స్త్రీలు చేసే ఈ 10 విషయాల వల్ల పురుషుడు అసంతృప్తికి లోనవుతాడు!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రేమ అంటే, ఒకరినొకరు అర్ధం చేసుకోవడంతో పాటు, ఇష్టా అయిష్టాలను పరస్పరం గౌరవించుకోవడం కూడా ప్రేమలో భాగమే . దీని వల్ల ఇద్దరి మధ్య ప్రేమానుబంధం మరింత బలపడుతుంది. అబ్బాయిలు ఏ విషయాల వల్ల, తమ సంబంధ బాంధవ్య విషయాల్లో ఎక్కువ అసంతృప్తి చెందుతారో తెలుసుకోవడం పెద్ద కష్టతరం కాదు. మహిళలతో పోల్చినప్పుడు, పురుషుల మనస్తత్వాన్ని ఊహించడం కొద్దిగా సులువైన పని. అబ్బాయిలు ఏ విషయాల వల్ల ఎక్కువగా అసంతృప్తి చెందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ప్రపంచంలో ఎవరినైనా ఇంకొకరు వందకు వంద శాతం ఇష్టపడరు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తిలో అతని వ్యక్తిత్వంతో పాటు, కొన్ని గుణగణాలు మాత్రమే నచ్చుతాయి. దీని వల్లనే ఒకరినొకరు ఇష్టపడి దగ్గరవడం జరుగుతుంది.

మీరు ఒకరితో ప్రేమలో ఉన్నారంటే దాని అర్ధం, మీరు ఏమి చేసినా ఎదుటి వ్యక్తి వాటిని అంగీకరిస్తారని కాదు. అలా శృతి మించి చేసే పనుల వల్ల మీ బంధం చిక్కుల్లో పడవచ్చు. మీరు తరచూ చేసే కొన్ని పనుల వల్ల, మీ భాగస్వామి అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. వారి అసంతృప్తిని మీ పై వ్యక్తపరచొచ్చు వ్యక్తపరచకపోవచ్చు. అలాంటప్పుడు మీ పై ఆకర్షణ, కలిసి జీవించాలనే కోరిక మెల్లమెల్లగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.

ఒక మహిళ ఒక పురుషుడితో ప్రేమలో ఉన్నప్పుడు, అతని దగ్గర ఈ క్రింద చెప్పిన పనులను చేయడం వల్ల ఆ వ్యక్తి అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. ఆ పనులు ఏమిటంటే......

సెల్ఫీలు తీసుకోవడం :

సెల్ఫీలు తీసుకోవడం :

మీరు మీ భాగస్వామితో ఉన్నప్పటికీ తనపై దృష్టిని కేంద్రీకరించకుండా సెల్ఫీలు తీసుకునే మోజులో ఉంటే అది మీ బంధం పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

ఎక్కువ సేపు అద్దం ముందు కూర్చొని రెడీ అవడం లేదా ఎక్కువ సేపు సెల్ఫీలు తీసుకోవడం అనే విషయాలు అబ్బాయిలకు నచ్చవు. తనకు ప్రాముఖ్యతని ఇవ్వకుండా, మీకు మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చుకోవడం అతడికి నచ్చదు.

అతడు మీ పక్కన లేనప్పుడు మీ ఇష్టం ఉన్నంత సేపు అద్దం ముందు ఉండండి. మీకు ఇష్టం వచ్చినన్ని సెల్ఫీలు తీసుకోండి. కానీ అతడు మీ ప్రక్కన ఉన్నప్పుడు చేస్తే మాత్రం విసుగు చెందుతాడు, చిరాకు పడతాడు.

రాలిన జుట్టు :

రాలిన జుట్టు :

మాములుగా మహిళలకు జుట్టు ఊడి, గదిలో ఎక్కడో ఒక చోట పోగయ్యి కనపడుతుంటుంది. పురుషులు పడుకోవడానికి ఆ గదిలోకి వచ్చినప్పుడు ఆ జుట్టు పోగుని చూడటానికి అస్సలు ఇష్టపడడు. ముఖ్యం గా ఇంటిలో వస్తువులపైన, నేల పైన, ఇలా ఎక్కడపడితే అక్కడ అవి కనపడితే కొద్దిగా తెలియని అయిష్టతకు లోనవుతాడు.

మహిళలలో ఎలాంటి లక్షణాలు మగవారికి చిరాకు తెప్పిస్తాయి...

మీ పై మాత్రమే దృష్టి కేంద్రీకరించాలని భావనతో వ్యవహరించకండి :

మీ పై మాత్రమే దృష్టి కేంద్రీకరించాలని భావనతో వ్యవహరించకండి :

గట్టిగా మాట్లాడటం, బిగ్గరగా నవ్వడం, మొత్తంగా చుట్టుప్రక్కల ఉన్న వారందరూ మిమ్మల్నే చూడాలనే విధం గా వ్యవహరించడం, చాల మంచి వారిలా ఏమి తెలియని వారిలా అమాయకంగా నటించడం చేయకండి. అతడు మీకు దగ్గర అవ్వాలనే ప్రయత్నం లో మీరు చేసే ఇలాంటి పనులు అతడ్ని మీకు మరింత దూరం చేస్తాయి.

ఒక వేళ అది మీ వ్యక్తిత్వంలో భాగం అయ్యి, మీ సాధారణ నడవడిక అలానే ఉంటే, మిమ్మల్ని మీరు మార్చుకోనవసరం లేదు. కానీ తన దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో అలా చేస్తే మాత్రం మీకు నిరాశ తప్పదు.

వేరే వ్యక్తులపై పుకార్లు మాట్లాడటం :

వేరే వ్యక్తులపై పుకార్లు మాట్లాడటం :

ఈ ఛండాలమైన పనిని పురుషులు అస్సలు సహించలేరు. అంటే దాని అర్ధం వాళ్ళు మాట్లాడరని కాదు. ఈ ప్రపంచం లో ప్రతి ఒక్క వ్యక్తి, వేరొకరి గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ అవి మాట్లాడే స్థాయిలు వేరే ఉంటాయి. మీరు మరీ అతిగా వేరే వాళ్ల జీవితాల్లో వ్యక్తిగత విషయాల్లోని చీకటి కోణాలను ఎక్కువగా అతడితో చర్చించకండి. అలా చేస్తే అతనికి తెలియకుండానే మీ పై అయిష్టం పెరిగే ప్రమాదం ఉంది.

వికృతంగా వ్యవహరించడం :

వికృతంగా వ్యవహరించడం :

ఒక పద్ధతిలేకుండా వ్యవహరించడం, శుభ్రత పాటించకపోవడం, ఎదుటి వ్యక్తిని గౌరవించకపోవడం, నియమనిబంధనలను ఉల్లంఘించడం లాంటి విషయాలను తానూ ప్రేమించే వ్యక్తి లో ఉండటాన్ని అస్సలు సహించలేడు పురుషుడు. ఒక అమ్మాయి యుక్త వయస్సులో అలా ఉంటే ముద్దుగా అనిపించొచ్చు, కానీ వయస్సు పెరిగే కొద్దీ మార్పు రావాలి.

అతనిలో అసూయని రగిలించడం :

అతనిలో అసూయని రగిలించడం :

మీరు ప్రేమించే వ్యక్తిలో అసూయని రగిలిస్తే మీకు ఎక్కడలేని ఆనందం కలుగుతుందా ? అందుకోసం మీరు వేరే పురుషులతో, మీ భాగస్వామి ముందు చనువుగా మాట్లాడటం లేదా వాళ్ళని పొగుడుతూ ఉండటం లాంటివి చేస్తున్నారా ? అలాంటి అప్పుడు మీ భాగస్వామి లో వచ్చే స్పందనలు తెలుసుకోవడానికి ఉవ్విల్లూరుతారా ? అయితే ఇలాంటివి మరీ శృతిమించి చేయకండి, దాని వాళ్ళ మీ బంధం అదుపు తప్పి చేజారిపోయే అవకాశం ఉంది.

ఓమై గాడ్ : ఒక మనిషి నిజంగా తన చర్మాన్ని తొలగించుకుని పార్ట్నర్ ను శాటిస్పై చేశాడా..?

మీ భాగస్వామితో కాకుండా మరో పది మంది పురుషులతో సన్నిహితంగా ఉంటున్నారా? :

మీ భాగస్వామితో కాకుండా మరో పది మంది పురుషులతో సన్నిహితంగా ఉంటున్నారా? :

మీ జీవితంలోని రహస్యాలను మీరు ప్రేమించే వ్యక్తితో కాకుండా, మీకు సన్నిహితంగా ఉన్న పురుష స్నేహితులతో పంచుకుంటున్నారా ? అలా అయితే మీ భాగస్వామికి ఇలాంటి విషయాలు అసౌకర్యం కలిగిస్తాయి.

మీరు మీరుగా ఉండకపోవడం :

మీరు మీరుగా ఉండకపోవడం :

మీరు మీ వయస్సుకు తగ్గట్లు, మీ ఆలోచనా శైలికి అనుగుణంగా ఒక పెద్ద మనిషిలా హుందాగా వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. అలా కాకుండా ఎదో "మసి పూసి మారేడు కాయ" చేసే విధంగా మీ నిజమైన శైలికి బిన్నం గా నడుచుకుంటే మాత్రం చిక్కులు తప్పవు.

మీ లోదుస్తులు లేదా నెలసరి రోజుల్లో జాగ్రత్త వహించండి :

మీ లోదుస్తులు లేదా నెలసరి రోజుల్లో జాగ్రత్త వహించండి :

మీ లోదుస్తులను గదిలో ఎక్కడపడితే అక్కడ పడేయడం, నెలసరి రోజుల్లో వాడే ప్యాడ్ లను గది మూలనో లేక మీ మంచం క్రింద పెట్టడంలాంటివి చేయకండి. అలాంటివి చేయడం వల్ల మీ భాగస్వామికి మీ పై కొద్దిగ అసహ్యం పెరుగుతుంది.

అతడి ప్రవర్తనను నియంత్రించడం :

అతడి ప్రవర్తనను నియంత్రించడం :

మీ భాగస్వామికి ఎలా ప్రేమించాలి, ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, అనే విషయమై మరీ ఎక్కువ సలహాలు ఇవ్వకండి. అతని పై చిన్న చూపు చూడటం, ఎప్పుడూ సలహాలు ఇద్దామని ప్రయత్నించడం, తరచూ కోపాన్ని వ్యక్తపరచడం లాంటివి చేయడం వల్ల, అతడు పడకగదిలో లేదా బాహ్య ప్రపంచం లో మీతో ఉన్నప్పుడు అంత సఖ్యతతో ఉండలేడు. మీ బంధం బీటలు బారే ప్రమాదం ఉంది.

పైన చెప్పిన విషయాలను పాటించండి. మీ భాగస్వామితో ఎటువంటి మనస్పర్థలు లేకుండా ఆనందంగా జీవించండి.

English summary

10 Things You're Doing That Are Turning Your Guy Off!

Knowing what turns a man off in a relationship isn't rocket science. Men are a bit predictable. In this post, let us discuss what turns him off.
Story first published: Wednesday, August 9, 2017, 17:00 [IST]
Subscribe Newsletter