For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోర్న్ సైట్స్ చూడటం వల్ల మీ శృంగార జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా..

|

మీకు పోర్న్ సైట్స్ చూసే అలవాటుందా? మీరు పోర్న్ సైట్స్ బ్యాన్ చేసిన ఇతర సైట్లను అన్వేషిస్తున్నారా? మీరు పోర్న్ సైట్లకు బానిసలుగా మారిపోయారా? అయితే మెల్లగా ఈ అలవాటు నుండి బయటపడేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే మీ రిలేషన్ షిప్స్ పై తీవ్ర ప్రభావం అవకాశముందంట. మామూలుగా పోర్న్ చూడటం పెద్ద సమస్యేమీ కాదు. కానీ అది మీ రిలేషన్ షిప్ ను నాశనం చేస్తుంటే, మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మీరు మీ భాగస్వామితో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటే, ఒకరితో ఒకరు సమయం గడపాలి. వారి కోసం చిన్న చిన్న పనులు చేయడం వంటి మంచి పనులు చేయాలి. ఇంకా ఏమేమీ చేయాలో ఈ స్టోరీని పూర్తిగా చదివి తెలుసుకోండి.

Relationships And Sex

ప్రముఖ పోర్న్ సైట్ హబ్ విడుదల చేసిన 2018 గణాంకాల ప్రకారం అమెరికా మరియు లండన్ తర్వాత పోర్న్ వెబ్ సైట్లను వీక్షించే సంఖ్యలో మన దేశం మూడో స్థానంలో ఉందని తేలింది. అంతేకాదు మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఆ గణాంకాలలో తేలింది.

Relationships And Sex

మన దేశంలో కొన్ని రకాల సైట్లపై నిషేధం ఉన్నా కూడా 18 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు గల వారు 44 శాతం మంది 25 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు 41 శాతం మంది ఉన్నారట. పోర్న్ సైట్లను చూడటానికి భారతీయులు గడిపే సమయం ఎంతో తెలుసా. తెలిస్తే షాకవ్వాల్సిందే. ఒక్కో వ్యక్తి సగటున 8 నిమిషాల 23 సెకన్ల వరకు వీడియోలను వీక్షిస్తున్నారంట. దీనంతటికి కారణం బహుశా ఇంటర్నెట్ కు అత్యంత సరమైన ధరలకే లభించడమే అని అందరూ తెగ చర్చించుకుంటున్నారు.

ఒత్తిడిని సృష్టిస్తుంది..

ఒత్తిడిని సృష్టిస్తుంది..

పోర్న్ వీడియోలు చూసేటప్పుడు బాగానే ఉంటుంది. కాని అది వారి రిలేషన్ షిప్ కు మరియు లైంగిక జీవితానికి హానికరం అని వారి గుర్తించారు. ఎందుకంటే ఇది భావోద్వేగ బంధం వంటి సమస్యలను సృష్టిస్తుంది. దీని ద్వారా మీ మొత్తం దృష్టి శారీరక ఆనందానికి మారుతుంది. బెడ్ రూమ్ లో తమ భాగస్వాములతో మంచి పనితీరు కనబరచాలనే వ్యక్తులలో ఇలాంటి ఒత్తిడికి ఎక్కువగా మారుతుంది. లేకపోతే వారి భాగస్వాములు పూర్తిగా నిరాశ చెందుతారు. ఇంకా శారీరక స్వరూపమే ప్రతిసారీ తొలి వరసలో నిలుస్తుంది. అందువల్ల, మహిళలు లేదా పురుషులు శృంగారంలో లైంగికంగా ఆకర్షణీయంగా కనిపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఎవ్వరూ శారీరకంగా పరిపూర్ణంగా ఉండలేరని వారు అస్సలు అర్థం చేసుకోలేరు.

ఆనందం కోసం ఏదైనా..

ఆనందం కోసం ఏదైనా..

పోర్న్ సినిమాల్లో లింగ అసమానత నిజజీవితంలోని భార్యాభర్తలకు చాలా హానికరంగా మారొచ్చు. దీని కోసం మీరు ఉదాహరణకు ఒక వీడియో యొక్క శీర్షికను పరిశీలించండి. కొన్నింట్లో స్త్రీలు పురుషుడిని కాకుండా కేవలం సెక్స్ కోరుకుంటున్నారని సూచిస్తుంది. ‘‘ఛీటింగ్ భార్య‘‘, ‘‘హోర్నీ గర్ల్‘‘ అయితే కాదు. అశ్లీల చిత్రాలలో కొన్నిసార్లు పురుషుల ముఖం బహిర్గతం చేయబడదు. ఎందుకంటే అందులో ఉండే నటులు లైంగిక చర్యలో ఉన్నప్పుడు మొత్తం దృష్టి అంతా స్త్రీ మరియు ఆమె స్పందనలపైకే మారుతుంది. దారుణమైన విషయం ఏమిటంటే, స్త్రీలను మనషులుగా కాకుండా డబ్బు సంపాదించే యంత్రాలుగా చూడటం. లైంగిక చర్య సమయంలో ఒకరకమైన హింసాత్మక ప్రవర్తన ఉన్నప్పటికీ, స్త్రీ కోరుకుంటున్నట్లు చూపించడం ద్వారా ఇది సమర్థించబడుతుంది. ఇది ప్రజలను లేదా వీడియో చూసేవారికి తమ భాగస్వాములు సెక్స్ వస్తువులు అని ఆలోచన మార్చగలదు. సెక్స్ విషయానికి వస్తే వారు వారితో ఏదైనా చేయగలరు. దాని నుండి ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు.

శారీరక మరియు భావోద్వేగ అభ్రదతను పెంచుతుంది..

శారీరక మరియు భావోద్వేగ అభ్రదతను పెంచుతుంది..

మీ భాగస్వామితో లైంగిక సంబంధం కలిగి ఉండటం అంటే, ఆ జంట ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉంటారు. అందువల్ల, ఈ చర్యకు వచ్చినప్పటికీ, మీరు మీ భాగస్వామిని గౌరవించడం అవసరం. కానీ, నిజంగా మీరు ఎక్కువగా పోర్న్ చూస్తుంటే, మీరు మీ భాగస్వామి వైపు కాకుండా నటుల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇది మీ భాగస్వామికి నిజంగా అసురక్షితంగా మరియు బెడ్ పైనే చెదిరిపోయేలా చేస్తుంది.

అవాస్తవ పరిస్థితులలో..

అవాస్తవ పరిస్థితులలో..

ఓ ఉపాధ్యాయుడు ఒక విద్యార్థితో లైంగిక సంబంధం కలిగి ఉండటాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? లేదా మీ కుటుంబ సభ్యులు డ్రాయింగ్ రూమ్ లో కూర్చోవడం లేదా వారు నిద్రలో ఎక్కువగా ఉన్నప్పుడు మీ భాగస్వామితో మాత్రమే లైంగిక చర్యను పూర్తి చేయొచ్చా? ఇదంతా నిజ జీవితంలో సాధ్యం కాదు. కానీ ఈ పోర్న్ వంటి సినిమాల్లో ఇవన్నీ సాధ్యమవుతాయి. కొందరు దీనిని నిజమని అనుకుని, వారి నిజ జీవితంలో కూడా అదే విధంగా చేయడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి పరిస్థితి వస్తే మీ భాగస్వామి గురించి మీకు భయంకరంగా అనిపించవచ్చు. అందుకే ఇది మీ రిలేషన్ షిప్ లో తీవ్రమైన సమస్యలను సృష్టింగలదు.

చాలా కష్టంగా ఉంటుంది..

చాలా కష్టంగా ఉంటుంది..

పోర్న్ సినిమాలకు బానిసలుగా మారితే ఒక సమయంలో ఒకటి కంటే ఎక్కువ మంది భాగస్వాములతో లైంగింక సంబంధాన్ని ఏర్పరచుకోవడం వంటివి జరిగే అవకాశాలున్నాయి. వారి లైంగిక అనుభవాన్ని అనుభవించడం కోసం బహుళ లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం సరైందేనని ప్రజలు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అది చూపబడింది. దీని ఫలితంగా వారు తమ లైంగిక కోరికలను తీర్చడానికి వారి సంబంధం వెలుపల చూడొచ్చు. అలాగే, వారు తమ భాగస్వాములను ఒకేసారి ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మంది లైంగిక సంపర్కంలో పాల్గొనమని కోరవచ్చు. భాగస్వాములిద్దరూ ఇందుకు సరే అంటే మంచిది. కానీ అలాంటి చర్యలకు అంగీకరించిన వ్యక్తులకు చాలా కష్టంగా ఉంటుంది. కచ్చితంగా దానిని వారు ఆహ్లాదకరంగా చూడలేరు.

శారీరక ఆనందాన్నే ఎక్కువగా కోరుకుంటారు..

శారీరక ఆనందాన్నే ఎక్కువగా కోరుకుంటారు..

నిజమైన ప్రేమలో ఎలాంటి పట్టింపు, పరిమాణాలు ఉండవు. మీరు మరియు మీ భాగస్వామి బెడ్ పై ఒకరినోకరు ఎంతగా సంతృప్తి పరచగలరనేది మీ సామర్థ్యం, సంబంధాన్ని బట్టి ఉంటుంది. కానీ పోర్న్ సైట్స్ క్లైమాక్స్ చేరుకోవడానికి మరియు కావాల్సిన ఆనందాన్ని పొందటానికి సమయాన్ని ఎలా పొడిగించవచ్చో చూపిస్తాయి. అందులో నటించే వారు ఉద్వేగం కలిగి ఉంటారు. కానీ అది నిజం కాదు. అక్కడ ఉండేది పూర్తిగా అవాస్తవం. అందువల్ల, మీరు పోర్న్ సినిమాలు చూడటం వల్ల మీ లైంగిక జీవితం గందరగోళానికి గురవుతుంది. పోర్న్ సైట్స్ బానిసలుగా మారిన వారు భాగస్వామితో తక్కువ లైంగిక సంబంధం కలిగి ఉంటారు. విభిన్న కోరికలు లేదా ఫాంటసీలను కలిగి ఉంటారు. లైంగిక చర్యలో పాల్గొనేటప్పుడు మీ భాగస్వామిని బాధపెట్టడం వల్ల మీ లైంగిక జీవితంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది.

మీరు చూసేదంతా నిజం కాదు..

మీరు చూసేదంతా నిజం కాదు..

పోర్న్ సినిమాలు లైంగికంగా ప్రేరేపించబడటానికి, ఆకర్షించబడటానికి కారణం కెమెరా యాంగిల్. ఇది లైంగిక స్థానాన్ని ఉత్సాహపరిచే, మనోహరమైన మరియు ఉత్తేజకరమైనదిగా చేస్తుంది. వీటిని చూడటం ద్వారా ఒకరు సులభంగా రెచ్చిపోతారు. కానీ ఈ చర్య ఆహ్లాదకరంగా ఉంటుందని అర్థం కాదు. మీ భాగస్వామికి కచ్చితమైన వ్యక్తి లేదా శరీరాకృతి ఉండాలని ఆశించడం నిజంగా అవివేకం అవుతుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం వేరే విషయం, కానీ మీ భాగస్వామిని అలాగే తయారు కావాలని చెప్పడం విడ్డూరంగా ఉంటుంది. పోర్న్ సినిమాల్లోని నటీనటులు మేకప్ వేసుకునే విషయం మనకు తెలిసిందే.అంతేకాదు వారు పరిపూర్ణంగా కనబడేందుకు కొన్ని సర్జరీలు కూడా చేయించుకుంటారని మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఆ సినిమాలు చేసేటప్పుడు మంచి ఎడిటింగ్ కూడా ఉంటుంది.

ఒకరినొకరు గౌరవించే మార్గం..

ఒకరినొకరు గౌరవించే మార్గం..

చాలా మంది ప్రజలు నటులు అంటే నిజమైన జంటలు అని భావిస్తారు. ఎందుకంటే వారు అలాంటి ఉద్వేగభరితమైన శృంగారంలో పాల్గొంటారు. అందువల్ల, కొంతమంది తమ భాగస్వాములను ఇలాంటి పనులు చేయమని బలవంతం కూడా చేయవచ్చు. ఇది ఎంతగానో అవసరం. పోర్న్ చూడటం చెడ్డ విషయం కానప్పటికీ, మీ రిలేషన్ షిప్ దాని చుట్టూ కలపడం నిజంగా చెడ్డ ఆలోచన. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇద్దరు వ్యక్తులు శారీరక స్థాయిలో కనెక్ట్ అయినప్పుడు అది శృంగారం కాదు. అది అంతకు మించినది. ఇది ఇద్దరు వ్యక్తులు భావోద్వేగ, శారీరక మరియు ఆధ్యాత్మిక స్థాయిలో కనెక్ట్ అయ్యే ప్రక్రియ. ఇది రెండు ఆత్మలు మరియు శరీరాల ఐక్యతను జరుపుకునే మరియు ఒకరినొకరు గౌరవించే మార్గం. ఇలాంటి పోర్న్ సినిమాలలో ఎక్కడా చెప్పరు. ఆ చిత్ర నిర్మాతలు కేవలం డబ్బే ప్రధానంగా సినిమాలను తీస్తారు.

చివరగా మీరు కోరుకునేదాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి.

English summary

Reasons Why Watching Porn Can Affect Your Relationships And Sex Life

Having a sexual relationship with your partner also means that the couple has a connection with each other. Therefore, even if it comes to the act, it is necessary that you respect your partner. But, if you are watching too much porn, it might happen that you are more attracted to the actors and not towards your partner. This can make your partner feel really insecure and disturbed in bed.
Story first published: Friday, September 20, 2019, 19:27 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more