ప్రేమలోని స్వచ్ఛతను తెలియజెప్పే ఈ ప్రేమ కథ ఖచ్చితంగా అందరూ వినాలి

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రస్తుత తరాల్లో చాలామంది మూసపోత పద్దతిలో తమంతట తాముగా ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. కేవలం జంటలలో మాత్రమే ప్రేమ ఉంటుందని, కనపడుతుందని చాలామంది బలంగా నమ్ముతారు. అయితే, ఈ ఆలోచన నిజానికి చాలా దూరంగా ఉంది.

స్వచ్ఛమైన ప్రేమ తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్యన ఉంటుంది. పుట్టిన ప్రతిఒక్కరు తల్లిదండ్రుల నుండి స్వచ్ఛమైన ప్రేమను తీసుకుంటున్నారా అంటే చెప్పడం కష్టం. అందుకు కూడా అదృష్టం ఉండాలి. ఎవరికైతే అటువంటి స్వచ్ఛమైన ప్రేమ లభిస్తుందో, వారు వారి యొక్క జీవితంలో ఏర్పరుచుకోబోయే ప్రతి ఒక్క సంబంధ బాంధవ్యాల్లో అటువంటి ప్రేమను పొందడానికి, వ్యక్తపరచడానికి ఇష్టపడతారు.

love story

ప్రకృతి సిద్ధంగా, ఈ సంబంధ బాంధవ్యాలు అనేటివి పరస్పర ఇచ్చుపుచ్చుకొనే విధంగా ఉంటాయి. అంటే దీని యొక్క నిఘాడమైన అర్ధం ఏమిటంటే, తల్లిదండ్రులు వెలకట్టలేనంత ప్రేమను మరియు ఎంతో సమయాన్ని పిల్లలపై వెచ్చిస్తారు. ఇందుకు బదులుగా తల్లిదండ్రులు ముసలి వయస్సుకు చేరుకున్నప్పుడు పిల్లలు వారియొక్క బాధ్యతని భుజాన పై వేసుకొని, వారిని కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు, ఎంతో ప్రేమని వారికి అందించాలని చాలామంది ఆశిస్తారు.

ఇలా గనుక చేయకపోతే వారిలో ప్రేమ కోసం దాహం పెరిగిపోతుంది మరియు తమను ప్రేమించేవారి కోసం తపిస్తారు. ఇప్పుడు మనం 60 సంవత్సరాల వయస్సున్న కైలాష్ సేన్ మరియు యుక్త వయస్సులో ఉన్న డాక్టర్ సునయన పథక్ ల కథ గురించి తెలుసుకోబోతున్నాం.

కైలాష్ నేపథ్యం :

కైలాష్ నేపథ్యం :

కైలాష్ సేన్ ఢిల్లీ లోని సి.ఆర్ పార్క్ ప్రాంతానికి వచ్చి ఒక సంవత్సర కాలం అయ్యింది. అతడి కొడుకు అనూప్ ఒక గది మరియు వంట గది ఉన్న ఫ్లాట్ కొన్నాడు. పది సంవత్సరాల క్రితం అనూప్ మరియు తన భార్య, కూతురితో కలిసి అమెరికా వెళ్ళిపోయాడు. తన తండ్రి గనుక ఢిల్లీలో ఉంటే, తనను కలుసుకోవడం, మాట్లాడటం సులభంగా ఉంటుందని భావించి తండ్రిని ఢిల్లీ కి మార్పు చేసాడు.

భావోద్వేగాలు మిళితమైన వేల :

భావోద్వేగాలు మిళితమైన వేల :

డుండుం లో సేన్ కు 4 వేల చదరపు అడుగుల బంగ్లా ఉంది. అంత పెద్ద ఇంటిని వదిలి ఒక అపార్ట్మెంట్ లోని మూడవ అంతస్తులోని కేవలం 500 చరుపు అడుగులు ఉన్న ఇంటిలో జీవనం సాగించేవాడు సేన్. దీని వల్ల అతను క్లాస్త్రోఫోభియా అనే మానసిక రుగ్మతతో కూడా అప్పుడప్పుడు బాధపడేవాడు. అంతేకాకుండా అతడికి చుట్టుప్రక్కల ఎవ్వరూ తెలీదు. అతడు తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు సాయంత్రం వేళ ఒక చిన్న అడ్డా లో కూర్చొని, తన స్నేహితులతో కబుర్లు చెప్పుకొనేవాడు. ఆ ఆనందాన్ని ఇక్కడ కోల్పోయాడు.

ఏకాంతంగా నివసిస్తున్న అమ్మాయి :

ఏకాంతంగా నివసిస్తున్న అమ్మాయి :

సునయన అనే అమ్మాయి ఉత్తరాది ప్రాంతానికి చెందినది. ఈమె కోల్ కత్తా ప్రాంతంలో పుట్టి పెరిగింది. అయితే ఈమెకు చిన్నప్పటి నుండి ప్రేమ కరువైంది. ఈమె తల్లిదండ్రులు మగ పిల్లాడు కావాలనుకున్నారు. ఈ అమ్మాయి జన్మించే సమయంలో చోటు చేసుకున్న కొన్ని సమస్యల కారణంగా, ఈమె తల్లి మళ్ళీ గర్భం దాల్చలేకపోయింది. అందుచేత ఈమె తల్లిదండ్రులు ఈమెను ద్వేషించడం ప్రారంభించారు.

చివరకు ఈ అమ్మాయి వైద్యురాలుగా పట్టా అందుకుంది. తాను ఒకటే లక్ష్యాన్ని పెట్టుకుంది. డబ్బుని బాగా ఆదా చేసి నగరంలో డబ్బున్న ప్రాంతాల్లో ఎక్కడైనా ఒక పెద్ద బంగ్లా కొనాలని నిశ్చయించుకుంది.

కలలు నిజమవ్వడం ప్రారంభం అయ్యింది :

కలలు నిజమవ్వడం ప్రారంభం అయ్యింది :

సునయన 8 సంవత్సరాల పాటు కోల్ కత్తా నగరంలోని బాగా పేరుగడించిన ఆసుపత్రిలో వైద్యురాలుగా సేవలు అందించింది. ఒక సంవత్సరం క్రితం చివరకు సునయన తానూ కోరుకున్నట్లుగానే 4000 చదరపు అడుగుల బంగ్లాను కొనే ఆర్ధిక స్థోమతకు చేరుకుంది. ఇక ఇప్పటి నుండి తన జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుందని భావించింది. ఇక నేను కలలు కన్న ఇంటికి మారిన తర్వాత తన జీవితం మరింత బాగుంటుంది అని భావించింది.

అయినప్పటికీ ఇది నిజానికి చాలా దూరంగా ఉంది. ఎందుకంటే, ప్రతి రాత్రి ఆమెను ఏకాంతం విపరీతంగా వేధించేది. ఎంతో ఉన్నత చదువులు చదివిన డాక్టర్ సునయన పథక్ తాను ఎదుర్కొంటున్న ఈ సమస్యలను పట్టించుకోవడం మానేసింది.

ఇద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడిందంటే :

ఇద్దరి మధ్య బంధం ఎలా ఏర్పడిందంటే :

ఒక రోజు ఉదయం ఎప్పటిలాగానే సునయన తన పనికి వెళ్ళడానికి సమాయత్తం అవుతోంది. అనుకోకుండా బయట నుండి ఎవరో తలుపు కొట్టారు. దీంతో ఎవరా వ్యక్తి అని చూడటానికి ఎంతో ఆతృతగా సునయన పై నుండి క్రిందకి వెళ్ళింది. తలుపు తీసిన తర్వాత ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఒక ప్రభుత్వ అధికారి వచ్చి ఉన్నాడు. అతడు సునయనకు ఒక సమాచార పత్రం ఇచ్చాడు. గత 9 సంవత్సరాలుగా బంగ్లాకు భూమి పన్ను కట్టలేదని, నెలలోపు గనుక బకాయి మొత్తం తీర్చకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అందులో రాసి ఉంది.

ఈ అమ్మాయి ఒక సంవత్సరం క్రితమే, అనూప్ సేన్ అనే వ్యక్తి దగ్గర నుండి ఆ బంగ్లా కొనుక్కుంది. సునయన వచ్చిన అధికారికి ధన్యవాదాలు తెలిపింది. అతడు వెళ్ళిపోయిన తర్వాత అనూప్ కి ఫోన్ చేసింది. ఆ సమయంలో అనూప్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. దీంతో ఏమి చేయాలో పాలుపోక, రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకున్న దస్తావేజుల్లో అనూప్ ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి అడ్రెస్స్ వెతకడం ప్రారంభించింది.

ఆ దస్తావేజుల్లో ఎక్కడో ఒక దగ్గర ' 13/5 సి.ఆర్ పార్క్, న్యూ ఢిల్లీ ' అని రాసి ఉంది. ఇక గత్యంతరంలేక సునయన మరసటి వారమే ఢిల్లీ వెళ్లి వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకుంది. ఎందుచేతనంటే, పన్ను తో పాటు జరిమానా కూడా కలిపి మొత్తం లక్ష ఇరవై వేలు కట్టాల్సి ఉంది.

ఒక్కసారిగా షాక్ కి గురైంది :

ఒక్కసారిగా షాక్ కి గురైంది :

ఎలాగోలా శనివారం సాయంత్రానికి 13/5 సి.ఆర్ పార్క్ కి చేరుకుంది. తాను ఎవరి దగ్గర అయితే ఇంటిని కొన్నానో అతను గాని, అతని భార్య గాని వచ్చి తలుపు తీస్తారు అని భావించింది.

కానీ, ఈమె ఊహించనిదానికి విరుద్ధంగా, విస్తుపోయేలా దాదాపు 60 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి తలుపు తీసాడు. గుండె సంబంధిత వ్యాధుల నిపుణురాలైన ఈ యుక్త వయస్సు వైద్యురాలు ఈ సంఘటన చూసి ఒక్కసారి నిర్ఘాంతపోయింది. తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆ దస్తావేజులను, పన్ను కట్టాల్సిన పత్రాలను ఆ ముసలి వ్యక్తికి చూపించి, తన కథను చెప్పడం మొదలు పెట్టింది. ఇది విన్న వెంటనే సేన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వంశపారంపర్యంగా వస్తున్న ఒక ఇంటిని తన కొడుకు తనకు తెలియ కుండానే అమ్మేశాడు అనే విషయాన్ని తెలుసుకొని ఒక్కసారిగా నిర్ఘాతపోయాడు ఆ తండ్రి.

నిష్క్రమించు సమయం :

నిష్క్రమించు సమయం :

సేన్ సునయనకు వెళ్లే సమయంలో ఒక చెక్ ఇచ్చి పంపించాడు. తాను ఒక నిజమైన మనసున్న వ్యక్తి అని సేన్ నిరూపించాడు. అక్కడ నుండి ఆ తర్వాత సునయన వెళ్ళిపోయింది. ఎందుకంటే, ఆమె కొద్ది గంటల్లోనే తిరిగి వెళ్లే విమానాన్ని ఎక్కవలసి ఉంది. అయినప్పటికీ ఈ ముసలాయన లోని ఎదో విషయం ఆమెను వెంటాడం ప్రారంభించింది.

అతను అనుభవిస్తున్న ఏకాంతాన్ని మరియు జీవితాన్ని సరిపోల్చి చూసుకున్నప్పుడు, తనని తానూ చేసుకున్నట్లు భావించింది సునయన. కోల్ కత్తా కు తిరిగి వచ్చేసిన తర్వాత కూడా ముసలాయనకు సునయన ఫోన్ చేస్తూ ఉండేది. మెల్లగా ఫోన్ లో మాట్లాడుకునే స్థాయి నుండి స్కైప్ లో వీడియో కాల్స్ మాట్లాడుకొనే స్థాయికి చేరింది. కాలక్రమంలో వీరిద్దరూ బాగా దగ్గరవడం ప్రారంభం అయ్యింది. ఎందుచేతనంటే వీరిద్దరూ ఎంతో కాలంగా తోడు లేకుండానే గడిపారు.

పుట్టినరోజు :

పుట్టినరోజు :

సునయన స్వతంత్రంగా వ్యవహరించే ఆలోచన ధోరణి గల యుక్తవయస్సులో ఉన్న అమ్మాయి. అందుచేతనే పుట్టినరోజులకు ఆమె పెద్ద ప్రాముఖ్యతని ఇవ్వదు. ఎందుకంటే, ఆమె చిన్నప్పటి నుండి కూడా ఏకాంతంగానే జీవించేది. అటువంటి ఈమె పుట్టినరోజు సందర్భంగా కైలాష్ సేన్ గడప దగ్గర నిలుచొని ఉన్నాడు. తన పుట్టినరోజునాడు వచ్చిన అరుదైన గొప్ప బహుమతిగా ఈమె ఈ సంఘటనను భావించింది.

రెండురోజుల పాటు ఆమెతో పాటు ఉండి సమయాన్ని ఆహ్లాదకరంగా గడిపి తిరిగి విమానంలో వెళ్ళిపోవాలి అనుకున్నాడు సేన్. ఆ రెండురోజులు సునయన తన జీవితానికి సరిపడా జ్ఞాపకాలను ఏర్పరుచుకుంది, పదిలం చేసుకుంది.

ఐకమత్యం :

ఐకమత్యం :

ఆ రోజు రాత్రి సేన్ సునయనని విడిచి వెళ్ళవలసిన సమయం. సునయన తన మెదడుతో బాగా అలోచించి, ఒక నిర్ణయానికి వచ్చింది. సునయన అలా నడుచుకుంటూ సేన్ దగ్గరకు వెళ్ళింది. ఆమె యొక్క భావాలను అతడికి అర్ధమయ్యే రీతిలో చెప్పింది. ఎంతలా చెప్పడం మొదలుపెట్టిందంటే, అతని దగ్గర నుంచి తాను ఎంత ప్రేమ పొందుతున్నాను అనే విషయం మరియు ఆ ప్రేమ తనకు ఎందుకంత ముఖ్యమో చెప్పుకొచ్చింది. తాను పుట్టినప్పటి నుండి ఇలాంటి ప్రేమ కోసమే వేచి చూస్తున్నాను అని,ఇంతకాలానికి నాకు అది దొరికిందని చెప్పింది. ఇద్దరి మధ్య సంభాషణ ముగిసే సమయానికి సేన్ కంటి నుండి కన్నీళ్లు ఉబుకుతున్నాయి. సునయన గట్టిగా ఏడవటం ప్రారంభించింది. చివరకు ఇద్దరు కౌగలించుకున్నారు.

ఆ తర్వాత ఈ ప్రేమ కథ ఎలా ప్రయాణించిందంటే :

ఆ తర్వాత ఈ ప్రేమ కథ ఎలా ప్రయాణించిందంటే :

ఆ తర్వాత నుండి వీరిద్దరూ ఎంతో ఆనందకరమైన జీవితాన్ని బాలీగొంగు లో ఉన్న బంగ్లాలో గడిపారు. సునయన వృత్తిపరంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ప్రారంభించింది. కైలాష్ తన యవనత్వంలో ఉన్న ఓజస్సుని తిరిగిపొందటం ప్రారంభించాడు. రోజులు గడిచే కొద్దీ మరింత యవ్వనాన్ని సంతరించుకున్నాడు. ఈ రకమైన జీవితాన్ని ఎలా వర్గీకరించాలి ? మరియు ఏ వర్గానికి చెందింది ఈ జీవితం అని చెప్పాలి ? అనే విషయం ఎవరికీ అర్ధం కాలేదు. కానీ, ఖచ్చితంగా అందరు ఒప్పుకొని తీరాల్సిన నిజం ఏమిటంటే పైన చెప్పబడిన నిజ జీవిత కథలో ప్రేమ చాలా స్వచ్ఛమైన రూపంలో ఉంది

English summary

love story | pure love

The purest form of love is that between a child and his or her parent. Now not everyone is blessed to have the good fortune of receiving the love of their parents from a young age and some of them end up craving the same in every relationship that they build later on in life. This relationship is also reciprocal
Story first published: Saturday, January 20, 2018, 16:00 [IST]
Subscribe Newsletter