For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి జంట 2018 కొత్త సంవత్సరంలో కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాలు

|

మనుషులని ఒకరితో ఒకరిని బంధించి నిలిపి ఉంచే అద్భుతమైన భావాలలో ముఖ్యమైనది ప్రేమ. ఈ ప్రేమ వల్లనే కుటుంబాలు ఒక్కటిగా జీవించగలుగుతున్నాయి. ఎలాగైతే ప్రతిదానికి దానికి తగ్గ బాధ్యతలతో ఉంటుందో, ప్రేమ కూడా బాధ్యతతో కూడినదే. ఇది మనస్సులో మీరు ఉంచుకోవాలి.

ఎప్పుడైతే ఇద్దరు ప్రేమలో ఉండి, ఒక బంధంలోకి ప్రవేశిస్తారో, వారు కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించటం సరికాదు. ఇద్దరికీ ఉమ్మడి లక్ష్యాలు, కలలు ఉండి వాటిని చేరుకోటానికి కలిసి కష్టపడాలి, విజయం సాధించాలి.

new year resolutions every couple should make

ప్రతి జంట తీసుకోవాల్సిన కొత్త సంవత్సరం నిర్ణయాలు

ఇద్దరికీ స్పష్టమైన గోల్స్ ఉండి, వారి బంధం నుంచి ఏం ఆశిస్తున్నారో తెలిసి ఉంటే కాలంతో పాటు వచ్చే ఏ సమస్యలకైనా ఎదురునిలిచి గెలుస్తుంది. ఈ ఉమ్మడి గోల్స్ దీర్ఘకాలంవి కావచ్చు, తక్కువ సమయంకి చెందినవై కూడా ఉండవచ్చు.

ఈ రెండు రకాల గోల్స్ కి సరైన ప్లానింగ్ మరియు వాయిదా వేసే పద్ధతి అస్సలు ఉండకూడదు. ఇలాంటి ప్లాన్లు వేయటం మరియు దాన్ని చివరివరకూ పాటించడానికి (ఒంటరిగానే కాదు జంటగా కూడా) కొత్త సంవత్సరంలో నిర్ణయాలు కలిసి తీసుకోండి.

ఈ కొత్త సంవత్సరం 2018లో జంటగా తీసుకోవాల్సిన కింద 10 నిర్ణయాలు చూడండి....

1. ఇద్దరూ ఒకర్నొకరికి డిజిటల్ స్పేస్ ఇవ్వండి

1. ఇద్దరూ ఒకర్నొకరికి డిజిటల్ స్పేస్ ఇవ్వండి

ఈనాటి ప్రపంచంలో మన మొబైల్ ఫోన్లు మరియు ఈ మెయిల్స్ మనతోపాటే ఉండే చాలా వ్యక్తిగత విషయాలుగా మారిపోయాయి. వ్యక్తిగత స్పేస్ ఉండటం చాలా ముఖ్యం పైగా ఒకరు మరొకరి మెసేజ్ లు , మెయిల్స్ చెక్ చేయకపోవటమే ఉత్తమం. అందుకని మంచి అలవాటుగా ఈ ఏడాది జంటలు అలాంటి పనులేమీ చేయమని నిర్ణయం తీసుకోండి.

2. కలిసి వంట చేసుకోవడం

2. కలిసి వంట చేసుకోవడం

మీరెంత గొప్పగా లేదా చెత్తగా వండుతారని ముఖ్యం కాదు. కలిసి వంట చేయటం ద్వారా జంటలు ఒకరితో ఒకరు తమ మనస్సులో బరువును పంచుకుంటారు, ఇది అర్థం చేసుకోటాన్ని పెంచి, మీ బంధాన్ని బలపరుస్తుంది. అందుకని, కొత్త సంవత్సరంలో ఒక మంచి నిర్ణయం కలిసి వంట చేయడం. ప్రతిరోజూ చేయటం కుదరకపోవచ్చు కానీ వారానికి రెండుసార్లైనా పాటించడం మంచిది.

3. ఉమ్మడి ఆర్థిక పెట్టుబడులు

3. ఉమ్మడి ఆర్థిక పెట్టుబడులు

ఇద్దరు వ్యక్తులు జంటగా మారినప్పుడు, వారి డబ్బు వ్యక్తిగతమైనదిగా ఉండకూడదు. మీరు ఉమ్మడిగా ఆర్థికంగా ఎదగాలని పెట్టుబడులు పెట్టడం వలన భవిష్యత్తులో ఆశయంగా చూడటానికి ఇద్దరికీ కలిపి విషయాలు ఉంటాయి. ఇది ఇద్దరూ కష్టపడటానికి ప్రేరణనిచ్చి అన్ని అవకాశాలను ఉపయోగించుకునేలా చేస్తుంది.

4. ఉమ్మడి హాబీలను కలిగివుండటం

4. ఉమ్మడి హాబీలను కలిగివుండటం

మనందరికీ తెలిసిన విషయమే ఒక వ్యక్తి తన హాబీల ద్వారానే నిర్వచింపబడతాడు. అందుకని, ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అతని హాబీలను తెలుసుకోవాలి. ఈ కొత్త సంవత్సరం మీరు, మీ భాగస్వామి ఇద్దరూ ఒకే హాబీని పెంచుకోటానికి నిర్ణయించుకోండి. ఈ చిన్నపని మీ బంధాన్ని ఎంత మారుస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు.

5. ఇద్దరూ కలిసి జిమ్ కి వెళ్ళటం

5. ఇద్దరూ కలిసి జిమ్ కి వెళ్ళటం

చాలామంది ఫిట్ నెస్ అనేది పూర్తి వ్యక్తిగత విషయం అని వాదిస్తారు, కానీ జిమ్ కి కలిసివెళ్ళే జంటలు ఒకరినుంచి ఒకరు ప్రేరణ పొందుతారనేది కొట్టిపారేయలేని వాస్తవం. ఇది శరీరంపై మంచి ప్రభావం కూడా చూపిస్తుంది. జిమ్ లో మీరు అస్సలు అందంగా కన్పడకుండా,పైగా దారుణంగా కన్పిస్తారన్నది నిజమే అయినా మీ భాగస్వామిని చూడటం (లేదా వారు మిమ్మల్ని చూడనివ్వటం) మీ ఇద్దరి మధ్య మానసిక బంధం ధృఢపడేలా చేస్తుంది.

6. మీ భాగస్వామి కుటుంబంతో సమయం గడపటం

6. మీ భాగస్వామి కుటుంబంతో సమయం గడపటం

సామాజికంగా మనము ఒక జంట కలిసి ఉన్నారంటే, అందులో వారికి తమ భాగస్వామి కుటుంబం కంటే వ్యక్తిగత కుటుంబమే ఎక్కువని మామూలుగా అనేసుకుంటాం. ప్రతి జంట ఈ అపార్థాన్ని వదిలించుకోగలిగితే ఇంకా దగ్గరవ్వగలుగుతారు. ఇలా చేయటానికి మంచి పద్ధతి మీ భాగస్వామి కుటుంబంతో ఎక్కువ సమయం గడపటం. ఈ కొత్త సంవత్సరం మనం కూడా ఈ నిర్ణయం తీసుకుందాం.

7. రోజులో ఒక్కసారైనా కలిసి భోజనం చేయాలని రూలు పెట్టుకోండి

7. రోజులో ఒక్కసారైనా కలిసి భోజనం చేయాలని రూలు పెట్టుకోండి

జంటలు రోజుకి ఒక్కసారైనా కలిసి భోజనం చేయాలని నియమంగా పెట్టుకుని పాటించాలి. ఆ సమయంలో ఇద్దరి ఫోన్లూ టేబుల్ కి దూరంగా ఉండాలి.ఈ రూలు మీ జంట మధ్య సంభాషణని పెంచి, ఆరోగ్యకరమైన బంధానికి దారితీస్తుంది.

8 ఇద్దరూ ఒకరికొకరు స్వేఛ్ఛను ఇవ్వటం

8 ఇద్దరూ ఒకరికొకరు స్వేఛ్ఛను ఇవ్వటం

కొన్నిసార్లు మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది.ఇలాంటి సమయాల్లో భాగస్వామి మరొకరి ఆలోచనల మధ్యలో దూరకుండా వారు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా వదిలేయాలి. ఇది సులభం కాదు అందుకే కొత్త సంవత్సరపు నిర్ణయంగా పెట్టుకుని పాటించి తీరండి.

9 ఇద్దరూ కలిసి సేవ చేయటం

9 ఇద్దరూ కలిసి సేవ చేయటం

సమాజంలో ఒక స్థాయిలో నిలదొక్కుకోవటం ప్రతి ఒక్కరికీ ఆనందాన్నే ఇస్తుంది. ఇది ఇద్దరు కలిసి సాధిస్తే ఆ ఆనందం ద్విగుణీకృతం అవుతుంది. ఇద్దరూ కలిసి సమాజానికి ఏదైనా జంటగా చేయటం వలన ఇతరులకి ఉపయోగమే కాదు, మీ బంధం కూడా బలపడుతుంది. అందుకని కొత్త సంవత్సరపు నిర్ణయాలలో ఇది ఒక మేటి నిర్ణయం.

English summary

New Year Resolutions Every Couple Should Make

When two people are in love and they get into a relationship, each of them cannot just think for himself or herself. They must have some common goals and agendas, which will help them to set out in the path of growth and achievement. So, check out what are the best new year resolutions that every couple should make in
Story first published: Saturday, December 30, 2017, 15:35 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more