For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? లేదా ప్రేమలో ఉన్నామన్న భావనలో ఉన్నారా? నిర్ధారించుకోండి.

ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? లేదా ప్రేమలో ఉన్నామన్న భావనలో ఉన్నారా? నిర్ధారించుకోండి.

|

ప్రేమ, ద్వేషం, ఆప్యాయత, కోపం ఇలాంటివన్నీ మనిషి జీవితంలో ఖచ్చితంగా ఎదురయ్యే అనుభూతులు. అందులో ప్రేమ అనేది అనిర్వచనీయం. ఒక కణంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల యొక్క కలయిక ఎలాగో, అలాంటిదే ప్రేమ కూడా. ప్రేమ అనేది ఒక డ్రగ్ వంటిది, ఒక్కసారి అనుభూతి చెందితే, ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ప్రేమ అనేది సంతోషం, విచారం, గందరగోళం, నిరాశ, నవ్వు వంటి అనేక అంశాల మేలుకలయికతో ఉగాది పచ్చడిలా ఉంటుంది. ఒక మనిషిలోని భిన్న కోణాన్ని వెలికితీసే ఒకే ఒక్క సాధనం ప్రేమ. ఆత్మ విశ్వాసాన్ని పెంచడంలోనే కాకుండా, అనేక మానసిక సమస్యలకు విరుగుడుగా ఉంటుంది ప్రేమ. రెండు మనసులు ఒకటిగా మారేలా చేయగల తిరుగులేని ఆయుధం ప్రేమ.

భావాలను బందీగా చేసే ఒకే ఒక్క పదం ప్రేమ. అంతే కాకుండా శరీరంలోని ప్రతి భాగాన్ని, తనకు కావలసినప్పుడు, తనకు కావలసిన రీతిలో అనుగుణంగా పనిచేయించుకోగలిగిన సత్తా ఒక్క ప్రేమకే ఉంది. ప్రేమ అంటేనే, ఒక డిగ్రీ పట్టా పొందిన అనుభూతి అనేకులకు. కానీ నిజంగా వారిలో ఎంతమందిలో ప్రేమకు అర్ధం తెలుసు?., ప్రేమ, ఆకర్షణ రెండింటికీ మద్య బేధం తెలీని గందరగోళంలో అనేక జంటలు కొట్టుమిట్టాడుతున్నాయని జగమెరిగిన సత్యం.

Have You Ever Fallen In Love? Love Is A Mystery You Need To Solve


మీరు ఎప్పుడైనా అలాంటి భావనని అనుభవించారా? అటువంటి అశాశ్వతమైన ప్రేమను పొందారా? లేదా అటువంటి ప్రేమ కోసం పరితపిస్తున్నారా ?

ఒకే ఒక్క మాట, ప్రేమను కోరుకోని వ్యక్తే ఉండరు ఈ భూమ్మీద.

మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా ? అది ప్రేమ అని మీకెలా తెలుసు?

1.ప్రేమ అంటే

1.ప్రేమ అంటే

ప్రేమ మీద అనేక మందికి సదభిప్రాయం లేదు, దీనికి కారణం చంచలమైన మనసులతో ఆకర్షణకు ప్రేమకు అర్ధం తెలీని వారి తొందరపాటు నిర్ణయాల వలన ప్రేమ అంటేనే కామంగా చూసే రోజులు వస్తున్నాయి. కానీ ప్రేమ అచంచలమైనది. మనిషిని చూడకుండానే, ఉత్తరాల ద్వారా అభిప్రాయాలు నచ్చి, వారికోసం వెతుక్కుంటూ వెళ్లి, తమ ప్రేమను వ్యక్త పరచి, బంధాలను ఏర్పరచుకున్న అనేకులు ఇంకా ఉన్నారు. ఒకప్పుడు ఉత్తరాలు మాధ్యమాలు అయితే నేడు సోషల్ మీడియా మాధ్యమంగా మారింది. ప్రేమలో పడడం ఎంత కష్టమో, ప్రేమలో ఉన్నామని మనసు అంగీకరించడం కూడా అంతే కష్టం. ప్రేమ అనేది రెండు ఆత్మల కలయిక. వారి మనసును, ఆలోచనలను అనుభూతి చెందితే తప్ప, మీరు ప్రేమను ఆస్వాదించలేరు కూడా. ప్రేమలో కామం అన్ని వేళలా భాగం కాకపోవచ్చు,. కానీ కామం కోసమే ప్రేమ అంటే అది ఎన్నటికీ ప్రేమ కాదు.

2.రోజులో మీ మొదటి ఆలోచన

2.రోజులో మీ మొదటి ఆలోచన

రోజులో మీ మొదటి భావన మీరు ప్రేమించే వ్యక్తి గురించి అయితే, ఆ వ్యక్తి రోజంతా మీ మనసులోనే ఉంటారు. అది సర్వసాధారణం. కానీ అది ప్రేమ అనుకోవడం సరి కాదు. అది కేవలం ఆకర్షణ మాత్రమే. రోజులోని మొట్టమొదటి ఆలోచనకు మద్దతుగా, రోజులోని వేల ఆలోచనలు నిలుస్తుంటాయి. ఒక్కోసారి ప్రేమకు అదే తొలిమెట్టు కూడా కావొచ్చు. కానీ మీ అంతరాత్మ సంధించే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం మీ ఆలోచనల్లో ఉండాలి. అది ప్రేమా లేక ఆకర్షణా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం మీదగ్గర ఉండాలి.

3.ప్రేమకోసం ఏమైనా చేస్తాను..!

3.ప్రేమకోసం ఏమైనా చేస్తాను..!

ప్రేమకోసం ఏమైనా చేయగలను అన్న ఆలోచన నీకుంటే, అది బహుమతులు ఇవ్వడం కోరికలు తీర్చడం వంటి “గివింగ్ పాలసీ” తోనే ఉంటుంది. కానీ భాగస్వామి సంతోషం, మరియు వారి పట్ల చూపే జాగ్రత్త, అన్న ఆలోచన ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రేమలో ఉన్నట్లే. ప్రేమ మీ భాగస్వామికి సంతోషాన్ని ఇస్తుంది. మీ చెంత ఉండడం వారి సంతోషానికి ప్రధాన కారణం అయితే, బహుమతులతో పనే లేదు. అలా కాకుండా అవసరానికి ప్రేమ అంటే అదెప్పటికీ ప్రేమ కానేరదు. వ్యాపారం, అవకాశవాదం లేదా ఆకర్షణ వంటి పదాలు అర్ధాలుగా మారుతాయి.

4.మీకు ఆశలు లేనప్పుడు

4.మీకు ఆశలు లేనప్పుడు

మీరు ప్రేమించే వారి నుండి ప్రేమను తప్ప మరే ఇతర అంశాన్ని ఆశించనప్పుడు., మీ ప్రేమ సత్యం. మరియు మీకు ప్రేమలో ఒక స్పష్టత ఉందని అర్ధం. ప్రేమ అంటే వ్యక్తిని స్వాధీన పరచుకోవడం కాదు. ప్రేమ స్వేచ్చని ఇవ్వగలగాలి, అంతే కాని భారం కాకూడదు. ప్రేమలో పడండి మరియు ప్రేమను ఇవ్వండి, అంతే కానీ తిరిగి ఆశించడం అనేది ప్రేమ కానేరదు. ఇలా,అలా ఉండాలి అన్న కట్టుబాట్లు ప్రేమలో సరైన మార్గం కాదు. అది వస్తు మార్పిడి పద్దతి అవుతుంది కానీ, ప్రేమ ఎందుకు అవుతుంది.

5.మీరు వారి స్వరూపాన్ని ప్రేమిస్తున్నారా లేక వారి మనసును ప్రేమిస్తున్నారా? నిర్ధారణ అవసరం.

5.మీరు వారి స్వరూపాన్ని ప్రేమిస్తున్నారా లేక వారి మనసును ప్రేమిస్తున్నారా? నిర్ధారణ అవసరం.

మీరు ఒకరిని నిజంగా ప్రేమిస్తే, వారి మనసును లేదా అంతరాత్మను ప్రేమిస్తున్నారని అర్ధం. వారి విధానం మీకు నచ్చిందని అర్ధం. వాటిని మార్చాలని మీరు ఏ కోశానా కోరుకోవడం లేదు. అలాంటి పక్షంలో వారి రూపురేఖలతో మీకు పని లేదు. రూపురేఖలే ప్రధానంగా భావించి ప్రేమలో పడ్డామని అనుకునే వాళ్ళు, అవి పోగానే విస్మరించడం మొదలు పెడుతుంటారు. అక్కడ వారు మనసుకు విలువిచ్చారా లేక అందానికా? అందానికి హద్దులు ఉంటాయి, ఏదో ఒక రోజు అది చెదరకపోదు. అందంతో ప్రమేయం లేని ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ ప్రేమ భాగస్వామిలో లోపాలను వెతకదు, వారు ఎలా ఉన్నా వీరి మనసులో ఎప్పటికీ ఒక ఉన్నత స్థానంలో ఉంటారు. అందాన్ని ఆరాధించే వాళ్ళ ప్రేమ ఎన్నటికీ నిలబడదు. అందం అనేది ఏరోజుకైనా తరిగిపోతుంది. నిజానికి అటువంటి వారి వల్లే ప్రేమకు అర్ధాలు సైతం మారిపోతున్నాయి. కానీ ప్రేమ ఎన్నటికీ ఒక తరగని గని.

6.ప్రేమ అంటే మనసుతో అనుబంధం అని తెలుసుకున్న నాడు ..!

6.ప్రేమ అంటే మనసుతో అనుబంధం అని తెలుసుకున్న నాడు ..!

మనసుతో అనుబంధాన్ని ప్రేమగా గ్రహించిన నాడు, మీరు నిజంగా ప్రేమలో ఉన్నారని అర్ధం. మనసుని అర్ధం చేసుకోడానికి ఒక్కోసారి జీవితకాలమే పట్టొచ్చు. కానీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీకు ప్రేమ యొక్క స్పష్టత, దాని అంతరార్ధం అవగతమవుతుంది. మీ మనసు ప్రేమని మాత్రమే కోరుతుంది, ఏ ఇతర అంశాలకు లొంగకుండా, ఆశించకుండా.

ఈ ఆరు ప్రధానాంశాలు మీ ఆలోచనల్లో భాగమైతే, మీరు ఖచ్చితంగా ప్రేమలో ఉన్నట్లే లెక్క.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక అంశాల కోసం బోల్డ్స్కీని తరచూ సందర్శించండి. మీ విలువైన అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

Have You Ever Fallen In Love? Love Is A Mystery You Need To Solve

Have You Ever Fallen In Love? Love Is A Mystery You Need To Solve,Love is a feeling of giving. Love is the chemistry of protons and neutrons in the cell. Love is the eternal drug and humans are the consumers. Love makes one feel happy, sఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? లేదా ప్రేమలో ఉన్నామన్న భావనలో ఉన్నారా? నిర్ధారించుకోండి.
Desktop Bottom Promotion