For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చబొట్టుతో పర్ఫెక్ట్ జోడిగా కనబడాలనుకుంటున్నారా? అయితే టాప్ 12 పచ్చబొట్లు ఇవే..

|

ఈరోజుల్లో తమ ప్రేమను చూపించడానికి ఒక్కో జోడి ఒక్కోరకంగా ప్రయత్నిస్తుంది. ఇందుకోసం అనేక మార్గాలను వెతుకుతుంటారు. తమ ప్రేమను ప్రత్యేకంగా చాటడానికి ఏదైనా చేయాలని తెగ ఆరాటపడుతుంటారు. అలాంటి వారు పచ్చబొట్లతో తమ ప్రేమ ప్రత్యేకతను చాటుకోవచ్చు. పచ్చబొట్టుతో మీరు పర్ఫెక్ట్ జోడి అని కూడా అనిపించుకోవచ్చు.

అయితే పచ్చబొట్ల డిజైన్ ఎలా ఉండాలి? మీ ప్రేమను ప్రత్యేకమైన పచ్చబొట్టు ద్వారా తెలపాలనుకుంటున్నారా? అలాంటి జంటల కోసమే మేము కొన్ని టాటూలను మీ కోసం తీసుకొచ్చాం. సో వీటిలో మీకు నచ్చిన టాటూను సెలెక్ట్ చేసుకుని ఫాలో అవ్వండి.

1) మ్యాచింగ్ టాటూస్..

మీరు మీ ప్రేమను పంచుకోవడానికి సిద్ధంగా ఉంటే, మీరు మరియు మీ భాగస్వామి మ్యాచింట్ టాటూలను ప్రయత్నించొచ్చు. ఇలా మీరు జీవితాంతం ఒకే టాటూను కలిగి ఉంటారు. ఇది మీ సారూప్య ఆలోచనను సైతం ప్రతిబింబిస్తుంది. ఇందు కోసం, మీరు మీ మనసుకు హత్తుకునేలా ఒక చిహ్నాన్ని లేదా ఒక జోక్, ఒక పదబంధం, లేదా జోక్ లేదా మీరు ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాన్ని ఎంచుకోవచ్చు.

2) బ్యూటిఫుల్ కపుల్ టాటూ..

టాటూలలో కలిసిన ఇంక్ పొందడానికి మీరు కళాత్మకంగా ఉండాల్సిన అవసరం లేదు. దీని కోసం తీవ్రంగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. మీరిద్దరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే కొన్ని అందమైన టాటూలను ప్రయత్నించవచ్చు. ఏదైనా పండు, ఎమోజి లేదా ఏదైనా అందమైన మెత్తటి జంతువు వంటి టాటూలను ట్రై చేయొచ్చు. లేదా ఏదైనా ఫన్నీ టాటూను ప్రయత్నించినా మీరు ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నట్లు అది గుర్తు చేస్తుంది.

3) యిన్ యాంగ్ కపుల్ టాటూ..

యిన్ యాంగ్ టాటూ అనేది ఒక పురాతన భావన. ఇది రెండు భాగాలకు భిన్నంగా ఉంటుంది. కానీ ఒకదానికొకటి సరిపోయేలా సంపూర్ణ సర్కిల్ ను ఏర్పరస్తుంది. దీనిలో, యిన్ మహిళా శక్తిగా పరిగణించబడుతుంది. యాంగ్ పురుష శక్తిగా సూచించబడుతుంది. మీరు మరియు మీ భాగస్వామి అనేక విధాలుగా భిన్నంగా ఉన్నప్పటికీ మీ సంబంధంలో అద్భుతమైన సమతుల్యతను కలిగి ఉంటే మరియు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటే మీరు ఈ డిజైన్ ను ట్రై చేయొచ్చు.

4) కపుల్ ఫింగర్స్ పై టాటూ..

పాత తరం నమ్మకం ప్రకారం, ఎడమ చేతి ఉంగరపు వేలికి ఉండే ఇంక్ నేరుగా గుండెకు వెళ్తుంది. అందుకే చాలా మంది అక్కడ వివాహ బ్యాండ్లను ధరిస్తారు. మీరు మీ ఉంగరానికి సమానమైన డిజైన్ ను ఎంచుకోవచ్చు. లేదా ఇది మీ రెండు వేళ్లు కలిసి ఉన్నపుడు చాలా అందంగా కనిపిస్తుంది. మీరు మీ భాగస్వామి పేరులో ఉన్న అక్షరాలను లేదా మీ సంబంధాన్ని సూచించే ఏదైనా ఇంక్ ను కూడా ఎంచుకోవచ్చు.

5) కోట్ టాటూలు..

ప్రపంచంలో ప్రేమ గురించి మాట్లాడే కవితలు, కథలు, నవలలు, పాటలు చాలా ఉన్నాయి. చాలా మంది కపుల్స్ కోసం, ఒక నిర్దిష్ట పద్యం లేదా కోట్ వారి సంబంధాన్ని మరియు వారి భాగస్వామి గురించి ఎలా భావిస్తారో నిర్వచిస్తుంది. మీరు ఒక పద్యం లేదా ఇలాంటి కోట్స్ నుండి సరిపోయే వాటిని ఎంచుకోవచ్చు. లేదా మీలో ప్రతి ఒక్కరిపై కోట్ ఇంక్ చేసిన సగం ఉంటుంది. మీరు మీ భాగస్వామిని కలుసుకున్నపుడు ఆ లైన్ కు పరిపూర్ణ అర్థం వస్తుంది.

6) సీక్రెట్ మీనింగ్ టాటూలు..

ప్రతి పచ్చబొట్టుకు ఒక అర్థం ఉంటుంది. కొన్ని సాధారణమైనవి, ఇంకొన్ని సీక్రెట్ మీనింగ్ వచ్చేలా ఉంటాయి. మీ సంబంధానికి సంబంధించిన సీక్రెట్ మీనింగ్ ఉన్న డిజైన్ ను కూడా మీరు ప్రయత్నించొచ్చు. మీరు ప్రతి ఒక్కరిని కో-ఆర్డినేట్ చేసేలా ఇంక్ ను వేయవచ్చు. మీరు మొదట కలిసిన ప్రదేశం లేదా మీరిద్దరూ కలిసి సందర్శించే కలల ప్రదేశం లేదా మీరిద్దరూ పంచుకునే రహస్య ప్రదేశం కావచ్చు. మీరిద్దరు మాత్రమే డీకోడ్ చేయవచ్చు.

7) కింగ్ అండ్ క్వీన్ టాటూస్..

టాటూను రాయల్ టచ్ తో కలిగి ఉండటం ఎలానో తెలుసా? మీరు మీ ప్రతి శరీరానికి రాజు మరియు రాణిని పొందవచ్చు. ఇది మీరు ఒకరికొకరు ఇచ్చే గౌరవాన్ని మరియు ఒకరి జీవితంలో మరొకరి పాత్రలను ప్రతిబింబిస్తుంది. లేదా ‘రాజు‘ మరియు ‘రాణి‘ని పొందటానికి బదులుగా మీరు కిరీటాలను టాటూగా ట్రై చేయవచ్చు. మీరు ఒకరినొకరు గౌరవించుకోవడానికి ఉత్తమమైన మార్గాలలో ఇదొకటి.

8) లవ్ టాటూస్..

‘లవ్‘ అనే పదానికి దిల్ షేప్ తో ఉండే టాటూకు చాలా మంది ఇట్టే ఆకర్షితులవుతారు. మీ స్లీవ్స్ లేదా మీ మణికట్టు మీద ‘ప్రేమ‘ అనే అర్థం వచ్చేలా మీ టాటూ ట్రై చేస్తే రోమాంటిక్ గా కనబడుతుంది.

9) అన్ లిమిటెడ్ టాటూస్..

మీరు మీ భాగస్వామి పట్ల మీ శాశ్వతమైన ప్రేమను చూపించాలనుకుంటే, ఈ పచ్చబొట్టు మీ అపరిమితమైన మరియు నిత్య ప్రేమను వర్ణిస్తుంది. ఆ టాటూ ముగింపు లేదా ప్రారంభం లేని లూప్. ఈ టాటూ ప్రతి జంటకూ సూట్ అవుతుంది.

10) ట్రైబల్ టాటూస్..

ట్రైబల్ (గిరిజన) టాటూలు ముఖ్యమైన అర్థాలను కలిగి ఉంటాయి. మీపై మరియు మీ భాగస్వామి శరీరంపై ట్రైబల్ టాటూ కోసం మీరు సిద్ధంగా ఉంటే మీ టాటూ ట్రైబల్ కల్చర్లో భాగమయ్యిందని వారు వాటిని గౌరవిస్తున్నారని అర్థం. ఈ టాటూలు నైరూన్య ఆకారాలను కలిగి ఉంటాయి. ఇందులో కొన్ని ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన డిజైన్లను కలిగి ఉండవచ్చు.

11) కూల్ టాటూస్..

మీరు, మీ భాగస్వామి ధోరణిని ఇష్టపడితే, మీరు కచ్చితంగా కొన్ని మంచి డిజైన్లను కలిగి ఉండాలి. ఇది ఆధునిక స్పర్శతో సాంప్రదాయ నమూనాలను కలిగి ఉంటుంది. మీరు లాంగ్ రిలేషన్ లో ఉంటే, సైలర్ జెర్రీ సృష్టించిన క్లాసిక్ స్వాలో టాటూను మీరు ట్రై చేయొచ్చు. పక్షులు కూడా వారి ఇంటికి తిరిగి వస్తాయి.

12) మణికట్టుపై పచ్చబొట్లు..

మీ భాగస్వామి మీ ప్రతి మణికట్టు మీద టాటూ వేయవచ్చు. అవి సమానంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. మీరు మీ మణికట్టు మీద ఒకరి పేరు ఉన్న అక్షరాలను కలిగి ఉండొచ్చు. మీరు మీ భాగస్వామిని మీరెంతలా ప్రేమిస్తున్నారో అలాంటి ప్రేమను చూపడానికి మీరెలాంటి టాటూ కావాలనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకోండి.

English summary

Unique And Adorable Tattoo Ideas For Couples

Every tattoo has a meaning. Some are simple, and another Secret Meaning. You can also try a design that has secret meanings to your relationship. You can put ink to co-ordinate everyone. It could be the place where you first met, or the dream place where you and your two visit together, or the secret place that both of you share. Only the two of you can decode
Story first published: Friday, August 30, 2019, 12:13 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more