For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మగవారు అక్రమ సంబంధాల పై ఎందుకు మోజుపడతారు?

  By Deepti
  |

  మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఒకే సమయంలో అనేక మంది అమ్మాయిలను మెప్పించాలనే కోరిక ఈ గ్రహంమీద సగం కన్నా ఎక్కువ మంది మగవారికి తప్పనిసరిగా ఉంటుంది! సినిమాల్లో అమ్మాయిల వెనకపడే మన హీరోలపై మనం చిరాకు తెచ్చుకోం, పైగా వారికి ఉన్న హీరోయిన్లను మెప్పించే శక్తిని చూసి వారిని ఆరాధిస్తాం.

  ఇది ఒకరకంగా షాక్ కలిగించే విషయమే, యాభై, అరవైల వయస్సులో ఉన్న బాలీవుడ్ లేదా హాలీవుడ్ హీరోలు, ఇరవైల వయసులో ఉన్న అమ్మాయిలను ఎంతో సులువుగా కలల్లో తేలేట్లు చేయగలరు. అది అక్కడే ఆగదు- ఈ యువతులు తమకన్నా రెట్టింపు వయస్సున్నవారితో బంధాలు కలుపుకుని స్థిరపడతారు కూడా, మరో అలాంటి యువతి తమ జీవితాల్లోకి వచ్చేవరకు!

  ప్రేమ వ్యవహారాన్ని అమ్మాయిలు ఇలా దాస్తారు!

  ఒకే సమయంలో ఎలా ఈ మగవారు ఒకరు కాదు, ఇంతమందిని ఆకర్షించగలుగుతున్నారు? ఆశ్చర్యంగా ఉందా? ఎవరికి ఉండదు? ఈ కింది కారణాలు చూడండి. మీకే ఈ ఆకర్షణ బంధాల వెనక అసలు రహస్యం తెలుస్తుంది.

  తమ మగతనాన్ని ప్రదర్శించటానికి

  తమ మగతనాన్ని ప్రదర్శించటానికి

  మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఒక మాచో మ్యాన్! ఈ కారణం వల్లనే అతను కేవలం మీ ఒక్కరితో ఉండలేడు. అంతమంది అందమైన యువతులను తన వెనక తిప్పుకోగల సామర్థ్యం తన మగతనానికి ఉందని ఇంకెలా నిరూపించుకోగలడు మరి?

  సంతోషంగా లేని వైవాహిక జీవితం

  సంతోషంగా లేని వైవాహిక జీవితం

  పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. కానీ పెళ్ళిలో ముఖ్యమైన శారీరక బంధం, భూమిపైనే సాధ్యం! లైంగిక బంధం సరిగాలేని జంటల్లోని మగవారు తమ భార్యలనుంచి దూరంగా వెళ్ళిపోతారు. నిజమే, అతను భరిస్తూ ఎల్లకాలం ఉండాల్సిన అవసరం ఏముంది? వీలుచిక్కినప్పుడల్లా వివాహేతర బంధాలకి వెళ్ళే సదుపాయం ఎలాగో ఉందిగా అతనికి !

  సంపద శక్తి

  సంపద శక్తి

  డబ్బు ఆరోగ్యం, సంతోషాన్ని కొనలేదని అంటారు. కానీ డబ్బు ఎలాంటి సంతోషాన్నిచ్చే మార్గానికైనా తీసుకెళ్ళగలదు. ధనవంతులు, శక్తివంతులైన పురుషులు, తాము ఎలాంటి వయస్సులో, ఎలా ఉన్నా సరే ఇలా అనేక మంది యువతులను బుట్టలో వేసుకోగలరు !

  వయస్సులో చిన్నవ్యక్తిని పెళ్ళాడటం వల్ల ఉపయోగాలు

  ఆధిక్యత

  ఆధిక్యత

  మనది పితృస్వామిక వ్యవస్థ, అందులో ఎలానో పురుషుడే కుటుంబ పెద్ద. చాలా సందర్భాల్లో పెళ్ళయిన మగవారు కూడా అక్రమబంధాలు ఏర్పర్చుకోటానికి ఎంతో స్వేఛ్చ కలిగిఉంటారు. ఎందుకంటే వారి భార్యల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఉండదు కాబట్టి.

  పోర్న్ వ్యసనం

  పోర్న్ వ్యసనం

  ఆశ్చర్యంగా అన్పించినా ఇది వాస్తవం! పోర్న్ వ్యసనం కూడా మగవారు ఒకరి కన్నా ఎక్కువమందితో అక్రమ బంధాల వైపు మొగ్గుచూపేట్లా చేస్తుంది. పోర్నోగ్రఫీకి అలవాటు పడ్డ వ్యక్తి, తన సంతోషాలకి చాలా మార్గాలున్నాయని గ్రహిస్తారు. ఇక మరేం, ఒకమ్మాయితో నిజాయితీగా ఉండి జీవితాన్ని ఏం ఆనందంగా అనుభవిస్తారు?

  సోషల్ మీడియా ప్రభావం

  సోషల్ మీడియా ప్రభావం

  ఏ సోషల్ మీడియాలోనైనా ఆడవారిని ఎప్పుడూ మగవారి రక్షణకోరే అబలలుగానే చిత్రీకరిస్తారు. యువతులు ఉద్యోగినులైనా, పార్టీకి వెళ్ళాలంటే తండ్రి అనుమతి తప్పనిసరి. అబ్బాయిలకు ఇలాంటి ఏ నియమాలు ఉండవు.

  ఒక అమ్మాయి అబ్బాయికి తన ప్రేమను తెలుపడంలో తప్పేముంది

  లొంగదీసుకోవాలనుకునే ఆడవారి మనస్తత్వం

  లొంగదీసుకోవాలనుకునే ఆడవారి మనస్తత్వం

  ఆఖరుది కానీ ముఖ్యమైనది, మగవారి అక్రమబంధాల బుద్ధికి, ఇలా అందరి చుట్టూ తిరిగే మనస్తత్వానికి మొత్తం వారినే నిందించక్కర్లేదు. స్త్రీల ఆకర్షణ ప్రభావం కూడా కావచ్చు! ఒక యువతి తన లైంగిక హావభావాలతో, చిన్న దుస్తులతో యువకులను ఆకర్షిస్తే, ఎవరైనా వెనక పడకుండా ఎలా ఉండగలరు?

  అందుకే ఇలా అనేకమందితో సంబంధాలు పెట్టుకునే మగవారు కేవలం వారిని ప్రేమించటం వల్లనే కాదు, ఇలాంటి యువతులు తమలో దాగివున్న కోరికను రెచ్చగొడతారు కూడా కాబట్టి ఆకర్షింపబడతారు. అయితే మిత్రులారా, ఈ వ్యభిచారాలకి కేవలం మగవారినే తప్పుపట్టటం,నిందించటం సరైనదేనా? మన చర్చ ప్రకారం చాలామటుకు సామాజిక వ్యవస్థ, ఆడవారి బలహీనతలే ఈ మగవారి పరాయి ఆకర్షణలకి కారణమని తేలింది !

  English summary

  7 Reasons Why Men Want Multiple Relationships

  If you are dating a guy who sleeps around, you must be wondering why men are interested in multiple relationships? Read this.
  Story first published: Friday, June 30, 2017, 12:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more