మీ కోపం మీకు మీ భాగస్వామికి మద్య దూరాన్ని పెంచుతుందా , అయితే ఇది మీకోసమే .. !

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మీ కోపం మీకు మీ భాగస్వామికి మద్య దూరాన్ని పెంచుతుందా ... అయితే ఇది మీకోసమే .. !

సంబంధంలో కోపం అనే అంశం అత్యంత ప్రమాదకరం. ఇది భాగస్వాముల మద్య అన్యోన్యతను దెబ్బతీయడమే కాకుండా ప్రేమను, భావోద్వేగాలను సైతం పునాదులతో సహా పెకలించి సమాధి చేయగలదు. ఒక్కోసారి చిన్న విషయాలు సైతం ఈ కోపం కారణంగా సంబంధాలు విచ్ఛిన్నమయ్యే స్థాయికి చేరుకుంటాయి.

ఒక్కోసారి పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత కోపానికి గల కారణాలను అన్వేషిస్తుంటాము, కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయే ఉంటుంది. ఏదైనా సమస్య మొదలైనప్పుడు పరిష్కార దిశగా కాకుండా నెగ్గడం మీదనే దృష్టి పెట్టడం వలన సగం ఈ అనార్ధాలకు కారణం అవుతుంటాయి.

HOW TO CONTROL ANGER IN A RELATIONSHIP

“ నువ్వు నా కోపాన్ని చూశావు , గుండె పొరల నుండి తన్నుకొస్తున్న కన్నీళ్లను చూడలేకపోయావా “

మీ సంబంధంలో కోపమే ఒక దారి చూపుతున్నట్లు ప్రయత్నిస్తుంటే , ఒక నయం కాని గాయాలకు కారణభూతమవుతున్న ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లే లెక్క. ఇలాంటి కోపాలను ఎంత వీలైతే అంత త్వరగా తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి, లేకుంటే సమస్యల సుడిగుండాలలోకి తెలిసి అడుగుపెడుతున్నట్లే. కోపం మీకు అలంకార ప్రాయం అయితే .. ఈ చిట్కాలు మీకోసమే.

మిమ్ములను మీరు సావధానపరచుకోండి:

మిమ్ములను మీరు సావధానపరచుకోండి:

మనలో అత్యధికులకు భాగస్వామితో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దుందుడుకు స్వభావాన్ని ప్రదర్శిస్తుంటాము. ఈ స్వభావమే కోపానికి ప్రధాన కారణం. అన్నీ వేళలా ఈ దూకుడు పనికిరాదన్న విషయాన్ని గమనించాలి. మరియు మనం దూకుడు ప్రదర్శించే వ్యక్తి ఎవరు అన్న ఆలోచన చేయగలిగిన రోజు, సగం ఈ స్వభావాలకు తద్వారా కోపానికి చెక్ పెట్టవచ్చు. కోపo కారణంగా మీ సంబంధాలు ప్రభావితం కాకుండా చేయడంలో ఇదొక గొప్ప సూత్రమనే చెప్పాలి.

కాస్త సమయం తీసుకుని బయటకు వెళ్ళండి:

కాస్త సమయం తీసుకుని బయటకు వెళ్ళండి:

ఒక్కోసారి మీ కోపం హద్దులు దాటుతుంది అని మీకు అనిపించిన పక్షంలో, అక్కడనుండి వెళ్ళిపోయి మిమ్ములను మీరు సావధానపరచుకునేలా ప్రయత్నించండి. తద్వారా మీకు తెలీకుండానే అనేక సమస్యలకు చెక్ పెట్టిన వారవుతారు. ఒక్కోసారి పాటలు వినడం, స్నేహితుల కడకు వెళ్ళడo లేదా మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళడం కూడా మీకోపాన్ని నియంత్రించుటలో సహాయం చేస్తుంది.

గట్టిగా ఊపిరి తీసుకోండి :

గట్టిగా ఊపిరి తీసుకోండి :

ఒక్కోసారి గట్టిగా ఊపిరి పీల్చుకోవడం వలన మీ కోపాన్ని తద్వారా మీ మనసు కాస్త కుదుట పడుతుంది. కానీ ఇలా చేయడం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి మీరు తిరిగి కోపాన్ని ప్రదర్శించవచ్చు కూడా , కానీ ఎన్నో సందర్భాలలో ఈ కిటుకు చక్కగా పనిచేస్తుంది.

10 నుండి 1 కి లెక్కబెట్టండి:

10 నుండి 1 కి లెక్కబెట్టండి:

ఈ మాట ఎవరైనా మీతో అంటే, లెక్కబెట్టమని చెప్పినందుకు కోప్పడుతారు కానీ, ఒక్కసారి ప్రయత్నించి చూస్తే దీని ఫలితం మీకు తెలుస్తుంది. 10 నుండి 1 కి వెనుకకు అంకెలను లెక్కబెట్టడం ద్వారా నెమ్మదిగా కోపం తగ్గుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఈ చిట్కా పనిచేస్తుంది. ఒక్క సారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది దీని ఫలితం.

మాట్లాడేముందు ఆలోచన చేస్తున్నారా :

మాట్లాడేముందు ఆలోచన చేస్తున్నారా :

కోపంలో ఉన్నప్పుడు మాటతూలడం అనేకమందికి ఉన్న అలవాటు. కొందరు అంటుంటారు కూడా చెయ్యి తూలితే వెనక్కి తీసుకోవచ్చు, మాట తూలితే తీసుకోలేమని. మాటలకు అంత పదును ఉంటుంది. కావున ముఖ్యంగా మీరు కోపంలో ఉండి మాట్లాడునప్పుడు ఆలోచనతో వ్యవహరించాలి. కోపానికి అర్ధం ఉండాలి, కోపం పరిస్థితులను చక్కదిద్దేలా చెయ్యొచ్చు కానీ , సమస్యను మరింత జఠిలం చేయకూడదు.

వినడం అన్నిటికన్నా శ్రేష్టం:

వినడం అన్నిటికన్నా శ్రేష్టం:

భాగస్వామితో గొడవ జరుగుతున్న సమయంలో మాట్లాడడం కన్నా వినడం ముఖ్యం, మాటలు అనేవి చినికి చినికి గాలివానగా మారుతాయి. కానీ వినడం వలన అవతలి వారి భాధను క్షుణ్ణంగా అర్ధం చేసుకోవడమే కాకుండా, సమస్యలకు పరిష్కారం ఆలోచించే దిశగా మీ మెదడు పని చేస్తుంది. కోపం మనిషి అహాన్ని పెంచి , విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. దీనివలన లాభాలు లేకపోగా నష్టాలు మాత్రం భారీగానే ఉంటాయి .

మీ కోపానికి కారణాలు తెలుసుకున్నారా:

మీ కోపానికి కారణాలు తెలుసుకున్నారా:

కోపం అన్ని సమస్యలకు పరిష్కారం కాజాలదు, కాకపోతే కొన్నిటిని పెంచుతుంది. ఇలాంటి కోపం వస్తుందన్న అనుమానం కలిగినప్పుడే జాగ్రత్త తీసుకొనవలసి ఉంటుంది. కొన్ని సంకేతాలు కూడా కోపం వచ్చే ముందు తారసపడుతాయి, చేతులు వణకడం, చమట పుట్టడం, తల అదరడం వంటివి కూడా సంకేతాలుగా ఉంటాయి. ఈ సంకేతాలు ఎదురైన మరుక్షణమే వాటి నుండి బయటపడే మార్గాలు అన్వేషించండి.

గిల్లుకోవడం కూడా మంచిదే :

గిల్లుకోవడం కూడా మంచిదే :

కొందరు ఏకాగ్రత కోసం చేతికి రబ్బర్ బాండ్స్ కట్టుకుని, మనసు పరధ్యానం వెళ్తున్నప్పుడు బాండ్ సాగదీసి కొడుతుంటారు, తద్వారా ఆ పరధ్యానాలు పక్కకి వెళ్తుంటాయి. ఎంతోమంది ఈ అలవాటును కలిగి ఉన్నారు అంటే , ఎంతో కొంత పనిచేసిందనే కదా అర్ధం. అటువంటిదే ఈ గిల్లుకోవడం కూడా.

అన్నివేళల రబ్బర్ బాండ్లు చేతికి కట్టుకుని తిరగలేము. కోపం వస్తున్న సమయం లో, లేదా కోపం వస్తుందన్న సంకేతాలు కనిపించిన సమయంలో, లేదా కోపం వలన పరిస్తితి హద్దు దాటుతున్న నేపద్యంలో ఒక్కసారి గిల్లుకుని చూడండి. కోపం నెమ్మదిగా తగ్గుతుంది. నవ్వు పుట్టించేలా ఉన్నా , ఇది నిజం.

కొందరు రక్తపోటు , ఊబకాయం వంటి సమస్యల వలన కూడా కోపం సహజ లక్షణంగా ఉంటుంది , కానీ వారికి తెలీదు ఈ కోపానికి కారణం ఆరోగ్యసమస్యలు కూడా అని, ఎక్కువగా కోపం ప్రదర్శిస్తూ ఉంటే వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళడం, డాక్టర్ సలహా మేరకు లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలు చేయించడం కూడా మంచిది .

English summary

HOW TO CONTROL ANGER IN A RELATIONSHIP? MEASURES YOU SHOULD APPLY

Anger is dangerous in a relationship. It breaks the bond between people. It kills love. It destroys people's emotion. Does it hamper your relationship? There are so many questions that come to our mind related to anger in a relationship but never the solution of it. When anger drives your path in a relationship you know you are meeting with an accident.
Story first published: Wednesday, April 4, 2018, 19:30 [IST]