెళ్లికి ముందు అయినా ఇతరులను ఆకర్షణీయంగా చూడటం సరైన విషయమే. ఇలాగే ఆకర్షణ కలిగి ఉండాలని ఈ విశ్వంలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇదే విషయాన్ని జీవశాస్త్రం కూడా సూచిస్తుంది. ఎందుకంటే ఇది జీవ సంబంధమైన అవసరం. మగ, ఆడ ఇద్దరూ వ్యతరేక జెండర్స్ కాబట్టి. వ్యతిరేక లింగాలకు ఒక విధమైన ఆకర్షణ ఉంటుంది. భార్యాభర్తలు వివాహ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత, వారు ఒకరినొకరు ఆకర్షించుకుంటారు. ఇక్కడ ఒకదాన్ని కోరుకోవడం అనివార్యం అని అందరూ తెలుసుకోవాలి.

English summary

healthy relationship habits that most people think are toxic

Read to know the healthy relationship habits that most people think are toxic
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more