For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బాల్య స్నేహితులు ఎల్లప్పుడూ ప్రత్యేకమని చెప్పే 6 కారణాలు !

మీ బాల్య స్నేహితులు ఎల్లప్పుడూ ప్రత్యేకమని చెప్పే 6 కారణాలు !

By Lekhaka
|

"ఫ్రెండ్షిప్ డే" మనకు చాలా దగ్గరలో ఉంది. ఈ సమయంలో మన జీవితంలో ఫ్రెండ్స్ తో ఉత్తమంగా గడిపిన కొన్ని సంవత్సరాల మధుర జ్ఞాపకాలను తలచుకొంటూ ఉంటాము. చిన్ననాటి స్నేహితులతో మనకున్న అనుబంధాన్ని వేరెవరూ భర్తీ చేయలేరని చాలామంది చెబుతారు, ఇది నిజం ! మన లైఫ్ లో మనము వర్క్ చేసే చోట & సోషల్ సర్కిల్స్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ వారంతా మనకి సన్నిహితం కాలేరు.

మన చిన్ననాటి స్నేహితులు గొప్పవారిని చెప్పే 6 కారణాలు ఇక్కడ ఉన్నాయి !

1. మీ గూర్చి వారికి అన్నీ తెలుసు :

1. మీ గూర్చి వారికి అన్నీ తెలుసు :

మీ చిన్ననాటి స్నేహితులతో మీకు చాలా జ్ఞాపకాలు ఉంటాయి. మాథ్స్ ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అవ్వడం దగ్గర నుంచి - మీరు చేసిన వింత వింత పనుల వంటి ప్రతీ అంశాన్ని మీ చిన్ననాటి స్నేహితులు బాగా అనుభవం పొంది ఉంటారు.

2. మీరు సిగ్గుపడిన క్షణాలు :

2. మీరు సిగ్గుపడిన క్షణాలు :

మీరు దాచిపెట్టిన మీ మొదటి క్రష్ (గర్ల్ ఫ్రెండ్), టీనేజ్లో మీరు మెయింటైన్ చేసిన హెయిర్ స్టైల్స్, మీరు భయపడుతూ కిస్ చేసిన విషయాలు కూడా మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ కి తప్ప ఇంకెవరికీ తెలియదు. వారు మీ జీవితంలో ప్రముఖ భాగమైపోయి ఉంటారు కాబట్టి వారిని మీరు అంత త్వరగా మర్చిపోలేరు.

3. మీ మధ్య దూరం పెద్ద విషయమేమీ కాదు :

3. మీ మధ్య దూరం పెద్ద విషయమేమీ కాదు :

మీ స్నేహితులు మీ సమీప ప్రాంతాలలో నివసించగా పోవచ్చు. ఒకే రాష్ట్రంలో (లేదా) ఓకే ఖండంలో కూడా ఉండకపోవచ్చు. కానీ అవేమీ పెద్ద విషయాలు కావు. మీరు కోరుకున్నప్పుడు ఒక వీడియో కాల్ (లేదా) టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీ ఫ్రెండ్ కి దగ్గరవడం ద్వారా కొన్ని వేల కిలోమీటర్ల దూరం కరిగిపోతాయి. ఎందుకంటే, వారితో మీరు సన్నిహితమైన సంబంధాన్ని కలిగివుంటారు.

4. మీ మధ్య ఉండే స్నేహాబంధం చాలా పటిష్టమైనది :

4. మీ మధ్య ఉండే స్నేహాబంధం చాలా పటిష్టమైనది :

మీ వల్ల మీ స్నేహితులు ఎన్నోసార్లు బాధపడి ఉండవచ్చు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో మీరు వారికి సాయం చేయనప్పటికీ కూడా వారు మీకు చాలా దగ్గరగా అంటుకొని మరి ఉంటారు (అది ఎలాంటి కఠినమైన పరిస్థితిలు అయినప్పటికీ కూడా) !

5. మిమ్మల్ని తేలికగా గుర్తిస్తారు :

5. మిమ్మల్ని తేలికగా గుర్తిస్తారు :

మీ చిన్ననాటి ఫ్రెండ్స్ మిమ్మల్ని చాలా తేలికగా గుర్తిస్తారు. వారికి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గురించి తెలియజేయనవసరం లేదు. మీరు మీ ఫ్యామిలీ ముందు, రిలేషన్షిప్ ముందు, ఫ్రెండ్స్ ముందు ఎన్ని డ్రామాలు వేశారో అన్నది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్లకి ఇవేమీ ప్రత్యేకంగా తెలియజేయనవసరం లేదు.

6. మీ బంధం ప్రత్యేకమైనది :

6. మీ బంధం ప్రత్యేకమైనది :

మీరు మీ పాత స్నేహితులను కోల్పోవచ్చు, వారి స్థానంలో కొత్త స్నేహితులతో పరిచయం కావచ్చు. లేదంటే, మీరే వేరొక దేశానికి వెళ్ళవచ్చు, అక్కడ పరిచయమైన ప్రముఖులలో మీ స్నేహితులను చూసుకోగలరు. అలా ఎక్కడైతే మీరు మీ ఫ్రెండ్ని విడిచిపెట్టారో - అక్కడి నుండే మీరు వారిని తలంచుకోగలరు. అలా మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ మధ్య ఉన్న జ్ఞాపకాలను పంచుకోవడం ద్వారా మీ బంధం పటిష్టంగా మారి, మీ జీవితంలో అత్యున్నతమైన, ఆనందకరమైన క్షణాలను పొందేలా చేయగలదు.

English summary

6 Reasons Why Childhood Friends Will Always Be Special

With friendship day right around the corner, it's a good time to throw back to the ones you spent the best years of your life with. It's true when they say that childhood friends are irreplaceable because no one in the world truly knows you the way they do. You will make many more friends at work and in social circles but none will come even close. Here are 6 reasons why childhood friendships really are the best ones.
Story first published:Wednesday, August 29, 2018, 17:40 [IST]
Desktop Bottom Promotion