For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవడానికి ఈ బాడీ లాంగ్వేజ్ సంకేతాలు చూడండి

ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదో వారి మాట తీరును, వారి ప్రవర్తనను చూసి తెలుసుకోవచ్చు.

|

ఇద్దరు ప్రేమికుల మధ్య బంధం చాలా ఆసక్తిగా ప్రారంభం అవుతుంది. ఓరకంట చూసుకోవడం, చూస్తూ కళ్లతో నవ్వుకోవడం, వారిని చూస్తూ సిగ్గు పడటంతో ప్రారంభం అవుతుంది. తర్వాత వారిని చూసినప్పుడు నవ్వడం మొదలు పెడతారు. వారితో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ అనే బంధం మొదలు కావడానికి ఇలాంటి చాలానే జరుగుతాయి.

Check out these body language signs to know if someone likes you in Telugu

ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదో వారిని పైపైన చూసి తెలుసుకోలేం. అయితే వారి మాట తీరును, వారి ప్రవర్తనను చూసి తెలుసుకోవచ్చని అంటారు మానసిక నిపుణులు. ఒకరికి మీపట్ల ఇష్టం, ప్రేమ ఉంటే వారు ప్రవర్తించే తీరు భిన్నంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఆ బాడీ లాంగ్వేజ్ సంకేతాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

 1. ముఖాన్ని స్కాన్ చేస్తారు

1. ముఖాన్ని స్కాన్ చేస్తారు

ఎవరైనా మిమ్మల్ని చూసే విధానం వారి ఆకర్షణ స్థాయిని సూచిస్తుంది. ఎవరైనా మీ వైపు ఆకర్షితులవుతున్నారనడానికి ఒక ప్రధాన సంకేతం వారి కళ్ళు మీ ముఖమంతా స్కాన్ చేయడమని అంటారు క్లినికల్ సైకాలజిస్టులు. మిమ్మల్ని స్నేహితుడిలా చూసే వ్యక్తి మీరు వారితో మాట్లాడుతున్నప్పుడు మీవైపే కళ్లార్పకుండా చూస్తారు. మీరు మాట్లాడుతున్నప్పుడు ముఖాన్ని మొత్తం స్కాన్ చేస్తారు. కళ్ళు, పెదవులు, జుట్టు, మళ్లీ కళ్ళు, పెదవులు, జుట్టు ఇలా మీతో ఉన్నంతసేపు వారు మీవైపు చూస్తూనే ఉంటారు.

2. దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తారు

2. దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తారు

ఎవరైనా మీపై ఇష్టాన్ని, ప్రేమను, ఆకర్షణను చూపించాలని ప్రయత్నిస్తుంటే, వారు మీకు ఎంత సన్నిహితంగా ఉంటారో చూడండి. మీకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మీ మధ్య ఖాళీని క్రమంగా తగ్గిస్తూ వస్తారు. ఎవరైనా మిమ్మల్ని వారి ఇంటిమేట్ జోన్‌కి దగ్గరగా అనుమతించినప్పుడు, వారు మీ పట్ల ఆకర్షితులవుతున్నారని నిర్ధారించవచ్చు. వారు మిమ్మల్ని వారి ముఖానికి దగ్గరగా అనుమతించినట్లయితే లేదా వారు మీ సన్నిహిత ప్రాంతానికి దగ్గరగా ఉంటే, అది మీకు గ్రీన్ లైట్ గా అనుకోవచ్చు.

3. మిమ్మల్ని చూసి నవ్వుతారు

3. మిమ్మల్ని చూసి నవ్వుతారు

నవ్వు.. ఇష్టాన్ని, ప్రేమను, మర్యాదను, గౌరవాన్ని తెలిపే సాధారణ చర్య. ఒకరు మిమ్మల్ని చూసి నవ్వారంటే ఇందులో ఏదైనా కారణం అనుకోవచ్చు. ఇష్టాన్ని, ప్రేమను చూపే వారి నవ్వు కొద్దిగా వేరుగా ఉంటుందని అంటున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. నకిలీ నవ్వుకు, ప్రేమపూర్వక నవ్వుకు తేడాను కనిపెట్టడానికి నిపుణులు కావాల్సిన అవసరం లేదని అంటున్నారు.

4. తాకడానికి ప్రయత్నిస్తారు

4. తాకడానికి ప్రయత్నిస్తారు

మనకు ఇష్టమైన వారిని తాకాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. వారితో తాకుతూ కూర్చోవాలని, వారి చేతులను పట్టుకోవాలి, ముఖాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ఇలా చాలా రకాలుగా అనిపిస్తుంది. ఒకరు మిమ్మల్ని తాకేందుకు ప్రయత్నించడం, తరచూ తాకడం చేస్తుంటే వారికి మీరంటే ఇష్టం, ప్రేమ ఉన్నట్లు భావించొచ్చని అంటున్నారు నిపుణులు. ఒకరి పట్ల ఆకర్షితులైనప్పుడు ఇది ప్రతి ఒక్కరిలో కలిగే సాధారణ చర్య అని.. దీంతో సులభంగా ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవచ్చని అంటున్నారు సెక్సాలజిస్టులు.

మానసిక స్పర్శ ఆక్సిటోసిన్ విడుదలకు కారణమవుతుంది. దీనిని ప్రేమ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది విడుదలైనప్పుడు, ఇది ఎవరితోనైనా దగ్గరగా మరింత కనెక్ట్ అయ్యేలా ప్రేరేపిస్తుంది.

5. మీరు ఉన్నప్పుడు నర్వస్ గా కనిపిస్తారు

5. మీరు ఉన్నప్పుడు నర్వస్ గా కనిపిస్తారు

కొందరు తమకు ఇష్టమైన వ్యక్తులు, తాము ప్రేమించే వ్యక్తులు వారికి దగ్గరగా వస్తుంటే వారి గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. వారికి తెలియకుండానే ఒంట్లో వణుకు వస్తుంది. మాటలు తడబడతాయి. పదాలు గుర్తుకు రావు. వారి వైపు చూడాలని ఉన్నా.. చూడలేరు. మాట్లాడాలని ఉన్నా.. మాట్లాడలేరు. చెమటలు కక్కుతారు. అరచేతుల్లోనూ చెమటలు పడతాయి. దూరంగా ఉన్నప్పుడు దగ్గరికి రావాలనుకుంటారు. దగ్గరికి వస్తే నర్వస్ అయిపోయి మాట్లాడకుండా ఉండిపోతారు.

English summary

Check out these body language signs to know if someone likes you in Telugu

read on to know Check out these body language signs to know if someone likes you in Telugu
Story first published:Thursday, November 17, 2022, 10:32 [IST]
Desktop Bottom Promotion