Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
అమ్మాయిలు పైకి చెప్పనివి,కానీ కోరుకునేవి ఏమిటి
మీరు ఇంతకు ముందెప్పుడూ డేటింగ్ చేయకపోతే, ఎక్కడ మొదలుపెట్టాలి ఎలా మొదలుపెట్టాలి అని ఆలోచిస్తుండవచ్చు. మీ కళాశాల లేదా ఉద్యోగస్థలంలో ఎవరినైనా మెప్పించటానికి ప్రయత్నించే ముందు, అమ్మాయిలకి ఏవి ఇష్టం, ఏవి కాదో తెలుసుకోండి.
సమస్య ఏంటంటే ఎవరూ తమకి ఏం ఇష్టమో కాదో బయటకి సూటిగా చెప్పరు. కానీ, ఈ కాలం యువతులకి కొన్ని విషయాల పట్ల నిర్దుష్ట అభిప్రాయాలున్నాయి. ఒక అబ్బాయిగా అవి ఏంటో తెలుసుకోవటం మీ బాధ్యత. దాని వల్ల వారి మనసులను గెలుచుకునే అవకాశాలు మరింత పెరుగుతాయి. వీటిని చూడండి....

మీరు ముందు చొరవ తీసుకోవాలి
అవును, ఈ తరం అమ్మాయిలకి తమకు నచ్చిన వ్యక్తికి ప్రేమ తెలిపే ధైర్యం ఉంటుంది; కానీ, అబ్బాయి ముందడుగు వేస్తేనే బావుంటుంది. అందుకని మీకు నచ్చిన వ్యక్తికి మీ భావాలను ధైర్యంగా తెలపండి; మీలోనే దాచేసుకోకండి!

ఈ రోజుల్లో అమ్మాయిలు తమ కాళ్ళ మీద నిలబడటానికే ఇష్ట పడుతున్నారు
చాలామంది అమ్మాయిలు స్వతంత్రంగా ఉంటున్నారు. తమ కాళ్ళ మీద నిలబడటానికే ఇష్ట పడుతున్నారు. కాబట్టి మీరు యెంత డబ్బు సంపాయించినా అది వారిని ఆకర్షించదు!

'పిక్అప్ అండ్ డ్రాప్' తప్పని సరి
మీరు ఆమెని కాఫీషాప్ లో కాని, పార్క్ లో గడపటానికి కానీ పిలిచారనుకోండి, ఆమె ఎక్కడవుందో అక్కడకి వెళ్ళి ఆమెను వెంట తీసుకువెళ్ళండి. అది వారిని మెప్పిస్తుంది! 'పిక్అప్ అండ్ డ్రాప్' తప్పని సరి!

మీరుకానీ మరో అమ్మాయిని చూసారంటే ఆమెకు అస్సలు నచ్చదు!
ఆమె పక్కన వున్నపుడు వేరే అమ్మాయిలను చూడద్దు. మీరు తనతో ఉన్నప్పుడు, ఆమె మీ ప్రపంచానికి పునాది కావాలి. మరొకరి వైపు మీ దృష్టి మరలటం ఆమెకు అసహ్యకరం.

ఆమె ఏం దుస్తులు ధరించాలో చెప్పద్దు
మీ వస్త్రధారణ గూర్చి మరొకరు నియంత్రిస్తే మీకు ఎలా ఉంటుంది? ఇది కూడా అంతే. అందుకని కలలో కూడా, ఆమె బట్టల గూర్చి మాట్లాడకండి.

ఎవరెవరితో మాట్లాడాలో వద్దో మీరు నిర్ణయిస్తే ఆమెకు నచ్చదు
నిజమే, మీకు ఆమె తన సహోద్యోగులైన అబ్బాయిలతో మాట్లాడితే నచ్చదు. కానీ మీరు అలాంటి నియమాలు పెట్టలేరు. మీ సమస్య తెలపండి కానీ ఆంక్షలు విధించకండి.

ఆమెకు మీ సర్ ప్రైజులు నచ్చుతాయి
చెప్పకుండా, అనుకోకుండా ఆమె ముందు ప్రత్యక్షమవటం కానీ, దాచిఉంచిన పార్టీ లేదా బహుమతి, ఇలాంటివి ఏవైనా ఆమె ఆనందపడుతుంది!

ఆమె మగస్నేహితులతో సెల్ఫీ తీసుకోవడం వల్ల మీరు అనుమానిస్తే తనకు నచ్చదు
అవును కదా, ఆమె జీవితం, తనకు నచ్చినట్టు బ్రతకనివ్వండి!



Click it and Unblock the Notifications
