For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి ఒక్కరూ ఇలాంటి వారినే పెళ్లి చేసుకోవాలనుకుంటారట...!

|

కళ్యాణం(Marriage)అంటేనే ప్రతి ఒక్కరి మదిలో ఏవేవో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. తమకు కాబోయే భాగస్వామి అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు.

ఎందుకంటే పెళ్లి అనేక మధురమైన ఘట్టంతోనే మరో వ్యక్తితో కొత్త జీవితం ప్రారంభమవుతుంది. పెళ్లి వయసు వచ్చిన నాటి నుండి తమకు కాబోయే భాగస్వామి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటారు.

ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత ప్రతి విషయాన్ని పార్ట్నర్ తో షేర్ చేసుకోవాలి. అయితే తమ జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడం కొందరు టెన్షన్ పడుతూ ఉంటారు. మరికొందరు గందరగోళ పడుతూ ఉంటారు.

ఎందుకంటే పెళ్లి అనేది చాలా మంది జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే మధురమైన అనుభూతి. అందుకే సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడంం చాలా ముఖ్యం. మీరు కూడా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? మీ వైవాహిక జీవితం సంతోషంగా గడవాలంటే మీరు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ విశేషాలేంటో చూసెద్దాం రండి...

'తన భర్త తాగితే మన్మథుడిలా మారిపోతాడంట.. ఇతర స్త్రీలతోనూ...'

అందరితో కలిసేవారిని..

అందరితో కలిసేవారిని..

మీతో మంచిగా మాట్లాడుతూ.. అందరినీ కలుపుకుపోయేవారిని.. నలుగురిని నవ్వించే వారిని మీ జీవిత భాగస్వామిగా చేసుకుంటే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు జీవితాంతం ఎలాంటి కలహాలు లేకుండా సాఫీగా పనులు చేసుకోవచ్చు. అంతేకాదు మీకు బోరు కొట్టినప్పుడల్లా తనతో మంచి కబుర్లు చెప్పుకోవచ్చు.

ఓపికగా ఉండేవారిని..

ఓపికగా ఉండేవారిని..

మీరు పెళ్లి చేసుకునే భాగస్వామి మీ ఫీలింగ్స్ షేర్ చేసుకునేలా ఉన్నారా లేదో చూసుకోండి. ఎందుకంటే మీరు గతంలో ఏదైనా పొరపాట్లు చేసినా.. ఇతరులతో చెప్పుకోలేని విషయాలు ఉన్నా.. అలాంటివన్నీ మీ పార్ట్నర్ తో షేర్ చేసుకునేలా ఉండాలి. అలాంటి వ్యక్తులు మీరు ఏమి చెబుతున్నా.. సహనంగా ఉండటమే కాదు.. మీకు మద్దతు కూడా ఇస్తారు. దీని వల్ల మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

చురుకుగా ఉంటే..

చురుకుగా ఉంటే..

మీరు పెళ్లి చేసుకునే వ్యక్తి తెలివితేటలను కూడా గమనించండి. ఎందుకంటే తను ఎంత చురుకుగా ఉంటే.. మీకు అంత లాభం. ఎందుకంటే మీకు ఎందులో అయినా అవగాహన తక్కువగా ఉంటే.. తను వాటిని మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా తను మీకన్నా ఎక్కువ లేదా అతి తెలివిగా ఉంటే..మీ వైవాహిక జీవితంలో సమస్యలు రావొచ్చు.

ఈ కారణం చేతనే కొంత మంది యువకులు వయస్సైనా వివాహం చేసుకోరు!

ఒకటే అలవాట్లు..

ఒకటే అలవాట్లు..

మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి మీకున్న అలవాట్లు ఉంటే.. మీ వైవాహిక జీవితం సానుకూలంగా ఉంటుంది. అయితే మీకున్న అలవాట్లు మీ భాగస్వామికి ఉండాలనుకోవడం అత్యాశే. అలా ఉండటం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. ఉదాహరణకు మీకు సినిమాలంటే ఇష్టం ఉంటే.. తనకు కూడా సినిమాలంటే ఇష్టం ఉంటే.. అలాంటి వారితో మీ జీవితం ఆసక్తికరంగా ఉంటుంది.

అండగా నిలబడేవారిని..

అండగా నిలబడేవారిని..

మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఏ సమయంలో అయినా.. ఏ సందర్భంలో అయినా.. ఏ విషయంలో అయినా మీకు అండగా నిలబడతారో లేదో టెస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు బయటకు వెళ్లేటప్పుడు మీకు తోడుగా ఉండాలి.. అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా నిలవాలి. మీ కష్టసుఖాలను కూడా షేర్ చేసుకోవాలి. అలాంటి వ్యక్తి మీకు తగిలితే.. వాళ్లను తప్పనిసరిగా పార్ట్నర్ గా ఎంచుకోవచ్చు.

గౌరవంగా చూసుకోవాలి..

గౌరవంగా చూసుకోవాలి..

మన సమాజంలో ఎవరైనా సరే జీవితంలో మంచి భార్యగా లేదా మంచి భర్తగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారో.. వారు మీ పిల్లల్ని ప్రేమించేలా ఉండాలి. అలాంటి లక్షణాలు మీరు గమనిస్తే.. భవిష్యత్తులో తను పిల్లలను ఎంత శ్రద్దగా చూసుకుంటాడో.. ఎంత ప్రేమిస్తారో లోతుగా పరిశీలించి పెల్లి చేసుకోండి.

పిల్లలు పుట్టాక కూడా రతి క్రీడలో రెచ్చిపోవాలంటే ఇలా చేయండి...

స్వేచ్ఛ విషయంలో..

స్వేచ్ఛ విషయంలో..

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛను కోరుకుంటున్నారు. కాబట్టి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ నిర్ణయాలకు, మీకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. ఎందుకంటే భాగస్వాముల మధ్య అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంటే ఒకరి వ్యక్తిత్వం మరొకరికి తెలిసే అవకాశం ఉంటుంది.

రాజీ పడే వారిని..

రాజీ పడే వారిని..

మీరు పెళ్లి చేసుకోబోయే వారు కొన్ని విషయాల్లో కచ్చితంగా రాజీ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే వైవాహిక జీవితంలో చాలా సందర్భాల్లో రాజీ పడాల్సి వస్తుంది. ఎవరైతే ఎంత ఎక్కువగా రాజీ పడతారో లేదా సర్దుకుపోతారో అలాంటి వ్యక్తులతో బంధం మరింత బలపడుతుంది. ఇలాంటి ప్రవర్తన వల్ల మీ దాంపత్య జీవితం సుదీర్ఘకాలం సంతోషంగా ఉండొచ్చు.

మీ పట్ల గౌరవం..

మీ పట్ల గౌరవం..

మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మీ పట్ల గౌరవం, ప్రేమ కలిగి ఉండాలి. తన మనసులో మీకు స్థానాన్ని స్థిరంగా ఉంటుందా లేదా గమనించాలి. మీరు ఏ తప్పు చేసినా, మీరు తిట్టినా మిమ్మల్ని భరించేలా ఉండాలి. మిమ్మల్ని అప్పుడప్పుడు బతిమాలాలి. మీరు కోపంగా ఉన్న సమయంలో మిమ్మల్ని ప్రేమగా చేరదీయాలి. అలాంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోకండి.

సానుకూల ఆలోచనలు..

సానుకూల ఆలోచనలు..

కొందరు వ్యక్తులు ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలు చేస్తుంటారు. అందుకే వారి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. కాబట్టి మీరు పెళ్లి చేసుకోబోయే ఎలా ఆలోచిస్తున్నారో గమనించండి. ముఖ్యంగా ఎవరైతే పాజిటివ్ థింక్ చేస్తున్నారో అలాంటి వారే మీ భాగస్వామి అయ్యేలా చూసుకోండి. అప్పుడే మీ వైవాహిక బంధం బలపడుతుంది. మీ మధ్య ఎలాంటి గొడవలు రాకుండా.. మీరు సంతోషంగా ఉంటారు.

క్లారిటీగా ఉండండి..

క్లారిటీగా ఉండండి..

మీరు పెళ్లికి ముందు ఎలా ఉన్నారో.. పెళ్లి తర్వాత అలానే ఉంటారని వారికి స్పష్టం చేయండి. తన కోసం మీ అలవాట్లను మార్చుకునే అవకాశం లేదని చెప్పండి. అయితే మీరు కూడా వారిలో తప్పులు, లోపాలు వెతికే ప్రయత్నం చేయకూడదు. ఇలా చేయడం వల్ల సమస్యలు తలెత్తుతాయి.

మనసుకు నచ్చిన పని..

మనసుకు నచ్చిన పని..

మీరు పెళ్లి చేసుకునే వ్యక్తి మీ మనసుకు నచ్చినంత మాత్రాన మీరు మీ అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేయకండి. అలా చేసుకుంటూ పోతే.. మీరు జీవితాంతం చాలా మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇద్దరూ కూర్చుకుని మాట్లాడుకుంటే.. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అప్పడు అనవసరమైన వాదనలు కూడా ఉండవు.

English summary

These Qualities of The Person You Should Marry in Telugu

Here are these qualities of the person you should marry in telugu. Take a look
Story first published: Thursday, June 10, 2021, 16:30 [IST]