For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారా? అయితే వారిని ఎదుర్కొనే మార్గాలేంటో తెలుసుకోండి..

మీ కుటుంబ సభ్యులతో లేదా విశ్వాసంగా ఉండే స్నేహితులతో మాట్లాడండి. ఎందుకంటే స్నేహితులు అన్ని పరిస్థితులులో మీకు రక్షకులుగా ఉంటారు.

|

ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తికి అతను లేదా ఆమె జీవిత భాగస్వామి తమను మోసం చేస్తున్నారని తెలుసుకోవడం చాలా కష్టం. ఒక వేళ ఎవరైనా భాగస్వామి చేతిలో మోసపోతే వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జీవిత భాగస్వామికి ద్రోహం చేసి తిరస్కరించడాన్ని వారిని నిస్సహాయులుగా చేస్తుంది. ఒకవేళ వారు మిమ్మల్ని నమ్మడం లేదని మీరు భావిస్తే మీపై అవిశ్వాసం చూపుతున్నారని మీరు కనుక్కుంటే దానిని ఎలా ఎదుర్కోవాలో మనలో చాలా మందికి తెలీదు. దీంతో కొంతమంది సంబంధాలను తెంచుకోవటానికి ఇష్టపడతారు. మరికొందరు తమను మోసం చేసే జీవిత భాగస్వామిని ఎలా ఎదుర్కోవాలో కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. అలా మిమ్మల్ని మోసం చేసే జీవిత భాగస్వామి లేదా భాగస్వామితో మీరు ఎలా వ్యవహరించాలో తెలిపే కొన్ని మార్గాలు ఇక్కడున్నాయి. వాటిని ఈ వ్యాసం ద్వారా తెలుసుకోందడి. మీ బతకు బండి మార్గాన్ని సులభతరం చేసుకోండి.

1) గిల్టీ ఫీలింగ్ ఆపేయండి..

1) గిల్టీ ఫీలింగ్ ఆపేయండి..

మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేయడం వెనుక గల కారణం మీకు తెలియకపోతే, మీరు వారిపై నిందలు వేయకుండా ఉండటమే మంచిది. కానీ దీనికి సాధ్యమైన కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తరచుగా చెడు ఉద్దేశ్యాలున్న వ్యక్తులు అపరాధ భావనతో మరియు వారి అవిశ్వాసానికి కారణమని మిమ్మల్ని మోసగిస్తారు. మోసం చేసిన భాగస్వామి సాధారణంగా నిందలు వేయడానికి ఇష్టపడుతుంటారు. అతను లేదా ఆమె చేసిన తప్పులకు ఎప్పుడూ బాధ్యతలు తీసుకోరు. దీని అర్థం మీరు తప్పు అని కాదు.

2) భాగస్వామితో ప్రశాంతంగా..

2) భాగస్వామితో ప్రశాంతంగా..

మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తుందని మీకు మీరే మనసులో బాధపడుతూ ఏమి జరిగిందనే దానిపై కన్నీళ్లు పెట్టుకునే బదులు మీ భాగస్వామి చేసిన తప్పును సరిద్దిందేకు ప్రయత్నించొచ్చు. మీరు అలాంటి సమస్యను పరిష్కరించే వరకు ఇలాంటివి మీ మనసులోనే దాచుకుంటే పరిస్థితులు చక్కబడతాయి. కానీ అప్పుడు మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే సైలెంటుగా ఉండటం కూడా మీ జీవిత భాగస్వామిని ప్రోత్సహిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడవచ్చు. అప్పుడు మీరు మిమ్మల్ని మోసం చేయడానికి గల కారణాలను సైతం అడగొచ్చు.

3) విశ్వాసంగా ఉండే వారితో మాటలు..

3) విశ్వాసంగా ఉండే వారితో మాటలు..

మీ కుటుంబ సభ్యులతో లేదా విశ్వాసంగా ఉండే స్నేహితులతో మాట్లాడండి. ఎందుకంటే స్నేహితులు అన్ని పరిస్థితులులో మీకు రక్షకులుగా ఉంటారు. అందువల్ల, వారి సహాయం కోరడం చాలా ఉత్తమమైన విషయం. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీకు తెలిస్తే, మీ కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన స్నేహితుడి సహాయం తీసుకోవడం మంచిది. ఈ విషయాన్ని వారితో చర్చిస్తే మీరు మీ బాధను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. అలాగే, మిమ్మల్ని మోసం చేసే జీవిత భాగస్వామితో ఎలా మసలుకోవాలో కూడా మీకు సహాయం దొరుకుతుంది.

4) మీదే అంతిమ నిర్ణయం..

4) మీదే అంతిమ నిర్ణయం..

మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి జీవించాలనుకుంటున్నారో లేదో మీరే ఒక నిర్ణయానికి రండి. ఎందుకంటే అది పూర్తిగా మీ ఇష్టం. మీ జీవిత భాగస్వామితో కొనసాగాలని మరియు అతని లేదా ఆమెకు మరో అవకాశం ఇవ్వాలనే నిర్ణయం మీకు మాత్రమే ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నారో లేదా అని కూడా మీరు ప్రయత్నాలు చేయొచ్చు. అంతేకాదు మీ జీవిత భాగస్వామిని క్షమించవచ్చని, ఇంతవరకు ఏమి జరిగిందో మర్చిపోయి, గతం గత: అన్న చందాన అతనితో లేదా ఆమెతో జీవించడం కొనసాగించవచ్చని మీరు అనుకుంటే, అప్పుడు మీరు వారితోనే ఉండగలరు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ మీరు అతనిని లేదా ఆమెను మూర్ఖంగా ప్రవర్తించకుండా చూసుకోండి.

5) మీరు కొన్ని రూల్స్ ను..

5) మీరు కొన్ని రూల్స్ ను..

అతను లేదా ఆమె మిమ్మల్ని మోసం చేసిన తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి ఉండాలని మీరు నిర్ణయించుకుంటే కొన్ని రూల్స్ ను సెట్ చేసుకోండి. వాటిని సెట్ చేయడం వలన మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేయరని భావించవచ్చు. మీకు కావాల్సినప్పుడు మీరు అతని లేదా ఆమె ఫోన్ ను చెక్ చేయవచ్చు. ఇతరులతో మరీ క్లోజ్ గా ఉండొద్దని అతనికి లేదా ఆమెకు చెప్పండి. అప్పుడే అతను లేదా ఆమె మీతో విలువైన సమయాన్ని గడుపుతారు. ప్రారంభంలో ఈ నియమాలను అమలు చేయడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మీ జీవిత భాగస్వామి నిజాయితీ ఉండటానికి నిబద్ధతతో ఉన్నారని మీరు నిర్ధారించుకోవచ్చు.

6) గతాన్నీ వీడటం మంచిది..

6) గతాన్నీ వీడటం మంచిది..

మీ జీవిత భాగస్వామిపై పగ పెంచుకోవడం వల్ల మీ మనసులో కలవరం మొదలవుతుంది. కాబట్టి గతాన్ని వీడటం మంచిది. మోసం చేసినప్పటికీ మీ జీవిత భాగస్వామితో కలిసి జీవించాలని మీరు నిర్ణయించుకుంటే, అతన్ని / ఆమెను క్షమించండి. మీ జీవిత భాగస్వామి అతని / ఆమె తప్పును గ్రహించినట్లు మీరు చూస్తే మీ పిల్లలు మరియు కుటుంబం కోసం మీ జీవిత భాగస్వామితో కలిసి జీవించడాన్ని మీరు ఎంచుకోవచ్చు.

7. వీలైనంత ముందుకు..

7. వీలైనంత ముందుకు..

మీ భాగస్వామికి వ్యతిరేకంగా ప్రతికూల భావోద్వేగాలను ఉంచే బదులు మీరు వీలైనంత మేరకు ముందుకు సాగడం మంచిది. చేదు జ్ఞాపకాలకు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఉన్నప్పటికీ, మీ నిర్ణయం పట్ల మీకు నమ్మకం ఉందని నిర్ధారించుకోండి. అందుకే మీరు వీలైనంత త్వరగా ముందుకు సాగడం మంచిది. కొత్త ప్రారంభం కోసం ఎదురుచూడండి.

మోసపోవడం మీ ఆత్మ మరియు మనస్సుపై మచ్చను ఏర్పరస్తుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మరియు మీకు సంతోషాన్ని కలిగించే పనులు చేయడం ద్వారా మీరు ఈ మచ్చను నయం చేయవచ్చు. ప్రారంభంలో, విషయాలు మీకు కష్టంగా ఉండవచ్చు, కానీ చివరికి పరిస్థితులన్నీ చక్కబడతాయి.

English summary

Ways to deal with your cheating spouse

For a person, finding out that his or her spouse is cheating on them can be a devastating thing and have a negative impact on their emotional health as being cheated is an unpleasant feeling. The infidelity of the spouse can make a person feel betrayed, rejected and helpless.
Desktop Bottom Promotion