For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ స్నేహితులలో ఎవరు ఫేక్.. ఎవరు రాక్ అనే తేడాలు మీకు తెలుసా..

నిజమైన స్నేహితులను కలిగి ఉండటం వల్ల ప్రేమ యొక్క విస్తారమైన మూలాన్ని కలిగి ఉంటారు. మీ నిజమైన స్నేహితుడు ఒక కుటుంబం లాగా మీ గురించి ఎప్పుడూ కేర్ తీసుకుంటాడు.

|

కష్టాల్లో ఉన్నప్పుడు కామిడి చేసేవాడు..
కావ్.. కావ్.. మంటూ కల్లబొల్లి కబర్లు చెప్పేవాడు..
కంటెంట్ లేకున్నా ఏదైన కథనాన్ని కళ్లకు కట్టినట్టు చూపేవాడు..
కీలకమైన విషయాల్లో కామ్ గా ఉండేవాడు..
ఆ విషయాల్లో మాత్రం 'కన్నింగ్' నైస్ గా ఉండేవాడు..
కన్యల విషయంలో 'కామ'ప్రమైజ్ డ్ కానివాడు..
ఖర్చులకు లేనపుడు కాసులు ఇచ్చేవాడు..
కలలో కరిష్మా, కత్రినా లాంటి అందగత్తెలనే ఊహించుకునేవాడు..
కుమ్ములాటల్లో కత్తిలా దూసుకొనెచ్చేవాడు..
కడలిని సైతం తన కాళ్ల దగ్గరికి రప్పించుకునేవాడు..
పైన ఉన్న వాటిలో ఈ పాటికే మీ జీవితంలో ఎవడో ఒకడు తగిలే ఉంటాడు..
వాడినే అందరూ అంటారు స్నేహితుడు అని..

ఇలాంటి స్నేహితులు మన జీవితంలో ఒక భాగమే. ఎందుకంటే చాలా మంది బంధాలకు ఇవ్వని విలువ స్నేహానికి ఇస్తుంటారు. ఆ తర్వాతే ప్రేమకు లేదా ఇతర వాటికి ఇస్తుంటారు. మన జీవితంలో ప్రతి ఒక్కరికి స్నేహం అనేది చాలా అవసరం. ఎందుకంటే స్నేహితులు మనల్ని ప్రేమిస్తారు. మనల్ని ప్రోత్సహిస్తారు. కొంతమంది మాత్రం మనల్ని బాధ పెడతారు. ఇంకా కొంతమంది ఎగతాళి చేస్తారు. ఏది ఏమైనా ఇప్పటికీ మన జీవితంలో కొందరు స్నేహితులు మన మనసుకు దగ్గరగా ఉంటారు. వారు మన జీవితంలో ఉంటే కలర్ ఫుల్ గా, ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇందుకు కారణాలేంటో తెలుసుకుందాం.

How to Distinguish Between a Fake Friend and a True Friend

చాలా సినిమాల్లో మనం ఈ డైలాగ్ వినే ఉంటాం. అదేంటో మరోసారి ఇప్పుడు మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే అంతలా ఫేమస్ ఆ డైలాగ్. నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ మీ వైపే ఉంటాడు. అయితే నకిలీ స్నేహితుడు అయితే మీరు బాగున్నారా లేదా అనే విషయాలను అసలు పట్టించుకోడు. అయితే నిజమైన మరియు నకిలీ స్నేహితుల మధ్య తేడాను గమనించడం కొంచెం కష్టం. అలాంటి వారి మధ్య వ్యత్యాసాలను గుర్తించడంలో కొన్ని సంకేతాలను మీ కోసం తీసుకొచ్చాం. వీటిని గుర్తిస్తే మీరు స్నేహం విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.

1) నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తారు..

1) నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తారు..

నిజమైన స్నేహితులకు ఒకరినొకరిని ఎలా ఆదరించాలో బాగా తెలుసు. వారి స్నేహానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో వారికి బాగా తెలుసు. మీ నిజమైన స్నేహితులు మీ భయంకరమైన కలలకు కూడా మద్తు ఇస్తారు. మీ నిర్ణయాలను ఈ ప్రపంచం తప్పు అని చెప్పినప్పుడు, మీ చుట్టూ ఉండి మీకు నిజమైన రక్షకుడిగా వ్యవహరిస్తారు. మీ వెన్నంటే ఎల్లప్పుడూ ఉంటారు. కానీ ఇదే పరిస్థితుల్లో నకిలీ స్నేహితులు వెనకడుగు వేస్తారు. మీకు మద్దతు ఇవ్వకుండా వెంటనే మీ దగ్గరి నుండి జారుకుంటారు. మీకు కష్టంగా ఉన్న సమయాల్లో వారి నిజమైన స్వభావాన్ని బయట పెడతారు.

2) అమితమైన ప్రేమ..

2) అమితమైన ప్రేమ..

నిజమైన స్నేహితులను కలిగి ఉండటం వల్ల ప్రేమ యొక్క విస్తారమైన మూలాన్ని కలిగి ఉంటారు. మీ నిజమైన స్నేహితుడు ఒక కుటుంబం లాగా మీ గురించి ఎప్పుడూ కేర్ తీసుకుంటాడు. ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉంటే వారు మీకు సేవలు చేస్తారు. మీరు ఏదైనా పరీక్షలో కచ్చితంగా పాస్ అవ్వాలని కోరుకుంటారు. నిజమైన స్నేహితులు ఒకరినొకరు ప్రేమను చూపించనప్పటికీ, వారు మీ పట్ల ఉన్న ప్రేమను ప్రతిబింబించే పనులు చేస్తారు. అదే కన్నింగ్ స్నేహితులైతే మీకు ఏదైనా నిజంగా అవసరం పడితే కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటారు.

4) ఒకరికొకరు అండగా..

4) ఒకరికొకరు అండగా..

నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా ఉంటారు. మీరు ఏదైనా ఒక వాదనలో చిక్కుకుంటే, మీ నిజమైన స్నేహితులు తాము కూడా అందులో చేరి మీ తిట్లను షేర్ చేసుకుంటారు. మీపై వచ్చిన ఆరోపణలను కూడా పంచుకుంటారు. కానీ మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆ వ్యక్తిపై తిరగబడతారు. నిజాలను తెలుసుకుని మాట్లాడమని సూచిస్తారు. కానీ ఫేక్ ఫ్రెండ్స్ ఇలాంటివేమీ చేయరు. వారు కూడా మిమ్మల్ని విమర్శించే వారిలో చేరవచ్చు. మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. కారణం లేకుండా మరొకరు విమర్శిస్తే సైలెంట్ గా చూస్తూ విగ్రహంలా ఉండిపోతారు.

4) రహస్యాలను తెలుసుకుంటారు..

4) రహస్యాలను తెలుసుకుంటారు..

నిజమైన స్నేహితులు ఒకరికొకరు మీకు సంబంధించిన రహస్యాలను తెలుసుకుంటారు. అవి ఎప్పటికీ రహస్యంగా ఉండేలా ప్రయత్నిస్తారు. మీ రహస్యాల గురించి ఎక్కడా నోరు విప్పరు. మీరు ఒకవేళ మద్యం సేవించి ఉంటే ఎలా ప్రవర్తించాలో వారికి బాగా తెలుసు. మీ మనసు వారికి బాగా తెలుసు. ఎందుకంటే మీరు మొదట ఏమి చెప్పకుండానే మీరు ఏమి చేస్తున్నారో వారు అర్థం చేసుకోగలరు. అయితే ఫేక్ ఫ్రెండ్స్ మీ రహస్యాలను వెంటనే గాసిప్ చేయవచ్చు. మీకు ప్రత్యేకమైన క్షణాలను అనిపించిన వాటిని ఎగతాళి చేయవచ్చు.

5) మీ మాటలను శ్రద్ధగా వింటారు..

5) మీ మాటలను శ్రద్ధగా వింటారు..

నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ మీ మాటను శ్రద్ధగా వింటారు. మీ కోసం ఎల్లప్పుడూ సమయం కేటాయిస్తారు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా కేవలం మెసెజ్ టెక్ట్స్ చేయడం లేదా మీ నిజమైన స్నేహితులను పిలవడం. మీ నిజమైన స్నేహితులు మీరు పిలిచిన వెంటనే వారు ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా కచ్చితంగా మీ వద్దకు చేరుకుంటారు. అయితే కన్నింగ్ ఫెలోస్ ఇలాంటి వాటికి అస్సలు ప్రాధాన్యత ఇవ్వరు. వారు వారి పనిని మరింత ముఖ్యమైనదిగా భావిస్తారు.

6) మీ కుటుంబాన్ని జాగ్రత్తగా..

6) మీ కుటుంబాన్ని జాగ్రత్తగా..

మీ నిజమైన స్నేహితులు మీ కుటుంబాన్ని వారి సొంత కుటుంబంగా భావిస్తారు. మీ తల్లిదండ్రులు మీ నిజమైన స్నేహితులను మీకు సరైన సహచరులుగా కనుగొంటారు. అయితే, మీ నకిలీ స్నేహితులు మీ కుటుంబంతో అంత అనుకూలంగా ఉండరు. వారు మంచి మాటలు మాట్లడవచ్చు కానీ వారి ప్రతి చర్య వెనుక ఏదో ఒక స్వార్థపూరిత ఉద్దేశం ఉండే ఉంటుంది. అలాగే, వారు మీ కుటుంబానికి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. తద్వారా మీ దగ్గరున్న వ్యక్తులు వారి నిజమైన ఉద్దేశాలను కనుగొనలేరు.

7) తప్పును కూడా షేర్ చేసుకుంటారు..

7) తప్పును కూడా షేర్ చేసుకుంటారు..

మీరు ఏదైనా తప్పు చేస్తే అందులోనూ షేర్ అవుతారు మీ నిజమైన స్నేహితులు. ఇలాంటి స్నేహితులను మీరు ఎప్పటికైనా నమ్మవచ్చు.

కానీ ఫేక్ ఫ్రెండ్స్ తో ఇలా ఎప్పటికీ జరగదు. ఏదైనా తప్పు జరిగితే మీపై దొరికింది చాన్సు అనుకొని మీపై నిందలు వేస్తారు.

మన జీవితంలో కచ్చితంగా స్నేహితులు కూడా ఒక భాగంగా ఉంటారు. అవి మనకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఊపును ఇస్తాయి. కానీ మీరు మంచి స్నేహితులను గుర్తించడం ముఖ్యం. అందువల్ల మీరు మీ స్నేహితులను తెలివిగా ఎన్నుకోవాలి. మీ జీవితంలో ఫేక్ ఫ్రెండ్స్ తో జాగ్రత్తగా ఉండాలి.

English summary

How to Distinguish Between a Fake Friend and a True Friend

However, distinguishing between true and fake friends is a bit tough. But you don't need to worry about this as we have listed down some subtle signs that can help you in distinguishing between true and fake friends.
Story first published:Thursday, October 24, 2019, 15:41 [IST]
Desktop Bottom Promotion