ఒక అమ్మాయి అబ్బాయికి తన ప్రేమను తెలుపడంలో తప్పేముంది?

By: Deepti
Subscribe to Boldsky

ఇంకా ఎవరో రాజకుమారుడు వచ్చి మిమ్మల్ని మెప్పించాలని కలలు కంటున్నారా? ఇక నిద్రలేవండి! ఎందుకంటే కాలం మారిపోయింది. మీరు ఇరవయ్యొకటవ శతాబ్దానికి చెందిన ఆధునిక యువతులు. మీరు ఎవరో అబ్బాయి వచ్చి డేట్ కోసం అడిగేవరకూ కూచోకూడదు.

మీరు కానీ వెంటనే ఏదో ఒకటి చేయకపోతే, మీరు జీవితాంతం ఎదురుచూసే యువరాణిగానే మిగిలిపోతారు! ఎందుకంటే ఇప్పుడు ఇక రాజ్యాలు లేవు, యువరాజులు అంతకన్నా లేరు మిమ్మల్ని ఎగరేసుకుపోవటానికి!

అయితే ఏంచేయాలి? యువరాజులు లేకపోవచ్చు, కానీ మీకు నచ్చిన వ్యక్తి ఇంకా ఈ గ్రహం మీదే ఉన్నాడు. సమస్య ఏంటంటే, మీరు అతన్ని డేట్ కి అడగవచ్చా లేదా అని; అంతేగా? ఎందుకు అడగకూడదు? ఈ క్రింద కారణాలు చదవండి మీకే తెలుస్తుంది; నిరభ్యంతరంగా అతనికి మీ ప్రేమ మొదట తెలపవచ్చని !

మీరొక స్వతంత్ర, స్వేచ్చా భావాలు కల యువతి

మీరొక స్వతంత్ర, స్వేచ్చా భావాలు కల యువతి

నిజం చెప్పండి, మీరేం అబ్బాయి ముందు మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడే అమ్మాయి కాదు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న మీరు ఎందుకు మీకు నచ్చిన వ్యక్తికి మీ భావాలు తెలపకూడదు? అందులో అసలు తప్పేముంది?

మీరొక స్త్రీవాది

మీరొక స్త్రీవాది

మీరు లింగవివక్షకి వ్యతిరేకులు. అబ్బాయే తన ప్రేమ కోసం పోరాడాలి అన్న ప్రాచీన సంప్రదాయాన్ని మీరు నమ్మరు.

నిజానికి, ఆ అబ్బాయికి మీరంటే ఇష్టమని ఎలా చెప్పాలో తలబద్దలు కొట్టుకునే వత్తిడి నుంచి అతన్ని దూరం చేసి, మీరే మొదటి అడుగు వేసి మీ ప్రేమను తెలిపితే ఎంత బావుంటుందో ఆలోచించండి!

అతను చాలా బిజీ!

అతను చాలా బిజీ!

సరే, అతనికి మీరంటే ప్రాణం, కానీ చాలా పనివత్తిడిలో మీరంటే ఎంత ఇష్టమో చెప్పే సమయం కానీ తీరిక కానీ లేకపోవచ్చు. అలాంటప్పుడు మీరే ఎందుకు అతని వెనకాల పడి మీ ప్రేమను చూపించకూడదు?

అతను అంతర్ముఖుడెమో!

అతను అంతర్ముఖుడెమో!

అతనికి మీరంటే ఎంతో ఇష్టం. కానీ, అందరు అబ్బాయిలు పుట్టుకతోనే ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా పుట్టరు.

అతనికి ధైర్యం వచ్చేసరికి ఏళ్ళు పట్టవచ్చు! అప్పటిదాకా మీరెందుకు ఆగటం? మీ భావాలపై క్లారిటీ ఉన్న మీరే ముందు చొరవ తీసుకోవచ్చుగా!

అతనికి మీరంటే ఆరాధన

అతనికి మీరంటే ఆరాధన

ఇది కూడా మరో కారణం కావచ్చు. అతనికి మీపట్ల ఉన్న ఆరాధనా భావం మీనుంచి దూరంగా ఉండేట్లు చేస్తోందేమో. మీ ఆత్మవిశ్వాసం అతనికి అలాంటివాళ్లని ప్రోత్సహించరు అనే తప్పుడు సంకేతాలు ఇస్తోందేమో!

అందుకని మొదటికే మోసం జరిగేముందే ఏదో ఒకటి చేసి అతని సందేహాన్ని పోగొట్టండి!

అందరు మగవారు అహంకారం కలిగిన వారు కాదు

అందరు మగవారు అహంకారం కలిగిన వారు కాదు

మీరు ప్రేమించే వ్యక్తికే ఒకమ్మాయి తనని డేట్ కై అడగటం ఇష్టమేమో. అందుకని మౌనంగా ఉండి మీ అవకాశం పోగొట్టుకోకుండా, ప్రయత్నిస్తే పోయేదేముంది? అతను మీ చొరవ చూసి ఆనందంలో తేలిపోతాడు!

అతను స్నేహానికి మించి కదలట్లేదా?

అతను స్నేహానికి మించి కదలట్లేదా?

సరే, మీరు మంచి మిత్రులు. కానీ, మీకు అతనిపై మరింత ఇష్టం ఉన్నప్పుడు, ఆ విషయం అతనికి అర్థం కానప్పుడు, హాయిగా నేరుగా అతన్ని లంచ్ కో, డిన్నర్ కో పిలిచి ఆ విషయం చెప్పేయచ్చుగా?

అతను మీకన్నా తక్కువ సంపాయిస్తున్నాడా?

అతను మీకన్నా తక్కువ సంపాయిస్తున్నాడా?

ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఇష్టం ఉన్నా, ఆగిపోతున్నారు. అతనికి మీపై ప్రేమను తెలపాలని ఉన్నా, మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళాలని ఉన్నా విలాసవంతమైన ప్రదేశాలకు తీసుకెళ్ళే స్థోమత లేక అతను ఆగిపోతున్నాడెమో.

ఇకే మీరే ముందడుగు వేసి అతన్ని పిలవండి. దానిద్వారా అతనితో సమయం గడపడం ముఖ్యంకానీ స్థలాలు,డబ్బు కాదని అన్యాపదేశంగా చెప్పవచ్చు!

ప్లేస్ మీరే డిసైడ్ చేయండి!

ప్లేస్ మీరే డిసైడ్ చేయండి!

మీ మొదటి అడుగు వల్ల ఇదొక లాభం! మీరే ముందు మొదలుపెడతారు కాబట్టి ఎక్కడ, ఎప్పుడు అని నిర్ణయించే హక్కు మీదే. ఆ అబ్బాయి తప్పకుండా దీన్ని తిరస్కరించలేడు!

మీ భవిష్యత్తు నిర్ణయించుకోవాలనుకున్నప్పుడు

మీ భవిష్యత్తు నిర్ణయించుకోవాలనుకున్నప్పుడు

ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం, గౌరవం అంతకుమించి మంచి స్నేహం ఉన్నాయి. ఇక ఈ స్థాయినుంచి పైకి ఎదగాలి.

అతను ఇంకా ఒకవేళ ఏదైనా కారణాల చేత అడగలేకపోతున్నా, మీరు కంగారుపడక్కర్లేదు. మీరే అతనితో చర్చించి, ఈ బంధం ఇక తర్వాత స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటున్నారా లేదా అన్నది తేల్చుకోవచ్చు.

సరే ఇక, పగటి కలలు మాని మీ ప్రేమికుడి వెనకాల పడి మీ ప్రేమను చేరవేయటానికి ఈ కారణాలు చాలవా?

English summary

Reasons Why A Woman Should Ask A Man Out

Just read the below-mentioned reasons and you will be satisfied that it's time a woman should ask a man out!
Story first published: Tuesday, June 20, 2017, 15:39 [IST]
Subscribe Newsletter