మీ ఇద్దరి మధ్యా శారీరక ఆకర్షణ ఉన్నదని తెలుసుకోవటం ఎలా?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

గాఢ లైంగిక ఆకర్షణ సంకేతాలు గుర్తించడం సులభం. ఈ పరిస్థితి ఊహించుకోండి. మీరొక కాఫీ షాపుకి వెళ్ళి క్యాష్ కౌంటర్ దగ్గర అమ్మాయిని అదేపనిగా చూస్తుంటారు. ఆమె కూడా మిమ్మల్ని చూసి నవ్వుతుంది. ఇక మీరు రెగ్యులర్ గా వెళ్ళటం మొదలుపెట్టి, చూపులు, నవ్వులను ఆనందిస్తుంటారు. మీకు ఆమెతో శారీరక సంబంధం గురించి కలలున్నా, ఆ కథ అంతకుమించి ముందుకు సాగదు. మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడన్నా జరిగిందా?

మొదటగా, సెక్సువల్ సంఘర్షణ అంటే ఏంటి? అది గాఢమైన శారీరక ఆకర్షణ. వివిధ సామాజిక కలయికల వల్ల ఇద్దరి మధ్య ఏర్పడే శారీరక కోరిక. చాలాకేసుల్లో ఇది తర్వాత స్థాయికి చేరదు.

డేటింగ్ వల్ల ఇన్ని సమస్యలా...?

ఒకేచోట పనిచేసే ఇద్దరు సహోద్యోగుల మధ్య ఇది కలగవచ్చు. ఒక బుకింగ్ గుమాస్తా, ఎప్పుడూ వచ్చే వినియోగదారుని మధ్య ఈ ఆకర్షణ ఏర్పడవచ్చు. మిత్రుల బృందంలో, కొన్ని సామాజిక కార్యక్రమాలలో ఇవి జరగవచ్చు. తర్వాత స్థాయికి వెళ్లకపోవటానికి అనేక కారణాలుంటాయి.

కేవలం శారీరక కోర్కె అయితే, ఈ రకపు ఘర్షణ కలుగుతుంది. దీని గురించిన మరికొన్ని వాస్తవాలు ఇదిగో.

మీకు ఆకర్షణ తెలుస్తుంది

మీకు ఆకర్షణ తెలుస్తుంది

మీకు ఆమెకి ఆసక్తి ఉందని తెలుస్తుంది, ఆమెకి మీరు ఆకర్షితులయ్యారని తెలుసు. కానీ ఇద్దరిలో ఎవరూ ముందడుగు వేయరు. ఇద్దరూ సిగ్గరులే అయ్యివుండవచ్చు. లేదా ఆమెకి ఇదివరకే పెళ్ళయిపోయి ఆమె భర్తను మోసం చేయటం ఇష్టం లేకపోవచ్చు.

మీకు ఈ అనుభవం అవుతుంది…

మీకు ఈ అనుభవం అవుతుంది…

మీకు ఈ అనుభవం ఎప్పుడు కలుగుతుందో ఎలా తెలుస్తుంది? మీరు ఆమె దగ్గర్లో ఉన్నప్పుడు మీ శరీరంలో, ఛాతీలో, కడుపులో, జననాంగాలలో విచిత్ర భావం కలుగుతుంది. మీ గుండెవేగం పెరిగి, ఎలా అయినా ఆమెతో పొందు కావాలని మీ శరీరం తపిస్తుంది.

మోడ్రన్ కపుల్స్ కోసం ఇండియన్ డేటింగ్ రూల్స్

గాఢమైన చూపులు

గాఢమైన చూపులు

మీరు ఇతరవ్యక్తిని గాఢంగా చూడవచ్చు, ఆమె కూడా మిమ్మల్ని అంతే గాఢంగా చూస్తుండవచ్చు. మిమ్మల్ని తినేసేటట్టు ఆమె చూడవచ్చు. ఎందుకు అంత తీవ్ర ఆకర్షణ కలుగుతుంది? మీరు విశ్లేషించినా మీకు కారణం దొరకదు.

శరీరభాష

శరీరభాష

శరీరభాష కూడా మారుతుంది. ఇద్దరూ ఒకర్నొకరు దూరం నుంచి చూసుకున్నప్పుడు కూడా, మరింత ఆకర్షణీయంగా కన్పించేట్లా మీ శరీరభాష అదంతట అదే మారిపోతుంది.

ఏదో భావం పెల్లుబుకుతుంది

ఏదో భావం పెల్లుబుకుతుంది

మీరు ఆమెను చూస్తున్నప్పుడు ఏదో తెలియని భావం ఉప్పొంగుతుంది. నిజానికి మీకు వెంటనే సెక్స్ కావాలనిపిస్తుంది. ఆమెతో మాట్లాడినప్పుడు మీ గొంతు మారిపోయి, తెలియకుండానే సెక్సీగా, మత్తుగా మాట్లాడుతారు.

యుక్త వయస్కుడితో డేటింగ్ వల్ల సమస్య

మీ మిత్రులేమంటారు

మీ మిత్రులేమంటారు

మీ స్నేహితులు సులభంగా మిమ్మల్ని దూరం నుంచి కూడా చూసి మీలో మార్పులను గుర్తించేస్తారు. మీ మధ్య జరుగుతున్న గాఢమైన శారీరక ఆకర్షణ కూడా వాళ్లకి అర్థమవుతుంది.

కొంటె ఆలోచనలు !

కొంటె ఆలోచనలు !

మీరు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఆమెను ముద్దులతో ముంచెత్తాలని,పెదవులు కొరకాలని అన్పిస్తుంది. ఇది ఒక గాఢమైన కోరికకి సంకేతం. ఆమెకు కూడా ఇలానే అన్పించవచ్చు.

ఆమె మాట్లాడే తీరు, శరీరభాషతో మీకు కూడా ఆమెకి మీరంటే ఇష్టమని తెలుస్తుంది. అయితే అక్కడితోనే కథ ముగుస్తుంది. మీరు ఆమెను అడగరు, ఆమె మీకు నేరుగా ఇష్టమని చెప్పదు!

English summary

How To Know If There Is Sexual Tension Between Two

Intense physical attraction signs are easy to identify. You go to the coffee shop and stare at the woman who sits at the cash counter. She too stares.
Story first published: Saturday, August 5, 2017, 17:00 [IST]
Subscribe Newsletter