For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Friendship Day 2021 : చెక్కు చెదరని బంధమే స్నేహం.. అందరినీ కలుపుకుని పోవడమే దీని లక్ష్యం...

ఫ్రెండ్షిప్ డే : 1930 నుండి చెక్కు చెదరని స్నేహానికి గుర్తుగా ఈ వేడుక

|

ఎవరైతే స్నేహానికి అత్యంత విలువని ఇస్తారో, ఎవరైతే పరస్పర స్నేహభావాన్ని కలిగి, జీవితాంతం ఒకరి పట్ల మరొకరు నిబద్దతను ప్రదర్శిస్తుంటారో, వారికే ప్రపంచ స్నేహితుల దినోత్సవం అంకితం. వసుదైవ కుటుంబం అనగా ఈ ప్రపంచంలోని వ్యక్తులంతా ఒకే కుటుంబానికి చెందినవారు అని, అవును మనమంతా ఒకే కుటుంబానికి చెందినవారం. మనమధ్య సంబంధాలు అన్న, అక్క, చెల్లి, తమ్ముడు,బాబాయి, మామ, అత్త, పిన్ని, బావ, మరదలు ఇలానే ఉండనవసరం లేదు. స్నేహం కూడా ఒక బంధమే. ఆ స్నేహబంధాలే లేకుంటే మనమంతా ఎవరికి వారమే కదా, రాళ్ళకు మనుషులకు తేడా ఉండేది కాదు.

అనేక కారణాలతో కూడిన ఈ స్నేహితుల దినోత్సవాన్ని విలువలతో కూడిన మానవ సంబంధాలను ఏర్పరచడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మనమందరం వేరేవేరే అయి ఉండవచ్చు, కానీ ఆపదలో ఉన్నప్పుడు మేమున్నాం అంటూ ముందుకొచ్చే స్నేహితుడు ఒక్కడున్నా, ఆ జీవితం చరితార్ధం అవుతుంది.

Friendship Day; A Celebration Amongst Friends Since 1930 ,

స్నేహితుల దినోత్సవం అంటే ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా మనుషుల మరియు మనసుల మద్య సంబంధాలను పదిలపరచే క్రమంలో భాగంగా నిర్దేశించబడిన రోజు ఈ స్నేహితుల దినోత్సవం. ఇది అనేక దేశాలలో ప్రసిద్ధి చెందింది కూడా. స్నేహితుల దినోత్సవం కోసం వారం, లేదా నెల ముందు నుండే ప్లానింగ్ లేదా షాపింగ్ చేసేవారు ఈ ప్రపంచంలో వందల, వేల మంది ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. కారణం గుండెల నిండా వ్యక్తుల పట్ల ఉన్న అభిమానాన్ని వ్యక్తపరచే రోజుగా వస్తుంది కాబట్టి. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నీచేయి వీడనన్న భరోసా ఇచ్చేది ఒక్క స్నేహితుడు మాత్రమే అన్నది జగమెరిగిన సత్యం. కులం, మతం, భాష మరియు వర్గ భేదాలు లేకుండా వ్యక్తుల మద్య ఏర్పడగలిగే పవిత్ర బంధం స్నేహం.

అసలు ఈరోజు వెనుకనున్న చరిత్ర ఏమిటి?
ఈరోజు వెనుక చరిత్ర 1930 నాటిది. మొదటి ప్రపంచయుద్ధం ముగిసిన తరువాత, శాంతి మరియు వ్యక్తుల మద్య ఆరోగ్యకర సంబంధాలు నెలకొల్పాల్సిన అవసరం ఏర్పడింది. జాయ్సీ హాల్, హాల్మార్క్ కార్డుల వ్యవస్థాపకుడు, ఈ స్నేహితుల దినోత్సవాన్ని ప్రారంభించాడు. ఆగష్టు 2వ తేదీన స్నేహితుల దినోత్సవం చేయవలసినదిగా ప్రణాళిక చేయబడింది.

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం మొదటిసారిగా1935లో అమెరికాలో ప్రారంభమైంది, కానీ అమెరికా కాంగ్రెస్, ప్రతి సంవత్సరం ఆగష్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకునేలా ప్రణాళికలు చేయాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగానున్న స్నేహితులను గౌరవించడం మరియు స్నేహితుల గౌరవార్థం స్నేహితుల దినోత్సవం ప్రారంభించబడింది.

ప్రస్తుతం యువత వారి స్నేహాన్ని వేడుక చేసుకునే క్రమంలో జరుపుకుంటున్నారు. క్రమంగా ఇది జాతీయ వేడుకగా రూపాంతరం చెందింది. స్నేహితులు మరియు స్నేహాన్ని గౌరవించేలా ఒకరోజు ఉండడం నిజంగా సంతోషకరమైన విషయమే. ఈ స్నేహితుల దినోత్సవం జరుపుకునే ప్రతిదేశంలోనూ ఒక పండుగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది.

ఈ వేడుక జరుపుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడం మూలంగా, దక్షిణ అమెరికా దేశాలతోపాటు ఇతరాత్రా దేశాలు కూడా నెమ్మదిగా ఈ వేడుకను చేసుకోవడం ఆరంభించాయి. 1958నాటికి, జూలై 30న పరాగ్వే దేశం తన సొంత జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రారంభించింది.

దక్షిణ ఆసియా దేశాలలో, ఆగష్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలలో దీనిని జూలై 20వ తేదీన జరుపుకుంటారు. ఫిన్లాండ్, ఎస్టోనియా దేశాలలో అయితే స్నేహితుల రోజునే ప్రేమికుల దినోత్సవం కూడా జరుపుకుంటారు.

ఈరోజు ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారు?

అందరూ వారివారి స్నేహితులకు బహుమతులు మరియు గ్రీటింగ్ కార్డులు ఇవ్వాలన్న కుతూహలాన్ని కలిగి ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటనగా ఈరోజున, మతాలు, రంగు, జాతి, మతం మరియు లింగాభేదాల గురించిన పాటింపును ఎవరూ పట్టించుకోరు. కొంతమంది ప్రజలు గ్రీటింగ్ కార్డులను స్వయంగా తయారుచేసి ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు. లేదా వాటిని కొనుగోలు చేసి తమ స్నేహానికి గుర్తుగా తమ స్నేహితులకు ఇచ్చి సంతోషాలను పంచుకుంటారు.


ఇతర దేశాలలో మాదిరిగానే, భారతదేశంలో కూడా స్నేహితుల దినోత్సవం జరుపుకోడానికి ప్రజలు కనీసం ఒకవారం ముందుగానే ప్లాన్ చేస్తారని మనం చెప్పుకున్నాము. రెస్టారెంట్లు, పబ్బులలో ముందుగానే సీట్స్ రిజర్వ్ చేయడం కూడా పరిపాటిగా ఉంటుంది. యువకులు వారి స్నేహితులను ఆనందపరిచేందుకు, ప్రత్యేకంగా ఆరోజు గ్రీటింగ్ కార్డులు లేదా బహుమతులను ఇవ్వడానికి అమితాసక్తిని కలిగి ఉంటారు. భారతదేశంలో లౌకికవాదాన్ని రక్షిస్తున్న పండుగలలో ప్రధానంగా చెప్పుకోదగినదిగా ఈ స్నేహితుల దోనోత్సవం ఉంది అనడంలో ఆశ్చర్యమే లేదు.

ఎందుకు మనం ఈరోజునే స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాము?

ప్రారంభంలో, స్నేహితుల గౌరవార్ధం మరియు స్నేహాన్ని వేడుక చేసుకునేలా ప్రారంభించబడిన ఈరోజు, క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందటం మూలంగా, ఇది ప్రపంచ వ్యాప్తంగా స్నేహితుల మధ్య వేడుకగా మారింది. ఈరోజు అనేక మంది స్నేహితులకు ప్రధానమైన రోజుగా ఉండడమే కాకుండా, అనేక మంది వ్యక్తుల మద్య స్నేహం చిగురించడానికి కూడా ఒక వేదికగా మారింది. వారి స్నేహితుల సంరక్షణ, గౌరవం మరియు వారిపై ఉన్న నమ్మకానికి గుర్తుగా ఈరోజును తమ తమ ఆలోచనా విధానాల ప్రకారం సర్ప్రైజ్ పార్టీలు, ట్రిప్స్, లేదా బహుమతులతో వేడుక చేసుకుంటూ ఉంటారు. ఇది స్నేహితుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి మరియు స్నేహితుల మధ్య మంచి బలమైన సంబంధాన్ని నిర్మించే క్రమంలో భాగంగా తోడ్పడుతుంది.

దగ్గరగా ఉన్న స్నేహితులే కాకుండా, దూరప్రాంతాలలోని స్నేహితులు కూడా సామాజిక మాధ్యమాలలో తమ తమ భావాలని వ్యక్తపరుస్తూ, స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం పరిపాటిగా వస్తుంది. కొందరైతే, కేవలం స్నేహితుల దోనోత్సవం కోసం సర్ప్రైజ్ విజిట్స్ చేస్తూ అబ్బురపరుస్తూ ఉంటారు. ఇది వారి వారి భావాల ప్రకారం, ప్రేమలకు, స్నేహానికి, సంబంధాలకు ఇచ్చే విలువను బట్టి ఆధారపడి ఉంటుంది.

ఆగస్ట్ మొదటి ఆదివారం సమీపిస్తున్న దృష్ట్యా, మన బోల్డ్స్కీ, ఈ దేశ ప్రజలందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తుంది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మరిన్ని వివరాల కోసం, బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.

మీకు ఈ వ్యాసం నచ్చినట్లైతే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. మీ వ్యాఖ్యలను అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Friendship Day; A Celebration Amongst Friends Since 1930

The world belongs to the ones who believe in the nature of friendship and share the same amongst each other. "Vasudhaiva Kutumbakam" or "the world is one family" is the way to realise we are all the same and we are one big family, involving every form of living being under one shed. Friendship is the most common form of connection between us and we know if not for friendship, we would have been divided from the start.
Desktop Bottom Promotion