భారతీయ పురుషులు 12 రకాలుగా సరసమాడుతారని మీకు తెలుసా ?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

సరసాన్ని ఎక్కువగా ప్రేమించే పురుషులను చాలామందిని మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కానీ, కొంత మంది స్త్రీలు ఎదురుగా కూర్చొని ఉన్న పురుషుడు తమతో సరసం ఆడుతున్నారని అర్ధం చేసుకోలేరు. ఎందుకంటే వారికీ ఆ లక్షణాల గురించి పెద్దగా తెలిసి ఉండదు. పురుషుడు ఎప్పుడు సరసం ఆడుతున్నాడు అనే విషయాన్ని తెలియజెప్పే లక్షణాల గురించి తెలుసుకోవడం మంచిది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

చాలా అధ్యయనాల ప్రకారం తమ కంటికి ఎవరైతే నచ్చుతారో అలాంటి స్త్రీలతో సరసమాడటానికి భారతీయ పురుషులు ఎక్కువగా ఇష్టపడుతుంటారట. సరసమాడే పురుషులను ఏ స్త్రీలు అయితే ఇష్టపడరో, అటువంటి సమయంలో మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడానికి వారి దగ్గర నుండి దూరం జరిగితే మంచిది. ప్రపంచంలోని మిగతా దేశంలో ఉన్న పురుషులతో పోల్చినప్పుడు, భారతీయ పురుషులు కొద్దిగా గగుర్పాటుకు గురిచేసేవిధంగా స్త్రీలతో సరసమాడుతుంటారట.

సామాజిక మాధ్యమాల ద్వారా తమకు నచ్చిన స్త్రీని వెంటపడుతూ భారతీయ పురుషులు సరసమాడటానికి ప్రయత్నించే విధానాల్లో ఇది కూడా ఒకటి. ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ వంటి సామజిక మాధ్యమాల్లో టన్నుల కొద్దీ సమాచారం అందుబాటులో ఉంటుంది. దీనిని అబ్బాయిలు అత్యద్భుతంగా ఉపయోగించుకుంటారట.

భారతీయ పురుషులు వారికి నచ్చిన స్త్రీలతో ఏ విధంగా సరసమాడుతారో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

స్త్రీలు వేసుకొనే దుస్తుల గురించి అభినందనలు కురిపిస్తుంటారు :

స్త్రీలు వేసుకొనే దుస్తుల గురించి అభినందనలు కురిపిస్తుంటారు :

మీ దగ్గర ఏ దుస్తులు ఉన్నాయి, ఏవి కొత్తగా ఉన్నాయి అనే విషయాన్ని మీరు ఆలోచించక ముందే, ఎవరైనా అబ్బాయి మీరు ఏ దుస్తులు వేసుకుంటున్నారు అనే విషయం పై ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తుంటే మరియు మీరు వేసుకున్న దుస్తులకు ఎప్పటికప్పుడు అభినందనలు తెలుపుతుంటే, మిమ్మల్ని ఆ వ్యక్తి ఎప్పటి నుండో గమనిస్తున్నాడు అని అర్ధం చేసుకోవాలి.

మిమ్మల్ని తాకడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు :

మిమ్మల్ని తాకడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు :

పురుషులు సరసమాడటానికి చాలా ఎక్కువ దగ్గరకి జరుగుతుంటారు. మీ యొక్క మృదువైన చర్మాన్ని తాకడానికి లేదా వెచ్చధనాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి సందర్భమే మీకు గనుక ఎదురైతే ఇది ఒక పెద్ద హెచ్చరికగా మీరు భావించండి.

మిమ్మల్ని ముద్దు పేర్లలతో పిలుస్తుంటారు :

మిమ్మల్ని ముద్దు పేర్లలతో పిలుస్తుంటారు :

ఎప్పుడైతే ఒక అబ్బాయి స్త్రీలను ముద్దు పేర్లతో పిలుస్తారో అప్పుడు స్త్రీలు కరిగిపోతుంటారు. మీ పై ఆసక్తిని ప్రదర్శించే పురుషుడు ఎక్కువగా ముద్దు పేర్లతో పిలుస్తుంటాడో, అతడు మీతో ముందుకు సాగాలని కోరుకుంటునాడని అర్ధం మరియు మీ నుంచి ఇంకా ఎదో ఆశిస్తూ ఉన్నాడు.

సామజిక మాధ్యమాల్లో హింసించడం :

సామజిక మాధ్యమాల్లో హింసించడం :

ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ వంటి సామజిక మాధ్యమాలను వాడటం అనేది చాలా సులువు అయిపోయింది. ఎప్పుడైతే మీరు వారిని వ్యక్తిగతంగా కలుస్తారో మరియు మీ పై వారు ఆకర్షణను పెంచుకుంటారో అటువంటి సమయంలో సామజిక మాధ్యమాలు, అంతర్జాలం మరియు వివిధ మార్గాల ద్వారా మీతో సరసమాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

మిమ్మల్ని అనుసరించడం మొదలు పెడతారు :

మిమ్మల్ని అనుసరించడం మొదలు పెడతారు :

ఇది వినడానికి కొద్దిగా గగుర్బాటు కు గురిచేసేది గా ఉన్నా ఇది నిజం. భారతీయ పురుషులు సరసమాడుతున్నారు అని తెలియజేసే విధానాల్లో ఇది కూడా ఒకటి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు.

సూచనాత్మక సందేశాలు :

సూచనాత్మక సందేశాలు :

తమకు నచ్చిన స్త్రీ ని సరసమాడటానికి చాలామంది భారతీయ పురుషులు శృంగార భావనలను అంతర్లీనముగా చొప్పిస్తూ, సూచనాత్మక సందేశాలను ఇచ్చే మార్గాన్ని కూడా ఎంచుకుంటుంటారు.

సరికొత్త విధానంలో మాట్లాడే ప్రయత్నం చేయడం :

సరికొత్త విధానంలో మాట్లాడే ప్రయత్నం చేయడం :

తనకు తెలియని ఒక కొత్త లేదా నకిలీ విధానంలో మాట్లాడే ప్రయత్నం చేసి స్త్రీతో సరసమాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా చేసినా కూడా వారు మీతో సరసమాడాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధం చేసుకోండి.

పొగడ్తలతో ముంచెత్తుతుంటారు :

పొగడ్తలతో ముంచెత్తుతుంటారు :

ఏ క్షణం అయినా పొగిడించుకోవడం అనే విషయాన్ని స్త్రీలు ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ సందర్భాన్ని కొంతమంది పురుషులు వారి యొక్క అత్యద్భుత అవకాశంగా భావించి మీతో సరసమాడటానికి ప్రయత్నిస్తారు. మీరు పనిచేసే ప్రదేశంలో ఉన్న భారతీయ పురుషుడు ఎవరైనా మీతో సరసమాడుతున్నాడా అని తెలుసుకోవాలంటే, అతడి యొక్క వ్యాఖ్యలను శ్రద్దగా గమనించండి.

అర్ధరాత్రి పూట మాట్లాడుతూ ఉండటం :

అర్ధరాత్రి పూట మాట్లాడుతూ ఉండటం :

సామజిక మాధ్యమాల ద్వారా మీరు గనుక ఆన్ లైన్ లో ఉన్నారు అనే విషయం తెలియగానే, ఎదో ఒక విషయమై మీతో చర్చించడానికి ప్రయత్నిస్తారు. ఆ విషయం అంత ముఖ్యమైనది కాకపోవచ్చు లేదా ఆ సందర్భానికి సంబంధించింది అవ్వకపోయి ఉండవచ్చు. కానీ, మీతో మాట్లాడటానికి దానిని ఒక అవకాశంగా తీసుకుంటారు. భారతీయ పురుషులు సరసమాడుతున్నారా లేదా అనే విషయం మీరు గుర్తించాలంటే, వారు మీకు సందేశం పంపినప్పుడు మీరు గనుక తిరిగి సమాధానం ఇవ్వకపోతే, వారి యొక్క నిరాశను కొద్దిగా గమనించండి.

గుంపులో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏడిపించడానికి ప్రయత్నిస్తారు :

గుంపులో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏడిపించడానికి ప్రయత్నిస్తారు :

గుంపులో ఉన్నప్పుడు సూక్ష్మమైన విధానంలో మిమ్మల్ని కొద్దిగా ఆటపట్టించి ఏడిపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా మంది భారతీయ పురుషులు సరసమాడే సాధారణ విధానాల్లో ఇది కూడా ఒకటి. మీ పై ఏ పురుషుడైతే ఆసక్తిని ప్రదర్శిస్తారో, అటువంటి వ్యక్తులు వారి యొక్క ఇరుగు పొరుగు వారిని పిలిచి మీ గురించి చెప్పడానికి లేదా మిమ్మల్ని పరిచయం చేయడానికి పరితపిస్తుంటారు.

వారి గురించి ఎక్కువగా బడాయికి పోతుంటారు :

వారి గురించి ఎక్కువగా బడాయికి పోతుంటారు :

వారి యొక్క గత చరిత్ర గురించి లేదా వారి దైనందిక కార్యకలాపాల గురించి మీకు తెలుసుకోవాలని లేకపోయినప్పటికీ వాళ్లంతకు వాళ్ళుగా వారి గురించి ఎక్కువగా బడాయికి పోతుంటారు. ఈ లక్షణం గనుక ఉంటే ఆ వ్యక్తి మీతో సరసమాడటానికి ప్రయత్నిస్తున్నారని అర్ధం.

మీ యొక్క దృష్టిని తమ వైపుకి తిప్పుకోవడం ! :

మీ యొక్క దృష్టిని తమ వైపుకి తిప్పుకోవడం ! :

మీరు ఎక్కడైనా ఉండనివ్వండి లేదా ఏమైనా చేస్తుండనివ్వండి, వారికి అనవసరం. భారతీయ పురుషులు వారికి నచ్చిన స్త్రీల పై నిఘా పెట్టి మరీ ఎదో ఒక రకంగా సరసమాడటానికి ప్రయత్నిస్తుంటారు. ఎదో ఒక వెర్రి పనులను లేదా విషయాలను చేయడానికి ప్రయత్నిస్తూ మీ యొక్క దృష్టిని తమ వైపుకు తిప్పుకోవని వారు భావిస్తుంటారు.

English summary

Ways Indian Men Flirt | Signs Of Guys Flirting | Indian Men Flirt Signs

According to reports, Indian men are into a lot of flirting to get the woman they lay eyes upon. Women who are not interested in these flirtatious men should move away from them just to be safe and secure. When compared to the rest of the men across the world, Indian men have a specific way of flirting with women which is kind of creepy.