డిప్రెషన్ లో ఉన్నప్పుడూ ప్రేమనా ?

Subscribe to Boldsky

నిరాశనిస్పృహలు కేవలం ఒకేఒక్క కారణానికి పరిమితమై ఉండవు. అనేకమంది డిప్రెషన్ అనగానే ప్రేమవిఫలం అన్నభావనకు వచ్చేస్తుంటారు. పని ఒత్తిడి, కుటుంబకలహాలు, ఆర్ధికపరిస్థితులు, మానసిక ఆరోగ్య సమస్యలు, ఇష్టమైన వారి దూరం, స్నేహం చెడిపోవడం ఇలా అనేక రకాలు డిప్రెషన్ కు కారణం అవుతుంటాయి. కానీ ఇలాంటి నిరాశానిస్పృహలతో ఉన్నప్పుడు ప్రేమలో దాని ప్రభావం ఎలా ఉంటుందో అన్న ఆలోచనలతో కూడా సతమతమవుతూ ఉంటారు.

ఈప్రపంచంలో ప్రతి మనిషి వారివారి పరిస్థితులను ఉద్దేశించి కనీసం జీవితంలో ఒకసారైనా డిప్రెషన్ కు లోనవడం పరిపాటి. కానీ ఏవిధంగా ఆ పరిస్థితులను అధిగమించాడు అన్నది, అతని మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం, వాతావరణ మార్పులు, ప్రియమైన వారి సహకారాలు, వ్యక్తిగత అలవాట్లు, చివరికి వ్యసనాలు ఆహారపు అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆవిధంగా ఈడిప్రెషన్ గురించి తెలియనివారే ఉండరు. ఈనిరాశా నిస్పృహలు ప్రజల సంబంధాల మద్య గోడలను నిర్మిస్తుంది. ఒకవేళ మీరు ప్రేమలో ఉండి ఆడిప్రెషన్ గోడలను మద్యలోనికి తీసుకుని వస్తే, ఆసంబంధం ఎంతోకాలం నిలవదు. ఒక్కోసారి తిరిగి ఆప్రేమను పొందాలన్నా కుదరని పనే అవుతుంది. కొన్ని సందర్భాలలో భాగస్వాములు డిప్రెషన్ స్థాయిలను అంచనావేసి వారి డిప్రెషన్ తగ్గుదల దృష్ట్యా ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయినా దేనికైనా ఓర్పు,సహనం అనేవి ఉంటాయి. అవి పరిధి దాటితే, పరిస్థితులు గాడి తప్పుతాయి అన్నది వాస్తవం.

HOW IT FEELS TO BE IN LOVE WHEN DEPRESSION TROUBLES YOU

ఈ డిప్రెషన్ కారణంగా మీ ప్రియమైన వారు పక్కనేఉన్నా, మీకెవరూ లేరన్న ఆలోచనని ఇస్తుంది. మీరు ప్రేమని ఆస్వాదించాలన్నా, కుదరనిపనే అవుతుంది. డిప్రెషన్ తారాస్థాయికి చేరిన పక్షంలో మీ ప్రియమైన వారి మనసుల నుండి, మీ సంతోషాల నుండి, మీకు సంబంధించిన ప్రతి విషయాలనుండి నెమ్మదిగా దూరం చేయబడుతారు. డిప్రెషన్ ఒకసారి వస్తే, దాని పరిస్థితులు కాన్సర్ కన్నా ప్రమాదకర స్థాయిలో ఉంటాయి. ఈ ప్రపంచంలో 10లో కనీసం ఇద్దరు డిప్రెషన్ సమస్యలతో భాధపడుతున్నారు అన్నది కాదనలేని ఊహించేలేని నిజం. ఒక్కసారి ఆలోచించండి డిప్రెషన్ వలన జీవితాలు ఎంత పతన స్థాయికి వెళ్తాయో. ఊహకు కూడా అందదు.

కానీ డిప్రెషన్లో ఉన్నారన్నంత మాత్రాన మీరు ప్రేమించబడడంలేదని అర్ధం కాదు, మీరు డిప్రెషన్ నుండి బయటకు రావాలని ఎదురుచూసే నిజాయితీతో కూడిన ప్రేమను కలిగిఉన్న మీ ప్రియమైన వారు కూడా ఉంటారు. కానీ డిప్రెషన్లో ఉన్నకారణాన, అవేమీ కంటికి కనపడవు. ఒక్కసారి మనకోసం వీళ్ళు ఇంతగా ఎదురుచూస్తున్నారా, మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నారా అని వాస్తవంలోనికి వచ్చిన క్షణాన, నెమ్మదిగా నిరాశానిస్పృహలు తగ్గుముఖం పడుతాయి. మరియు ఇంతకాలం డిప్రెషన్లో ఉన్నందుకు చాలా బాధపడుతారు. కానీ మీప్రియమైన వారి సాంగత్యంలో ఎంతో మానసిక ఉల్లాసాన్ని తిరిగి పొందగలరు.

ఈ డిప్రెషన్ మిమ్ములను ఒక మానసిక రోగిగా మార్చగలదు, మీకే తెలీకుండా ఏడవడం, జబ్బు పడిన వారిలా అందరికీ దూరంగా ఒంటరితనాన్ని అనుభవించడం ఇలా అనేక అంశాలు మీకే తెలీకుండా మిమ్ములను ప్రభావితం చేస్తాయి. ఎపుడైనా మీరు ఇలాంటి సందర్భాలలో సానుకూల పవనాలను ఆస్వాదించినప్పుడు, ఒక తోడును కలిగి ఉన్నారన్న భావనకు గురైనప్పుడు(type of silver lining) డిప్రెషన్ పటాపంచలు అవడం గారెంటీ.

మీరు దేనికారణంగా డిప్రెషన్ కు గురై భాధపడుతున్నారో మీ ప్రియమైన వారికి చెప్పనవసరం లేదు, వారు కూడా కారణాల గురించి ఆలోచించరు, మీరు డిప్రెషన్ నుండి బయటకు రావాలనే కోరుకుంటారు. పరిస్థితులు సహకరిస్తే మీరు పంచుకోగలరు అని అనిపిస్తే ధైర్యంగా పంచుకోండి. లేనిపక్షంలో ఏమీ జరగనట్లు కొత్తజీవితాన్ని ప్రారంభించడమే మంచిది. డిప్రెషన్ మిమ్ములనే కాదు, మీప్రియమైన వారి సంతోషాన్ని కూడా హరించి వేస్తుందన్న సత్యాన్ని మీరు గ్రహించాలి.

ఎప్పుడైతే మీ ప్రియమైన వారినుండి సహకారాన్ని మీరు ఆస్వాదించగలరో, అప్పుడు మీమనసులో మెదిలే మాట “ మనల్ని మనం ప్రేమించలేకపోయినా ఇతరులను ప్రేమించగలం”. ఆశ్చర్యానికిలోనవడం మీవంతు అవుతుంది. తద్వారా నెమ్మదిగా మీలో మార్పు మొదలవుతుంది.

ఒకవేళ మీరు ఆ ప్రేమని ఆస్వాదించలేక దూరం చేసుకున్న ఎడల, ఏదో ఒకరోజు మీరు డిప్రెషన్ స్థాయి నుండి బయటపడిన రోజున తిరిగి ప్రేమను పొందడం అసాధ్యమనే చెప్పాలి. కావున మీలో డిప్రెషన్ స్థాయిలు హెచ్చు మీరుతున్నాయి అని మీకు అనిపించిన వెంటనే, దాని నుండి బయటకు వచ్చే మార్గాలను అన్వేషించడమే మంచిది. డిప్రెషన్ స్థాయిలను వ్యసనాలు హెచ్చుమీరేలా చేస్తాయి. వాటిని త్యజింపడం ఎంతో మంచిది.

మీరు నిజంగా ప్రేమలో ఉన్నవారైతే, మీ కన్నీళ్ళకు తోడుకూడా మీభాగస్వామి వ్యధే అవుతుంది. మిమ్ములను డిప్రెషన్ నుండి బయటకు తీసుకుని రావడంలో కన్నీళ్లు కనపడకుండా దాచి మీసంతోషానికై పరితపిస్తుంటారు. వారిని భాధపెడితే మీకు వచ్చే లాభమేదీ లేదు. కానీ వారి ప్రేమను అర్ధం చేసుకోవలసిన అవసరం అయితే ఉంది.

మీరు మీ సంతోషాలను భాధలను మీ భాగస్వామితో పంచుకునేలా ఉండాలి. ఈ కారణం చేత వారు మిమ్ములను వదిలి వెళ్లరు. మీ భాధ తెలియడం ద్వారా మిమ్ములను అర్ధం చేసుకుని మీకు సహకరించే ప్రయత్నాన్నే చూస్తారు. ఒకవేళ మీరు ఈ మానసిక స్థితి నుండి బయటకు రాలేని పక్షంలో , మీకే తెలీకుండా మీ ప్రియమైన వారిని కూడా డిప్రెషన్ లోనికి తీసుకువచ్చే ప్రమాదం ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    HOW IT FEELS TO BE IN LOVE WHEN DEPRESSION TROUBLES YOU

    We all have heard about depression and the pain we go through when we are depressed. Depression builds walls around people and between people. When you are in love and have been dragged inside those walls, distance happens and you end up on a long way to reach your lover. You miss them when they're right there beside you.
    Story first published: Saturday, March 31, 2018, 20:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more