For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా వక్షోజాలు చాలా చిన్నగా ఉన్నాయి, అబ్బాయిలకు అవి లావుగా ఉంటేనే ఇష్టమా? మరి నేనేమీ చెయ్యాలి?

నా స్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మొదట వాటి గురించి నేను అస్సలు ఆలోచించేదాన్ని కాదు. హైట్ కాస్త తక్కువగా ఉంటాను. నా ఫ్రెండ్స్ లో కొందరు చండాలంగా ఉన్నా వారి స్తనాల సైజ్ బాగా పెద్దదిగా ఉండడంతో..

|

ప్రశ్న : నా వయస్సు పంతొమ్మిదేళ్లు. నేను చదువులో ఫస్ట్. మా కాలేజీలో నేనే టాఫర్. నేను చూడడానికి అందంగానే ఉంటాను. కానీ నా స్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మొదట వాటి గురించి నేను అస్సలు ఆలోచించేదాన్ని కాదు. హైట్ కాస్త తక్కువగా ఉంటాను. నా ఫ్రెండ్స్ లో కొందరు చండాలంగా ఉన్నా వారి స్తనాల సైజ్ బాగా పెద్దదిగా ఉండడం వల్ల వారికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు.

ఒక్కరూ కూడా ప్రపోజ్ చేయడం లేదు

ఒక్కరూ కూడా ప్రపోజ్ చేయడం లేదు

నాకు మాత్రం ఒక్కరూ కూడా ప్రపోజ్ చేయడం లేదు. కారణం ఏమిటో అర్థం కాక నేను చాలా సతమతం అయ్యాను. అయితే ఇటీవల నా ఫ్రెండ్ నాకొక విషయం చెప్పింది. " నీ వక్షోజాలు చిన్నగా ఉండడం వల్లే నీకు ఎవరూ ప్రపోజ్ చేయడం లేదు. నీ ఫిజిక్ కూడా అంత అట్రాక్టివ్ గా ఉండదు. అందుకే ఎవ్వరూ నిన్ను ఇష్టపడడం లేదు. అబ్బాయిలు స్తనాలు పెద్దగా ఉండే అమ్మాయిలంటేనే ఇష్టం. " అని చెప్పింది.

వాటి పరిమాణం పెంచుకోవడానికి

వాటి పరిమాణం పెంచుకోవడానికి

దాంతో నాలో నేను ఆవేదన చెందుతున్నాను. వాటి పరిమాణం పెంచుకోవడానికి ఏమైనా మార్గాలున్నాయా? అబ్బాయిలు కేవలం మాటిని మాత్రమే చూసి ఇష్టపడతారా? మంచి మనస్సున్న నాలాంటి అమ్మాయిలను ఇష్టపడరా? లాంటి సందేహాలు నన్ను వెంటాడుతున్నాయి. దయజేసి సలహా ఇవ్వగలరు.

అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు

అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు

సమాధానం : మీ సమస్య అర్థమైంది. చాలా మంది అమ్మాయిలు ఇలాంటి సమస్యలతో కుంగిపోతుంటారు. ఈ విషయంలో మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. మీ జీన్స్ పరంగా మీ శరీర నిర్మాణం ఉంటుంది. మీరు మంచి ర్యాంక్ స్టూడెంట్ అని చెబుతున్నారు. మీ బాహ్య సౌందర్యం గురించి ఎక్కువగా మదనపడకండి.

అందవికారంగా ఉన్నా

అందవికారంగా ఉన్నా

శారీరక సౌందర్యం అనేది తాత్కాలికమైనది. కేవలం నీ శరీరాన్ని చూసి నిన్ను ఇష్టపడే వ్యక్తులకు మీరు దూరంగా ఉండడమే మంచిది. కొందరు భౌతికంగా అందవికారంగా ఉన్నా వారి వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. ఒక్కసారి ఒక వ్యక్తి శక్తిసామర్థ్యాలు తెలిశాకా వారిపై మనకు గౌరవం ఏర్పడుతుంది. మీ విషయంలో కూడా అదే జరుగుతుంది.. బాధపడకండి.

ఏ అబ్బాయైనా మీ వెంట పడతాడు

ఏ అబ్బాయైనా మీ వెంట పడతాడు

మీరు మీ వ్యక్తిత్వంతో మనషుల హృదయాలను గెలవండి. ఒక వ్యక్తి దగ్గరున్న టాలెంట్ చూసి మీకు కూడా ప్లాట్ అయ్యే అబ్బాయిలుంటారు. మీరు ఏమీ కంగారుపడకండి. మొదట మీ ఫోకస్ మొత్తం చదువుపైనే పెట్టండి. బాగా చదివి మంచి స్థాయికి వెళ్లండి. అప్పుడు ఏ అబ్బాయైనా మీ వెంట పడే అవకాశం ఉంటుంది.

స్తనాల పరిమాణం అనేది

స్తనాల పరిమాణం అనేది

చాలా మంది వారిలో ఉన్న ప్రతిభను గుర్తించకుండా, వారిలో ఉన్న లోపాల గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు. మీరు కూడా అలాగే చేస్తున్నారు. స్తనాల పరిమాణం అనేది క్రమంగా మారుతూ ఉంటుంది. వాటి పరిమాణం పెంచుకునేందుకు మీరు కృత్రిమ పద్దతులు పాటిస్తే తర్వాత మీరే నష్టపోతారు. నిజానికి మంచి జ్ఞానానికి మించిన అందం మరొకటి లేదు. దాన్ని సాధించేందుకు శ్రమించండి. తర్వాత ఒక్కరేమిటి లోకమంతా నీ వెంటే పడుతుంది.

స్పెషలిస్ట్ లను సంప్రదించండి

స్పెషలిస్ట్ లను సంప్రదించండి

మీరు మరి కుంగిపోతుంటే ఫిట్ నెస్ లేదా న్యూట్రిషన్ స్పెషలిస్ట్ లను సంప్రదించండి. వారు మీకు కొన్ని సలహాలు ఇస్తారు. మీరు హైట్ కాస్త తక్కువగా ఉంటారని చెప్పారు. అదేమీ పెద్ద ప్రాబ్లమ్ కాదు. మీ ఫ్రెండ్స్ లో కొందరు చండాలంగా ఉన్నా కూడా వారికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు. ఆ విషయంలో మీరు ఏమీ ఆందోళన చెందకండి. కేవలం వాటి సైజ్ చూసి ప్రేమించే వాడు అసలు మనిషే కాదు.

శారీరకంగా అనుభవిస్తారు కానీ

శారీరకంగా అనుభవిస్తారు కానీ

నీ వక్షోజాలు చిన్నగా ఉండడం వల్లే నీకు ఎవరూ ప్రపోజ్ చేయడం లేదని మీ ఫ్రెండ్స్ చెప్పారంటున్నారు.. అలా చూసి ప్రేమించే వారు నీకు అక్కర్లేదు. అలాంటి ప్రేమ ఎక్కువ కాలం ఉండదు. కొందరు అబ్బాయిలకు స్తనాలు పెద్దగా ఉండే అమ్మాయిలంటే ఇష్టమనేది వాస్తవమే. కానీ కేవలం వాటి చూసి ప్రేమించే వారు మిమ్మల్ని శారీరకంగా అనుభవిస్తారు కానీ మీ భావాలను అర్థం చేసుకోలేరని గుర్తించుకోవాలి. సో మీరు ఆత్మస్తైర్యం పెంచుకోండి. మంచి పౌష్టికాహారం తీసుకోండి. వర్క్ అవుట్స్ చేయండి. కృతిమంగా మీ బాడీ పరిమాణాన్ని పెంచే ఏ పద్దతిని కూడా పాటించకండి.

English summary

I feel insecure about the way I look What should I do please suggest me

How do I stop feeling insecure about my body? I feel insecure about the way I look, What should I do please suggest me.
Story first published:Saturday, September 1, 2018, 12:13 [IST]
Desktop Bottom Promotion