For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ఆ సమయంలో ఇలాంటి సమస్యలే ఎదురైతే.. మీరేమి చేయాలో తెలుసుకోండి..

మీరు గదిని ఎప్పుడూ కష్టపడి శుభ్రం చేస్తుంటే, మీరు రూమ్ మేట్ దానిని గజిబిజిగా ఉంచితే, అది అతని సోమరితనానికి సంకేతం కావచ్చు.

|

ప్రస్తుత కాలంలో చాలా మంది వారి పనుల రీత్యా లేదా ఇంకా ఏదైనా కారణాల రీత్యా కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. అలా కలిసి ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా రూమ్ మేట్స్ తో కొన్ని సమస్యలను అనుభవించి ఉండొచ్చు. మీ కుటుంబం లేదా మీ స్నేహితుడు కాని వారితో కలిసి జీవించడం మిమ్మల్ని భయపెట్టి ఉండొచ్చు. ఎందుకంటే మీ షేర్ చేసుకునే రూమ్ లో ఉండే వ్యక్తి యొక్క జీవనశైలి మరియు అలవాట్ల గురించి మీకు తెలియకపోవచ్చు.

Signs You Are Living With Toxic Roommates

కళాశాల విద్యార్థులు మాత్రమే ఇది వరకు రూమ్స్ ను షేర్ చేసుకునే వారు. మీరు కూడా ప్రస్తుత కాలంలో మీరు మీ రూమ్ ను తెలియని వ్యక్తులతో(అపరిచితులతో) పంచుకోవాల్సిన సందర్భం ఎప్పుడైనా రావచ్చు. లేదా మీరు ఇప్పటికే కలిసి ఉంటుండొచ్చు. కొందరు రూమ్ మేట్స్ ప్రమాదకరంగా ఉంటారు. అలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అలాంటి వారు ఉంటే, వారిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేందుకు కిందికి స్క్రోల్ చేయండి. పూర్తిగా తెలుసుకోండి.

1) అన్నింటికీ అతిగా స్పందిస్తారు..

1) అన్నింటికీ అతిగా స్పందిస్తారు..

మానవులు అన్న తర్వాత కొన్ని విషయాలపై స్పందించవచ్చు. కానీ ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందిస్తేనే సమస్యలొస్తాయి. మీ రూమ్ మేట్ కేవలం మీకు సంబంధించిన విషయాలపై అతిగా ప్రవర్తిస్తున్నట్లు మీకు అనిపిస్తే వారితో ఇబ్బందికరంగా ఉంటుంది. 23 ఏళ్ల ప్రియ (పేరు మార్చబడింది) బెంగళూరుకు చెందిన ఒక రచయిత బోల్డ్ స్కైతో తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నా మాజీ రూమ్ మేట్ నేను తెచ్చిన తెల్లని పువ్వులతో, నేను ఒక గ్లాసు ఉంచిన విధానం, నేను తినడానికి ఉపయోగించే ఆహారం గురించి బాగా అసౌకర్యానికి గురయ్యాను‘‘ అని చెప్పింది. ‘ నా ల్యాప్ టాప్ లో నేను ఎలా పనిచేస్తానో దాని గురించి నా మాజీ రూమ్ మేట్ చాలా ప్రత్యేకంగా చెప్పారు. దాని హానికరమైన కిరణాల వల్ల ఆమె ప్రభావితమవుతోంది. అంతేకాక నేను నిద్రలేచి ఆమె నిద్రకు భంగం కలిగించేలా బ్రష్ చేయడం ఆమెకు నచ్చలేదు.

ఈ సమస్యకు పరిష్కారం : మీరు మీ రూమ్ మేట్ కు మీ దృక్పథాన్ని వివరించవచ్చు. లేదా అతను లేదా ఆమె మీకు చెప్పేదాన్ని విస్మరించవచ్చు. మీరు మీ గొంతును అనవసరంగా పెంచే బదులు, మీ రూమ్ మేట్ తో ప్రశాంతంగా మాట్లాడండి. లేదంటే పరిస్థితులు గొడవల వరకు వెళ్లొచ్చు..

2. సోమరితనం..

2. సోమరితనం..

మీరు గదిని ఎప్పుడూ కష్టపడి శుభ్రం చేస్తుంటే, మీరు రూమ్ మేట్ దానిని గజిబిజిగా ఉంచితే, అది అతని సోమరితనానికి సంకేతం కావచ్చు. వారు మురికిగా ఉన్న వంట సామాన్లను సింక్ లో వదిలేయడం, షవర్ డ్రెయిన్ ను శుభ్రపరచకపోవడం లేదా పార్టీ ముగిసిన తర్వాత ఆ స్థలాన్ని క్లీన్ చేయడానికి నిరాకరించడంతో పాటు మీకు సహాయం చేయమని మీరు వారిని అడిగితే వారు కుంటి సాకులతో తప్పించుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి శ్రుతి మెహతా(20) బోల్డ్ స్కైతో తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘వంట గదిని శుభ్రం చేయడంలో నా మాజీ రూమ్ మేట్ ను సహాయం చేయమని నేను అడిగినప్పుడల్లా, ‘నేను మీటింగ్ కు వెళ్లాలి, నాకు కొంచెం తలనొప్పి లేదా నాకు డస్ట్ అలర్జీ. అని చెప్పేవారు. నేను ఒక్కదాన్నే మొత్తం ఇంటిని శుభ్రం చేయాల్సి వచ్చేది.

దీనికి పరిష్కారం : మీ రూమ్ ను క్లీన్ చేసుకోవడంలో మీ రూమ్ మేట్ ను నమ్ముకునే బదులు మీరు ఒక పని మనిషిని నియమించుకోవడం మంచిది. ఆమె ద్వారా మీ భాగం వరకు శుభ్రం చేయించుకోవచ్చు. మిగిలిన వాటిని వదిలేయొచ్చు. అప్పటి నుండి అయినా మీ రూమ్ మేట్ తన సొంత బాధ్యతలను తీసుకోవచ్చు.

3) అనాలోచితంగా..

3) అనాలోచితంగా..

మీ రూమ్ మేట్స్ లో చాలా మంది మీ వస్తువులను ఉపయోగించుకుని వాటిని మీకు తిరిగి ఇస్తే తప్పు లేదు. కానీ మీ రూమ్ మేట్స్ మీ అనుమతి తీసుకోకుండానే మీ వస్తువులను ఉపయోగిస్తుంటే, అదే మీకు తిరిగి ఇవ్వకపోతే, మీరు వారి గురించి కొంత ఆలోచించాలి. అంతేకాకుండా వారు ఏదో ఒక విధంగా లేదా మరో విధంగా మీకు హాని కలిగించిన లేదా అసౌకర్యాన్ని కలిగించి వారు క్షమాపణ చెప్పకపోతే వారితో ఇప్పటికీ ఇబ్బంది అని సంకేతం కావచ్చు. ‘‘నేను నిద్రపోయేటప్పుడు నా మాజీ రూమ్ మేట్ గదిలోనే గట్టిగా మ్యూజిక్ ఆన్ చేసేవాడు. నా బట్టలు తీసుకున్నప్పుడల్లా నా దుస్తులు చెడిపోయినందుకు కనీసం క్షమాపణ చెప్పదు‘‘ అని అన్నారు ప్రియ.

ఇందుకు పరిష్కారం : మీరు మీ రూమ్ మేట్స్ కు బట్టలు అప్పుగా ఇచ్చినట్లయితే సకాలంలో అడగండి. అలాగే మీ దుస్తులు చెడిపోయినట్లు మీరు గమనించినట్లయితే దాన్ని సరిచేసి ఇవ్వమని అడగండి. మీ రూమ్ మేట్స్ బాధ్యతారహితంగా ఉంటే, మీ బట్టలు వారికి ఇవ్వకుండా కూడా మీరు తిరస్కరించవచ్చు.

4. అన్ని విషయాల్లో అతిగా విమర్శిస్తారు..

4. అన్ని విషయాల్లో అతిగా విమర్శిస్తారు..

ప్రతి ఒక్కరికీ తమలో కొన్ని లోపాలు లేదా మరొకటి ఉంటాయి. వారి ప్రియమైనవారు కొన్ని సమయాల్లో వారిని విమర్శించవచ్చు. మీ రూమ్ మేట్స్ మీరు చేసే ప్రతి పని గురించి అతిగా విమర్శిస్తే మీరు మీ రూమ్ ను ఎవరితో షేర్ చేసుకుంటున్నారో ఆలోచించాలి. ‘‘ప్రతిదాని గురించి అతిగా విమర్శించే వ్యక్తి పర్యావరణాన్ని చాలా ప్రతికూలంగా మార్చేస్తాడు. నా మాజీ రూమ్ మేట్ కూడా అలానే చేస్తాడు‘‘ అని శ్రుతి చెప్పారు. ‘‘నేను కొన్న దానితో సంబంధం లేకుండా నా రూమ్ మేట్ నా సెలెక్షన్ ను విమర్శించడంలో ఎప్పుడూ ముందు ఉండేవారు. నా అభిరుచి మంచిది కాదని నేను అనుకున్నాను. కానీ అప్పుడు నేను చేసే ప్రతి పని గురించి ఆమె తీర్పు చెబుతుందని నేను గ్రహించాను. నా షూలేస్ ను కట్టుకునేందుకు నేను ఉపయోగించిన విధానంలో సమస్యలు ఉన్నాయి‘‘ అని ప్రియా నవ్వింది.

దీనికి పరిష్కారం : మీ రూమ్ మేట్స్ మీ చెడు అలవాట్లను విమర్శిస్తున్నారని మీరు అనుకుంటే, మీరు మీ అలవాట్లను మెరుగుపరచుకోవచ్చు. లేకపోతే మీ అలవాట్ల గురించి మాట్లాడవచ్చు. కానీ మీ చివరలో ప్రశాంతంగా మరియు నమ్మకంగా ఉండేలా చూసుకోండి.

5) వారి అద్దె చెల్లించమంటారు..

5) వారి అద్దె చెల్లించమంటారు..

మీ రూమ్ మేట్స్ వారి తరపున వారి అద్దె చెల్లించమని అడుగుతారు. తిరిగి మీకు చెల్లిస్తామని హామీ కూడా ఇస్తారు. నిరుపేదలకు సహాయం చేయడం ఎప్పుడూ సమస్య కాదు. కానీ వారు ప్రతిరోజూ కొత్త దుస్తులను కొనుగోలు చేస్తున్నారని మీరు తరచుగా చూడొచ్చు. అలాగే, మీరు మీ డబ్బును తిరిగి ఇవ్వరు. ఇలాంటివి జరిగితే మీరు వారితో జాగ్రత్తగా ఉండాలి. ‘‘ అద్దె చెల్లించేటప్పుడు ఆమె ప్రతిసారీ ఏడుస్తూ ఉండేది. ఇంకా ఆమెకు తగినంత డబ్బు టోర్డర్ ఫాన్సీ ఆహార పదార్థాలు లేదా కొత్త దుస్తులు కొనడం‘‘ అని ప్రియా పేర్కొన్నారు.

పరిష్కారమేమిటంటే : మీ రూమ్ మేట్స్ ఎల్లప్పుడూ వారి అద్దె వాటాను చెల్లించమని మిమ్మల్ని అడిగితే మరియు మీకు తిరిగి ఆ మొత్తాన్ని ఇవ్వకపోతే, మీరు ఆ అద్దెను తిరిగి ఇవ్వమని వారిని అడగొచ్చు. లేదా మీరు వారికి ఇంకోసారి సహాయం చేయడానికి నిరాకరించవచ్చు.

6) తరచూ స్నేహితులను తీసుకురావడం..

6) తరచూ స్నేహితులను తీసుకురావడం..

మీ స్థలంలో స్నేహితులను తీసుకురావడం అనేది సమస్య కాదు. కానీ అది రోజూ జరిగితే, అది కూడా మీకు సమాచారం లేకుండా జరిగితే, అలాగే మీ రూమ్ మేట్స్ యొక్క స్నేహితులు సమస్యలను కలిగిస్తుంటే, మీ రూమ్ మేట్స్ దీనిని అంగీకరించకపోతే మీరు ఇబ్బందికరమైన వ్యక్తులతో కలిసి ఉంటున్నారని నిర్ధారణకు రావచ్చు. ‘‘ఒకసారి నేను నా రూమ్మేట్ తో ‘నేను అలసిపోయాను మరియు ప్రశాంతంగా నిద్ర పోవాలనుకుంటున్నాను‘ అని చెప్పాను. అర్థం చేసుకోకుండా ఆమె తన స్నేహితులను అర్ధరాత్రి పిలిచి పార్టీ మరియు గాసిప్ లు చేస్తుంది. ఇది నా నిద్రకు తీవ్ర భంగంగా కలిగిస్తుంది. ఆమె స్నేహితులు నా బెడ్ పైన కూడా పడుకునేవారు‘‘ అని ప్రియా అన్నారు.

దీనికి పరిష్కారం : మీరు మరియు మీ రూమ్ మేట్స్ స్నేహితులను పిలిచి పార్టీ చేసుకునే సమయాన్ని ముందుగానే మాట్లాడుకోవాలి. ఇది అనవసరమైన చర్చ మరియు వాదనలను నివారిస్తుంది.

English summary

Signs You Are Living With Toxic Roommates

If you are the one who is always cleaning the room, then it might be a sign that your roommate is lazy. It is possible that they will leave their dirty dishes in the sink, not clean hair clogged shower drain or refuse to clean the place after the party is over. Moreover, when you ask them to help you, they are ready with lame excuses. Shruti Mehta (20) a Delhi University student shares her experience with Boldsky,
Desktop Bottom Promotion