స్త్రీలు స్త్రీ స్వభావం గల పురుషులతో డేటింగ్ చేయడానికి ఇష్టపడతారా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

చదరపు ఆకారంతో దృఢమైన దవడలు కలిగి ఉండి, గంభీరమైన స్వరంతో, కండలు తిరిగిన శరీరం కలిగి మరియు దూకుడు స్వభావం కలిగిన మంచి ఆకారం ఉన్న పురుషులు మాత్రమే మంచి స్త్రీలను పొందగలరు అని చాలా మంది భావిస్తారు. కానీ, అసలు నిజం ఏమిటంటే స్త్రీ స్వభావం కలిగిన పురుషులు, త్వరగా ఎక్కువ మంది స్త్రీలను వశపరుచుకోగలరు.

బాగా కండలు తిరిగిన శరీరం కలిగిన పురుషులు ఖచ్చితంగా అందమైన స్త్రీలను ఆకర్షించగలరు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ, ఇప్పటికీ స్త్రీ స్వభావం కలిగిన పురుషులు త్వరగా స్త్రీల మనస్సుకి చేరుకోగలరు మరియు వారిని సులభంగా అర్ధం చేసుకోగలరు.

మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు మరొకరితో డేటింగ్ చేస్తుంటే?!

దీర్ఘకాలిక సంబంధ బాంధవ్యాలను ఏర్పరుచుకోవాలి అని భావించినప్పుడు, అందానికి అంత ప్రాముఖ్యత దక్కదు. అంతకుమించిన మరెన్నో స్వభావాలు ప్రాముఖ్యతను సంతరించుకొంటాయి. కాబట్టి స్త్రీలు స్త్రీ స్వభావం గల పురుషుల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు. అందుకు గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం...

పురుష స్వభావాలు ఎక్కువగా ఉన్న వారు మరీ ఎక్కువగా భయపెడతారు :

పురుష స్వభావాలు ఎక్కువగా ఉన్న వారు మరీ ఎక్కువగా భయపెడతారు :

ఏ స్త్రీ లైతే ఒక విపరీతమైన ఆధిపత్యం చెలాయించే తండ్రి సంరక్షణలో పెరుగుతారో, అటువంటి వారు మగతనం ఎక్కువగా ఉన్న పురుషుల సాంగత్యాన్ని కోరుకోరు. వారిని చూసి భయపడతారు. అలాంటి స్త్రీలు అంత కఠినంగా వ్యవహరించని మరియు బయపెట్టని మృదు స్వభావం కలిగిన పురుషుడిని కోరుకుంటారు.

స్త్రీ స్వభావం కలిగిన పురుషులు భావోద్వేగపరులు :

స్త్రీ స్వభావం కలిగిన పురుషులు భావోద్వేగపరులు :

ఇటువంటి వారు స్త్రీల యొక్క భావోద్వేగాలను త్వరగా అర్ధం చేసుకోగలరు. దీంతో ఒకరికొకరు చాలా త్వరగా దగ్గరవుతారు. పురుష స్వభావాలు ఎక్కువగా ఉన్న పురుషులు భావోద్వేగాల సమయంలో స్త్రీ ల పై ఎటువంటి సానుభూతిని గాని, కారుణ్యాన్ని గాని అంత ఎక్కువగా చూపలేరు.

సాధారణంగా ఇరువురిలో ఉండే లక్షణాలు :

సాధారణంగా ఇరువురిలో ఉండే లక్షణాలు :

ఎప్పుడైతే స్త్రీ, స్త్రీ స్వభావం ఉన్న పురుషుడితో సంభాషించడం మొదలుపెడతుందో ఆ సమయంలో తనకు ఎదుటి వ్యక్తికి లక్షణాల్లో చాలా సారూప్యత ఉందని గ్రహిస్తుంది. అంతే కాకుండా పురుష స్వభావాలు ఎక్కువగా ఉన్న పురుషులు తమ గురించి తాము గొప్పగా ఎప్పుడూ చెప్పుకుంటారు, అదే స్త్రీ స్వభావం ఉన్న పురుషులు , స్త్రీలు చెప్పే విషయాలను శ్రద్దగా వింటారు మరియు తక్కువగా మాట్లాడతారు.

అవసరంలేని దూకుడు కనిపించదు :

అవసరంలేని దూకుడు కనిపించదు :

స్త్రీల స్వభావం కలిగిన పురుషులు చాలా ప్రశాంతంగా, మౌనం గా మరియు మృదువుగా వ్యవహరిస్తారు. ఇవి వారిలో ఉన్న అత్యుత్తమ లక్షణాలు. వాళ్ళు పురుష స్వభావాలు ఎక్కువగా ఉండే పురుషులు చూపించే దూకుడు స్వభావాన్ని కనబరచరు మరియు హింసాత్మక ధోరణిలో వ్యవహరించరు.

ఓదారుస్తారు కానీ చికాకుపడరు :

ఓదారుస్తారు కానీ చికాకుపడరు :

ఎప్పుడైనా స్త్రీలు ఏడిస్తే స్త్రీ స్వభావం ఉన్న వ్యక్తులు వారిని అర్ధం చేసుకొని ఓదార్చడానికి ప్రయత్నిస్తారు. పురుష స్వభావాలు ఎక్కువగా మరీ ఎక్కువ ఉన్న వ్యక్తులు ఆడవాళ్లు ఏడవటాన్ని చూసి చికాకుపడతారు.

యుక్త వయస్కుడితో డేటింగ్ వల్ల సమస్

పడక గదిలో స్వార్ధపూరితంగా ఆలోచించారు :

పడక గదిలో స్వార్ధపూరితంగా ఆలోచించారు :

పురుష స్వభావాలు ఎక్కువగా ఉన్న పురుషుల్లో చాలా మంది పడక గదిలో తమ శక్తిని సామర్ధ్యాన్ని చూపించాలనుకుంటారు మరియు వారియొక్క కోరిక నెరవేరితే చాలని భావిస్తారు మరియు స్త్రీలను సంతృప్తి పరచాలని భావించరు. కానీ స్త్రీ స్వభావం ఉన్న వ్యక్తులు పడక గదిలో నెమ్మదిగా, జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మరీ కఠినంగా వ్యవహరించకుండా, మనస్సుని గాయపరచకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.

సర్వేలు ఏమని చెబుతున్నాయంటే :

సర్వేలు ఏమని చెబుతున్నాయంటే :

చాలా మంది స్త్రీలు కొద్దిగా స్త్రీల వంటి ముఖాలు కలిగిన పురుషులను కోరుకుంటున్నారని ఈ మధ్య జరిగిన ఒక సర్వేలో వెల్లడైంది. కొంత శాతం మంది అందమైన స్త్రీలు సాధారణం గానే మంచి దృఢమైన శరీరం మరియు గంభీరమైన ఆకారం కలిగిన పురుషులను ఇష్టపడతారు. కానీ ఎక్కువ శాతం మంది స్త్రీలు స్త్రీల స్వభావం కలిగిన పురుషులను లేదా కొద్దిగా స్త్రీల వంటి ముఖాలు కలిగిన పురుషుల పట్ల ఆకర్షితులవుతున్నారు.

English summary

Do Women Get Attracted To Feminine Guys

Do you know that many women are attracted to feminine guys? Read this!
Story first published: Wednesday, September 6, 2017, 17:00 [IST]
Subscribe Newsletter