ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించటం సాధ్యమేనా?

By: Deepti
Subscribe to Boldsky

ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో పడి వారిని ఒకేసారి ప్రేమించగలగటం సాధ్యమా? నిప్పు తో చెలగాటం, కదా? ఒకవేళ ఇద్దరికీ ఈ విషయం తెలిసిందంటే, ఇద్దరూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు!

ఒక సర్వేలో, కొందరు వ్యక్తులు వివాహేతర సంబంధం కలిగిఉన్నామని ఒప్పుకున్నారు. అక్రమ సంబంధం కలిగి ఉండి కూడా వారు సంసారం ఎందుకు చేస్తూన్నారని అడిగితే, వారు ఏం చెప్పారో తెలుసా?

భార్యని, అక్రమబంధంలో ఉన్న యువతిని, ఇద్దర్నీ సమానంగా ప్రేమిస్తున్నామని చెప్పారు.

వారు జోకులేస్తున్నారా? లేదా నిజంగానే ఇద్దర్ని ఒకేసారి ప్రేమించటం సాధ్యమా? మనం చర్చిద్దాం.

#1

#1

మొదట, అక్రమసంబంధాలు ఏర్పర్చుకుని వివాహాన్ని అపహాస్యం చేసే పురుషుల గూర్చి మాట్లాడదాం. అది కామం, ప్రేమ కాదు !

#2

#2

అయితే ప్రేమంటే ఏంటి? టూకీగా చెప్పాలంటే, ఒకరితో మీరు ఎంతో అనుబంధాన్ని పెంచుకుని వారు లేకుండా జీవితం అర్థరహితం అని భావిస్తే అది ప్రేమ. వారి సమక్షంలో మిమ్మల్ని మీరు సంపూర్ణంగా భావిస్తారు.

అలాంటి బంధం ఆనంద భావోద్వేగాలతో నిండిపోతుంది. ప్రేమ అనేది ఆనందాన్ని నింపేసే మధుర భావం అయితే, ఇద్దరు వ్యక్తులను ఒకేసారి ప్రేమించటం కుదురుతుందా?

#3

#3

మానసిక నిపుణుల ప్రకారం, జీవితంలో ఎప్పుడో అప్పుడు వివాహితులు అక్రమబంధాల వైపు ఆకర్షితులవుతారు. కానీ అది కామం వల్లనో, లైంగిక అవసరాల వల్లనో జరుగుతుంది. అది ప్రేమ కాదు!

#4

#4

పెళ్ళైన వారికి కూడా తీరని కోరికలు ఉంటాయా? వారు ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటారా? అవును, కొన్నిసార్లు జరుగుతుంది. కొంతమంది వివాహితులు మరొకర్ని కలల్లో ఊహించుకుంటారు కూడా.

అందంగా ఆకర్షణీయంగా ఉండేవారితో గడుపుతున్నట్టు పగటికలలు కూడా కంటుంటారు. కానీ కేవలం ఊహల వల్ల వివాహబంధానికి ఏ ఇబ్బంది రాదు. అది అపాయం లేనిది.

#5

#5

వివాహం జరిగాక కూడా బయటవారితో ఆకర్షణ కలిగితే, మిమ్మల్ని మీరు ఆపుకోగలరా? మీ భావాలను మీరు నియంత్రించుకోగలరా? సైకాలజిస్టుల ప్రకారం మీ భావాలను మీరు అదుపుచేసుకోలేరు కానీ మీ పనులను నియంత్రించగలరు. మీ ఆకర్షణను ఆపుకోలేరు కానీ వారివెనుక పడటాన్ని నియంత్రించగలరు.

#6

#6

మీరు ఆకర్షితులైన వారిగురించి కలలు కనటంలో ఏం తప్పులేదని సైకాలజిస్టులు చెప్తున్నారు. కానీ ఆ కలలు, పాడు ఆలోచనలు నిజంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎప్పుడూ మీదే.

అన్ని సమస్యలు అలాంటి విచిత్ర చెడు ఆలోచనలు ఆచరణలో పెట్టడం వల్లనే వస్తాయి. మీరు అలా చేయకపోతే, ఆ ఆలోచనలు తొందరగా మారిపోయి మీ వివాహజీవితం స్థిరంగా ఉంటుంది.

#7

#7

ఇంతకీ, ఇద్దర్ని ఒకేసారి ప్రేమించటం కుదురుతుందా? కుదరదు! అది సాధ్యం అని అనిపించినా, లోతుగా చూసినట్లయితే, అది కామం లేదా ఆకర్షణ మాత్రమే! నిజమైన ప్రేమ మాత్రం కాదు!

English summary

Is It Possible To Love Two People At The Same Time?

Is It Possible To Love Two People At The Same Time?
Story first published: Friday, June 16, 2017, 16:00 [IST]
Subscribe Newsletter