మీ భర్తకి బాధ కలిగించే విషయాలేంటి?

By: Deepti
Subscribe to Boldsky

పెళ్ళంటేనే ఒక రొమాంటిక్ కలలాగా ఉండి, చాలా మంది జంటలు వారి భవిష్యత్తు వాస్తవం ఏంటో పట్టించుకోరు. ప్రపోజ్ చేయటం, నిశ్చితార్థం పార్టీ, కలల వివాహం, భూతల స్వర్గంలో హనీమూన్- వీటన్నిటితో ఆ జంట 'ఇకపై అంతా ఆనందకరమే' జీవితం కోసం ఎదురుచూస్తుంటారు. నిజజీవిత వాస్తవాలు కళ్ళముందుకొచ్చేసరికి, వైవాహిక జీవితం పూలపాన్పు కాదని తెలుసుకుంటారు.

దైనందిక జీవితం రోజువారీ బాధ్యతలు, కుటుంబ సంరక్షణ ఇలాంటివాటికి ఏ జంటా ముందుగా తయారవ్వదు. అలాంటి పరిస్థితుల్లో, వారి బంధంలో ఆకర్షణ తగ్గిపోవటం సహజం. ఆ జంట ఈ కష్టాలు, భారాలు, పనులు, భాధ్యతలు ఇవే జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తాయని గ్రహించాలి. ఇద్దరూ కలిసి వాటిని స్వీకరించి, పంచుకుంటూ నిర్వహించాలి.

 మీ భర్తకి బాధ కలిగించే విషయాలేంటి?

ఒక భార్యగా, మీరు మీ భర్త సంతోషం కోసం కొన్ని పనులు చేయవచ్చు. మీ భర్త తన జీవితం పట్ల సంతోషంగా లేకపోతే, అతనికి చెడ్డ మూడ్ లేకుండా మీరు వీటిని మీ బంధంలో నివారించవచ్చు.

భార్య కన్నా భర్త తక్కువ డబ్బు సంపాదిస్తుంటే..?

ఈరోజు, మనం మీ భర్తకి చిరాకు తెప్పించే విషయాలేంటో కొన్ని చూసి, అవి ఎలా నివారించవచ్చో చర్చిద్దాం.

గుమ్మంలో అడుగుపెట్టగానే అతనికి ఇంటిపనులు అప్పగించటం

గుమ్మంలో అడుగుపెట్టగానే అతనికి ఇంటిపనులు అప్పగించటం

మీరూ జీవితంపట్ల అంతే అలసిపోయి ఉన్నారని, రోజువారి పనులతో విసిగిపోయి ఉన్నారని అర్థమవుతోంది. పిల్లల సంరక్షణ, ఇంటిపనులు, ఆఫీసు పనులు ఇవన్నీ కష్టమై ఉంటుండొచ్చు. కానీ మీ ఆయన ఇంట్లోకి అడుగుపెట్టగానే ఇవన్నీ అతనిమీద పడేయకండి. దానికి బదులు అతన్ని కాసేపు విశ్రాంతి తీసుకోనిచ్చి, అతనిపై ప్రేమని కురిపించి అప్పుడు పనులేమన్నా చేయమని అడగండి. అప్పుడు అతను కూడా అవి చేయడానికి సుముఖత చూపిస్తాడు.

ప్రతిసారి రొమాంటిక్ గా ఉండాలంటే అతనే ప్లాన్ చేయాలి అని ఊహించటం

ప్రతిసారి రొమాంటిక్ గా ఉండాలంటే అతనే ప్లాన్ చేయాలి అని ఊహించటం

మీ ఇద్దరి మధ్య ప్రేమను సజీవంగా ఉంచుకోటానికి దైనందిక జీవితం నుంచి కొంత సమయం దూరంగా ఉండటం సాయపడుతుంది. మీరు పనుల్లో ఉన్నప్పుడు మీ భర్త దీనికోసం ప్లాన్ చేయటం చాలా ఆనందకరంగానే ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి అతనికి కూడా ముద్దుచేయించుకోవాలని ఉండటం సహజం మరియు హక్కు కూడా. అందుకని వచ్చేసారి మీరు ప్లాన్ చేసి అతన్ని సర్ ప్రైజ్ చేయండి.

భర్త నుండి భార్య కోరుకునేదేంటి..మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే విషయాలు..!

మీరు కేవలం పిల్లలు మరియు రోజువారి విషయాల గురించే మాట్లాడతారు

మీరు కేవలం పిల్లలు మరియు రోజువారి విషయాల గురించే మాట్లాడతారు

వివాహ జీవితంలో పిల్లలు, ఇతర బాధ్యతలు ముఖ్యమైనవే కానీ, భార్యాభర్తలు కేవలం వాటి గురించే మాట్లాడుకోనక్కర్లేదు. మీరు కేవలం అవే మాట్లాడితే, మీ భర్తకి మెల్లగా విసుగు వచ్చేయచ్చు. అందుకని మీరు మీ బంధం గురించి మాట్లాడుతూ, కనీసం ఒంటరిగా ఉన్నప్పుడైనా మీ సంభాషణల్లో రొమాన్స్ ను తీసుకురండి.

మీకు సాయం కావాల్సినప్పుడు అతనికి తెలియనివ్వకపోవటం

మీకు సాయం కావాల్సినప్పుడు అతనికి తెలియనివ్వకపోవటం

మీ ఇంటి మహారాణిగా ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మీకు ఇష్టం కావచ్చు. మీ భర్త కూడా మీ మీద గౌరవంతో ఏమీ అనకపోవచ్చు. కానీ మీకు సాయం అవసరమై, అతను చేయకపోతే మీకు కోపం రావచ్చు. ఇది మీ ఇంటి శాంతికి భగ్నం కలిగిస్తుంది. అతనికి మీకు సాయం కావాలనే తెలియకపోతే, ఎలా చేస్తానని అంటాడు? అందుకని మీ ఇద్దరి మనఃశ్శాంతి కోసం, మీకు ఏపనిలోనైనా సహాయం అవసరమైతే నేరుగా అడగండి. అతని భావాలు, ఉద్వేగాలు కూడా విలువైనవే సాధారణంగా మగవారిని ఎంతో ధృఢస్తులు, స్త్రీలకు తమ భుజాన్ని ఆసరాగా ఇచ్చేవారని అనుకుంటారు. మీకు మనస్సు గజిబిజి అయిపోయినప్పుడు మీ భర్త మిమ్మల్ని దగ్గరికి తీసుకుని ఓదారుస్తాడు. ఆయనతో కూడా సున్నిత విషయాలు పంచుకుని అతని మద్దతు, విశ్వాసం పొందవచ్చు.

వివాహం తర్వాత భర్త భార్య నుండి నేర్చుకోవలసిన 10 విషయాలు

 మగవారికి కూడా ఆడవారికి కావాల్సినంత ప్రేమ, ఆసరా అవసరం

మగవారికి కూడా ఆడవారికి కావాల్సినంత ప్రేమ, ఆసరా అవసరం

అదే అతను ఏదైనా భావోద్వేగాల ఒత్తిడికి లోనైనప్పుడు, మీరు అతన్ని పట్టించుకోకుండా అతనే ధృఢంగా ఉండాలని భావిస్తారు.

అతనంత అతను పరిష్కరించుకోగలడని నమ్ముతారు. కానీ అది నిజం కాదు. మగవారికి కూడా ఆడవారికి కావాల్సినంత ప్రేమ, ఆసరా అవసరం. మీకు మీ భర్తను ఆనందంగా చూడాలని ఉంటే, అతని భావాలకు విలువనిస్తూ, అంతులేని ప్రేమ, సాన్నిహిత్యం, మీరున్నారనే ధైర్యం ఇవ్వండి.

English summary

What Makes Your Husband Happy

Do you know what makes your husband happy or unhappy? Well, as a wife it is better to know what makes him sad. Read on to know.
Story first published: Friday, July 21, 2017, 17:00 [IST]
Subscribe Newsletter