Just In
- 18 min ago
గర్భిణీ స్త్రీలకు ఈ ఆహారం చాలా ముఖ్యం; ఈ పండ్లు మరియు కూరగాయలు తింటే తల్లి బిడ్డ క్షేమం..
- 2 hrs ago
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- 6 hrs ago
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- 11 hrs ago
Today Rasi Palalu 28January 2023: ఈ రోజు తులారాశి వారికి అకస్మిక ధనలాభం
ప్రియమైన వారితో బంధాన్ని నిలుపుకోవాలనుకునేటప్పుడు అనుసరించవలసిన మూడు మార్గాలు
బాంధవ్యాల మధ్య తలెత్తే విభేదాలను పరిష్కరించుకోకపోతే బాంధవ్యాలు దెబ్బతింటాయి. విభేదాలను పరిష్కరించుకోవడానికి కొన్ని మార్గాలను పాటించాలి.
కుటుంబ సభ్యునితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు అలాగే ప్రియమైన వారితో ఏర్పడే విభేదం అనేది ఎంతో ఒత్తిడిపూర్వకమైనది. ఆ సమయంలో మిమ్మల్ని మానసికంగా కిందకి తీసుకురావడంతో పాటు మీ జీవితంలోని ముఖ్య విషయాలపై ఈ విభేదాల యొక్క ప్రభావం పడుతుంది. ముఖ్యంగా, ఈ గొడవలను పరిష్కరించుకోకపోతే మీకు బాగా దగ్గరైన వ్యక్తికి మీరు దూరంగా ఉంటూ మానసికంగా ఇబ్బంది పడవలసి వస్తుంది. అందువలన, బాంధవ్యాలను నిలుపుకోవాలనే ఆలోచనతోనే ముందుకు సాగాలి. ఈ పొరపచ్చాలను తొలగించుకునేందుకు సరైన మార్గాలను పాటించాలి.
ఈగోను పక్కన పెట్టండి:
ఎవరు తప్పు ఎవరు ఒప్పు అన్న విషయాన్ని పక్కన పెట్టండి. ముందుగా మీరే కాన్వర్సేషన్ ను మొదలు పెట్టండి. సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులేయండి. ఎదుటి వ్యక్తి మరీ మొండిగా ఉన్నప్పుడు ముందడుగు వేసేందుకు మీరే ప్రయత్నించండి. మీ కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి.
స్పష్టంగా మాట్లాడండి:
సమస్య ఏదైనా సరే మీరు జాగ్రత్తగా ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులేయండి. స్పష్టంగా మాట్లాడండి. మీ అభిప్రాయాలను వ్యక్తపరచండి. సగం చెప్పి సగం అర్థం చేసుకోవాలి అంటే సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం వలన మీపైన ఉండే అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. భేటీ అన్నది మీకు అసౌకర్యంగా ఉన్నా కూడా సమస్య పరిష్కారం దిశగా ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఒకవేళ మీరనుకున్నంత పెద్ద సమస్య కూడా అయి ఉండకపోవచ్చు. కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటే సమస్యకు పరిష్కారం సులభంగా లభిస్తుంది. ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ను మెరుగుపరచుకోవడం వలన పరిష్కారం కష్టతరమైనా కూడా మార్గం సులభతరమవుతుంది. మాట్లాడుకున్నాక ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మరింత గౌరవం పెరుగుతుంది.
మీ అంతట మీరే ముందుకెళ్ళండి:
మీకు మద్దతుగా ఎవరినైనా మీతో పాటు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాలని భావించవచ్చు. దానికి బదులుగా మీ అంతట మీరే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించండి. దాని వలన ఎదుటి వ్యక్తి అవమానకర భావనకు లోనవడు. స్నేహితులను అలాగే కుటుంబసభ్యులను ఇన్వాల్వ్ చేయడం మంచి ఆలోచనే అయినా సమస్య పరిష్కారానికి మీరు పడే ప్రయత్నమే ఎదుటి వ్యక్తిని ఎక్కువగా ఆకర్షిస్తుంది.