For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలాంటి సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ఇద్దరే...!

|

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ టీమిండియా బ్యాట్స్ మెన్లు గురించి తెలియని వారుండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.వీరిలో ఒకరు హిట్ మ్యాన్ అయితే.. మరొకరు రన్నింగ్ మషిన్.

రోహిత్ శర్మ భారత్ తరపున రెండుసార్లు డబుల్ సెంచరీ కొట్టి ప్రపంచరికార్డులు నెలకొల్పితే.. విరాట్ కోహ్లీ సెంచరీలు, తక్కువ సమయంలో అధిక పరుగులు చేయడంలో ప్రపంచ రికార్డులను బద్దలుకొట్టారు.

అయితే వీరిద్దరూ కొన్ని సందర్భాల్లో క్రీజులో చిన్న పొరపాటు వల్ల రనౌట్ గా వికెట్లను కోల్పాయరు. అప్పటి నుండి వీరి మధ్య వైరం ఏర్పడిందని, వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని ఏవేవో పుకార్లు వినిపించాయి.

ఓ దశలో విరాట్ కోహ్లీ మైదానంలోనే రోహిత్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. కోహ్లీ చాలా కూల్ అయిపోయాడు. తన సహచర ఆటగాడైన రోహిత్ శర్మ ఆటను బాగా ఎంజాయ్ చేశాడు. తనను బాగా ప్రోత్సహించాడు. దీనంతటికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపిఎల్ ఆటగాళ్ల డైట్ ఫాలో అవ్వండి... మీరూ ఫిట్ గా మారిపోండి...ఐపిఎల్ ఆటగాళ్ల డైట్ ఫాలో అవ్వండి... మీరూ ఫిట్ గా మారిపోండి...

స్నేహమే మిన్న..

స్నేహమే మిన్న..

ఈ లోకంలో అన్నింటి కంటే బలమైనది.. ప్రేమను మించినది స్నేహం. ఏదైనా కష్టం వస్తే.. చాలా మంది బంధువుల దగ్గరకు వెళ్లడం కన్నా.. స్నేహితుని దగ్గరకు వెళితే సాయం దొరుకుతుందని చెబుతుంటారు. అందుకే స్నేహానికన్నా మిన్న ఏదీ లేదని అన్నాడో గొప్ప కవి. కష్టమైనా, నష్టమైనా, ఆనందమైనా, సంతోషమైనా, ఎల్లప్పుడూ మన వెంటే నీడలా వెన్నంటి ఉంటాడు స్నేహితుడు. అలాంటి స్నేహితుల మధ్య గొడవలు రావడం సహజం. అలాంటి వాటిని అధిగమించడమే కష్టం. అలాంటిది అతి తక్కువ సమయంలోనే తమ మధ్య విభేదాలను పక్కనపెట్టేశారు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ.

గాసిప్స్ కు చెక్..

గాసిప్స్ కు చెక్..

ఆ రోజు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధమయ్యారు. అయితే అంతలోనే అవగాహన లోపం వల్ల విరాట్ కోహ్లీ రనౌటయ్యాడు. దీనికి రోహిత్ కారణమని కోహ్లీ భావించాడు. దీంతో మీడియాలో ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య వైరం ఏర్పడిందని పుకార్లు వినిపించాయి. అయితే కోచ్ రవిశాస్త్రి ఈ విషయంలో ఇద్దరినీ రాజీ చేశారు. దీంతో ఆ గాసిప్స్ చెక్ పడింది.

రోహిత్ కు అభినందనలు..

రోహిత్ కు అభినందనలు..

అదే రోజు డ్రెస్సింగ్ రూమ్ రవిశాస్త్రి ఏం అద్భుతం చేశాడో తెలీదు కానీ.. కొన్ని గంటల్లోనే విరాట్ రోహిత్ ను ప్రోత్సహిస్తూ కనిపించాడు. తన మిత్రుడు ఇచ్చిన సహకారంతో ఆరోజు హిట్ మ్యాన్ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేశాడు. ఆ మ్యాచ్ అనంతరం రోహిత్ కూడా విరాట్ కు క్షమాపణలు చెప్పాడు. కానీ కెప్టెన్ కోహ్లీ కూడా ఈ విషయం గురించి మరచిపోయినట్టు చెప్పాడు.

వివాహ బంధం విజయవంతమయ్యేందుకు.. ఈ వృద్ధ జంట చెబుతున్న రహస్యాలేంటో చూడండి...వివాహ బంధం విజయవంతమయ్యేందుకు.. ఈ వృద్ధ జంట చెబుతున్న రహస్యాలేంటో చూడండి...

స్నేహపూర్వక వాతావరణం..

స్నేహపూర్వక వాతావరణం..

మ్యాచ్ ల అనంతరం కొన్ని టీవీ షోలలో పాల్గొన్న వీరిద్దరికీ ఆ రనౌట్ కు సంబంధించిన ప్రశ్నలు తరచుగా ఎదరవుతూనే వచ్చాయి. అయితే వీరిద్దరూ అందరికి ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తున్నారు. తామిద్దరు ఎంతో సంతోషంగా ఉన్నామని, అప్పుడేదో అనుకోకుండా అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. దాని గురించి మళ్లీ మళ్లీ గుర్తు చేయొద్దని విన్నవించారు.

ఆపదలో అండగా..

ఆపదలో అండగా..

ఈ ఆటగాళ్లిద్దరూ టీమిండియా జట్టులో కెప్టెన్, వైస్ కెప్టెన్ గా కాకుండా మంచి స్నేహితుల్లా కలిసి మెలిసి ఉంటారు. అందుకు నిదర్శనమే ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్. ఆ మ్యాచ్ మధ్యలో కోహ్లీ గాయపడితే.. రోహిత్ తన స్నేహితుని బాధ్యతలను భుజాన వేసుకుని, మ్యాచ్ ను దగ్గరుండి గెలిపించి.. తన స్నేహితుడికి గిఫ్టుగా ఇచ్చాడు.

ఐపిఎల్ లో మాత్రం..

ఐపిఎల్ లో మాత్రం..

ఈ ఇద్దరు ఆటగాళ్లు టీమిండియా జట్టులో ఎంత క్లోజ్ గా ఉంటారో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మ్యాచ్ లు వచ్చేసరికి మాత్రం చాలా సీరియస్ అయిపోతారు. అయితే అదంతా కేవలం మైదానంలోనే. ఒక్కసారి డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకుంటే.. అంతా కూల్ అయిపోతారు. అన్ని విషయాలను లైట్ తీసుకుంటారు. ఇక కోహ్లీ గ్రౌండ్లో ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటాడో మనందరికీ తెలిసిందే. అయితే హిట్ మ్యాన్ మాత్రం చాలా కూల్ గా కనిపిస్తాడు. తనలో ఏ మాత్రం టెన్షన్ కనిపించనివ్వడు.

మళ్లీ ప్రత్యర్థుల్లా..

మళ్లీ ప్రత్యర్థుల్లా..

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఈరోజు నుండి మరికొన్ని రోజుల పాటు మైదానంలో ప్రత్యర్థుల్లా మారబోతున్నారు. అయితే వీరంతా ఎప్పటిలాగే మంచి మిత్రుల్లా కొనసాగాలని.. ఐపిఎల్ ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలని అభిమానులందరూ కోరుతున్నారు.

English summary

How Virat Kohli And Rohit Sharma Resolved Differences And Rekindled Their Friendship

Here we are talking about how virat kohli and rohit sharma resolved differences and rekindled their friendship. Read on