For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేకప్ తర్వాత ఈ మెమోరీస్ మరచిపోవాలంటే... ఇలా ట్రై చేయండి...

మీ మాజీ భాగస్వామి జ్ణాపకాలను మరచిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.

|

ప్రేమ బంధం అయినా.. వివాహ బంధం అయినా లేదా ఇంకే రిలేషన్ అయినా విడిపోవడం అనేది ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవ్వరినైనా బాధిస్తుంది. ఎందుకంటే ఒక రిలేషన్ లో మనం ఎంతగానో సర్దుకుపోతాం.

How to stop thinking about your ex in Telugu

ఎన్నో త్యాగాలు చేస్తాం.. అలాంటిది మనం మనసారా ప్రేమించిన వ్యక్తితో బంధాన్ని తెంచుకోవాలంటే.. బ్రేకప్ పేరిట తనకు దూరం కావాలంటే.. ఏదో కోల్పోతున్నామనే ఫీలింగ్ ఉంటుంది. అయితే మీరు ఎవరితో అయిన విడిపోయినప్పుడు.. వారు మరొకరిని ప్రేమిస్తున్నారని తెలిస్తే.. గుండె పగిలినంత పనవుతుంది.

How to stop thinking about your ex in Telugu

కాబట్టి మీరు వారిని చాలా మిస్ అయ్యారని బాధపడుతూ కూర్చుంటే ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే మీ మాజీ ప్రియుడు/ప్రియురాలి గురించి ఆలోచనల వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో బ్రేకప్ తర్వాత మీకు ఎదురయ్యే బాధ నుండి ఎలా బయటపడాలి.. మీ ఎక్స్ ను మరచిపోయి మీరు లైఫ్ లో మరింత స్ట్రాంగ్ గా ఎలా మారాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పడకగదిలో ఈ పనులు చేస్తే... రొమాన్స్ లో రెండింతల సంతృప్తి మీ సొంతం...!పడకగదిలో ఈ పనులు చేస్తే... రొమాన్స్ లో రెండింతల సంతృప్తి మీ సొంతం...!

వాస్తవాన్ని అంగీకరించాలి..

వాస్తవాన్ని అంగీకరించాలి..

మీ మాజీ పార్ట్ నర్ కొత్త వ్యక్తితో ప్రేమలో పడ్డట్టు.. మీరు నిరంతరం వారి గురించి ఆలోచిస్తుంటే.. మీరు వారినింకా పూర్తిగా మరచిపోలేదని అర్థం. అయితే మీరు ఇప్పటికీ వారిని ప్రేమిస్తున్నారని దీని అర్థం కాదు. అయితే వీరిని మరచిపోవడానికి మాత్రం కాస్త ఎక్కువ సమయం పడుతుందనే వాస్తవాన్ని మీరు గ్రహించాలి. మీరు ఇష్టపడినా, ఇష్టపడకపోయినా, మీరు ఒకసారి ప్రేమించిన వ్యక్తి ఇకపై మీ జీవితంలో ఒక భాగం కాదు. మీ గతాన్ని మరచిపోవడం అనేది ఒక్క రాత్రిలో జరగదు. కానీ కనీస మీరు ప్రయత్నం చేయాలి. పాత జ్ఞాపకాలు పదే పదే గుర్తుకొస్తున్నా.. మీ ప్రణాళికలు మరియు లక్ష్యాలపై దృష్టి పెట్టండి. త్వరలో మీకు తేడా కనిపిస్తుంది. ఏదో ఒకరోజు ఈ బాధలన్నీ పూర్తిగా తగ్గిపోతాయి.

అద్భుతమైన విషయాలు..

అద్భుతమైన విషయాలు..

ప్రస్తుతం మీ జీవితంలో ఏమి జరుగుతున్నా.. మీరు గుర్తుంచుకోవాల్సింది మీ మాజీ భాగస్వామి గురించి కాదు.. మీ లైఫ్ లో ముందుకెళ్లే కొద్దీ.. అద్భుతమైన విషయాలు జరుగుతాయి. మీరు ఊహించని విషయాలు మీ కోసం ఎన్నో ఎదురుచూస్తున్నాయి. జీవితం అనేది ఎన్నో అద్భుతమైన విషయాలతో కూడుకుని ఉంటుంది. అది మీరు ఎలా ఉన్నారని చూడకుండా.. మీకు కొత్త కొత్త అద్భుతాలను, అందాలను అందిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు నమ్మకంతో ముందడుగు వేయాలి.

ఒక్క బంధమే..

ఒక్క బంధమే..

మీ లైఫ్ లో ప్రస్తుతం మీరు కొనసాగిస్తున్న రిలేషన్ షిప్ చాలా వాల్యుబుల్ కావొచ్చు. కానీ మీ విలువను అది మార్చలేదు. కేవలం ఒక బంధం మాత్రమే మిమ్మల్ని నిందించలేదు. కాబట్టి మిమ్మల్ని మీరు బలంగా మారాలి. మీకంటూ చదువు, కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం వంటివి ఎన్నో ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మీకు మీరున్నారు. ఒక బంధం తెగిపోగానే మీ జీవితం ముగిసిపోయినట్లు కాదు. దాని కంటే మీరు ఎంతో గొప్పవారనే విషయాన్ని మీరు ఎప్పటికీ మరచిపోకూడదు.

ధైర్యంగా ఎదుర్కోవాలి..

ధైర్యంగా ఎదుర్కోవాలి..

మీరు మీ ఎక్స్ తో విడిపోయినప్పుడు ప్రారంభంలో పరిస్థితులు కాస్త భయంకరంగా ఉంటాయి. కానీ మీరు వాస్తవాలను అంగీకరించాలి. మీరు కొత్త భాగస్వామి కోసం ప్రయత్నించొచ్చు. లేదా ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్లడం ప్రారంభించండి. దీని వల్ల మీ మైండ్ డైవర్ట్ అవుతుంది. ఇది మిమ్మల్ని ఎక్కువ కాలం పాత జ్ణాపకాల నుండి ప్రభావితం చేయదు. కొంతకాలం తర్వాత మీరు కొత్తదనాన్ని చూస్తారు.

మీ పార్ట్ నర్ లో ఇలాంటి లక్షణాలుంటే... మీ బంధం బలహీనపడినట్టే...మీ పార్ట్ నర్ లో ఇలాంటి లక్షణాలుంటే... మీ బంధం బలహీనపడినట్టే...

అందమైన భవిష్యత్తు..

అందమైన భవిష్యత్తు..

‘ప్రతి ఒక్కరికీ ప్రతి రోజూ.. దేవుడు ఇచ్చే ఓ గిఫ్ట్' అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి మీ గతంలో ఎంత తప్పు జరిగినా.. దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల.. ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. అంతేకాదు.. మీ మనసులో మరింత బాధ పెరిగిపోతుంది. కాబట్టి మీరు వర్తమానంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ అందమైన భవిష్యత్తు గురించి కలలు కనండి. అందుకోసం ఏం చేయాలో ఆలోచించండి. అయినప్పటికీ మీ మాజీ భాగస్వామి గుర్తొస్తుంటే.. మీ స్నేహితులతో కాసేపు.. మీ బంధువులతో మరికాసేపు మాట్లాడి చూడండి.. వారు మిమ్మల్ని ఎంత అభిమానిస్తున్నారో తెలుస్తుంది.

మీకు ఆ ఎనర్జీ..

మీకు ఆ ఎనర్జీ..

ఈ ప్రపంచాన్ని సృష్టించే శక్తి మీ మనసుకు ఉంది. మీరు మీ మాజీ ప్రియుడి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని గురించి మళ్లీ ఆలోచించాల్సిన లేదా బాధపడాల్సిన అవసరమే ఉండదు. అయితే కొన్ని రోజులు లేదా నెలల పాటు మీ నిర్ణయం తప్పు అనే భావ వస్తుంది. చాలా బాధగా ఉంటుంది కూడా. కానీ మీరు తీసుకున్న నిర్ణయం సరైందే అయితే.. మీరు మరింత ఆనందం పొందుతారు.

గొడవలకు కారణంగా.

గొడవలకు కారణంగా.

మీ భాగస్వామితో మీరు విడిపోయిన తర్వాత మీకు ఎక్కువగా గుర్తుకొచ్చే విషయాలు గొడవలకు కారణమైన సందర్భాలు. ఏ విషయం అయినా సరిగ్గా మాట్లాడుకుని ఉంటే.. ‘మీ గొడవ సమసిపోయేది కదా' అనిపిస్తుంది. అయితే దాని గురించి ఇప్పుడు మీరు చేసేదేమీ ఉండదు. కాబట్టి దీన్ని ఓ లెసన్ లా గుర్తుంచుకోండి. ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి.

అది మారదు..

అది మారదు..

మీరు ప్రేమించిన వారు మీ లైఫ్ లో చాలా క్లోజ్ గా ఉండొచ్చు. తను లేకుండా మీరు జీవితాన్ని ఊహించుకోలేక పోయిండొచ్చు. కానీ మీ విలువ మాత్రం తనను బట్టి ఏ మాత్రం తగ్గదు. మీరు చేసే పనులు, ప్రవర్తన వల్ల మీ విలువ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో మీరు మంచి పనులు చేస్తూ ముందుకెళ్లండి.

English summary

How to stop thinking about your ex in Telugu

Here we are talking about the how to stop thinking about your ex in Telugu. Read on,
Story first published:Monday, March 29, 2021, 13:33 [IST]
Desktop Bottom Promotion