Latest Updates
-
మిథున, కర్కాటక, కన్యా రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - బుధవారం, 17 జూన్ 2026 -
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్‌లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.!
మీ భాగస్వామికి వ్యక్తిగత స్వేచ్చని ఇవ్వడానికి 3 మార్గాలు
మీ భాగస్వామికి వ్యక్తిగత స్వేచ్చని ఇవ్వడానికి 3 మార్గాలు
ఒక ఇద్దరు మనుషులు వారి జీవితాలను మరియు సమయాన్ని పంచుకోవడాన్నే, బంధం అంటారు. ఆ వ్యక్తుల మధ్య సంబంధం ఎంత దృఢమైనది అయినా, ఎవరికి వారి వ్యక్తిగత స్వేచ్ఛ కూడా చాలా ముఖ్యమైనదే!
మీ భాగస్వామికి వ్యక్తిగత స్వేచ్చని ఇవ్వడానికి 3 మార్గాలు

వ్యక్తిగత స్వేచ్ఛ మరియు దాని యొక్క హద్దులు గురించిన చర్చ ఆరోగ్యకరంగా ఉండాలి
మీరు ఒక జంట అయినప్పుడు, మీ మధ్య తలెత్తే ఎన్నో పొట్లాటలు, మీ మరియు మీ భాగస్వామి మధ్య చిచ్చు పెట్టవచ్చు. ఏ సంబంధమైన పటిష్టంగా ఉండాలంటే, భాగస్వాములు ఒకరినొకరు సంపూర్ణంగా అర్ధం చేసుకోవడం అవసరం. కానీ కొన్నిసార్లు, వీరి మధ్య తలెత్తే పోరాటాలు పరిష్కరించడానికి, వారి మధ్య కమ్యూనికేషన్ ను మించి అవసరం అయినది ఏదో ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటి సమస్యలు, తమ బంధంలో వ్యక్తిగత స్వేచ్ఛ లోపించినదని ఒక భాగస్వామి భావించినపుడు చెలరేగుతాయి. ఖచ్చితంగా, ఒక సంబంధం వారి జీవితాలను మరియు సమయంను పంచుకోవడమే అయినప్పటికీ కూడా ఇద్దరు వక్తుల మధ్య , వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యం. మీరు కనుక మీ హద్దుల మేరకు పోరాడే వ్యక్తి అయ్యి, వ్యక్తిగత స్వేచ్ఛ గురించిన అవగాహన కలిగి ఉండి, అది ఎదుటివారికి కూడా అవసరమనే తలపు ఉన్నవారైతే, మీరు కొన్ని విషయాలు మనసులో పెట్టుకోవాలి.

1. ఈ అంశాన్ని సానుకూల దృక్పథంతో చూడాలి
కొద్ది సమయాన్ని ఎవరికై వారు తమ స్వంత పనులకై వెచ్చించడం, మీకే కాదు, మీ భాగస్వామి మరియు మీ మధ్య సంబంధంలో కూడా ఉన్న ఆరోగ్యకరమైన ధోరణిని సూచిస్తుంది. మీ వ్యక్తిగత జీవితానికి, ఒక జంటగా మీకున్న గుర్తింపుకు మధ్య ఉన్న సమతుల్యాన్ని పాటించడం వలన, మీ జీవితంలోని ప్రతి అంశానికీ మనస్ఫూర్తిగా సమయం వెచ్చించగలుగుతారు.

2. ఇది మీకు విరుద్ధం కాదని గుర్తించండి.
కొన్నిసార్లు, తమ భాగస్వామి వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకున్నప్పుడు,చాలామంది అది తమ భాగస్వామి ఆ సంబంధం పట్ల సంతోషంగా లేరని లేదా వారికి ఆ సంబంధం నుండి బయట పడాలన్న కోరికకు సంకేతంగా అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. ఒక భాగస్వామి వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకోవడమనేది, వారికున్న ఎన్నో కొరికలలో ఒకటి మాత్రమే! ఇద్దరూ కలిసి వారి హద్దులను మరియు అవసరాలను ఆరోగ్యకరమైన విధానంలో, స్పష్టంగా గుర్తించుకోవాలి, కానీ ఎటువంటి అభద్రతా భావాన్ని పెంచుకోకూడదు.

3. మీ మనసు ఏమంటుందో మీరు తెలుసుకోండి
వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వాలనే ఆలోచన మిమ్మల్ని ఒత్తిడికి లోను చేస్తే, ఈ విషయాన్ని మీ భాగస్వామికి తెలియజేసి, సామరస్యంగా ఒక పరిష్కారానికి లేదా ఇరువురికి అంగీకారం అయిన ఒక ఒప్పందానికి రండి. మీరు ఇద్దరి మధ్య సమానత్వాన్ని పెంచి పోషించండి, అంతేకాని ఒకరిని మరొకరు దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా భావించవద్దు.



Click it and Unblock the Notifications