For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేకప్ మీ లైఫ్ కు బ్రేకులేస్తుందా? లేదా బెటర్ గా మారుస్తుందా?

|

మీరు ఒక వ్యక్తితో కలిసి జీవిస్తున్నప్పుడు అంటే అది వైవాహిక జీవితం కావచ్చు లేదా ప్రేమ జీవితం కావచ్చు చాలా మంది ఆ బంధం శాశ్వతంగా ఉండిపోవాలి అని కోరుకుంటారు. కానీ ఇటీవల కాలంలో ట్రెండ్ మారుతోంది. సెలబ్రిటీల దగ్గర నుండి సామాన్య మానవుల వరకు కేవలం కొంత కాలం కలిసి జీవించి సడన్ గా బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. ఇందు కోసం పొంతన లేని కారణాలను వెతుక్కుంటున్నారు.

సాధారణంగా ఆడవారైనా లేదా మగవారైనా ఎవరైనా సరే ఒంటరిగా ఉన్న సమయంలో రిలేషన్ కోసం ఎంతగానో ఆరాటపడతారు. అప్పటి వరకు తమ ప్రేమను, ఇష్టాన్ని ఎన్నో రకాలుగా వ్యక్తం చేస్తారు. అలాంటి వారికి అకస్మాత్తుగా బ్రేకప్ పేరుతో దూరమవ్వాలంటే భరించలేని బాధ ఉంటుంది. అయితే ఆ బ్రేకప్ మీ లైఫ్ కు కొత్త పాఠాలను నేర్పుతుంది.

అవి జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుంది. మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ నుంచి మీరు విడిపోయినప్పుడు తెలుసుకునే మంచి లేదా చెడ్డ విషయాలే మిమ్మల్ని మరియు మీ వ్యక్తిత్వాన్ని మరింత బెటర్ గా మారుస్తాయి. ఇంతకీ బ్రేకప్ మీ జీవితానికి నేర్పే గుణపాఠాలు ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...

అద్భుతాలు..

అద్భుతాలు..

ప్రస్తుతం మీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే మీరు ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. అది ఏంటంటే.. మీరు జీవితంలో ముందుకు వెళ్లే కొద్దీ మీకు అద్భుతమైన విషయాలు జరుగుతాయి. మీరు ఊహించని ఎన్నో విషయాలు మీ కోసం వేచి చూస్తున్నాయి.

నమ్మకంతో ముందుకు..

నమ్మకంతో ముందుకు..

జీవితం అనేది ఎన్నో అద్భుతాలతో నిండి ఉంటుంది. అది మీరు ఎలా ఫీలవుతున్నారనే విషయాన్ని పట్టించుకోకుండా మీకు కొత్త కొత్త సర్ ప్రైజ్ లను అందిస్తూనే ఉంటుంది. అందుకే నమ్మకంతో ముందుకు వెళ్లాలి.

బంధం తెగిపోగానే..

బంధం తెగిపోగానే..

మీరు ఒకరితో బంధం తెంచుకున్నప్పుడు మీ జీవితం ముగిసిపోయినట్లు కాదు అని మీరు గుర్తుంచుకోవాలి. ఆ బంధం కంటే మీరు చాలా గొప్పవారు అని మీరు గ్రహించాలి.

మీ కంటూ ఓ విలువ..

మీ కంటూ ఓ విలువ..

మీ జీవితంలో మీరు ప్రస్తుతం కొనసాగిస్తున్న బంధం ఎంతో ముఖ్యమైనది అయ్యుండొచ్చు. కానీ మీ విలువను అది అస్సలు మార్చలేదు. కేవలం ఒక రిలేషన్ షిప్ మాత్రమే మిమ్మల్ని నిర్వచించలేదు. మీకంటూ మీరు విలువ ఇచ్చుకోవడం అనేది చాలా అవసరం.

ప్రతిరోజూ ఓ వరం..

ప్రతిరోజూ ఓ వరం..

మనకు ప్రతిరోజూ ఓ వరం లాంటిది అని మీరు గుర్తుంచుకోవాలి. ఇది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి. గతంలో మీకు సంబంధించి ఏదైనా జరిగి ఉండొచ్చు. అయితే దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ఈరోజుపై..

ఈరోజుపై..

అందుకే మీ మనసులో ఎంత బాధ.. ఎలాంటి బాధ గూడు కట్టుకున్నా.. మీరు ఈరోజు ఎక్కువ దృష్టి పెట్టాలి.

భవిష్యత్ కలలు..

భవిష్యత్ కలలు..

మీ అందమైన భవిష్యత్తు కోసం మీరు కలలు కనడం ప్రారంభించాలి. అంతేకాదు వాటిని నిజం చేసుకునేందు ఏమి చేయాలో ఆలోచించాలి. మీ ఎక్స్ పదే పదే గుర్తుకు వస్తుంటే.. మీ స్నేహితులతో మాట్లాడాలి. లేదా కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడపాలి. అప్పుడు వారు మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది.

మీ తర్వాతే..

మీ తర్వాతే..

ఎప్పుడైనా.. ఏ క్షణం అయినా మీ తర్వాతే ఎవరైనా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని గురించి మళ్లీ మళ్లీ ఆలోచించి బాధపడాల్సిన అవసరం ఉండకూడదు. కొన్నిరోజుల తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం తప్పు ఏమో అని కూడా మీకు అనుమానం కలుగుతుంది. అప్పుడు మళ్లీ బాధపడాల్సి ఉంటుంది.

మీ నిర్ణయం సరైనదే..

మీ నిర్ణయం సరైనదే..

కానీ మీరు తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ సరైనదే. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా నిర్ణయం తీసుకుంటే, అది మీకు ఎప్పటికీ ఆనందాన్ని ఇస్తుంది. మీ జీవితంలో ఒక సందర్భంలో మీతో బంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి కంటే, మీకు మీరే ముఖ్యం. అదే మీ బ్రేకప్ మీకు నేర్పే పాఠం. అందుకే మీరు తీసుకున్న నిర్ణయాల గురించి చింతించకండి.

గొడవలు ఒక కారణం..

గొడవలు ఒక కారణం..

చాలా మందికి బ్రేకప్ తర్వాత గుర్తొచ్చే ఫస్ట్ మ్యాటర్ గొడవలు. ఆ గొడవలకు ఏయే కారణాలు..ఎలాంటి సందర్భాలు.. లేదా ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకోకపోవడం వంటివి. అప్పుడు అనిపిస్తుంది. అప్పుడే సరిగా మాట్లాడుకుని ఉంటే గొడవ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అని అనిపిస్తుంది. కానీ దాని గురించి ప్రస్తుతం ఏమి చేయలేరు. అది మీకు ఓ గుణపాఠంలా గుర్తుండిపోతుంది.

ప్రతి విషయాన్ని..

ప్రతి విషయాన్ని..

ఈ ప్రపంచంలో ఎవ్వరైనా సరే ఏ బంధాన్ని అయినా సరిగ్గా కొనసాగించాలంటే అవతలి వ్యక్తితో మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని పంచుకోవాలి. అప్పుడే బ్రేకప్ తర్వాత మీతో మీరు మాట్లాడుకోవడంతో పాటు అవతలి వ్యక్తితో మాట్లాడే పద్ధతిని కూడా మీరు తెలుసుకుంటారు.

పైకి లేచే ప్రయత్నం..

పైకి లేచే ప్రయత్నం..

జీవితంలో అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు. ఎవ్వరైనా సరే సమస్యల సుడిగుండం నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మనల్ని ఎంతగా ఇష్టపడుతున్నా.. మనం వారికి దూరంగా ఉంటే బాగుండదు. బ్రేకప్ వంటి కష్టాలు మన జీవితంలోకి వచ్చి మన విలువను మనకు తెలియజేస్తాయి. ‘మన బెస్ట్ ఫ్రెండ్ మనమే‘ అని చెబుతాయి. మనల్ని మనం ఎక్కువగా ప్రేమించేలా చేస్తాయి.

బ్రేకప్.. అయితేనేం..

బ్రేకప్.. అయితేనేం..

గతం అనేది ఎప్పటికీ భవిష్యత్తును మార్చలేదు. అలాగే ఒక వ్యక్తితో బ్రేకప్ అయ్యింది. అయితేనేం.. అది మీ విలువను ఏ మాత్రం మార్చదు. ప్రతి కథకు ఒక మంచి ముగింపు అనేది ఉంటుంది. ప్రతి చీకటి దారి చివర్లో వెలుగు కచ్చితంగా కనిపిస్తుందని గుర్తుంచుకోవాలి. అందుకే మిమ్మల్ని మీరు మానసికంగా సంసిద్దులను చేసుకొని ముందుకు వెళ్లండి.

మీరు చేసే పనులే..

మీరు చేసే పనులే..

మీ విలువ మీ ఎక్స్ ను బట్టి ఉండదు. మీరు చేసే పనుల వల్లే మీ విలువ అనేది మారుతుంది. కాబట్టి మీ జీవితంలో మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్లండి. మీ ఎక్స్ లేకుండా మీరు జీవితాన్ని ఊహించుకోలేకపోవచ్చు. కానీ అది తప్పదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.

English summary

Important lessons Only A Breakup Will Teach You

Here are the some important lessons only a breakup will teach you. Read on