పడకగదిలో పురుషులు చేసే అతి ముఖ్యమైన తప్పులు

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

అనుభవం లేకపోవడం మరియు దూకుడు ఎక్కువగా ఉండటం వల్ల వయస్సులో ఉన్న పురుషులు పడకగదిలో చాలా పెద్ద తప్పులను చేస్తుంటారు. సాధారణంగా వయస్సులో ఉన్న పురుషులు ఎంతో ఉద్రేకంతో ఎదో చేయాలని అనుకుంటారు. కానీ ఆ ఆతురుతలో తప్పులు చేస్తుంటారు.

కానీ సమయం గడిచే కొద్దీ వాళ్లకు అనుభవం కూడా పెరుగుతుంది. దీంతో తప్పులు సరిదిద్దుకొని పడగగదిలో వ్యవహరించేటప్పుడు బాగా వ్యవహరించడానికి వారి అనుభవం ఎంతగానో తోడ్పడుతుంది. కానీ, గమనించవలసిన విషయం ఏమిటంటే, చాలా కొద్ది మంది పురుషులు మాత్రమే సమయం గడిచే కొద్ది తమంతట తాముగా అన్నింటిని గ్రహించి అందుకు అనుగుణంగా వ్యవహరించి పడకగదిలో సఫలీకృతమవుతుంటారు. అందుకే కాబోలు చాలా మంది స్త్రీలు తాము సరైన భావప్రాప్తి పొందలేకపోతున్నామని ఇప్పటికీ పిర్యాదు చేస్తుంటారు.

పడకగదిలో పురుషులు చేసే అతి ముఖ్యమైన తప్పులు

అంటే దీనర్ధం పురుషులు పడకగదిలో చాలా తప్పులు చేస్తున్నారనా ? అవునని చెప్పక తప్పదు. పురుషాంగాన్ని యోనిలోకి పంపడం మరియు స్కలించడం ద్వారా తమ భాగస్వాములు సంతృప్తి పడతారని ఇప్పటికి చాలా మంది పురుషులు భావిస్తుంటారు. పడకగదిలో చాలా మంది పురుషులు ఇప్పటికీ చేస్తున్న అతిపెద్ద తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమెని ఎక్కువగా ప్రశ్నలు అడగడం :

ఆమెని ఎక్కువగా ప్రశ్నలు అడగడం :

సంభోగం మొదలుపెట్టిన తర్వాత ఎక్కువగా మాట్లాడకుండా పని చేసుకుపోవడం ఉత్తమం. " భావప్రాప్తి పొందావా ? " , " నీకు నా పురుషాంగం చాలా పెద్దదిగా అనిపిస్తుందా ? " లాంటి ప్రశ్నలను ఎక్కువగా అడగకండి. ఇలా గనుక అడిగితే మీ భాగస్వామి యొక్క ఆలోచనలు మారిపోతాయి. అందువల్ల మీరిద్దరూ రతిక్రీడను సరిగ్గా ఆనందించలేరు.

ఆమె భావప్రాప్తి చెందే వరకు ఆగకపోవడం :

ఆమె భావప్రాప్తి చెందే వరకు ఆగకపోవడం :

స్త్రీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ! నిజమే పడకగదిలో కూడా స్త్రీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మొదట మీ ప్రక్కనున్న మహిళ భావప్రాప్తి చెందేలా చేయాలి, ఆ తర్వాతనే మీరు స్కలించడానికి ఉపక్రమించాలి. మీరు గనుక మీ యొక్క ఆనందం గురించి మాత్రమే గనుక ఆలోచించినట్లయితే ఆ తర్వాత మీ భాగస్వామి వాష్ రూంలోకి వెళ్లి ఓ గంట పాటు అక్కడ తడుముకుంటూ తనను తానూ సంతృప్తి పరుచుకోవాల్సి రావచ్చు.

ఆమెను ఆకట్టుకోవడానికి విపరీతంగా ప్రయత్నించడం :

ఆమెను ఆకట్టుకోవడానికి విపరీతంగా ప్రయత్నించడం :

ప్రతి ఒక పురుషుడు తనను తానూ ఎంతో గొప్పగా ఓ ' సూపర్ మ్యాన్ ' లా చూపించుకోవాలని భావిస్తుంటారు. కానీ లేనిది ఉన్నట్లు నటన చేసే సమయంలో పూర్తిగా విఫలమవుతారు. లేనిది ఉన్నట్లు నటించడం కంటే కూడా మీరు మీరుగా ఉండి మరియు సాధారణంగా వ్యవహరించినట్లైతే బాగుంటుంది. పడకగదిలో మీరు ప్రేమని వ్యక్తపరుస్తున్నప్పుడు మీ అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది. కావున ఆ సమయంలో మీరు నటించనవసరం లేదు లేదా మీలో ఎదో తెలియని శక్తి ఉందని భ్రమింప చేయనవసరం లేదు.

ఆమెను ఆకట్టుకోవడానికి విపరీతంగా ప్రయత్నించడం :

ఆమెను ఆకట్టుకోవడానికి విపరీతంగా ప్రయత్నించడం :

ప్రతి ఒక పురుషుడు తనను తానూ ఎంతో గొప్పగా ఓ ' సూపర్ మ్యాన్ ' లా చూపించుకోవాలని భావిస్తుంటారు. కానీ లేనిది ఉన్నట్లు నటన చేసే సమయంలో పూర్తిగా విఫలమవుతారు. లేనిది ఉన్నట్లు నటించడం కంటే కూడా మీరు మీరుగా ఉండి మరియు సాధారణంగా వ్యవహరించినట్లైతే బాగుంటుంది. పడకగదిలో మీరు ప్రేమని వ్యక్తపరుస్తున్నప్పుడు మీ అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది. కావున ఆ సమయంలో మీరు నటించనవసరం లేదు లేదా మీలో ఎదో తెలియని శక్తి ఉందని భ్రమింప చేయనవసరం లేదు.

సినిమాల్లో చూసిన విధంగా చేయాలనుకోవడం :

సినిమాల్లో చూసిన విధంగా చేయాలనుకోవడం :

చాలా మంది పురుషులు అశ్లీల చిత్రాలను ఎక్కువగా చూస్తుంటారు. ఆ సినిమాల్లో చేసే వివిధ భంగిమలను మరియు పనులను నిజ జీవితంలో చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొద్దిగా నిరాశ చెందుతుంటారు.

మీ భాగస్వామిని పళ్ళుతోముకోమని చెప్పడం :

మీ భాగస్వామిని పళ్ళుతోముకోమని చెప్పడం :

మీరు గనుక ప్రొదున్న పూట సంభోగానికి ఇష్టపడుతున్నట్లైతే అలాంటి సమయంలో మీ భాగస్వామి పరిశుభ్రంగా ఉండాలని కోరుకోవడం కొద్దిగా అత్యాశ అవుతుంది. ఆమె నోటి నుండి దుర్వాసన వస్తుందని అందుచేత తప్పనిసరిగా పళ్ళుతోముకోవాలని ఒత్తిడి తెచ్చినట్లైతే ఆమె లో ఉన్న కామోద్రేకం తగ్గిపోయి, ఆలోచనలు మారిపోయి, సంభోగం చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు.

 మీ యొక్క పురుషాంగ పరిమాణం గురించి ఎక్కువగా కలత చెందడం :

మీ యొక్క పురుషాంగ పరిమాణం గురించి ఎక్కువగా కలత చెందడం :

పురుషాంగ పరిమాణానికి మరియు స్త్రీల యొక్క భావప్రాప్తికి ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికే నిపుణులు చెప్పడం జరిగింది. స్త్రీలు భావప్రాప్తిని ఎన్నో విధాలుగా పొందుతారు. పురుషాంగ పరిమాణం గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది తెలివైన వారు చేసే పని కాదు.

ఎక్కువగా పరిశుభ్రతను పాటించడం లేదా ఎక్కువ మురికిగా ఉండటం :

ఎక్కువగా పరిశుభ్రతను పాటించడం లేదా ఎక్కువ మురికిగా ఉండటం :

పరిశుభ్రత గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తే మీ భాగస్వామి కామోద్రేకం పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మీతో సంభోగం చేయడానికి ఇష్టపడకపోవచ్చు. మరీ ఎక్కువగా మురికిగా ఉంటే కూడా ఇద్దరి మధ్య శృంగార ఆలోచనలు కలగవు. అదే సమయంలో ప్రేమను ఒకరినొకరు పంచుకునేటప్పుడు మరీ ఎక్కువగా పరిశుభ్రంగా ఉండమని ఒత్తిడి చేయడం మంచిది కాదు. ఎందుకంటే శృంగారం అనేది పాక్షికంగా ఒక మురికి ఆట. ఇందులో నుండి ఎంతో సరదాగా ఆనందం పొందుతారు. :

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Top Bedroom Mistakes Of Men!

    Top Bedroom Mistakes Of Men!,Does it mean that men commit bedroom blunders? Maybe yes. Most of the men still think that penetration and ejaculation are enough to satisfy their partners. Here are the top bedroom mistakes that most of the men commit.
    Story first published: Friday, September 29, 2017, 15:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more